మ్యాచ్ నాలుగో రోజు బుధవారం 445 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లకు 112 పరుగులు చేసింది.
సౌతాంప్టన్: ఇంగ్లండ్తో మూడో టెస్టులో భారత్కు ఓటమి గండం పొంచి వుంది. మ్యాచ్ నాలుగో రోజు బుధవారం 445 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లకు 112 పరుగులు చేసింది. భారత్ ఇంకా 333 పరుగులు వెనుకబడివుండగా, చేతిలో ఆరు వికెట్లున్నాయి. రహానె, రోహిత్ క్రీజులో ఉన్నారు. మురళీ విజయ్, ధవన్, పుజారా, కోహ్లీ అవుటయ్యారు.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ను 205/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసి, 445 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కుక్(70 నాటౌట్), రూట్(56) అర్థసెంచరీలతో రాణించడంతో ఇంగ్లీషు జట్టు వేగంగా పరుగులు సాధించింది.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 569/7 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 330 పరుగులకు ఆలౌటైంది.