Uttarakhand Assembly elections
-
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
రావత్, తివారీ ట్వీట్లు; కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న సీనియర్ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైకమాండ్ వైఖరిని తప్పుబడుతూ తాజాగా మనీష్ తివారీ ట్వీట్ చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి కేంద్ర నాయకత్వ విధానాలే కారణమన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ‘మొదట అసోం, తర్వాత పంజాబ్, ఇప్పుడు ఉత్తరాఖండ్.. ’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ సొంత పార్టీ నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మరుసటిరోజే మనీష్ తివారీ గళం విప్పడం గమనార్హం. సొంత పార్టీలోనే సహాయ నిరాకరణ: రావత్ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార చీఫ్, రాష్ట్ర మాజీ సీఎం హరీశ్ రావత్ సొంత పార్టీ నాయకుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ‘ఎన్నికల్లో కష్టపడి పార్టీని విజయతీరాలకు చేర్చే పనిలో చేదోడువాదోడుగా ఉండాల్సిందిపోయి కాంగ్రెస్ నేతలే మొండిచేయి చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను మొసళ్లుగా వదిలింది. అయినాసరే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎన్నికల సంద్రాన్ని ఈదుతున్నాను. ఎన్నికల సాగరంలో నాకు సాయం చేయకపోగా కొందరు నా కాళ్లు చేతులూ కట్టేస్తున్నారు. ఇక రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని పిస్తోంది’ అని రావత్ ట్వీట్ చేశారు. (చదవండి: మహిళా వివాహ వయసు పెంపు.. వాళ్లని బాధిస్తోంది) కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తూ.. ట్వీట్లపై రావత్ మీడియా సలహాదారు సురేంద్ర స్పందించారు. ‘కొన్ని శక్తులు కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తూ కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తున్నాయి’ అని అన్నారు. రావత్ నేతృత్వంలోకాకుండా ఉమ్మడి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని ఏఐసీసీ ఉత్తరాఖండ్ ఇన్చార్జ్ దేవేంద్ర యాదవ్ పట్టుబడుతుండటం గమనార్హం. కాగా, తాను చేసిన ట్వీట్‌పై వివరణ ఇచ్చేందుకు హరీశ్ రావత్ నిరాకరించారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని విలేకరులతో అన్నారు. (చదవండి: జియా ఉల్ హక్ హయాం.. మోదీ పాలన ఒక్కటే) -
Uttarakhand Assembly Election 2022: లోహాఘాట్ అసెంబ్లీ సీటు ఎవరిది? పోటాపోటీగా..
ఉత్తరాఖండ్: లోహాఘాట్ అసెంబ్లీ సీటు కోసం పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల వ్యూహకర్తల్లో గెలుపుపై ఉత్కంఠ ఇప్పటికే మొదలైంది. 2022లో జరగనున్న ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాకు చెందిన లోహాఘాట్ అసెంబ్లీ సీటు 2017లో కాషాయ పార్టీ దక్కించుకుంది. ఐతే ఈ సారి కాంగ్రెస్ సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది. కాగా ఈ సారి గెలుపోటములు పూర్తిగా ప్రజల అబీష్టం ప్రకారం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరో వైపు అధికార బీజేపీ మాత్రం ఉత్తరాఖండ్‌ను కాపాడుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తోంది. లోహావతి నది ఒడ్డునున్న లోహాఘాట్ చారిత్రక, పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన పురాన్ సింగ్ రెండుసార్లు గెలుపొందగా, కాంగ్రెస్ నుంచి మహేంద్ర సింగ్ రెండుసార్లు గెలుపొందారు. లోహాఘాట్ అసెంబ్లీ సీటు కోసం రానున్న ఎన్నికల్లో గట్టి పోటీకి తెరలేపనుంది. ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. టికెట్ రాకపోతే రెబల్స్ వస్తారో, నాయకుడికే మద్దతిస్తారనేది చూడాలి. లోహాఘాట్ అసెంబ్లీ స్థానం ఎవరు ఎప్పుడు గెలిచారంటే.. ►2017లో భారతీయ జనతా పార్టీకి చెందిన పురాన్ సింగ్ 148 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి ఖుషాల్ సింగ్‌పై రెండో సారి విజయం సాధించారు. ►2012 లో బీజేపీకి చెందిన పురన్ సింగ్ 30,429 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ మెహ్రాపై విజయం సాధించారు. ►2007లో కాంగ్రెస్‌కు చెందిన మహేంద్ర సింగ్ మహ్రా 15,433 ఓట్లతో బీజేపీకి చెందిన కృష్ణ చంద్ర పునేఠాపై విజయం సాధించారు. ►2002లో కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ మహ్రా ఈ స్థానంలో గెలుపొందారు. లోక్ సభ ఎంపీగా.. లోహాఘాట్ అసెంబ్లీ స్థానం అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీకి చెందిన అజయ్ తమ్టా ఎంపీగా 2,32,986 తేడాతో కాంగ్రెస్‌కి చెందిన ప్రదీప్ టామ్టాపై విజయం సాధించాడు. చదవండి: పదేళ్ల బాలిక సక్సెస్ఫుల్ బిజినెస్.. నెలకు కోటిపైనే ఆదాయం... -
కాంగ్రెస్‌లోకి ఉత్తరాఖండ్ మంత్రి, ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యశ్పాల్ ఆర్య, తన కుమారుడు, ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యతో కలిసి సోమవారం బీజేపీకి రాజీనామా చేసి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరారు. యశ్పాల్ ఆర్య 2007 నుంచి 2014 దాకా ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. యశ్పాల్, సంజీవ్, వారి మద్దతుదారులు ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు హరీష్ రావత్, కె.సి.వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు వారు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. తనకు చాలా సంతోషంగా ఉందని, సొంతింటికి తిరిగి వచ్చానని యశ్పాల్ వ్యాఖ్యానించారు. ఇది తన ‘ఘర్ వాపసీ’ అని చెప్పారు. ఆయన ఇప్పటిదాకా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాసనసభ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ బలోపేతం అయితే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని యశ్పాల్ ఈ సందర్భంగా చెప్పారు. ఆయన కుమారుడు సంజీవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో బీజేపీ నేత హరీందర్ సింగ్ లడ్డీ కూడా కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో చేరిన దేవేందర్ రాణా, సూర్జిత్‌సింగ్ మరోవైపు, జమ్మూకశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కీలక నేతలు దేవేందర్ రాణా, సూర్జిత్ సింగ్ స్లాథియా సోమవారం బీజేపీలో చేరారు. వారు ఆదివారమే నేషనల్ కాన్ఫరెన్స్‌కు రాజీనామా సమర్పించారు. వారిద్దరూ ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్సింగ్ పురి, జితేంద్ర సింగ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దేవేందర్ రాణా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత అగ్రనేత ఒమర్ అబ్దుల్లాకు రాజకీయ సలహాదారుగా సేవలందించారు. -
యూపీ రెండో దశలో 65% పోలింగ్
-
యూపీ రెండో దశలో 65% పోలింగ్
ఉత్తరాఖండ్‌లో రికార్డు స్థాయిలో68% లక్నో: ఉత్తరప్రదేశ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఒకే విడత ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. యూపీలో తాజా విడతలో 65 శాతం పోలింగ్, ఉత్తరాఖండ్‌లో రికార్డు స్థాయిలో 68 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలోని బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ తదితర 11 జిల్లాల్లోని 67 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి, ఎస్పీ నేత ఆజం ఖాన్, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద సహా మొత్తం 721 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తల్లి కాజ్మీ(115) కుటుంబ సభ్యులతో కలసి బరేలీలో ఓటు వేశారు. ఈ నెల 11న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 64.2 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరాఖండ్‌లో 2 శాతం ఎక్కువ.. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో నమోదైన 68 శాతం పోలింగ్ 2012 ఎన్నికల నాటి పోలింగ్(66 శాతం) కంటే రెండు శాతం ఎక్కువ. రాష్ట్ర చరిత్రలో ఇదే భారీ పోలింగ్. రాష్ట్రంలోని మొత్తం 70 అసెంబ్లీల స్థానాలుండగా కర్ణప్రయాగ్ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి చనిపోవడంతో 69 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కర్ణప్రయాగ్‌లో మార్చి 9న ఎన్నికలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ రెండు స్థానాల(హరిద్వార్ రూరల్, కిచ్చా) నుంచి బరిలోకి దిగారు. ఓటు సరిగ్గా పడినట్లు ఓటరుకు ధ్రువీకరణ పత్రాలిచ్చే వీవీపీఏటీ యంత్రాలను తొలిసారి రాణిపూర్, ధరమ్‌పూర్, రుద్రపూర్‌లలో వినియోగించారు.