టీయూడబ్ల్యూజే వీడియో జర్నలిస్టు కార్యవర్గం ఎన్నిక
హన్మకొండ: టీయూడబ్ల్యూజే హెచ్– 143కి అనుబంధ తెలంగాణ వీడియో జర్నలిస్టు యూనియన్(టీవీజేయు) జి ల్లా నూతన కమిటీని సోమవారం ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొ డిగే శ్రీను, ప్రధాన కార్యదర్శిగా గొర్రె సంజీవ్, కోశాధికారిగా జనగాని ఆంజనేయులు, కార్యనిర్వాహక కార్యదర్శిగా గుండెబోయిన దిలీప్, ఉపాధ్యక్షుడిగా తోట తిరుమలరావు, సంయుక్త కార్యదర్శిగా అబ్బగాని విజయ్, కార్యవర్గ సభ్యులుగా కె.రా జు, రమేష్, పాషా, పి.సుధాకర్, జగదీష్, ప్రదీప్‌రాజ, ఎం.రాజు, క్రాంతి, మున్నాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా తమ నియామకానికి సహకరించిన టీయూడబ్ల్యూజే నాయకులు బీ.ఆర్.లెనిన్, పీ.వీ.కొండల్‌రావు, జి.వెంకట్, తడక రాజనారాయణ, పి.శివకుమార్, గడ్డం కేశవమూర్తి, మెండు రవీందర్, సుధాకర్, వెంకటరత్నంలకు కృతజ్ఞతలు తెలిపారు.