ఉత్తరాఖండ్: లోహాఘాట్ అసెంబ్లీ సీటు కోసం పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల వ్యూహకర్తల్లో గెలుపుపై ఉత్కంఠ ఇప్పటికే మొదలైంది. 2022లో జరగనున్న ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాకు చెందిన లోహాఘాట్ అసెంబ్లీ సీటు 2017లో కాషాయ పార్టీ దక్కించుకుంది. ఐతే ఈ సారి కాంగ్రెస్ సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది. కాగా ఈ సారి గెలుపోటములు పూర్తిగా ప్రజల అబీష్టం ప్రకారం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరో వైపు అధికార బీజేపీ మాత్రం ఉత్తరాఖండ్‌ను కాపాడుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తోంది.
లోహావతి నది ఒడ్డునున్న లోహాఘాట్ చారిత్రక, పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన పురాన్ సింగ్ రెండుసార్లు గెలుపొందగా, కాంగ్రెస్ నుంచి మహేంద్ర సింగ్ రెండుసార్లు గెలుపొందారు. లోహాఘాట్ అసెంబ్లీ సీటు కోసం రానున్న ఎన్నికల్లో గట్టి పోటీకి తెరలేపనుంది. ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. టికెట్ రాకపోతే రెబల్స్ వస్తారో, నాయకుడికే మద్దతిస్తారనేది చూడాలి.
లోహాఘాట్ అసెంబ్లీ స్థానం ఎవరు ఎప్పుడు గెలిచారంటే..
►2017లో భారతీయ జనతా పార్టీకి చెందిన పురాన్ సింగ్ 148 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి ఖుషాల్ సింగ్‌పై రెండో సారి విజయం సాధించారు.
►2012 లో బీజేపీకి చెందిన పురన్ సింగ్ 30,429 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ మెహ్రాపై విజయం సాధించారు.
►2007లో కాంగ్రెస్‌కు చెందిన మహేంద్ర సింగ్ మహ్రా 15,433 ఓట్లతో బీజేపీకి చెందిన కృష్ణ చంద్ర పునేఠాపై విజయం సాధించారు.
►2002లో కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ మహ్రా ఈ స్థానంలో గెలుపొందారు.
లోక్ సభ ఎంపీగా..
లోహాఘాట్ అసెంబ్లీ స్థానం అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీకి చెందిన అజయ్ తమ్టా ఎంపీగా 2,32,986 తేడాతో కాంగ్రెస్‌కి చెందిన ప్రదీప్ టామ్టాపై విజయం సాధించాడు.
చదవండి: పదేళ్ల బాలిక సక్సెస్‌ఫుల్ బిజినెస్.. నెలకు కోటిపైనే ఆదాయం...
Comments
Please login to add a commentAdd a comment