Roger binny
-
వారణాసి క్రికెట్ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని మోదీ
Varanasi International Cricket Stadium Foundation Ceremony Highlights: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, టీమిండియా దిగ్గజాలు కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా తదితరులు కూడా హాజరయ్యారు. #WATCH | PM Modi lays the foundation stone of an international cricket stadium in Uttar Pradesh's Varanasi pic.twitter.com/5sAh2wZ5eA — ANI (@ANI) September 23, 2023 సంతోషంగా ఉంది: యూపీ సీఎం కాగా సుమారు రూ. 451 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ స్టేడియం నిర్మాణం.. 2025, డిసెంబరు నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. ఇక శంకుస్థాపన సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. బీసీసీఐ తొలిసారిగా ఆధ్యాత్మిక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాశీకి విచ్చేసిన ప్రధాని మోదీ సహా క్రికెట్ ప్రముఖులకు క్రీడా ఔత్సాహికుల అందరి తరఫున తాను స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. బీసీసీఐ, మోదీజీకి ధన్యవాదాలు అదే విధంగా.. కేంద్ర ప్రభుత్వ పథకం స్మార్ట్ సిటీ మిషన్ కింద స్టేడియం నిర్మాణం చేపట్టారని.. ఉత్తరప్రదేశ్‌లో ఇది మూడో అంతర్జాతీయ స్టేడియం అని యోగి పేర్కొన్నారు. బీసీసీఐ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. యూపీతో పాటు బిహార్‌లో గల వర్ధమాన క్రికెటర్లకు ఈ స్టేడియం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూపీకి ఇంత గొప్ప బహుమతి ఇచ్చిన బీసీసీఐ, ప్రధాని నరేంద్ర మోదీకి యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలిపారు. #WATCH | Varanasi, UP: "PM Modi is laying the foundation stone for International Cricket Stadium Varanasi by the Board of Control for Cricket in India (BCCI) in Uttar Pradesh for the first time. I welcome PM Modi on behalf of every sports enthusiast in the state," says Uttar… pic.twitter.com/CL4xhbPXZG — ANI (@ANI) September 23, 2023 ఆ మహదేవుడికే అంకితం: ప్రధాని మోదీ వారణాసి స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మహదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఆ మహదేవుడికే అంకితం. కాశీలో ఉన్న క్రికెట్ ఔత్సాహికులకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్వాంచల్ ప్రాంతం మొత్తానికి తారలా వెలుగొందుతుంది’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసియా క్రీడలు-2023లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు, క్రీడా జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. #WATCH | This stadium in the city of 'Mahadev' will be dedicated to 'Mahadev' himself. The sportspersons here will benefit from the construction of an international stadium in Kashi. This stadium will become the star of Purvanchal region: PM Modi on the foundation stone laying of… pic.twitter.com/bgh8bErN2l — ANI (@ANI) September 23, 2023 #WATCH | Asian Games will begin from today. I send my good wishes to all the athletes participating in the Games: PM Modi in Varanasi pic.twitter.com/hXzePvaRPM — ANI (@ANI) September 23, 2023 శివతత్వం ఉట్టిపడేలా చారిత్రాత్మక నగరంలో నిర్మించతలపెట్టిన వారణాసి క్రికెట్ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా.. ప్రేక్షకులు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయేలా రూపొందించనున్నారు. సీటింగ్ ప్లేస్ పైకప్పు అర్ధచంద్రాకారం, ఫ్లడ్‌లైట్లు త్రిశూలం, ఓవైపు ఎంట్రన్స్ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. సుమారు 30 వేల మంది సీటింగ్ కెపాసిటీతో నిర్మించనున్న ఈ స్టేడియం కోసం యూపీ ప్రభుత్వం సుమారు 121 కోట్లు వెచ్చించి భూమి సేకరించినట్లు సమాచారం. ఇందులో ఏడు పిచ్‌లను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: శుబ్‌మన్ గిల్ అరుదైన ఘనత.. సచిన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు! -
పీసీబీకి థాంక్స్.. ఇండియా- పాక్ మ్యాచ్ అంటే: పాకిస్తాన్ పర్యటనలో బీసీసీఐ బాస్
BCCI President Roger Binny Visit To Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ ధన్యవాదాలు తెలిపారు. తమను పాకిస్తాన్‌కు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేది లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడు జై షా స్పష్టం చేశారు. ఈ క్రమంలో చర్చోపర్చల అనంతరం శ్రీలంకతో కలిసి హైబ్రిడ్ విధానంలో ఈ వన్డే ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు పీసీబీ సిద్ధపడింది. ఆ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఇందుకు తగ్గట్లుగానే భారత జట్టు ఆడే మ్యాచ్లన్నింటితో పాటు ఫైనల్ కూడా శ్రీలంకలోనే జరుగనుంది. ఇదిలా ఉంటే.. ఏసీసీ సభ్యులు, ఆసియా కప్‌లో భాగమైన జట్ల క్రికెట్ బోర్డు మెంబర్స్‌ను పీసీబీ డిన్నర్‌కు ఆహ్వానించింది. PC: PCB ఈ క్రమంలో బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీతో పాటు.. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం నాటి పీసీబీ విందుకు హాజరయ్యారు. లాహోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. దాయాదుల పోరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థాంక్యూ పీసీబీ ‘‘మమ్మల్ని ఇక్కడకు ఆహ్వానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా. బీసీసీతో పాటు భారత్‌లో ఉన్న క్రికెట్ ప్రేమికుల తరఫున కూడా నేనే విష్ చేస్తున్నా. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అందరికీ పండుగ. రోడ్లు మొత్తం ఖాళీ అవుతాయి మ్యాచ్ మొదలైందంటే చాలు.. ప్రతి ఒక్కరు అలెర్ట్ అయిపోతారు. పనులన్నీ పక్కనపెట్టేస్తారు. రోడ్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. ప్రతి ఒక్కరు క్రికెట్ చూసేందుకు టీవీ ముందు కూర్చుంటారు’’ అంటూ రోజర్ బిన్నీ చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ పోరు గురించి కామెంట్ చేశారు. పల్లెకెలెలో మ్యాచ్ అద్భుతంగా సాగిందని.. వర్షం అంతరాయం కలిగించి ఉండకపోతే.. ఫలితం చూసే వాళ్లమని పేర్కొన్నారు. పీసీబీ ఆహ్వానం మేరకు సరిహద్దులు దాటి వచ్చామన్న బిన్నీ.. ఇదొక అద్భుతమైన అనుభవమని సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్-2023లో భారత్- పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. అది స్వర్ణయుగం ఇక రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. 2004 తర్వాత మళ్లీ పాకిస్తాన్‌కు రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. అప్పట్లో ఇండియా- పాకిస్తాన్‌కు స్వర్ణయుగమని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కాగా పాకిస్తాన్ వేదికగా ఆగష్టు 30న ఆరంభమైన ఆసియా టోర్నీ సెప్టెంబరు 17న శ్రీలంకలో జరుగనున్న ఫైనల్‌తో ముగియనుంది. చదవండి: WC 2023: ఇద్దరూ తుదిజట్టులో ఉంటే తప్పేంటి?: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ BCCI President Roger Binny's speech at the PCB Gala Dinner at the Governor's House in Lahore.#AsiaCup2023 pic.twitter.com/Zl2tq5MHxW — Pakistan Cricket (@TheRealPCB) September 4, 2023 BCCI Vice-President Rajeev Shukla's speech at the PCB grand gala dinner at Governor's House, Lahore.#AsiaCup2023 pic.twitter.com/OdOmI4Ddcl — Pakistan Cricket (@TheRealPCB) September 4, 2023 -
పాకిస్తాన్‌దే పైచేయి! అక్కడ టీమిండియాదే హవా.. నాడు రోజర్ బిన్నీ, రవిశాస్త్రి కారణంగా..
భారత్ వర్సెస్ పాకిస్తాన్.. దాయాదుల మధ్య క్రికెట్ పోరుకు ఉన్న క్రేజే వేరు. గెలుపు కోసం చిరకాల ప్రత్యర్థులు మైదానంలో పోటాపోటీగా ముందుకు సాగుతూ ఉంటే అభిమానులకు కన్నులపండుగగా ఉంటుంది. హై వోల్టేజీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందా అని ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి హోరాహోరీ పోరుకు సమయం ఆసన్నమైంది. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2(శనివారం)న ఆసియా కప్-2023 వన్డే టోర్నీలో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్- పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. ఇప్పటికే నేపాల్‌పై విజయంతో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉండగా.. రోహిత్ సేన ఈ మ్యాచ్‌తోనే ఈవెంట్‌ను ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య తొలి వన్డే ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఆ మ్యాచ్‌లో విజేత ఎవరు? ఆసియా కప్ చరిత్రలో ఆధిపత్యం ఎవరిది? ఓవరాల్‌గా వన్డేల్లో ఎవరు ముందంజలో ఉన్నారు? తదితర అంశాలు గమనిద్దాం. తొలిసారి అక్కడే బలూచిస్తాన్‌లోని క్వెటా వేదికగా 1978లో తొలిసారి భారత్, పాకిస్తాన్ వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌పై 4 పరుగుల స్వల్ప తేడాతో జయభేరి మోగించింది. పాకిస్తాన్‌దే పైచేయి! ఇక ఇప్పటి వరకు భారత్- పాకిస్తాన్ మధ్య మొత్తంగా 132 వన్డేలు జరుగగా.. 73 మ్యాచ్‌లలో పాక్ విజయం సాధించింది. టీమిండియా 55 మ్యాచ్‌లలో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిసిపోయాయి. తొట్టతొలి విజేత భారత్ ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీలో మాత్రం భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. 1984లో షార్జాలో ఆరంభమైన ఈ మెగా ఈవెంట్లో టీమిండియా పాక్‌తో తొలిసారి తలపడింది. నాటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిని 54 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా తొట్టతొలి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. నాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే ఆనాడు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సురీందర్ ఖన్నా 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సందీప్ పాటిల్ 43 రన్స్‌తో రాణించాడు. నాటి కెప్టెన్ సునిల్ గావస్కర్ 36 పరుగులు సాధించగా.. గులాం పార్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ వరుసగా 22, 14 పరుగులు చేశారు. పాకిస్తాన్ జట్టులో సర్ఫరాజ్ నవాజ్, షాహిద్ మహబూబ్, ముదాసర్ నాజర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 39.2 ఓవర్లలోనే 134 పరుగులకు ఆలౌట్ అయింది. మొహ్సిన్ ఖాన్ 35 పరుగులు చేయగా.. కెప్టెన్ జహీర్ అబ్బాస్ 27 పరుగులు సాధించాడు. రోజర్ బిన్నీ, రవిశాస్త్రి మ్యాజిక్ మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో పాక్ తక్కువ స్కోరుకే పరిమితమై భారీ ఓటమిని మూటగట్టుకుంది. టీమిండియా బౌలర్లలో పేసర్ రోజర్ బిన్నీ, స్పిన్నర్ రవిశాస్త్రి ఆకాశమే హద్దుగా చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. చెరో మూడు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక నలుగురు బ్యాటర్లు రనౌట్ల రూపంలో వెనుదిరగడంతో పాక్ కథ ముగిసిపోయింది. టైటిల్ భారత్ సొంతమైంది. ఆసియాలో టీమిండియాదే హవా ఓవరాల్‌గా వన్డేల్లో పాకిస్తాన్ ఆధిక్యంలో ఉన్నా ఆసియా కప్ టోర్నీలో మాత్రం భారత్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు ఏడుసార్లు టైటిల్ గెలిచిన ఘనత టీమిండియాది. ఇందులో ఆరు వన్డే, ఒక టీ20 ట్రోఫీ ఉన్నాయి. పాక్ కేవలం రెండుసార్లు రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ఈవెంట్లో 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఇక పాకిస్తాన్ ఇప్పటి వరకు 2000, 2012లో.. అంటే రెండుసార్లు మాత్రమే చాంపియన్‌గా నిలిచింది. 2000 ఫైనల్లో శ్రీలంకను 39 పరుగులు, 2012లో బంగ్లాదేశ్‌ను 2 పరుగులతో ఓడించి టైటిల్ గెలిచింది. ముఖాముఖి పోరులో ఇక ముఖాముఖి పోరులో 1984- 2022 వరకు భారత్- పాకిస్తాన్ వన్డే పోరులో 13 మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందగా.. పాక్ ఐదుసార్లు విజయం సాధించింది. వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దైపోయింది. చదవండి: వన్డేల్లో ఏకైక బ్యాటర్‌గా రోహిత్ రికార్డు.. మరి ఆసియా కప్‌లో? ఈ గణాంకాలు చూస్తే -
ఏసీఏ వల్లే ఆటగాళ్ల అద్భుత రాణింపు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రోత్సాహంతోనే ఏపీ ఆటగాళ్లు రాణించి.. జాతీయ స్థాయిలో అవకాశాలు పొందుతున్నారని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. ఏసీఏ 70 వసంతాల వేడుకలు సోమవారం విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆవిష్కరించారు. అనంతరం రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఏపీలో క్రికెటర్లకు అవసరమైన మౌలిక వసతులు, గ్రౌండ్లు, అకాడమీలు పెరుగుతున్నాయి. మరో పదేళ్లలో ఢిల్లీ, ముంబైతో పోటీపడే స్థాయికి రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చెందుతోంది. తొలిసారిగా 1975లో రంజీ మ్యాచ్ ఆడేందుకు విశాఖ వచ్చాను. ఇప్పుడు విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందింది. ఏపీలో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లోనూ క్రీడలకు తగిన మౌలిక వసతులు కల్పించి.. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరముంది. అప్పుడే భారత్‌లో క్రీడాభివృద్ధి సాధ్యపడుతుంది. బీసీసీఐ తరఫున స్కూల్ స్థాయి నుంచే ప్రొఫెషనల్ క్రికెటర్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్రక్రియ ఐదు రాష్ట్రాల్లో ముందంజలో ఉండగా.. ఇప్పుడు ఆంధ్ర చేరింది’ అని అన్నారు. ఐపీఎల్‌తో అద్భుత అవకాశాలు.. క్రికెట్ ఆడే దేశాల్లో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్స్ అన్నింటిలో.. ఐపీఎల్‌కున్న క్రేజ్ ప్రత్యేకమైనదని రోజర్ బిన్నీ చెప్పారు. ఆ స్టాండర్డ్స్‌ను కాపాడాలంటే.. ఐపీఎల్లో పాల్గొనే ప్రాంచైజీల నియంత్రణ చాలా అవసరమన్నారు. అందుకే ఐపీఎల్లో మరో కొత్త ఫ్రాంచైజీకి అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ఆ రోజుల్లో మూడు దశల్లో రాణించిన వారికి జాతీయ జట్టులో అవకాశం వచ్చేదని.. కానీ ఇప్పుడు ఐపీఎల్ తరహా ప్లాట్‌ఫాంలతో మెరుగైన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.మహిళల క్రికెట్‌ను బాగా ప్రోత్సహిస్తున్నామని.. వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ మదన్‌లాల్ మాట్లాడుతూ.. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, ఏసీఏ పూర్వ కార్యదర్శి చాముండేశ్వర్‌నాథ్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, సీఈఓ శివారెడ్డి, వీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
Asia Cup 2023: పాకిస్తాన్‌కు వెళ్లనున్న బీసీసీఐ పెద్దలు
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్తాన్‌కు వెళ్లనున్నారు. ఆసియా కప్-2023 ప్రారంభ వేడులకు హాజరు కావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పంపిన ఆహ్వానం మేరకు వీరిరువురు దాయాది దేశానికి పయనం కానున్నారు. పీసీబీ వీరిద్దరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షాకు కూడా ఆహ్వనం పంపినప్పటికీ.. అతను లాహోర్‌కు వెళ్లేందుకు అయిష్టత ప్రదర్శించాడు. దీంతో అక్టోబర్ 30న రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లాలు మాత్రమే పాక్‌కు వెళ్లనున్నారు. కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ టోర్నీకి పాక్ ఒక్కటే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉనప్పటికీ.. భారత క్రికెట్ జట్టు పాక్‌లో అడుగుపెట్టదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యంగా మారింది. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 30న జరుగనుంది. ముల్తాన్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో పాక్ –నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు పల్లెకెలె మైదానం ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్ 4 భారత్.. నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ఆసియాకప్ ముగుస్తుంది. అనంతరం భారత్ వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. -
చిక్కుల్లో టీమిండియా కెప్టెన్! అప్పీలుకు వెళ్లేది లేదన్న బీసీసీఐ..
ICC- Harmanpreet Kaur- BCCI: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వరుస విజయాలు అందుకున్న హర్మన్‌ప్రీత్‌కౌర్ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అపఖ్యాతి మూటగట్టుకుంది. బంగ్లాతో ఆఖరి మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ పెవిలియన్‌కు చేరే క్రమంలో బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. అంతేకాదు.. సిరీస్ 1-1తో సమానమైన నేపథ్యంలో ట్రోఫీ పంచుకునేటపుడు కూడా కాస్త దురుసుగా ప్రవర్తించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ దగ్గరికి రాగానే.. ఈ మ్యాచ్ టై అవడానికి అంపైర్లు కూడా కారణం.. వాళ్లను కూడా పిలువు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించింది. హర్మన్ నుంచి ఊహించని కామెంట్ల నేపథ్యంలో ఆమె తమ జట్టును తీసుకుని డ్రెసింగ్‌రూంకి వెళ్లిపోయింది. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం హర్మన్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఐసీసీ సైతం ఆమెపై కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ.. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలా స్పందిస్తున్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వీవీఎస్ లక్ష్మణ్ అనుచిత ప్రవర్తన గురించి హర్మన్‌తో మాట్లాడతారు. మేమైతే ఆమె సస్పెన్షన్ గురించి ఐసీసీని సవాలు చేయబోము. ఇప్పటికే ఆ సమయం కూడా మించిపోయింది’’ అని జై షా పేర్కొన్నాడు. కాగా హర్మన్ ప్రవర్తన ఆమె పట్ల గౌరవాన్ని తగ్గించిందనే కామెంట్లు వినిపిస్తుండగా.. అభిమానులు మాత్రం ఇంతకంటే ఓవరాక్షన్ చేసిన వాళ్లు మాత్రం మీకు కనబడరా అంటూ అండగా నిలుస్తున్నారు. కాగా ఐసీసీ నిషేధం నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసియా క్రీడలు-2023లో రెండు మ్యాచ్‌లకు దూరం కానుంది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
స్వాతంత్య్రం వచ్చాక టీమిండియా తొలి కెప్టెన్‌గా.. ఆయన కొడుకులు సైతం!
భారత క్రికెట్ తొలితరం క్రీడాకారుల్లో లాలా అమర్నాథ్ భరద్వాజ్ అగ్రగణ్యుడు. టెస్ట్ క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా 1933లోనే ఆయన చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో భారత్ అధికారికంగా ఎలాంటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లలోనూ పాల్గొనలేదు. అదేకాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సహా వివిధ జట్లతో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ఆడిన లాలా అమర్నాథ్ ఆ మూడేళ్ల వ్యవధిలోనే ముప్పయి సెంచరీలు సహా పదివేల పరుగుల మైలురాయిని అధిగమించారు. స్వాతంత్య్రం వచ్చాక భారత క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్‌గా సారథ్యం వహించారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా బౌలర్‌గానూ అద్భుతంగా రాణించారు. అప్పటి ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మాన్‌ను తన బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా ఔట్‌చేసిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. క్రీడారంగంలో వారసులు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటిది లాలా అమర్నాథ్ కొడుకులు– సురీందర్ అమర్నాథ్, మోహీందర్ అమర్నాథ్ తండ్రి అడుగుజాడల్లోనే క్రికెట్ క్రీడాకారులుగా అంతర్జాతీయంగా రాణించారు. మొహీందర్ అమర్నాథ్ 1983 ప్రపంచకప్ సాధించిన జట్టు వైస్‌కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు. లాలా అమర్నాథ్ చిన్న కొడుకు రాజీందర్ అమర్నాథ్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా రాణించాడు. రాజీందర్ తన తండ్రి జీవిత చరిత్రను ‘లాలా అమర్నాథ్: లైఫ్ అండ్ టైమ్స్– ది మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో రాశాడు. తండ్రి స్ఫూర్తితోనే తమ సోదరులు ముగ్గురమూ క్రికెట్లోకి అడుగు పెట్టామని రాజీందర్ చెబుతాడు. భారత క్రికెట్లో తండ్రీకొడుకులు ►వినోద్ మన్కడ్- అశోక్ మన్కడ్ ►నయన్ మోంగియా- మోహిత్ మోంగియా ►యోగ్రాజ్ సింగ్- యువరాజ్ సింగ్ ►రోజర్ బిన్నీ- స్టువర్ట్ బిన్నీ ►సునిల్ గావస్కర్- రోహన్ గావస్కర్ ►హేమంత్ కనిత్కర్- హ్రిషికేశ్ కనిత్కర్ ►విజయ్ మంజ్రేకర్- సంజయ్ మంజ్రేకర్ ►పంకజ్ రాయ్- ప్రణబ్ రాయ్ చదవండి: ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్ ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు -
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయింది..!
Roger Binny: ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, మాజీలు, విశ్లేషకులు టీమిండియాను ఏకి పారేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే సోషల్‌మీడియా వేదికగా భారత ఆటగాళ్లను ఓ రేంజ్లో ఎండగడుతున్నారు. మాజీలు, విశ్లేషకులు సైతం ఎన్నడూ లేనంతగా స్వరం పెంచి టీమిండియా వైఫల్యాలను తూర్పారబెడుతున్నారు. బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ సైతం టీమిండియాను వదిలిపెట్టలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ చేసిన సెంచరీలే భారత్‌కు ఆసీస్‌కు మధ్య వత్యాసమని తెలిపాడు. హెడ్, స్మిత్ భాగస్వామ్యమే టీమిండియా కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు. ఈ పార్ట్నర్షిపే ఆసీస్ టీమిండియాపై ఆధిక్యత ప్రదర్శించేలా చేసిందని అన్నాడు. హెడ్, స్మిత్ సెంచరీ చేయకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపాడు. భారత ఆటగాళ్ల పోరాటం మూలాన మ్యాచ్ ఆఖరి రోజు వరకు వచ్చింది కాని, నా దృష్టిలో టీమిండియా తొలి రోజే ఓడిపోయిందంటూ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆసీస్ చేతిలో 209 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఐపీఎల్లో అలా అడగడం లేదు కదా.. రోహిత్ శర్మపై మాజీ లెజెండ్ ఫైర్ -
ఐపీఎల్ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో
IPL2023OpeningCeremony: ఐపీఎల్-2023 సీజన్ ఆరంభం వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సహా కార్యదర్శి జై షా తదితరులు హాజరయ్యారు. Photo Credit : IPL Twitter నటి మందిరా బేడి ఐపీఎల్ యాంకర్‌గా పునరాగమనం చేసింది. ఆరంభ వేడుకులకు ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. Photo Credit : IPL Twitter కాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తన గానా బజానాతో అభిమానులను అలరిస్తున్నాడు. అర్జిత్ సింగ్‌తో పాటు పాన్ ఇండియా బ్యూటీలు రష్మిక మంధాన, మిల్కీ బ్యూటీ తమన్నాలు తమ డాన్స్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించారు. Photo Credit : IPL Twitter Photo Credit : IPL Twitter ఊ అంటావా అంటూ తమన్నా మాస్ స్టెప్పులు హీరోయిన్ తమన్నా భాటియా ఐపీఎల్-2023 ఆరంభ వేడుకల్లో తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. టమ్ టమ్ అంటూ ట్రెండింగ్ పాటకు స్టెప్పులేసిన తమన్నా.. ఊ అంటావా మామా అంటూ ఉర్రూతలూగించింది. Photo Credit : IPL Twitter సామీ గర్ల్ రష్మిక కూడా.. పుష్ప క్రేజ్‌తో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోన్న రష్మిక మందన్నా సామీ సామీ అంటూ ప్రేక్షకులకు వినోదం పంచింది. శ్రీవల్లి పాటతో పాటు గంగూభాయ్ కతియావాడీలోని డోలీడా పాటకు అదరగొట్టే స్టెప్పులేసింది. Photo Credit : IPL Twitter 𝙈𝙚𝙡𝙤𝙙𝙞𝙤𝙪𝙨! How about that for a performance to kick off the proceedings 🎶🎶@arijitsingh begins the #TATAIPL 2023 Opening Ceremony in some style 👌👌 pic.twitter.com/1ro3KWMUSW — IndianPremierLeague (@IPL) March 31, 2023 𝘿𝙖𝙯𝙯𝙡𝙞𝙣𝙜 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧!@tamannaahspeaks sets the stage on 🔥🔥 with her entertaining performance in the #TATAIPL 2023 opening ceremony! pic.twitter.com/w9aNgo3x9C — IndianPremierLeague (@IPL) March 31, 2023 -
బీసీసీఐ అధ్యక్షుడిపై ఆరోపణలు.. ఆమె కారణంగా..!
ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా ఈ విషయంపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో డిసెంబర్ 20లోగా వివరణ ఇవ్వాలంటూ బిన్నీకి వినీత్ నోటీసు జారీ చేశారు. భారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ పని చేస్తోందని... ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేలు ఆడిన బిన్నీ ఇటీవలే బోర్డు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. -
BCCI: అగార్కర్, లక్ష్మణ్ ఔట్.. సెలెక్షన్ కమిటీ రేసులో కొత్త పేర్లు
BCCI New Selection Committee: చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీపై బీసీసీఐ ఇటీవలే వేటు వేసిన నేపథ్యంలో కొత్త ప్యానెల్ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దరఖాస్తు స్వీకరణకు నిన్న (నవంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో 100 వరకు అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సెలెక్షన్ కమిటీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపించిన లక్ష్మన్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్‌లు దరఖాస్తు చేసుకోలేదన్న వార్త బీసీసీఐ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతానికి సెలెక్షన్ కమిటీకి ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో హేమంగ్ బదానీ, మణిందర్ సింగ్ పేర్లు చైర్మన్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఫైనల్ రిజల్ట్ రావాలంటే, డిసెంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురు ప్రముఖుల పేర్లు.. సౌత్ జోన్.. హేమంగ్ బదానీ కన్వల్జిత్ సింగ్ వెస్ట్ జోన్.. మణిందర్ సింగ్ నయన్ మోంగియా సలీల్ అంకోలా సమీర్ దీఘే సెంట్రల్ అండ్ నార్త్ జోన్.. అజయ్ రాత్రా గ్యాను పాండే అమయ్ ఖురాసియా అతుల్ వాసన్ నిఖిల్ చోప్రా రితేందర్ సింగ్ సోధి ఈస్ట్ జోన్.. శివ్ సుందర్ దాస్ ప్రభంజన్ మల్లిక్ ఆర్ఆర్ పరిడా శుభోమోయ్ దాస్ ఎస్ లహిరి -
ఇండియా క్రికెట్ పవర్‌హౌజ్.. అయినా: ఆఫ్రిదికి బీసీసీఐ బాస్ కౌంటర్
ICC Mens T20 World Cup 2022: టీమిండియాను ఉద్దేశించి నిరాధార ఆరోపణలు చేసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావని.. ఇష్టారీతిన మాట్లాడితే సహించబోమన్నాడు. క్రికెట్ ప్రపంచంలో భారత్ పవర్‌హౌజ్ లాంటిదైనప్పటికీ తాము ప్రత్యేక ప్రయోజనాలేమీ పొందడం లేదని స్పష్టం చేశాడు. అక్కసు వెళ్లగక్కిన ఆఫ్రిది టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాన ఆగిన తర్వాత మళ్లీ ఆట కొనసాగించారు అంపైర్లు. ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో ఆఫ్రిది మాట్లాడుతూ.. ఫీల్డ్ తడిగా ఉన్నా మ్యాచ్ ఎలా కొనసాగిస్తారని, భారత్‌ను సెమీస్ చేర్చాలనే ఉద్దేశంతోనే ఐసీసీ ఇలా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు చేశాడు. అంతేగాకుండా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు అంపైర్లుగా వ్యవహరించిన వారినే.. ఇండియా- బంగ్లా మ్యాచ్‌కు కూడా అసైన్ చేశారని.. ఇవన్నీ చూస్తుంటే ఐసీసీ భారత్‌కు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందంటూ అక్కసు వెళ్లగక్కాడు. అలా ఎలా మాట్లాడతారు? ఆఫ్రిది వ్యాఖ్యలపై బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ స్పందించాడు. ‘‘ఇలా మాట్లాడటం సరికాదు. ఐసీసీ మాకు ఏ రకంగానూ అనుకూలంగా వ్యవహరించడం లేదు. ప్రతి జట్టు పట్ల వాళ్ల వైఖరి ఒకేలా ఉంటుంది. ఏ ప్రాతిపదికన మీరు అలా మాట్లాడతారు? మిగతా జట్ల కంటే మాకు అదనంగా లభించిన ప్రయోజనాలు ఏమిటి? క్రికెట్ ప్రపంచంలో ఇండియా అతిపెద్ద పవర్ హౌజ్. కానీ మాకు కూడా మిగతా జట్లలాంటి ట్రీట్మెంటే లభిస్తుంది’’ అని ఈ పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలను ఖండించాడు. చదవండి: Ind Vs Zim: భారత్‌తో మ్యాచ్.. అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్ ఎలా వదులుకుంటాం: జింబాబ్వే కెప్టెన్ Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పాక్‌పై 'విరాట్'కొట్టుడు ఓ కలలా అనిపించింది..!
టీ20 వరల్డ్‌కప్-2022లో పాక్‌తో మ్యాచ్ ముగిసి దాదాపు వారం గడుస్తున్నా.. ఆ మ్యాచ్ తాలూకా స్మృతులు క్రికెట్ అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. భారత అభిమానులైతే ఈ మ్యాచ్ జ్ఞాపకాలను చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. అంతలా ఆ మ్యాచ్ ప్రభావం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌పై చూపింది. అందరు క్రికెట్ అభిమానుల్లాగే ఈ మ్యాచ్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీని కూడా అమితంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి వీరోచిత ఇన్నింగ్స్‌కు బీసీసీఐ బాస్ ముగ్దుడైపోయాడు. విరాట్ కొట్టుడు ఓ కలలా అనిపించిందని ప్రశంసలతో ముంచెత్తాడు. దాయాదుల సమరం క్రికెట్ ప్రపంచానికి అసలుసిసలైన టీ20 క్రికెట్ మజాను అందించిందని అన్నాడు. ముఖ్యంగా కోహ్లి ఇన్నింగ్స్ న భూతో న భవిష్యత్ అన్న రీతిలో సాగిందని కొనియాడాడు. కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అసాధారణమైనదని అభివర్ణించాడు. ఒత్తిడి సమయాల్లో కోహ్లి మరింత మెరుగ్గా ఆడతాడని ఈ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి నిరూపితమైందని కితాబునిచ్చాడు. క్రికెట్లో కోహ్లి నిరూపించుకోవాల్సింది ఇంక ఏమీ లేదని, అతని ఈ ఇన్నింగ్స్ ఒక్కటి చాలు అతనేంటో ప్రపంచానికి తెలియడానికంటూ ఆకాశానికెత్తాడు. ఛేదనలో కోహ్లినే రారాజని ఈ ఇన్నింగ్స్ మరోసారి క్రికెట్ సమాజానికి చాటాచెప్పిందని ప్రశంసించాడు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) ఏర్పటు చేసిన సన్మాన సభలో బిన్నీ ఈ మేరకు కోహ్లిని, పాక్‌పై భారత్ సాధించిన విజయాన్ని కొనియాడాడు. ఈ సందర్భంగా బిన్నీ తన సొంత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడు కావడానికి తోడ్పడిన కేసీఏకి కృతజ్ఞతలు తెలిపాడు. కేసీఏకు తాను జీవితకాలం రుణపడి ఉంటానిని అన్నాడు. కేసీఏతో తన అనుబంధం 50 ఏళ్ల నాటిదని గుర్తు చేశాడు. -
పాకిస్తాన్‌కు వెళ్లేది లేనిది భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది: బీసీసీఐ కొత్త బాస్
పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది (2023) సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ పాల్గొనేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు దూమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద అంశంపై తాజాగా బీసీసీఐ కొత్త బాస్ రోజర్ బిన్నీ స్పందించాడు. జై షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బిన్నీ ఓ ప్రకటన విడుదల చేశాడు. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలా వద్దా అన్న అంశం భారత ప్రభుత్వం పరిధిలోని అంశమని, ఈ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని బీసీసీఐ ఫాలో అవ్వాల్సిందే తప్పించి, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు భారత క్రికెట్ బోర్డుకు లేదని బీసీసీఐ అధ్యక్ష హోదాలో బిన్నీ వివరణ ఇచ్చాడు. ఈ విషయమై ప్రస్తుతానికి బీసీసీఐ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని, ఒకవేళ కేంద్రం నుంచి ఏవైనా కీలక ఆదేశాలు వస్తే మీడియాకు తప్పక తెలియజేస్తామని స్పష్టం చేశాడు. కాగా, ఇదే అంశంపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించాడు. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుతానికి ఈ విషయం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి రాలేదని ఆయన వివరించాడు. ఇదిలా ఉంటే, జై షా చేసిన ప్రకటనపై ఉలిక్కపడ్డ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్‌లో అడుగుపెట్టకపోతే, భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ కూడా పాల్గొనబోదని బెదిరింపులకు దిగింది. -
మొత్తానికి గంగూలీని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీసీసీఐ
-
గంగూలీ అయిపోయాడు.. ఇప్పుడు చేతన్ శర్మ వంతు?!
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దాదా తొలగింపుపై ఎంత డ్రామా నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి గంగూలీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీసీసీఐ మంగళవారం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది. తొలి వన్డే ప్రపంచకప్ (1983) గెలిచిన టీమిండియా సభ్యుడు, 67 ఏళ్ల రోజర్ బిన్నీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత మళ్లీ ఆటగాడే బోర్డు పగ్గాలు చేపట్టారు. మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పదవులన్నీ కూడా పోటీలేకుండానే నామినేషన్ వేసిన వాళ్లందరికీ దక్కాయి. కొత్త కార్యవర్గంలో రోజర్ బిన్నీ (అధ్యక్షుడు.. బీసీసీఐ కార్యదర్శిగా జై షా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా , సంయుక్త కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా,కోశాధికారిగా ఆశిష్ షెలార్‌లు నియమితులయ్యారు. గంగూలీని పదవి నుంచి తొలగించిన బీసీసీఐ ఇప్పుడు జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్.. మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వర్గంపై కన్నువేసింది. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో గంగూలీ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ చేతన్ శర్మను చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు 2020 డిసెంబర్లో కొత్త సెలక్షన్ కమిటీని నియమించాడు. సెలక్షన్ కమిటీలోచేతన్ శర్మతో పాటు అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతి ఉన్నారు. తాజాగా చేతన్ శర్మ బృంధం తమ పదవులను కోల్పోయే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. చేతన్ శర్మ పనితీరు పట్ల బీసీసీఐ కొత్త నాయకత్వం సంతృప్తిగా ఉన్నప్పటికి కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయాలనే ధోరణిలోనే కొత్త పాలకవర్గం ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన పనితీరు కనబరిచిన చేతన్ శర్మను తొలగించకపోయినా.. అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతిని సాగనంపడం ఖాయమని సమాచారం. టి20 ప్రపంచకప్‌లో టీమిండియా చేసే ప్రదర్శన ఆధారంగానే సెలక్షన్ కమిటీ పదవుల మార్పుపై ఒక స్పష్టత రానుంది. వీరి స్థానాల్లో ఇద్దరు మాజీ క్రికెటర్లు.. ఒడిశాకు చెందిన మాజీ ఓపెనర్ శివ సుందర్ దాస్, బెంగాల్ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా, జాతీయ జూనియర్ సెలెక్టర్ రణదేబ్ బోస్ సెలెక్షన్ కమిటీ పదవుల కోసం పోటీలో ఉండొచ్చని అంటున్నారు. అయితే వీరిలో రణదేబ్ బోస్ జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించకపోవడం అతనికి మైనస్. దీనిని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం బెంగాల్‌కే చెందిన మాజీ వన్డే ప్లేయర్ లక్ష్మీ రతన్ శుక్లా లేదా ఒడిశాకు చెందిన సంజయ్ రౌల్లో ఒకరిని తీసుకోవచ్చని తెలుస్తోంది. చదవండి: 'లెగ్ స్పిన్ బౌలింగ్ వేయాలా'.. రిజ్వాన్ అదిరిపోయే రిప్లై ఆసియా కప్ టోర్నీలో ఆడలేం: జై షా -
ఆసియా కప్ టోర్నీలో ఆడలేం: జై షా
ముంబై: మరోసారి మరో మాజీ క్రికెటరే బోర్డు పాలకుడయ్యారు. తొలి వన్డే ప్రపంచకప్ (1983) గెలిచిన టీమిండియా సభ్యుడు, 67 ఏళ్ల రోజర్ బిన్నీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత మళ్లీ ఆటగాడే బోర్డు పగ్గాలు చేపట్టారు. మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పదవులన్నీ కూడా పోటీలేకుండానే నామినేషన్ వేసిన వాళ్లందరికీ దక్కాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ అభ్యర్థిపై ఎలాంటి చర్చ లేకుండానే బోర్డు ఏజీఎం పదవుల పంపకంతోనే ముగిసింది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా మహిళల ఐపీఎల్‌ను ఆమోదించడం ఒక్కటే జరిగింది. ‘ఐసీసీకి వెళ్లే బోర్డు ప్రతినిధిపై, ఐసీసీ చైర్మన్‌గిరిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఎజెండాలోని అంశాలే ఏజీఎంలో చర్చించారు’ అని ఓ రాష్ట్ర సంఘం సభ్యుడొకరు తెలిపారు. కొత్త కార్యవర్గం: రోజర్ బిన్నీ (అధ్యక్షుడు), జై షా (కార్యదర్శి), రాజీవ్ శుక్లా (ఉపాధ్యక్షుడు), దేవ్జిత్ సైకియా (సంయుక్త కార్యదర్శి), ఆశిష్ షెలార్ (కోశాధికారి). ఐపీఎల్ చైర్మన్‌గా ధుమాల్ గంగూలీ నేతృత్వంలోని బోర్డులో ఇన్నాళ్లూ కోశాధికారిగా పనిచేసిన అరుణ్ ధుమాల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. బ్రిజేశ్ పటేల్ స్థానంలో ఆయన్ని నియమించారు. ఎమ్‌కేజే మజుందార్‌ను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అమ్మాయిల ఐపీఎల్‌కు జై బోర్డు ఏజీఎంలో ఐపీఎల్ తరహా అమ్మాయిల లీగ్‌కు ఆమోదం లభించింది. వచ్చే ఏడాది మార్చిలో ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ జరుగుతుంది. అయితే జట్లను ఎలా విక్రయించాలి, టోర్నీని ఏ విధంగా నిర్వహించాలనే అంశాలను కొత్త గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఏటా రూ. వేల కోట్లు పెరుగుదల ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు (బీసీసీఐ) నగదు నిల్వలు ఏటికేడు వేల కోట్లు పెరిగిపోతున్నాయి. మూడేళ్ల క్రితం పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆధ్వర్యంలో ఉన్నపుడు రూ. 3,648 కోట్లుగా ఉన్న బోర్డు కోశాగారం ఇప్పుడు రూ. 9,629 కోట్లకు చేరింది. కేవలం మూడేళ్లలోనే రూ. 5,981 కోట్లు పెరిగాయి. దాదాపు 3 రెట్లు ఆదాయం పెరిగింది. అలాగే రాష్ట్ర సంఘాలకు వితరణ కూడా ఐదు రెట్లు పెంచారు. సీఓఏ జమానాలో రూ. 680 కోట్లు ఇస్తుండగా... ఇప్పుడది రూ.3,295 కోట్లకు పెరిగిందని కోశాధికారి పదవి నుంచి దిగిపోతున్న అరుణ్ ధుమాల్ ఏజీఎంలో ఖాతాపద్దులు వివరించారు. పాక్‌లో ఆడేదిలేదు వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ టోర్నీలో ఆడలేమని బోర్డు కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌కు ముందు వన్డే ఫార్మాట్లో ఆసియా ఈవెంట్ పాకిస్తాన్లో నిర్వహించనున్నారు. దీనిపై ఏజీఎంలో చర్చించిన నూతన కార్యవర్గం తటస్థ వేదికపైనే ఆడేందుకు మొగ్గు చూపింది. అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడైన జై షా బోర్డు నిర్ణయాన్ని వెలువరించారు. తటస్థ వేదికపై అయితేనే ఆసియా కప్ ఆడతామన్నారు. ఈ ఏడాది టి20 ఫార్మాట్లో శ్రీలంకలో జరగాల్సిన ఆసియా ఈవెంట్ సింహళ దేశం దివాళా కారణంగా యూఏఈలో నిర్వహించారు. పాక్‌లో జరిగే ఆసియాకప్‌లో టీమిండియా ఆడకపోతే... వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ కూడా ఆడబోదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఇక కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. క్రికెటర్ల గాయాలపై దృష్టి పెడతాం. ఆటగాళ్లు తరచూ గాయాలపాలయ్యే పరిస్థితుల్ని తగ్గిస్తాం. దీనికోసం అందుబాటులో ఉన్న అవకాశాల్ని పరిశీలించి, పరిస్థితిని మెరుగుపరుస్తాం. బెంగళూరు అకాడమీ (ఎన్సీఏ)లో డాక్టర్లు, ఫిజియోల బృందం ఈ పనిలో నిమగ్నమవుతాయి. దేశవాళీ పిచ్‌లను పోటీతత్వంతో ఉండేలా తీర్చిదిద్దుతాం. ఆస్ట్రేలియాలాంటి దేశాలకు దీటుగా పిచ్‌లను తయారు చేస్తాం. –రోజర్ బిన్నీ -
Sourav Ganguly: బీసీసీఐ కొత్త బాస్‌గా రోజర్ బిన్నీ.. గంగూలీ స్పందన ఇదే!
Sourav Ganguly- Roger Binny: భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ శకం ముగిసినట్లయింది. రెండో దఫా బీసీసీఐ బాస్ కావాలని దాదా ఆశించినా.. అందుకు బోర్డు నుంచి సానుకూల స్పందన రాలేదన్న వార్తల నేపథ్యంలో.. రోజర్ బిన్నీ నియామకం మంగళవారం ఖరారైంది. గంగూలీకి వీడ్కోలు చెప్పిన బోర్డు.. ప్రస్తుత కార్యదర్శి జై షాను మరోసాని ఆ పదవిని చేపట్టినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి.. ముంబైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ ఎన్నికైనట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. కొత్త ఆఫీస్ బేరర్లు, మహిళా ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు వెల్లడించింది. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన గంగూలీ.. బీసీసీఐ ఇప్పుడు గొప్ప వ్యక్తుల చేతుల్లో ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘రోజర్ బన్నీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. కొత్త యాజమాన్యం బోర్డు ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నా. బీసీసీఐ గొప్ప వ్యక్తుల చేతుల్లో ఉంది. భారత క్రికెట్ గొప్ప స్థాయిలో ఉంది. ఆయనకు గుడ్ లక్ చెబుతున్నా’’ అని దాదా పేర్కొన్నాడు. కాగా గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలోనే టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లిపై వేటు పడ్డ విషయం తెలిసిందే. మరోవైపు.. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకంలోనూ దాదా కీలకంగా వ్యవహరించాడు. చదవండి: T20 World Cup Records: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ రికార్డులివే అయ్యో నిసాంక! పాపం కిందపడిపోయాడు.. షూ కూడా! హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! -
BCCI: దాదాకు గుడ్‌బై! జై షా కొనసాగింపు.. బోర్డు కీలక నిర్ణయాలివే!
91st Annual General Meeting of BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి 91వ సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ నియామకాన్ని ఖరారు చేసిన బీసీసీఐ నూతన ఆఫీస్ బేరర్ల పేర్లను కూడా వెల్లడించింది. అదే విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి పలు కీలక అంశాల గురించి వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం నాటి ముంబై మీటింగ్‌కు సంబంధించిన పత్రికా ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ సర్వసభ్య సమావేశం- ముఖ్యాంశాలు ►బీసీసీఐ అధ్యక్షుడు- రోజర్ బిన్నీ ►ఉపాధ్యక్షుడు- రాజీవ్ శుక్లా ►కార్యదర్శి- జై షా ►సంయుక్త కార్యదర్శి- దేవజిత్ సైకియా ►కోశాధికారి(ట్రెజరర్)- ఆశిష్ షేలార్ ►బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో జనరల్ బాడీ ప్రతినిధిగా ఎంకేజే మజూందార్ ►ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రతినిధులుగా అరుణ్ ధుమాల్ సింగ్, అవిషేక్ దాల్మియా ►2022-23 ఏడాదికి సంబంధించి వార్షిక బడ్జెట్‌కు ఆమోదం ►2023-2027 మధ్య కాలంలో భారత పురుషుల జట్టు ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్, 2022-2025 మహిళల జట్టు ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ ధ్రువీకరణ ►మహిళల ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం చేసిన జనరల్ బాడీ చదవండి: T20 WC NED Vs NAM: ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్ విజయం.. సూపర్-12కు అర్హత! అతడు ప్రపంచ అత్యుత్తమ టీ20 ఆటగాళ్లలో ఒకడు: సచిన్ -
Roger Binny: గంగూలీకి బైబై! బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ
BCCI New President: భారత క్రికెట్ నియంత్రణ మండలి 36వ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ ఎంపికయ్యారు. భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ బాస్‌గా పగ్గాలు చేపట్టారు. ముంబైలోని తాజ్ హోటల్లో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశం తర్వాత బోర్డు ఈ మేరకు ప్రకటన వెలువరించింది. కాగా ఈ సమావేశంలో సౌరవ్ గంగూలీ సహా బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని గంగూలీ భావించినప్పటికీ విముఖత వ్యక్తం కావడంతో నామినేషన్ వేయలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పదవి కోసం నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తిగా ఉన్న 67 ఏళ్ల రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ ఘనత బిన్నీకే దక్కింది! భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆంగ్లో ఇండియన్ రోజర్ బిన్నీ. ఆయన స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడిగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మొట్టమొదటిసారి భారత్ విశ్వవిజేతగా నిలవడంలో ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్‌ది కీలక పాత్ర. ఆ ఎడిషన్‌లో 18 వికెట్లు తీసి వెలుగులోకి వచ్చారు. కాగా భారత్ తరఫున 27 టెస్టులాడి 47 వికెట్లు తీసిన రోజర్ బిన్నీ.. 72 వన్డేల్లో 77 వికెట్లు కూల్చారు. దేశవాళీ క్రికెట్లో కర్ణాటకు ప్రాతినిథ్యం వహించిన రోజర్ బిన్నీ.. ఆ రాష్ట్ర బోర్డు ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. చదవండి: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? -
గంగూలీపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీలు రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ.. ఒకరంటే ఒకరికి పడదన్న విషయం బహిర్గతమే. ఇద్దరి మధ్య ఎప్పటినుంచో కోల్డ్‌వార్ సాగుతూనే ఉంది. ఒక సందర్భంలో తనకంటే జూనియర్ అయిన సౌరవ్ గంగూలీ ముందు టీమిండియా హెడ్ కోచ్‌గా ఇంటర్వ్యూకు వెళ్లడానికి తనకు మనసొప్పలేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అంతేగాక గంగూలీ అధ్యక్షుడిగా బీసీసీఐ తీసుకొచ్చిన కొన్ని పాలనాపరమైన నిర్ణయాలను కూడా శాస్త్రి బాహటంగానే విమర్శించేవాడు. తాజాగా బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ రావడంపై రవిశాస్త్రి స్పందించాడు. రోజర్ బిన్నిని ప్రశంసిస్తూనే గంగూలీకి పరోక్షంగా చురకలంటించాడు. జీవితంలో ఏది శాశ్వతం కాదు.. కొన్ని పనులు మాత్రమే చేయగలరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. ''బీసీసీఐ అధ్యక్షుడి రేసులో రోజర్ బిన్నీ పేరు ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను అతడితో కలిసి ఆడాను.1983 వన్డే ప్రపంచకప్ బిన్నీ నా సహచర ఆటగాడు.కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు బీసీసీఐకి వస్తున్నాడు ఒక ప్రపంచకప్ విన్నింగ్ జట్టులోని సభ్యుడు బీసీసీఐ అధ్యక్షుడవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి బీసీసీఐ అధ్యక్ష పదవిలో ప్రపంచకప్ విజేత కూర్చోనుండటం ఇదే తొలిసారి. బిన్నీ రాకతో అయినా దేశవాళీ క్రికెట్ లో వసతులు మెరుగుపడతాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే బిన్నీ కూడా ఒక క్రికెటరే. అతడు కచ్చితంగా బోర్డులో ఇతర వ్యవహారాల కంటే క్రికెట్ గురించే ఎక్కువ ఆలోచిస్తాడని నేను భావిస్తున్నా. కింది స్థాయిలో గ్రౌండ్స్ లో వసతులు సరిగా లేవు. కొత్త పాలకవర్గం దాని మీద దృష్టి సారించాలి. నేను చదివిన ప్రకారం బీసీసీఐకి ఎవరూ రెండోసారి అధ్యక్షుడు కాలేదు. ఈ రకంగా చూస్తే ఒకరు రావాలంటే ప్రస్తుతం ఉన్నవారు పదవి నుంచి తప్పుకోవాల్సిందే. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. అన్ని చేయాలనుకున్నప్పటికీ చివరికి కొన్ని పనులు మాత్రమే చేయగలరు.'' అని తెలిపాడు. రవిశాస్త్రి కామెంట్స్ విన్న అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ఒక రకంగా రవిశాస్త్రికి ఇది సంతోషకరమైన విషయం కావొచ్చు.. బిన్నీని పొగడుతూనే దాదాకు చురకలంటించాడు. అంటూ పేర్కొన్నాడు. ఇక దాదా అభిమానులు మాత్రం.. ''ఎప్పుడో జరిగిన దానిని మనసులో పెట్టుకొని కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు.'' అని చురకలంటించారు. చదవండి: జర్నలిస్టు తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్ బీసీసీఐ అధ్యక్ష పదవి కోల్పోవడంపై నోరు విప్పిన గంగూలీ -
బీసీసీఐ కొత్త బాస్.. ఎవరీ రోజర్ బిన్నీ?
-
అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఆసక్తికర విషయాలు
బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ త్వరలోనే బాధ్యతలు తీసుకోనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాస్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ మరోమారు అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికి బోర్డు మాత్రం దాదాను కాదని బిన్నీకే అవకాశం ఇవ్వాలని భావించింది. ఈ మేరకు రోజర్ బిన్నీ నామినేషన్ పేపర్లను దాఖలు చేయనున్నాడు. అక్టోబర్ 18న ముంబైలో జరగనున్న ఏజీఎం మీటింగ్ అనంతరం బిన్నీ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. రోజర్ బిన్నీ అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది 1983 ప్రపంచకప్. 1983 ప్రపంచకప్‌ను కపిల్ డెవిల్స్ నెగ్గిన సంగతి తెలిసిందే. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు మించి రాణించి విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంలో బౌలర్‌గా రోజర్ బిన్నీ పాత్ర కీలకం. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన బిన్నీ ఆ ప్రపంచకప్‌లో 18 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా 1985లో వరల్డ్ సిరీస్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లోనూ రోజర్ బిన్నీ మరోమారు అదరగొట్టాడు. ఆ సిరీస్‌లో 17 వికెట్లు తీసి పాపులర్ క్రికెటర్‌గా మారిపోయాడు. ఒక ఆంగ్లో ఇండియన్‌గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. టీమిండియా తరపున బిన్నీ 27 టెస్టుల్లో 47 వికెట్లు, 72 వన్డేల్లో 77 వికెట్లు తీశాడు.ఇక దేశవాలీ క్రికెట్లో కర్నాటకకు ప్రాతినిధ్యం వహించాడు. కొడుకు స్టువర్ట్ బిన్నీతో రోజర్ బిన్నీ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు? 67 ఏళ్ల వయసులో 36వ బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు ఏంచుకుందనే సందేహాలు చాలా మందిలో కలిగాయి. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ)లో సెక్రటరీ సంతోష్ మీనన్‌కు బదులుగా బిసిసిఐ ఎజిఎమ్లో బిన్నీని ప్రతినిధిగా నియమించారు. అప్పుడే బిన్నీకి బీసీసీలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపించాయి. పైగా రోజర్ బిన్నీకి క్లీన్ ఇమేజ్ ఉంది.అతని కుమారుడు స్టువర్ట్ బిన్నీ టీమిండియాకు ఆడుతున్న సమయంలోనే రోజర్ బిన్నీ సెలెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశాడు. అంతేకాదు రోజర్ బిన్నీ మంచి కోచ్ కూడా. 2000 అండర్-19 ప్రపంచకప్‌ను నెగ్గిన టీమిండియా కోచ్‌గా రోజర్ బిన్నీనే ఉన్నాడు. యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ లాంటి ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది కూడా ఇతనే. ఆ తర్వాత బెంగాల్ రంజీ జట్టు కోచ్‌గా రోజర్ బిన్నీ సేవలందించారు. ► బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఐపీఎల్ 2023తో పాటు దేశవాలీ టోర్నీలు నిర్వహించడం బిన్నీ ముందున్న పెద్ద లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. చదవండి: దగా పడ్డ గంగూలీ.. ఐసీసీ పదవి కూడా లేనట్టే..! బీసీసీఐ కొత్త బాస్ ఎవరంటే..? -
గంగూలీ కథ ముగిసినట్లే..!
టీమిండియాకు ఆడే సమయంలో కెప్టెన్‌గా చక్రం తిప్పిన సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా.. బీసీసీఐ బాస్‌గానూ గత మూడేళ్లలో తనదైన ముద్ర చూపించాడు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. బీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు ఉండాలని ఆశపడిన గంగూలీకి ఆ అవకాశం లేనట్లే. అధ్యక్ష పదవి రెండోదఫా ఇచ్చే సంప్రదాయం లేదని దాదాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఐపీఎల్ చైర్మన్ పదవిని తిరస్కరించిన దాదా.. ఐసీసీ పదవికి కూడా గంగూలీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో దాదా కథ ఇక ముగిసినట్లేనని క్రీడావర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడు రానున్నాడు. పాత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని సాగనంపేందుకే బోర్డు పెద్దలు నిర్ణయించారు. ఇది ఎవరూ ఊహించని అనూహ్య పరిణామం! ఎందుకంటే బోర్డు అధ్యక్ష స్థానం కోసమే గంగూలీ సుప్రీం కోర్టు మెట్లెక్కాడు. పదవుల మధ్య విరామం (కూలింగ్ ఆఫ్ పీరియడ్) మినహాయింపు కోసం న్యాయపోరాటం చేసి విజయం సాధించాడు. కానీ బోర్డు కార్యవర్గంలో మాత్రం తన మాట నెగ్గించుకున్నట్లు లేడు. అందుకే తెరపైకి రోజర్ బిన్నీ వచ్చారు. భారత్ తొలి వన్డే ప్రపంచకప్ (1983) విజేత జట్టు సభ్యుడైన బిన్నీకే బీసీసీఐ పెద్దలు జైకొట్టడంతో అనూహ్యంగా మంగళవారం 67 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. కార్యదర్శిగా మళ్లీ జై షా కొనసాగేందుకు రంగం సిద్ధమైంది. అతను కూడా ఆ పదవికి నామినేషన్ దాఖలు చేశాడు. ఈనెల 18న బీసీసీఐ ఎన్నికలు జరుగుతాయి. ఐపీఎల్ కమిషనర్ పదవి తిరస్కరణ కొన్ని రోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసిన ‘దాదా’ మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు బోర్డు ఉన్నతాధికారులతో మంతనాలు జరిపాడు. వచ్చే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో గంగూలీ తన పదవిని అట్టిపెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా కనుసన్నల్లోని బోర్డు వర్గాలు గంగూలీని కొనసాగించేందుకు సుముఖంగా లేవు. ఈ నేపథ్యంలో ఉన్నపళంగా బిన్నీని తెరపైకి తెచ్చారు. గంగూలీని ఐపీఎల్ కమిషనర్ పదవి తీసుకోమన్నారు. కానీ బోర్డులో అధ్యక్షుడిగా పనిచేసిన ‘దాదా’ ఓ సబ్ కమిటీకి చీఫ్ అయ్యేందుకు నిరాకరించారని బోర్గు వర్గాలు తెలిపాయి. దీంతో కమిషనర్ బ్రిజేశ్ పటేల్ స్థానంలో ప్రస్తుత కోశాధికారి, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడైన అరుణ్ ధుమాల్‌ను ఐపీఎల్ కమిషనర్‌గా నియమించే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర బీజేపీ నేత, ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు ఆశిష్ షెలార్ ఇకపై బోర్డు కోశాధికారిగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు అత్యంత సన్నిహితుడు దేవజిత్ సైకియా సంయుక్త కార్యదర్శిగా ఖరారయ్యారు. ఉపాధ్యక్ష పదవి మాత్రం రాజీవ్ శుక్లా నుంచి మారడం లేదు. కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడైన రాజీవ్ శుక్లా మరోసారి ఆ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీలో కీలక పదవికి గంగూలీని నామినేట్ చేసే అంశం అసలు బోర్డులో చర్చకే రాలేదని పూర్తిగా బోర్డు పదవులపైనే ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది. చదవండి: 'ఇలాగే ఉంటే టెన్త్ కూడా పాసవ్వలేవన్నారు' -
బీసీసీఐ కొత్త బాస్ ఎవరంటే..?
సౌరవ్ గంగూలీ తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ ఎన్నిక దాదాపుగా ఖరారైంది. బిన్నీకి ఈ పదవి కట్టబెట్టేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులందరూ ఏకపక్షంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం బిన్నీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముంబైలో ఇవాళ జరిగిన బీసీసీఐ అంతర్గత సమావేశంలో అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్ష, కార్యదర్శి, ఐపీఎల్ చైర్మన్ అభ్యర్ధిత్వాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా జై షా కొనసాగనుండగా.. ఐపీఎల్ చైర్మన్‌గా బ్రిజేష్ పటేల్ స్థానంలో అరుణ్ ధుమాల్ ఆ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇదే సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు గంగూలీ భవితవ్యంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. గంగూలీని ఐసీసీ అధ్యక్ష బరిలో నిలిపేందుకు బోర్డు సభ్యులందరూ అంగీకారం తెలిపినట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 18వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న రోజర్ బిన్నీ విషయానికొస్తే.. 67 ఏళ్ల ఈ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ భారత్ 1983 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అతను ప్రస్తుతం కర్నాటక క్రికెట్ సంఘం ఆఫీస్ బేరర్‌గా కొనసాగుతున్నాడు. గతంలో బిన్నీ జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. బిన్నీ.. 1980-87 మధ్య 27 టెస్ట్ లు, 72 వన్డేలు ఆడి 1459 పరుగులు సాధించి, 113 వికెట్లు పడగొట్టాడు. 1983 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన బిన్నీ.. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.