హడలగొట్టిన అలీ; బెంబేలెత్తిన భారత్ | England crush India by 266 runs in Southampton Test | Sakshi
Sakshi News home page

హడలగొట్టిన అలీ; బెంబేలెత్తిన భారత్

Published Thu, Jul 31 2014 5:38 PM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

హడలగొట్టిన అలీ; బెంబేలెత్తిన భారత్

హడలగొట్టిన అలీ; బెంబేలెత్తిన భారత్

సౌతాంప్టన్: ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలయింది.  266 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో చిత్తయింది. 445 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 178 పరుగులకే ఆలౌటైంది. పోరాడకుండానే ప్రత్యర్థి ముందు తలవంచింది.

రహానే(52) మినహా ఆటగాళ్లు చేతులెత్తేడయంతో ధోని సేనకు భంగపాటు తప్పలేదు. టాప్ బ్యాట్స్మెన్ అందరూ ఘోరంగా విఫలమయ్యారు. అంతకుముందు రెండు టెస్టుల్లో ఆపద్భాందవ పాత్ర పోషించిన టెయిలెండర్లు నిలబకలేపోవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. రోహిత్ శర్మ(6), ధోని(6), జడేజా(15) విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ డకౌటయ్యారు.

ఇంగ్లండ్ బౌలర్ మొయిన్ అలీ తన పదునైన బౌలింగ్ తో భారత ఆటగాళ్లను హడలగొట్టాడు. 6 వికెట్లు కూల్చి భారత పతనాన్ని శాసించాడు. ఆండర్సన్ 2 వికెట్లు తీశాడు. రూట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1తో ఇంగ్లండ్ సమం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement