ఇది యావత్ జాతికి గర్వకారణం:ధోని
బెంగళూరు:ఇటీవల భారత వైమానిక దళంలోకి తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్'ను ప్రవేశపెట్టడాన్ని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్వాగతించాడు. ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతీ ఒక్కరికి ధోని అభినందనలు తెలియజేశాడు. వైమానిక దళంలో తేజస్ ను ప్రవేశపెట్టడం యావత్ జాతి గర్వించదగ అంశం అంటూ ధోని తాజాగా ట్వీట్ చేశాడు. ఇది భారత్ సాధించిన అరుదైన ఘనతగా పేర్కొన్నాడు.
ఈ నెల ఆదిలో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'తేజస్' ను భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ తేజస్ స్క్వాడ్రన్ను 'ఫ్లయింగ్ డ్యాగర్స్' గా పిలుస్తున్నారు. ఈ స్క్వాడ్రన్లోకి మరో ఆరు తేజస్లు త్వరలోనే చేరనున్నాయి.
Cngrts to IAF on their latest warbirds and every1 who were part of the project indeed a very proud moment for INDIA pic.twitter.com/de6YANPzqE
— Mahendra Singh Dhoni (@msdhoni) 1 July 2016