Asia Cup 2023: పాకిస్తాన్‌కు వెళ్లనున్న బీసీసీఐ పెద్దలు | Asia Cup 2023: BCCI President Roger Binny, Vice President Rajeev Shukla To Attend Matches In Pakistan | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: పాకిస్తాన్‌కు వెళ్లనున్న బీసీసీఐ పెద్దలు

Published Sat, Aug 26 2023 9:26 PM | Last Updated on Sat, Aug 26 2023 9:26 PM

Asia Cup 2023: BCCI President Roger Binny, Vice President Rajeev Shukla To Attend Matches In Pakistan - Sakshi

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా పాకిస్తాన్‌కు వెళ్లనున్నారు. ఆసియా కప్‌-2023 ప్రారంభ వేడులకు హాజరు కావాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పంపిన ఆహ్వానం మేరకు వీరిరువురు దాయాది దేశానికి పయనం కానున్నారు. పీసీబీ వీరిద్దరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షాకు కూడా ఆహ్వనం పంపినప్పటికీ.. అతను లాహోర్‌కు వెళ్లేందుకు అయిష్టత ప్రదర్శించాడు. దీంతో అక్టోబర్‌ 30న రోజర్‌ బిన్నీ, రాజీవ్‌ శుక్లాలు మాత్రమే పాక్‌కు వెళ్లనున్నారు. 

కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్తాన్‌, శ్రీలంక దేశాలు సంయుక్తంగా  ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ టోర్నీకి పాక్‌ ఒక్కటే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉనప్పటికీ.. భారత క్రికెట్‌ జట్టు పాక్‌లో అడుగుపెట్టదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో టోర్నీని హైబ్రిడ్‌ పద్ధతిలో నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. దీంతో భారత్‌ ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యంగా మారింది.  

ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌ ఈ నెల 30న జరుగనుంది. ముల్తాన్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో పాక్‌ –నేపాల్‌ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు పల్లెకెలె మైదానం ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్‌ 4 భారత్‌.. నేపాల్‌తో మ్యాచ్‌ ఆడనుంది. సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్‌తో ఆసియాకప్‌ ముగుస్తుంది. అనంతరం భారత్‌ వేదికగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement