Mahendra Singh
-
Uttarakhand Assembly Election 2022: లోహాఘాట్ అసెంబ్లీ సీటు ఎవరిది? పోటాపోటీగా..
ఉత్తరాఖండ్: లోహాఘాట్ అసెంబ్లీ సీటు కోసం పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల వ్యూహకర్తల్లో గెలుపుపై ఉత్కంఠ ఇప్పటికే మొదలైంది. 2022లో జరగనున్న ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాకు చెందిన లోహాఘాట్ అసెంబ్లీ సీటు 2017లో కాషాయ పార్టీ దక్కించుకుంది. ఐతే ఈ సారి కాంగ్రెస్ సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది. కాగా ఈ సారి గెలుపోటములు పూర్తిగా ప్రజల అబీష్టం ప్రకారం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరో వైపు అధికార బీజేపీ మాత్రం ఉత్తరాఖండ్‌ను కాపాడుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తోంది. లోహావతి నది ఒడ్డునున్న లోహాఘాట్ చారిత్రక, పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన పురాన్ సింగ్ రెండుసార్లు గెలుపొందగా, కాంగ్రెస్ నుంచి మహేంద్ర సింగ్ రెండుసార్లు గెలుపొందారు. లోహాఘాట్ అసెంబ్లీ సీటు కోసం రానున్న ఎన్నికల్లో గట్టి పోటీకి తెరలేపనుంది. ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. టికెట్ రాకపోతే రెబల్స్ వస్తారో, నాయకుడికే మద్దతిస్తారనేది చూడాలి. లోహాఘాట్ అసెంబ్లీ స్థానం ఎవరు ఎప్పుడు గెలిచారంటే.. ►2017లో భారతీయ జనతా పార్టీకి చెందిన పురాన్ సింగ్ 148 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి ఖుషాల్ సింగ్‌పై రెండో సారి విజయం సాధించారు. ►2012 లో బీజేపీకి చెందిన పురన్ సింగ్ 30,429 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ మెహ్రాపై విజయం సాధించారు. ►2007లో కాంగ్రెస్‌కు చెందిన మహేంద్ర సింగ్ మహ్రా 15,433 ఓట్లతో బీజేపీకి చెందిన కృష్ణ చంద్ర పునేఠాపై విజయం సాధించారు. ►2002లో కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ మహ్రా ఈ స్థానంలో గెలుపొందారు. లోక్ సభ ఎంపీగా.. లోహాఘాట్ అసెంబ్లీ స్థానం అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీకి చెందిన అజయ్ తమ్టా ఎంపీగా 2,32,986 తేడాతో కాంగ్రెస్‌కి చెందిన ప్రదీప్ టామ్టాపై విజయం సాధించాడు. చదవండి: పదేళ్ల బాలిక సక్సెస్ఫుల్ బిజినెస్.. నెలకు కోటిపైనే ఆదాయం... -
ముప్పు ఉందని ముందే పసిగట్టాడు
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తరపున వాదిస్తున్న న్యాయవాది మహేంద్ర సింగ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందుగానే ఊహించారు. రోడ్డు ప్రమాదం జరగడానికి వారం రోజుల ముందే తుపాకీ లైసెన్స్ కోసం ఉన్నావ్ జిల్లా కలెక్టర్‌కు ఆయన లేఖ రాసిన తాజాగా వెలుగులోకి వచ్చింది. భవిష్యత్తులో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున తనకు తక్షణమే తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని జూలై 15న కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో తుపాకీ లైసెన్స్ కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించారు. పోలీసులు, జిల్లా యంత్రాంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తన దరఖాస్తును తిరస్కరించేలా చేసిందని ఆరోపించారు. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు మహేంద్ర సింగ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుత్తం లక్నోలోని కింగ్‌జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు బాధితురాలి లేఖపై సుప్రీంకోర్టు స్పందించింది. కేసు విచారణను 45 రోజుల్లో పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. బాధితురాలికి రూ.25 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. (చదవండి: ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!) -
మహేంద్రసింగ్‌ది కిరాయి హత్యే !
నెల్లూరు (క్రైమ్): జిల్లాలో సంచలనం రేకెత్తించిన రాజస్థాన్ వ్యాపారి మహేంద్రసింగ్ హత్య కేసులో చిక్కుముడిని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇది కిరాయి హత్యేనని తమ విచారణలో తేల్చిన పోలీసులు సూత్రదారిని అదుపులోకి తీసుకుని పాత్రదారుల కోసం గాలిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా సంద్రి మండలం ఆర్తండి గ్రామానికి చెందిన మహేంద్రసింగ్ రాజ్‌పురోహిత్ (40) ఈ నెల 3వ తేదీన తుపాకీలతో కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే. రాజ్‌పురోహిత్ తన భార్య ఉషాదేవితో కలిసి 15 ఏళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఫత్తేఖాన్‌పేట రైతుబజారు సమీపంలోని అక్కనవారి వీధిలో నివాసం ఉంటున్న ఆయన తన కుమార్తె కోమల్ పేరుతో సంతపేటలో, ఫత్తేఖాన్‌పేటలో, తిరుపతిలో పవర్ టూల్స్ సర్వీస్ అండ్ సేల్స్ పేరిట దుకాణాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని దుకాణ బాధ్యతలను ఆయన అన్న మంగిలాల్ రాజ్‌పురోహిత్ చూస్తున్నాడు. ఈ నెల 3వ తేదీ శనివారం రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూతవేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఆయనపై ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి తుపాకీతో కాల్పులు జరిపారు. మహేంద్రసింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సవాల్‌గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించారు. తొలుత నగదు కోసం దుండగలు హత్య చేశారా? అనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేపట్టారు. అయితే హత్య జరిగిన సమయంలో మృతుడి వద్ద రూ. 1.50 లక్షలు నగదు ఉండడంతో నగదు కోసం కాదని నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌లో ఆయన బావమరిది ఆత్మహత్య చేసుకోగా, మృతిపై అనుమానాలు ఉన్నాయనీ మహేంద్రసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి ఈ హత్యకు ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు. మహేంద్రసింగ్ స్వగ్రామంలోని స్థానిక సర్పంచ్‌తో గొడవలు పడేవారని ఈ నేపథ్యంలో ఏమైనా హత్య జరిగి ఉంటుందేమోననే అనుమానాలు వ్యక్తమవడంతో ఆ దిశగా సైతం విచారణ చేపట్టారు. మృతుడి సెల్‌ఫోను కాల్ డిటైల్స్‌ను పరిశీలించారు. బిహార్‌కు చెందిన వ్యక్తితో గొడవలు ఉన్నాయని తేలడంతో అతన్ని సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాలు తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో విచారణ చేపట్టినా ఎక్కడా చిన్నపాటి ఆధారాలు కూడా పోలీసులకు చిక్కలేదు. లోతైన దర్యాప్తులో వీడిన చిక్కుముడి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను విచారించే క్రమంలో మృతుడి సమీప బంధువు ఒకరు పొంతన లేని సమాధానాలు చెబుతుండటతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఈ కేసులోని చిక్కుముడి దాదాపుగా వీడిపోయినట్లు సమాచారం. ఆస్తి విషయాల్లో నెలకొన్న విభేదాలే హత్యకు దారితీసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ విషయంలో పలుమార్లు హతుడు తన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని, స్వగ్రామంలోని ఆస్తిని పంచకుండా అడ్డుకుంటున్నాడని, మరో కారణంతో మహేంద్రసింగ్‌ను అడ్డుతొలగించుకోవాలని నిందితుడు నిశ్చయించుకున్నట్లు తెలిసింది. నిందితుడు రాజస్థాన్‌లోని తన స్నేహితులతో కలిసి మహేంద్రసింగ్ హత్యకు పథక రచన చేసినట్లు, హత్యకు రూ.8 లక్షలు కిరాయి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నట్లు సమాచారం. దీంతో నిందితుడి స్నేహితులు (హంతకులు) రెక్కీ వేసి మహేంద్రసింగ్‌ను ఈ నెల 3వ తేదీ రాత్రి తుపాకీతో కాల్చిచంపినట్లు తెలిసింది. కిరాయి హంతకుల కోసం గాలింపు మహేంద్రసింగ్‌ను హత్య చేసిన కిరాయి హంతకుల కోసం ప్రత్యేక బృందాలు రాజస్థాన్, ముంబైల్లో గాలిస్తున్నాయి. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద హత్య కేసులో చిక్కుముడి దాదాపు వీడడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై పోలీసు అధికారులను వివరణ కోరగా వారు ధ్రువీకరించలేదు. త్వరలోనే వివరాలను వెల్లడిస్తామన్నారు. -
నెల్లూరులో కాల్పుల కలకలం
నెల్లూరు(క్రైమ్): దుండగుల కాల్పులతో బొల్లినేని ఆస్పత్రిలో మృతిచెందిన మహేంద్రసింగ్ మృతదేహాన్ని, సంఘటన స్థలిని శనివారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మృతునికి వ్యాపార లావాదేవీల్లో లేదా వ్యక్తిగతంగా ఎవరితోనైనా విభేదాలున్నాయా అనే వివరాల గురించి ఆరా తీశారు. కుటుంబ సభ్యులను విచారించగా ఎవరితోనూ విభేదాలులేవని వారు వెల్లడించినట్లు సమాచారం. అయితే దుండగులు ఎందుకు హత్యచేయాల్సి వచ్చిందనే విషయం పోలీసులకు చిక్కు ప్రశ్నలామారింది. ముమ్మరంగా తనిఖీలు వ్యాపారిపై దుండగులు కాల్పులకు తెగబడిన నేపథ్యం యంత్రాంగం అప్రమత్తమైంది. నగర డీఎస్పీ మురళీకృష్ణతోపాటు నెల్లూరు రూరల్, సీసీఎస్, ట్రాఫిక్ డీఎస్పీలు రాఘవరెడ్డి,బాల సుందరరావు, మల్లికార్జున నగరంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేంద్రసింగ్ శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. చిన్నబజారు పోలీసులు హత్యఘటనపై కేసు నమోదు చేశారు. వరుస సంఘటనల నేపథ్యంలో సిబ్బంది పనితీరుపై ఎస్పీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తెలిసినవారి పనే.. మహేంద్రసింగ్‌పై కాల్పులు జరిపిన వారు తెలిసివారే అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండు నుంచి వచ్చిన దుండగులు తొలుత మహేంద్రసింగ్‌తో మాట్లాడుతూ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. మహేంద్రసింగ్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేప«థ్యంలో మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. -
ధోనితో విభేదాల్లేవు: గంభీర్
న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనితో తనకు విభేదాలు ఉన్నాయని, అదే కారణంగా తాను జట్టుకు దూరమయ్యానని చాలా కాలంగా ప్రచారంలో ఉన్న వార్తలను గౌతం గంభీర్ కొట్టిపారేశాడు. తనకు ధోనితో పడదంటూ జరిగిన చర్చపై అతను స్పష్టంగా తన అభిప్రాయం వెల్ల డించాడు. ‘ఒకే చోట కలిసి ఉన్నప్పుడు అది కుటుంబం అయినా మరో చోట అయినా జీవితంలో చాలా మంది అభిప్రాయాల్లో తేడాలు ఉండటం సహజం. అంతే గానీ అదేమీ వైరంలాంటిది కాదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య లేదు. మేం కలిసి ఆడిన ప్రతీసారి సొంత అభిప్రాయాలు ఎలా ఉన్నా... చివరకు జట్టును గెలిపించడమే లక్ష్యంగా ఆడాం. అతనో గొప్ప ఆటగాడు, మంచి మనిషి. టి20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ విజయాలవంటి చిరస్మరణీయ జ్ఞాపకాలు మేమిద్దరం కలిసి పంచుకున్నాం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కొన్నాళ్ల క్రితం ధోనిపై రూపొందిన సినిమా విడుదల సమయంలో క్రికెటర్లపై అసలు బయోపిక్‌లు అవసరం లేదంటూ గంభీర్ వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. -
అభిమాన నటుడు రజనీ తో ధోనీ
-
ఇది యావత్ జాతికి గర్వకారణం:ధోని
బెంగళూరు:ఇటీవల భారత వైమానిక దళంలోకి తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్'ను ప్రవేశపెట్టడాన్ని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్వాగతించాడు. ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతీ ఒక్కరికి ధోని అభినందనలు తెలియజేశాడు. వైమానిక దళంలో తేజస్ ను ప్రవేశపెట్టడం యావత్ జాతి గర్వించదగ అంశం అంటూ ధోని తాజాగా ట్వీట్ చేశాడు. ఇది భారత్ సాధించిన అరుదైన ఘనతగా పేర్కొన్నాడు. ఈ నెల ఆదిలో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'తేజస్' ను భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ తేజస్ స్క్వాడ్రన్‌ను 'ఫ్లయింగ్ డ్యాగర్స్' గా పిలుస్తున్నారు. ఈ స్క్వాడ్రన్‌లోకి మరో ఆరు తేజస్‌లు త్వరలోనే చేరనున్నాయి. Cngrts to IAF on their latest warbirds and every1 who were part of the project indeed a very proud moment for INDIA pic.twitter.com/de6YANPzqE — Mahendra Singh Dhoni (@msdhoni) 1 July 2016 -
జడేజాపై రాజ్‌కోట్ దృష్టి!
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ జట్లలో అందుబాటులో ఉన్న వారిలో అందరికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. కాబట్టి సహజంగానే ధోనిని పుణే తీసుకోవచ్చు. సంజీవ్ గోయెంకాకు చెందిన కంపెనీ రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియలో మైనస్ 16 కోట్ల రూపాయలతో జట్టును పుణేను గెలిచింది. రాజ్‌కోట్‌ను కొనుక్కున్న ఇంటెక్స్ మొబైల్స్ (మైనస్ 10 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ మొత్తం పుణే జట్టు చెల్లిస్తోంది. కాబట్టి తొలి ఆటగాడిని పుణే ఎంచుకుంటే, రెండో క్రికెటర్‌ను రాజ్‌కోట్ తీసుకుంటుంది.ఒకవేళ ధోనిని పుణే చేజిక్కించుకుంటే.. రాజ్‌కోట్ జట్టు తమ తొలి ఆటగాడిగా జడేజాను ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో జడేజా విశేషంగా రాణించడంతో పాటు... అతను రాజ్‌కోట్‌కే చెందిన వాడు కావడంతో తొలుత ఈ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని భావిస్తున్నారు. మొత్తం మీద ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఆడిన ఆటగాళ్లలో కొందరు ఇప్పుడు రెండు వేరు వేరు జట్లకు ఆడాల్సి వస్తుంది. కొత్త జట్టు ఆటగాళ్ల కోసం కనిష్టంగా రూ.40 కోట్లు, గరిష్టంగా రూ.60 కోట్లు ఖర్చు చేయాలి. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో తొలి క్రికెటర్‌ను తీసుకోగానే ఇందులో నుంచి రూ.12.5 కోట్లు తగ్గిపోతాయి. ఆ తర్వాత నలుగురు క్రికెటర్లను తీసుకోగానే వరుసగా రూ.9.5 కోట్లు, రూ.7.5 కోట్లు, రూ.5.5 కోట్లు, రూ.4 కోట్లు తగ్గిపోతాయి. ఫిబ్రవరిలో జరిగే వేలంలో ఈ మొత్తాన్ని తగ్గించుకుని మిగిలిన ఆటగాళ్లను కొనుక్కోవాలి. చెన్నై, రాజస్తాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో వచ్చిన కొత్త జట్లు పుణే, రాజ్‌కోట్ జట్లు మంగళవారం పదిమంది క్రికెటర్లను ఎంచుకోనున్నాయి. చెన్నై, రాజస్తాన్ జట్లకు గత సీజన్లో ఆడిన మొత్తం 50 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండగా... ఈ రెండు జట్లు ఐదుగురేసి ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ధోని, అశ్విన్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, బ్రెండన్ మెకల్లమ్, అజింక్య రహానే, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, డ్వేన్ బ్రే వో, డ్వేన్ స్మిత్‌ల మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇంకా మిగిలిన 40 మంది క్రికెటర్లు ఫిబ్రవరిలో జరిగే వేలంలోకి వెళతారు. అక్కడ వీరితో పాటు మరింత మంది క్రికెటర్లు ఉంటారు. ఆ వేలంలో అన్ని జట్లూ పాల్గొంటాయి. -
'కోహ్లీ-ధోనీల మధ్య విభేదాలు లేవు'
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల మధ్య ఎటువంటి విభేదాలు చోటు చేసుకోలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా మహేంద్ర సింగ్ ఫీల్డింగ్ నిర్ణయాలపై కోహ్లీ విభేదించాడని వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. అది కేవలం మీడియా సృష్టి మాత్రమేనని సోమవారం సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ పేర్కొన్నారు. ప్రస్తుతం టీమిండియా జట్టులో ఎటువంటి విభేదాలు లేవని సందీప్ తెలిపారు. బంగ్లాదేశ్ టూర్ లో ఇద్దరు ఆల్ రౌండర్లు ఉండాలన్న కారణంగానే విక్రమ్ రాథోడ్, రోజర్ బిన్నీలను ఎంపిక చేశామన్నారు. ఇదిలా ఉండగా బంగ్లాతో వన్డే సిరీస్ కోల్పోయిన అనంతరం టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని ధోనీ ప్రకటనపై సందీప్ తనదైన శైలిలో స్పందిచారు. టీమిండియా ఓటమి తరువాత చాలా రకాలైన వ్యాఖ్యలు విన్నామని.. అయితే ధోనీ కెప్టెన్సీ పై మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి చర్చ జరగలేదన్నాడు. -
'ఆటగాడిగా ఉన్నా సంతోషమే'
మిర్పూర్: ఆటకైనా, మాటకైనా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునే టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఘోర ఓటమిని చవిచూసి సిరీస్ ను కోల్పోయిన టీమిండియాపై విమర్శలు ఇంకా ఊపందుకోకముందే ధోనీ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పాడు. అవసరమైతే టీమిండియా కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. 'కెప్టెన్సీ నుంచి బయట రావడాన్ని కూడా ఆస్వాదిస్తా. భారత క్రికెట్ టీమ్ లో ఏ విధమైన చెడు జరిగినా అందుకు నేను కూడా ఒక బాధ్యుణ్నే. బోర్డు పెద్దలు నన్ను ఆటగాడిగా పరిమితం చేసినా ఇబ్బందేమీ లేదు' అని ధోనీ వ్యాఖ్యానించాడు. ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో ఓటమి పాలైన అనంతరం ధోనీ మాట్లాడుతున్న సమయంలో ఊహించని ప్రశ్న ఒకటి ఉక్కిరిబిక్కిరి చేసింది. టీమిండియా కెప్టెన్ గా ఎంతకాలం కొనసాగవచ్చని అనుకుంటున్నారు?అని ధోనీని అడగ్గా.. ప్రస్తుతం అయితే కెప్టెన్ గా ఉన్నా.. భవిష్యత్తులో జరిగే పరిస్థితులైతే తనకు తెలియదన్నాడు. 'నేను క్రికెట్ ను ఎంజాయ్ చేస్తున్నా. క్రికెట్ కెప్టెన్ గా ఎంతకాలం ఉంటారని ప్రశ్న ఏదో ఒక రోజు వస్తుందనే విషయం నాకు తెలుసు. నన్ను మీడియా ప్రేమించింది. నా వల్లే టీమిండియా ఓడిపోతుందని మీరు భావించినట్లైయితే.. నేను కెప్టెన్ గా తప్పుకుంటే టీమిండియా క్రికెట్ అభివృద్ది చెందుతుందని మీరు నిర్ణయిస్తే తప్పకుండా ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతా' అని ధోనీ స్పష్టం చేశాడు. జట్టుకు ఎవరు కెప్టెన్ అనేది ఎప్పుడూ సమస్య కానే కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు. ఆటగాడిగానైనా జట్టులో ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని ధోనీ తెలియజేశాడు. -
తొలి టెస్టుకు మహేంద్ర సింగ్ ధోని!
అడిలైడ్: భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఇక్కడ జరిగే తొలి టెస్టుకు భారత కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని హాజరయ్యే అవకాశం ఉంది. ముందుగా ఖరారు చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితా ప్రకారం తొలి టెస్టులో ధోని పేరు లేదు. చేతికి గాయం కారణంగా 'బ్రిస్బేన్'టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ ధోని స్థానంలో తాత్కాలిక కెప్టెన్ గా విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టాడు. అయితే ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా తొలి టెస్టు వేదిక బ్రిస్బేన్ నుంచి అడిలైడ్ కు మారింది. పాత షెడ్యూల్ ప్రకారం 12నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు జరగాల్సి ఉండగా... 4 వ తేదీ నుంచి బ్రిస్బేన్ లో తొలి టెస్టు జరగాలి. ఇప్పుడు మెల్బోర్న్ మినహా మిగతా మూడు టెస్టు మ్యాచ్‌ల తేదీల్లో స్వల్ప మార్పులతో కొత్త షెడ్యూల్ ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది.గత రెండేళ్లుగా ఫిల్ హ్యూస్ సొంత మైదానంగా మార్చుకున్న అడిలైడ్‌లోనే సిరీస్ ప్రారంభించడం అతనికి నివాళిగా సీఏ భావిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మారిన షెడ్యూల్ సమీకరణాలు దృష్ట్యా ధోని అడిలైడ్ టెస్టుకు హాజరైనా.. ఆ టెస్టులో ఆడతాడా?లేదా అనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
ఆరుగురు భారత బ్యాట్స్‌మెన్ డకౌట్
-
‘సున్నా’లే సిగ్గుపడేలా..!
ఆరుగురు భారత బ్యాట్స్‌మెన్ డకౌట్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌట్ అర్ధసెంచరీతో ధోని ఒంటరిపోరాటం బ్రాడ్‌కు 6 వికెట్లు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 113/3 ఎంత విడ్డూరం..! చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో చిరస్మరణీయ విజయం సాధించిన జట్టేనా ఇది! గొప్ప విజయం తరువాత ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయంలో ఆడే తీరేనా ఇది! దెబ్బతిన్న పులుల్లా విజృంభించాల్సిన సందర్భంలో ఇంగ్లండ్ పేస్‌కు దాసోహమంటూ భారత బ్యాట్స్‌మెన్ పిల్లుల్లా తోక ముడిచారు. ఆడుతున్నది టెస్టు మ్యాచేనా అన్న అనుమానం కలిగేలా.. కనీసం 50 ఓవర్లు కూడా ఆడకుండా ఒకరి వెనకాల మరొకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒకరిద్దరు కాదు, ముగ్గురు కాదు.. ఏకంగా అరడజను మంది పరుగుల ఖాతా తెరవకుండానే తమకేదో అత్యవసర పని ఉన్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్నారు. వీరు చుట్టిన ‘సున్నా’ లకు నిజంగా ‘సున్నా’లే సిగ్గుపడుతున్నాయి. అవును.. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడమన్నది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏదేమైనా ధోనిసేన ఈ ఘనతనూ సొంతం చేసుకుంది. మాంచెస్టర్: టెస్టుల్లో ధోని ఆరో ఓవర్లోనే బ్యాటింగ్‌కు వస్తాడని ఎవరైనా ఊహిస్తారా? భారత్ 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోతుందని అంచనా వేస్తారా? సగటు భారత అభిమాని కలలో కూడా ఊహించని ఈ పరిణామాలు మాంచెస్టర్ టెస్టులో జరిగాయి. ఇంగ్లండ్ పేసర్లు బ్రాడ్ (6/25), అండర్సన్ (3/46) సంచలన బౌలింగ్‌తో.... నాలుగో టెస్టులో భారత్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. ధోని (133 బంతుల్లో 71; 15 ఫోర్లు) ఒంటరిపోరాటం చేయగా.... అశ్విన్ (42 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్సర్) కాసేపు తోడుగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 3 వికెట్లకు 113 పరుగులు చేసింది. బెల్ (45 బ్యాటింగ్), జోర్డాన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బ్యాలెన్స్ (37) ఫర్వాలేదనిపించినా... కుక్ (17), రాబ్సన్ (6) విఫలమయ్యారు. ఆరోన్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం కుక్‌సేన 39 పరుగులు వెనుకబడి ఉంది. వర్షం వల్ల మ్యాచ్ ఆరగంట ఆలస్యంగా ఆరంభమైంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) కుక్ (బి) అండర్సన్ 0; గంభీర్ (సి) రూట్ (బి) బ్రాడ్ 4; పుజారా (సి) జోర్డాన్ (బి) బ్రాడ్ 0; కోహ్లి (సి) కుక్ (బి) అండర్సన్ 0; రహానే (సి) బెల్ (బి) జోర్డాన్ 24; ధోని (సి) జోర్డాన్ (బి) బ్రాడ్ 71; జడేజా ఎల్బీడబ్ల్యు (బి) అండర్సన్ 0; అశ్విన్ (సి) రాబ్సన్ (బి) బ్రాడ్ 40; భువనేశ్వర్ (బి) బ్రాడ్ 0; ఆరోన్ నాటౌట్ 1; పంకజ్ సింగ్ (బి) బ్రాడ్ 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (46.4 ఓవర్లలో ఆలౌట్) 152. వికెట్ల పతనం: 1-8; 2-8; 3-8; 4-8; 5-62; 6-63; 7-129; 8-137; 9-152; 10-152 బౌలింగ్: అండర్సన్ 14-3-46-3; బ్రాడ్ 13.4-6-25-6; వోక్స్ 10-1-43-0; జోర్డాన్ 9-4-27-1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) పంకజ్ (బి) ఆరోన్ 17; రాబ్సన్ (బి) భువనేశ్వర్ 6; బ్యాలెన్స్ ఎల్బీడబ్ల్యు (బి) ఆరోన్ 37; బెల్ బ్యాటింగ్ 45; జోర్డాన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (35 ఓవర్లలో 3 వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1-21; 2-36; 3-113 బౌలింగ్: భువనేశ్వర్ 9-4-17-1; పంకజ్ సింగ్ 11-1-50-0; ఆరోన్ 8-2-26-2; అశ్విన్ 7-0-16-0. భారత్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్ కావడం ఇదే తొలిసారి. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ల ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. అయితే ఒక ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్ అయిన సందర్భంలో భారత్‌దే (152) అత్యధిక స్కోరు కావడం విశేషం. తొలి 4 వికెట్లు కోల్పోయిన దశలో భారత్ ఇంతకంటే చెత్త ప్రదర్శన 1952లో హెడింగ్లీ టెస్టులో కనబర్చింది. అప్పుడు సున్నాకే భారత్ మొదటి 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మరోసారి 1952లోనే ఓవల్‌లో 6 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఎందుకిలా జరిగింది..? మాంచెస్టర్ టెస్టులో టాస్ గెలవగానే ధోని నవ్వాడు. అటు కుక్ కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలని అనుకున్నానని చెప్పాడు. అంటే ఇరు జట్ల కెప్టెన్లు వికెట్‌ను ఒకేలా చదివారు. కానీ అరగంట తర్వాత కుక్ నవ్వాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు నలుగురు భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌లో కూర్చున్నారు. వికెట్ మీద పేస్ ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసినా... మ్యాచ్ ఆరంభానికి ముందు కొద్దిసేపు వర్షం పడటంతో వచ్చిన తేమను ఇంగ్లండ్ పేసర్లు సమర్థంగా వినియోగించుకున్నారు. దీనికితోడు అండర్సన్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌తో బంతిని స్వింగ్ చేశాడు. మరో ఎండ్‌లో బ్రాడ్ అద్భుతంగా బౌన్స్ రాబట్టాడు. లంచ్ తర్వాత అశ్విన్, ధోని షాట్లు ఆడిన తీరు చూస్తే ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం అసాధ్యమేం కాదనే విషయం అర్థమైంది. ఇంగ్లండ్‌లో ఏ వేదికలో టెస్టు జరిగినా తొలి సెషన్లో బౌలర్లకు సహకారం లభిస్తుందనేది జగమెరిగిన సత్యం. కానీ భారత ‘టాప్’ బ్యాట్స్‌మెన్ ఈ విషయాన్ని గ్రహించలేకపోయారు. ఓ గంట, రెండు గంటల పాటు పరుగులు రాకపోయినా నష్టమేం లేదు. వికెట్లు చేతిలో ఉంటే రెండు, మూడు సెషన్లలో పరుగులు చేసుకోవచ్చు. దీనికి తోడు బంతి స్వింగ్ అవుతున్నప్పుడు డ్రైవ్‌లు ఆడాల్సిన అవసరం ఏంటో తెలియదు. మొత్తానికి టాస్ గెలవడం ద్వారా లభించిన అడ్వాంటేజ్‌ను భారత బ్యాట్స్‌మెన్ కేవలం అరగంటలోనే నాశనం చేశారు. ధోని, అశ్విన్ కలిసి ఆడుతున్న సమయంలో భారత్ తిరిగి పుంజుకునే అవకాశం లభించింది. ఎదురుదాడి ఆయుధంగా ఆడిన అశ్విన్... కాస్త పరిస్థితి చక్కబడుతున్న సమయంలో సంయమనం చూపకుండా అవుటయ్యాడు. ఆ తర్వాత ఏ దశలోనూ భారత్ కోలుకోలేదు. ఎప్పుడూ దూకుడుగా ఆడే ధోని ఈసారి తన శైలికి భిన్నంగా ఆడి అర్ధసెంచరీ చేయకపోతే... తీవ్రమైన అవమాన భారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇక టెస్టు పోయినట్లే (నా)! పేలవ బ్యాటింగ్‌తో తొలి రోజు కేవలం రెండు సెషన్లలోనే ఆలౌటైన భారత్... ఇక ఈ టెస్టును కాపాడుకున్నా అద్భుతమే అనుకోవాలి. మొదటి రోజు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడటంతో.. ఆ జట్టు ఇప్పటికే భారత్ స్కోరుకు చేరువయింది. ఇంగ్లండ్ పేసర్లు ప్రభావం చూపిన పిచ్‌పై భారత సీమర్లు ఇప్పటికే తేలిపోయారు. భువనేశ్వర్, ఆరోన్ ఆకట్టుకున్నా... పంకజ్ సింగ్‌ను ఆతిథ్య బ్యాట్స్‌మెన్ తేలికగా ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే భారత బౌలర్లు అద్భుతం చేయాలి. అది కూడా రెండో రోజు ఉదయం సెషన్లో నాలుగు వికె ట్లు తీయగలిగితేనే మ్యాచ్‌లో నిలబడతారు. ఒకవేళ కుక్‌సేనకు తొలి ఇన్నింగ్స్‌లో 150పై చిలుకు ఆధిక్యం వస్తే మాత్రం మ్యాచ్‌తో పాటు సిరీస్‌పై పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిందే..! - సాక్షి క్రీడావిభాగం సెషన్ 1: ‘టాప్’లేచింది వాతావరణం మేఘావృతంగా ఉండటంతో ఆరంభంలోనే ఇంగ్లండ్ పేసర్లు అండర్సన్, బ్రాడ్ బంతితో చుక్కలు చూపారు. తొలి 5.1 ఓవర్లలో భారత ‘టాప్’లేపి మ్యాచ్‌ను ఆధీనంలో తెచ్చుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత టెస్టు ఆడుతున్న గంభీర్ (4)ను బ్రాడ్ వెనక్కి పంపాడు. తర్వాత మూడు బంతుల వ్యవధిలో విజయ్ (0), కోహ్లి (0)లను అండర్సన్ దెబ్బతీశాడు. వదిలేయాల్సిన అవుట్ స్వింగర్‌ను ఆడిన కోహ్లి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఆ వెంటనే పుజారా (0) అవుట్ కావడంతో భారత్ 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత రహానే (24), ధోని ఇన్నింగ్స్‌ను ఆదుకునే బాధ్యతను తీసుకున్నారు. ఐదో వికెట్‌కు 54 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించినా లంచ్‌కు ముందు జోర్డాన్ ఈ జోడిని విడదీశాడు. ఓవరాల్‌గా ఈ సెషన్లో ఇంగ్లండ్ పేస్‌కు భారత్ దాసోహమైంది. ఓవర్లు: 25; పరుగులు: 63; వికెట్లు: 5 సెషన్ 2: ధోని నిలకడ లంచ్ తర్వాత రెండో ఓవర్లో అండర్సన్ వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు జడేజా (0) వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్ మరోసారి కష్టాలపాలైంది. క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ను ఇంగ్లండ్ పేసర్లు టార్గెట్ చేసినా నాణ్యమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ 34వ ఓవర్లో భారత్ 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. 35వ ఓవర్లో ఇచ్చిన క్యాచ్‌ను బట్లర్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న అశ్విన్... ఫీల్డర్లను దగ్గరగా మొహరించడంతో కాస్త ఇబ్బందిపడ్డాడు. ఫలితంగా బ్రాడ్ వేసిన షార్ట్ బంతిని గాల్లోకి లేపి రాబ్సన్ చేతికి చిక్కాడు. ఓవరాల్‌గా టాప్ బ్యాట్స్‌మన్ కంటే మెరుగ్గా ఆడిన అశ్విన్...ధోనితో కలిసి ఏడో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. 115 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కెప్టెన్ నిలకడగా ఆడినా బ్రాడ్ దెబ్బకు లోయర్ ఆర్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. బ్రాడ్ 21 బంతుల వ్యవధిలో ఆరు పరుగులకు ధోనితో సహా చివరి నాలుగు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఓవర్లు: 21.4; పరుగులు: 89; ఓవర్లు: వికెట్లు: 5 సెషన్ 3: మూడు వికెట్లు టీ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను కాసేపు భారత పేసర్లు ఇబ్బందిపెట్టారు. భువనేశ్వర్ లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో 9వ ఓవర్లో ఫలితం వచ్చింది. భువీ బంతిని అద్భుతంగా ఇన్‌స్వింగ్ చేసి రాబ్సన్ (6)ను అవుట్ చేశాడు. పంకజ్ స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన ఆరోన్ తన రెండో ఓవర్లోనే కుక్ (17)ను వెనక్కి పంపడంతో భారత్ శిబిరంలో ఆనందం నెలకొంది. 22వ ఓవర్లో అశ్విన్‌ను బౌలింగ్‌కు దించడంతో బెల్ భారీ సిక్సర్‌తో స్వాగతం పలికాడు. రెండో ఎండ్‌లో బ్యాలెన్స్ కూడా వికెట్‌ను కాపాడుకుంటూనే వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడిని విడదీసేందుకు ధోని బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించాడు. ఈ వ్యూహం రోజు చివరి ఓవర్లో ఫలించింది. వేగంగా దూసుకొచ్చిన ఫుల్‌లెంగ్త్ బంతి మిస్సయి బ్యాలెన్స్ ప్యాడ్‌ను తాకింది. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన జోర్డాన్ మరో వికెట్ పడకుండా రోజు ముగించాడు. ఓవర్లు: 35; పరుగులు: 113; వికెట్లు: 3 -
మూడో టెస్టు: ఓటమి అంచున భారత్
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో భారత్‌కు ఓటమి గండం పొంచి వుంది. మ్యాచ్ నాలుగో రోజు బుధవారం 445 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లకు 112 పరుగులు చేసింది. భారత్ ఇంకా 333 పరుగులు వెనుకబడివుండగా, చేతిలో ఆరు వికెట్లున్నాయి. రహానె, రోహిత్ క్రీజులో ఉన్నారు. మురళీ విజయ్, ధవన్, పుజారా, కోహ్లీ అవుటయ్యారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ను 205/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసి, 445 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కుక్(70 నాటౌట్), రూట్(56) అర్థసెంచరీలతో రాణించడంతో ఇంగ్లీషు జట్టు వేగంగా పరుగులు సాధించింది.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 569/7 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 330 పరుగులకు ఆలౌటైంది. -
టీమిండియా టార్గెట్ 445 పరుగులు
సౌతాంప్టన్: మూడో టెస్టులో భారత్ కు ఇంగ్లండ్ 445 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ ను 205/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కుక్(70 నాటౌట్), రూట్(56) అర్థసెంచరీలతో రాణించడంతో ఇంగ్లీషు జట్టు వేగంగా పరుగులు సాధించింది. టీ విరామ సమయానికి 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రాబ్సన్ 13, బాలన్స్ 38, బెల్ 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 569/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 330 పరుగులకు ఆలౌటైంది. -
ఫాలోఆన్ లో చిక్కుకున్న టీమిండియా
సౌతాంప్టన్: ఇంగ్లండ్ లో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఫాలోఆన్ గండం నుంచి తప్పించుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 330 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్ కు 40 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 323/8 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఏడుగురు పరుగులు మాత్రమే జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ 243 పరుగులు వెనుకబడింది. ఇంగ్లీషు బౌలర్ల ఆధిపత్యానికి టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని తలవంచాడు. అర్థ సెంచరీతో క్రీజులో ఉన్న కూల్ కెప్టెన్ ఒక్క పరుగు కూడా జోడించకుండానే వెనుదిరిగాడు. షమీ 5 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 5 వికెట్లు నేలకూల్చాడు. బ్రాడ్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టారు. భారత్ తో ఫాలో ఆన్ ఆడించకుండా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. -
ధోని వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి?
జట్టులో ఆడేటప్పుడే అందరూ ఫాం ఉంటారను కోవటం పారపాటే. ఒక టోర్నీ జరిగేటప్పుడు ఆటగాళ్ల ఫాంను కూడా లెక్కించడం కూడా కష్టమే. ఒక మ్యాచ్ లో గెలిస్తే..మరో మ్యాచ్ కి అదే టీంను కొనసాగించడం ఎక్కువగా జరుగుతుంది. ఆ తరుణంలో ఒకరిద్దరి ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శన కూడా పెద్దగా లెక్కించరు. సమిష్టిగా విజయాలు సాధిస్తున్నప్పుడు టీం లో ఏమీ మార్పులు ఉండవు. ఆ రకంగానే యువరాజ్ చివరి వరకూ జట్టులో కొనసాగాడు. కాగా, చివరి మ్యాచ్.. అదీ ఒక ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో జట్టును నైరాశ్యంలోకి నెట్టి యువీ ఆడిన తీరు ఎంతమాత్రం సబబు కాదు. ఒకప్రక్క విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తుంటే అతనికి స్ట్రైకింగ్ ఇచ్చేందుకు కూడా యువీ యత్నించకపోవడమే అతను మానసికంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడనేది అర్దమవుతోంది. ఆటంటే సవాళ్లు..ప్రతి సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించాలంటే అన్నిరకాలుగా ఫిట్ గా ఉండాలి. మరి ఆ ఆటతీరు ప్రేక్షకులకే చికాకు తెప్పిస్తే జట్టు కెప్టెన్ కు అసహనానికి గురి చేయదా? అదే కనిపించింది నిన్నటి మన టీం ఇండియా కెప్టెన్ ధోని మాటల్లో..ఏ క్రికెటర్ కూడా కావాలని చెత్తగా ఆడడు. కానీ ఆటలో ఇవన్నీ సహజం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అంటూ యువీకి మద్దతుగా మాట్లాడాడు. కానీ... అదే ధోని పరోక్షంగా యువీ కెరీర్ ముగిసినట్లే అనే సంకేతమిచ్చాడు. యువరాజ్ భవిష్యత్ ఏమిటి? అనే ప్రశ్నకు ‘ఈరోజు గురించి మాట్లాడుకుందాం. సెలక్షన్ గురించి ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు. ఎందుకంటే భారత క్రికెట్‌కు సీజన్ అయిపోయింది. ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ ఆడాలి. దాని తర్వాత మళ్లీ భారత జట్టు ఎంపిక సమయం వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడదాం’ అన్నాడు. ప్రస్తుతానికి టీం ఇండియా ఆడే మ్యాచ్ లు ఏమీ లేకపోవడంతో సెలక్షన్ సమస్య ఇప్పటికి ఉండదు. అయితే రాబోయే రోజుల్లో యువరాజ్ భవితవ్యం ఏంటనేది ఈపాటికి అభిమానులకు అర్థమయ్యే ఉంటుంది. -
వాయవ్య ఢిల్లీ ఎన్నికల చిత్రం
దళితులు, జాట్ల ఓట్లే కీలకం సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో వాయవ్య ఢిల్లీ అన్నింటికన్నా పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్.. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కృష్ణా తీరథ్‌కు, బీజేపీ.. దళిత నేత ఉదిత్‌రాజ్‌కు టికెట్ ఇచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ.. ముందుగా ప్రకటించిన అభ్యర్థి మహేంద్ర సింగ్ టికెట్ వాపస్ చేయడంతో మాజీ మంత్రి రాఖీ బిర్లాను బరిలోకి దింపింది. కృష్ణాతీరథ్ పదేళ్లుగా వాయవ్య ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె బీజేపీకి చెందిన మీరా కన్వరియాను 1.8 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. అయితే ప్రస్తు తం గట్టిగా వీస్తోన్న కాంగ్రెస్ వ్యతిరేకపవనాల దృష్ట్యా కృష్ణాతీరథ్ విజయం సాధించడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. మహేంద్రసింగ్‌ను ఎన్నికల బరిలోనుంచి తప్పించి, ఢిల్లీ కాంగ్రెస్ నేతలలో దిగ్గజంగా గుర్తింపు పొందిన రాజ్‌కుమార్ చౌహాన్‌ను భారీ మెజారిటీతో ఓడించిన రాఖీ బిర్లాను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపడం వల్ల ఆప్ విజయావకాశాలు మెరుగయ్యాయని అంటున్నారు. వాల్మీకీ సమాజం అండ ఆమెకు లాభిస్తుందని ఆశిస్తున్నారు. అయితే రాఖీ అభ్యర్థిత్వాన్ని మహేంద్రసింగ్ వ్యతిరేకించారు . ప్రచారం చేయడం కోసం రాఖీ తనను డబ్బు అడిగారని కూడా ఆయన ఆరోపించారు. రాఖీకి తాను మద్దతు ఇవ్వబోనని ప్రకటించారు. మహేంద్ర సింగ్‌కు టికెట్ ఇవ్వడానికి ముందు కూడా రాఖీ అభ్యర్థిత్వాన్ని కొందరు స్థానిక నేతలు కూడా వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకతతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రజలకు తగ్గిన మోజువల్ల రాఖీని కూడా విజయలక్ష్మి అంత సులువుగా వరించే సూచనలు కనిపించడం లేదంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఉదిత్‌రాజ్ కూడా వాల్మీకీ సమాజం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలో అడుగుపెట్టిన ఉదిత్‌రాజ్ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ , ఎస్టీలకు అధినేత. అయన గత నెలలోనే బీజేపీలో చేరారు. పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి టికెట్ ఇవ్వకుండా కొత్తగా వచ్చిన ఉదిత్ రాజ్‌కు టికెట్ ఇవ్వడాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. అయితే ఉదిత్‌రాజ్ మాత్రం తాను 34 సంవత్సరాలుగా ఢిల్లీవాసినని, జాతీయస్థాయి నేతనని అంటున్నారు. ఈ రిజర్వుడు నియోజకవర్గంపై బీఎస్పీ కూడా ఆశలు పెట్టుకుంది. బీఎస్పీ ఇక్కడి నుంచి బసంత్ పవార్‌ను నిలబెట్టింది. ఔటర్ ఢిల్లీ నియోకవర్గం నుంచి విడదీసిన ప్రాంతాలతో 2008లో ఆవిర్భవించిన వాయవ్య ఢిల్లీ నియోజకవర్గంలోని 17 లక్షలకు పైగా ఓటర్ల లో 21 శాతం మంది దళిత ఓటర్లున్నారు. జాట్ ఓటర్ల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువే. ఓటర్లలో 16 శాతం మంది జాట్లున్నారు. బ్రాహ్మణులు 12 శాతం, వైశ్యులు 10 నుంచి 11 శాతం, ముస్లింలు 5 నుంచి 8 శాతం ఉన్నారు. హర్యానాను ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గం పరిధిలో 100కి పైగా గ్రామాలున్నాయి. 20 జేజే కాలనీలు, పలు అనధికార కాలనీలు ఉన్నాయి. అనధికార కాలనీలు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేవి. కానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీరు మారిపోయింది. ఓటర్లు కాంగ్రెస్ కన్నా ఢిల్లీ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గుచూపారు. -
వాయవ్య ఢిల్లీ బరిలో రాఖీ బిర్లా
సాక్షి, న్యూఢిల్లీ: వాయవ్య ఢిల్లీ రిజర్వ్డ్ ఎంపీ సీటు బరి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి మహేంద్ర సింగ్ వైదొలిగారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి మాజీ మంత్రి రాఖీబిర్లా పోటీ చేస్తున్నట్టు సమాచారం. ఈమె కేజ్రీవాల్ సర్కారులో మహిళాశిశు అభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేయడం తెలిసిందే. వాయవ్యఢిల్లీ లోక్‌సభ ఎన్నికల బరి నుంచి వైదొలగడానికి మహేంద్ర సింగ్ కారణాలు వెల్లడించలేదు. సింగ్‌పై క్రిమినల్ కేసులున్న దృష్ట్యా అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను కోరిందని, అందుకు సింగ్ అంగీకరించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అన్నా హజారే ఆందోళనలు మొదలు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న సింగ్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని సమాచారం. ఈ విషయం తమకు ఇటీవలే తెలిసిందని ఆప్ నేత ఒకరు చెప్పారు. నకిలీ నోట్ల చెలామణి కేసులో సింగ్ మూడు నెలలు జైలులో ఉన్నట్లు తేలడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి రాఖీ బిర్లాను అభ్యర్థిగా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. వాయవ్య ఢిల్లీ నుంచి రాఖీ బిర్లాను అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీలో ఒక వర్గం మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. అయితే శాసనసభ్యులకు టికెట్ ఇవ్వరాదని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ మొదట్లోనే ప్రకటించారు. ఇది వరకే ఎమ్మెల్యే అయిన రాఖీకి ఎలా టికెట్ ఇస్తారంటూ కొందరు కార్యకర్తలు నిరసనలు ప్రారంభించారు. ఇప్పుడు మహేంద్ర సింగ్ అభ్యర్థిత్వం రద్దు కావడంతో రాఖీ బిర్లాను ఎన్నికల బరిలోకి దింపాలని ఆప్ భావిస్తోంది. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి కేజ్రీవాల్‌ను బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించి కాబట్టి రాఖీని అభ్యర్థిగా ప్రకటించడం సులువుగా మారిందని పార్టీ నేత చెప్పారు. వాయవ్య ఢిల్లీకి ప్రస్తుతం కృష్ణాతీరథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ ఇక్కడి నుంచి ఉదిత్‌రాజ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. రాఖీ బిర్లా ఆమ్ ఆద్మీ పార్టీలో దళిత నేతగా గుర్తింపు పొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ దిగ్గజం రాజ్‌కుమార్ చౌహాన్‌ను ఓడించారు. ఇది వరకే కీలక దళిత నేతలుగా ముద్ర పడిన ఉదిత్ రాజ్‌ను, కృష్ణా తీరథ్‌ను ఎదుర్కోవడానికి రాఖీ బిర్లాయే తగిన అభ్యర్థని పార్టీ భావించినట్లు సమాచారం.