ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక | APTF District Selection Committee | Sakshi
Sakshi News home page

ఏపీటీఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక

Published Tue, May 27 2014 1:07 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

APTF District Selection Committee

శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : ఏపీటీఎఫ్ జిల్లా శాఖ కార్యవర్గ ఎన్నిక సోమవారం జరి గింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా టెంక చలపతిరావు, సన్నశెట్టి రాజశేఖర్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏపీటీఎఫ్ రాష్ట్ర నేత బి.జోబిబాబు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. సహా ధ్యక్షునిగా జి.బాలాజీరావు, ఉపాధ్యక్షులుగా చింతాడ దిలీప్‌కుమార్, నానుబాల ప్రభాకరరావు, మైలపల్లి తులసీరావు, ఎం.లక్ష్మణరావు, అదనపు కార్యదర్శిగా కవిటి పాపారావు, కార్యదర్శులుగా కొర్రాయి చలపతిరావు, వావిలపల్లి గోవిందరావు, ఆర్.వి.అనంతాచార్యులు, పేకేటి రామారావు, వాన కామేశ్వరరావు, బూరాడ ప్రకాశరావు, కె.ప్రసాదరావు, రాష్ట్ర కౌన్సిలర్లుగా పి.నాగేశ్వరరావు, పి.ఆనందరావు, పొగిరి ముఖలింగం, ఎం.భుజంగరావు, టి.గిరిరాజు, మైలపల్లి వెంకటరమణ, ఎ.చిట్టన్న, బొడ్డేపల్లి నేతాజీరావు, కె.ప్రసాదరావు ఎన్నికయ్యారు.
 
 పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం
 పాలకులు మారినంత మాత్రాన సమస్యలకు పరిష్కారం లభించదని, నిరంతర పోరాటాలతోనే శాశ్వత పరిష్కారం సాధ్యమని సన్నశెట్టి రాజశేఖర్ అన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యా ప్రగతి, సమాజ శ్రేయ స్సు లక్ష్యాలుగా సంఘం పనిచేస్తోందన్నా రు. గతంలో అపరిష్కృతంగా మిగి లిన సమస్యలను టీడీపీ ప్రభుత్వ హయాం లో సాధించుకుంటామన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీబాధ్యతలు చేపట్టాక ఆయన్ను కలసి సమస్యలపై చర్చిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement