ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా ఈ విషయంపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో డిసెంబర్ 20లోగా వివరణ ఇవ్వాలంటూ బిన్నీకి వినీత్ నోటీసు జారీ చేశారు.
భారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ పని చేస్తోందని... ఇది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేలు ఆడిన బిన్నీ ఇటీవలే బోర్డు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment