ఏప్రిల్‌ 15న... | India's 2019 ICC ODI World Cup squad to be picked on April 15 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 15న...

Published Tue, Apr 9 2019 5:22 AM | Last Updated on Tue, Apr 9 2019 5:22 AM

India's 2019 ICC ODI World Cup squad to be picked on April 15 - Sakshi

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌ కప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల భారత జట్టును సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ నెల 15న ప్రకటించనుంది. సోమవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ కప్‌ జట్లను ప్రకటించేందుకు ఐసీసీ నిర్దేశించిన తుది గడువు ఏప్రిల్‌ 23 కాగా... టీమిండియా సభ్యుల సన్నద్ధత కోసం మరికొంత అదనపు సమయం ఉంటే బాగుంటుందని సెలక్టర్లు భావించారు. సోమవారం ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో బెంగళూరు ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండబోతున్న    భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా సెలక్షన్‌ కమిటీ సమావేశానికి హాజరవుతాడు. మే 30నుంచి     ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్‌ జరగనుండగా, భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement