
BCCI New Selection Committee: చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీపై బీసీసీఐ ఇటీవలే వేటు వేసిన నేపథ్యంలో కొత్త ప్యానెల్ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దరఖాస్తు స్వీకరణకు నిన్న (నవంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో 100 వరకు అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే సెలెక్షన్ కమిటీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపించిన లక్ష్మన్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్‌లు దరఖాస్తు చేసుకోలేదన్న వార్త బీసీసీఐ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతానికి సెలెక్షన్ కమిటీకి ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో హేమంగ్ బదానీ, మణిందర్ సింగ్ పేర్లు చైర్మన్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఫైనల్ రిజల్ట్ రావాలంటే, డిసెంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే.
ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురు ప్రముఖుల పేర్లు..
సౌత్ జోన్..
హేమంగ్ బదానీ
కన్వల్జిత్ సింగ్
వెస్ట్ జోన్..
మణిందర్ సింగ్
నయన్ మోంగియా
సలీల్ అంకోలా
సమీర్ దీఘే
సెంట్రల్ అండ్ నార్త్ జోన్..
అజయ్ రాత్రా
గ్యాను పాండే
అమయ్ ఖురాసియా
అతుల్ వాసన్
నిఖిల్ చోప్రా
రితేందర్ సింగ్ సోధి
ఈస్ట్ జోన్..
శివ్ సుందర్ దాస్
ప్రభంజన్ మల్లిక్
ఆర్‌ఆర్ పరిడా
శుభోమోయ్ దాస్
ఎస్ లహిరి