MSK
-
మహిళా కేంద్రాలకు అందని ‘శక్తి’
గృహ హింస నిరోధక చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం... తదితర అత్యంత ప్రధానమైన చట్టాల అమలు, అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహిళా శక్తి కేంద్రాలు (ఎంఎస్కే) నీరసించిపోతున్నాయి. మహిళల శక్తిని చాటే చట్టాలను పర్యవేక్షించే సిబ్బందికి పది నెలలుగా వేతనాలు అందడం లేదు. 2019–20 వార్షిక సంవత్సరంలో ఈ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వలేదు. ఫలితంగా ఎంఎస్‌కేల్లో పనిచేస్తున్న సిబ్బంది ఖాతాల్లో గతేడాది ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు వేతనాలు జమకాలేదు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఈ సిబ్బందికి ఇచ్చే వేతనాలు అరకొరే అయినప్పటికీ... అవి కూడా సకాలంలో అందకపోవడంతో ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వేతనమందక...పనిపై శ్రద్ధ పెట్టలేక... మహిళా శక్తి కేంద్రాల్లో పనిచేసేఉద్యోగులకు ఇదివరకు ప్రతినెల ఐదో తేదీలోగా వేతనాలు అందేవి. కొన్ని సందర్భాల్లో నెలవారీ వేతన చెల్లింపుల్లో జాప్యం జరిగినప్పటికీ ప్రభుత్వం మూడు నెలల్లోగా సమస్యను పరిష్కరించి బకాయిలను క్లియర్ చేసేది. ప్రస్తుతం ఈ జాప్యం పది నెలలకు పెరిగింది. గతేడాది ఏప్రిల్ నెల నుంచి ఎంఎస్‌కేల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు రాలేదు. 2019–20 వార్షిక సంవత్సరంలో ఎంఎస్‌కేలకు నిర్దేశించిన బడ్జెట్‌ను కేంద్రం విడుదల చేయలేదు. దీంతో వారికి వేతనాలు ఇవ్వలేదని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎంఎస్‌కేలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన బకాయిలు దాదాపు రూ.కోటిన్నర వరకు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎంఎస్కే విధులేంటి... మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడంలో మహిళా శక్తి కేంద్రాలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఎంఎస్‌కేలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్వహిస్తారు. ఒక్కో మహిళా శక్తి కేంద్రంలో సోషల్ కౌన్సిలర్(ఎస్సీ), లీగల్ కౌన్సిలర్(ఎల్సీ)తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు(పీసీ), మరో డాటా ఎంట్రీ ఆపరేటర్(డీఈఓ) ఉంటారు. సోషల్, లీగల్ కౌన్సిలర్లు గృహ హింస చట్టంతో పాటు పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా శిక్షణ కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు. గతంలో గృహ హింస చట్టంపైనే పనిచేసే సోషల్, లీగల్ కౌన్సిలర్లకు ఎంఎస్‌కేల ఏర్పాటుతో అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న ఎంఎస్‌కేలు త్వరలో కొత్త జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
పంత్ చివరి నిమిషంలో మిస్: ఎమ్మెస్కే
ముంబై: రిషభ్ పంత్‌కు దాదాపు చోటు ఖరారయ్యే పరిస్థితి ఉన్నా... చివరకు అవకాశం దక్కలేదని సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. సుదీర్ఘ చర్చలో సెలక్టర్లు అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్‌వైపు మొగ్గుచూపడంతో పంత్‌కు ఇంగ్లండ్ దారులు మూసుకుపోయాయని చెప్పారు. ‘రెండో వికెట్ కీపర్‌గా ఎవరిని తీసుకోవాలనే చర్చ సుదీర్ఘంగా జరిగింది. అయితే ధోని గాయపడినపుడే వికెట్ కీపర్ తుది జట్టుకు ఆడతాడు. అలాంటి పరిస్థితి కీలకమైన సెమీస్‌లాంటి మ్యాచ్‌ల్లో వస్తే పర్యవసనాలు ఎలా ఉంటాయో చర్చించే చివరకు కార్తీక్‌ను సెలక్ట్ చేశాం. పంత్ ప్రతిభావంతుడే కానీ దురదృష్టవశాత్తు ఆఖర్లో అవకాశాన్ని కోల్పోయాడు’ అని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే వివరించాడు. తొలిసారిగా డేటా ప్రజంటేషన్ మామూలు ట్రై సిరీస్, పర్యటనలకే ఆటగాళ్ల గణాంకాలను పలుమార్లు పరిశీలిస్తారు. మరి ప్రపంచకప్ సెలక్షన్ అంటే ఆషామాషీ కాదు. కాబట్టే తొలిసారి గణాంకాల విశ్లేషణను ప్రజంటేషన్ రూపంలో చూశారు. అంటే ఎంపిక ప్రక్రియలో సాధారణంగా ఆటగాళ్ల వివరాలు కేవలం మ్యాచ్‌లు, ఇన్నింగ్స్, చేసిన పరుగులు, స్ట్రయిక్ రేట్, తీసిన వికెట్లు, ఎకానమి రేట్ ఇలా అంకెలతో ఉండేవి. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునేవారు. కానీ ఈ సెలక్షన్లో తొలిసారిగా భిన్నమైన పద్ధతిని అవలంభించారు. మూడున్నర గంటల పాటు సాగిన ఆటగాళ్ల విశ్లేషణాత్మక ప్రజంటేషన్లో ఎవరు ఎక్కడ బాగా ఆడతారు. ఎవరి షాట్లు ఎక్కడ పరుగులు తెచ్చిపెడతాయి. ఏ ఓవర్లలో ఎవరు మెరుగు, ఎలాంటి పరిస్థితుల్లో ఏ బౌలర్ అదరగొట్టాడు తదితర అంశాల్ని కూలంకశంగా ప్రజంటేషన్ రూపంలో చూశారు. ఆ తర్వాతే జట్టు ఎంపికపై సెలక్టర్లు అంచనాకు వచ్చారు. దీన్ని డేటా విశ్లేషకుడు ధనంజయ్ సిద్ధం చేశాడు. మెగా ఈవెంట్, ప్రధాన టోర్నీకి ముందు ఇలాంటి ఎంపిక ప్రక్రియతోనే శ్రీకారం చుడతామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
ఏప్రిల్ 15న...
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల భారత జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నెల 15న ప్రకటించనుంది. సోమవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ కప్ జట్లను ప్రకటించేందుకు ఐసీసీ నిర్దేశించిన తుది గడువు ఏప్రిల్ 23 కాగా... టీమిండియా సభ్యుల సన్నద్ధత కోసం మరికొంత అదనపు సమయం ఉంటే బాగుంటుందని సెలక్టర్లు భావించారు. సోమవారం ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉండబోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరవుతాడు. మే 30నుంచి ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్ జరగనుండగా, భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. -
చీలిన ఎస్ఎంకే
* మరో ఎంఎస్కే ఆవిర్భావం * కమిటీ ప్రకటించిన ఎర్నావూర్ * అమ్మకు మద్దతుగా ప్రచారం * శరత్‌కు ప్రత్యర్థిగా బరిలోకి సాక్షి, చెన్నై : అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి చీలింది. కొత్తగా శుక్రవారం సమత్తువ మక్కల్ కళగం ఆవిర్భవించింది. శరత్‌కుమార్‌కు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు తాను సిద్ధం అని ఎర్నావూర్ నారాయణన్ ప్రకటించారు. సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలో నాడార్ సామాజిక వర్గ అభ్యున్నతి లక్ష్యంగా అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) ఆవిర్భవించి ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే చిహ్నంతో ఎన్నికల్లో ఆ పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎర్నావూర్ నారాయణన్ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. తాజాగా, శరత్‌కుమార్, నారాయణన్‌ల మధ్య బయలు దేరిన వివాదంతో ఆపార్టీ చీలిక దిశగా పయనం సాగింది. అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు శరత్‌కుమార్ ప్రకటించడంతో, ఇక తాను మాత్రం అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ విధేయుడ్నే అని నారాయణన్ స్పష్టం చేశారు. అలాగే, ఎస్‌ఎంకేను కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, సాధ్య పడకపోవడంతో చివరకు ఎస్‌ఎంకేను చీల్చడంతో పాటుగా శరత్‌కుమార్‌ను ఇరకాటంలో పెట్టే విధంగా ఎస్ఎంకే నినాదంతో కొత్త పార్టీని ప్రకటించారు. కొత్త పార్టీ : సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే)ని ఇరకాటంలో పెట్టే విధంగా సమత్తువ మక్కల్ కళగం(ఎస్ఎంకే) నినాదంతో ఎర్నావూర్ నారాయణన్ తన పార్టీని ప్రకటించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కొత్త పార్టీ ప్రకటనతో పాటుగా హిందూ, ముస్లీం, క్రైస్తవ ఐక్యతను చాటే రీతిలో జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, పసుపు, మధ్యలో తెలుపు వర్ణంతో వలయాకారం, మధ్యలో పిరమిడ్‌ను తలపించే గుర్తును పొందు పరిచారు. అనంతరం ఎర్నావూర్ నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, కొత్త కమిటీని ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడుగా ఎర్నావూర్ నారాయణన్, ప్రధాన కార్యదర్శిగా సూలూరు టీఆర్ చంద్ర శేఖరన్, కోశాధికారిగా కన్నన్, ఉపాధ్యక్షుడిగా ధనుస్కోడి, సంయుక్త కార్యదర్శిగా టీ.వినాయక మూర్తి, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా తంగముత్తు, రాజకీయ సలహాదారుగా ఎస్ గణేషన్ వ్యవహరించనున్నారు. అలాగే, రాష్ట్రంలోని 32 జిల్లాలకు కార్యదర్శుల్ని ప్రకటించారు. యువజన కార్యదర్శిగా ఎస్ రవి, కార్మిక కార్యదర్శిగా ఎస్ జబరాజ్లను నియమించారు. కొత్త పార్టీ ప్రకటనతో ఒకటి రెండు రోజుల్లో అమ్మ జయలలితను కలవనున్నాట్టు తెలిపారు. వాస్తవం, శ్రమ తారక మంత్రంగా నినాదాన్ని అందుకుని ముందుకు సాగనున్నామని పేర్కొన్నారు. అన్నాడిఎంకేకు శరత్‌కుమార్ తీవ్ర ద్రోహం చేశారని, ఎస్‌ఎంకేను అడ్డం పెట్టుకుని ఆయన సాగించిన అవినీతికి హద్దేలేదంటూ ఆరోపణలు గుప్పిస్తూ చిట్టా విప్పారు. ఈ ఎన్నికల్లో శరత్‌కుమార్ ఎక్కడ పోటీ చేసినా సరే , ప్రత్యర్థిగా అమ్మ ఆజ్ఞతో బరిలో దిగడానికి తాను సిద్ధమని ప్రకటించారు.