'కోహ్లీ-ధోనీల మధ్య విభేదాలు లేవు'
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల మధ్య ఎటువంటి విభేదాలు చోటు చేసుకోలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా మహేంద్ర సింగ్ ఫీల్డింగ్ నిర్ణయాలపై కోహ్లీ విభేదించాడని వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. అది కేవలం మీడియా సృష్టి మాత్రమేనని సోమవారం సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ పేర్కొన్నారు. ప్రస్తుతం టీమిండియా జట్టులో ఎటువంటి విభేదాలు లేవని సందీప్ తెలిపారు. బంగ్లాదేశ్ టూర్ లో ఇద్దరు ఆల్ రౌండర్లు ఉండాలన్న కారణంగానే విక్రమ్ రాథోడ్, రోజర్ బిన్నీలను ఎంపిక చేశామన్నారు.
ఇదిలా ఉండగా బంగ్లాతో వన్డే సిరీస్ కోల్పోయిన అనంతరం టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని ధోనీ ప్రకటనపై సందీప్ తనదైన శైలిలో స్పందిచారు. టీమిండియా ఓటమి తరువాత చాలా రకాలైన వ్యాఖ్యలు విన్నామని.. అయితే ధోనీ కెప్టెన్సీ పై మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి చర్చ జరగలేదన్నాడు.