Stuart Binny
-
టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి
హాంకాంగ్ సిక్సస్ టోర్నీలో టీమిండియా ఓటముల పరంపర కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై ఓటమి చవిచూసిన భారత జట్టు.. తాజాగా యూఏఈతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు. భారత స్టార్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విరోచిత పోరాటం చేసినప్పటకి తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 32 పరుగులు అవసరమవ్వగా.. స్టువర్ట్ బిన్నీ వరుసగా 4, వైడ్, 6, 6, 6, 6, 1 బాదాడు. చివరి బంతికి బిన్నీ అనుహ్యంగా రనౌట్ కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో 131 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 129 పరుగుల వద్ద అగిపోయింది. భారత బ్యాటర్లలో స్టువర్ట్ బిన్నీ(11 బంతుల్లో 44, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో పాటు కెప్టెన్ రాబిన్ ఉతప్ప (10 బంతుల్లో 43) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.యూఏఈ ఇన్నింగ్స్‌లో ఖలీద్ షా(42), జహూర్ ఖాన్(37)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. భరత్ చిప్లి, షెహ్బాజ్ నదీమ్‌కు చెరో వికెట్ దక్కింది. కాగా ఏడేళ్ల తర్వాత మళ్లీ మొదలైన ఈ హాంకాంగ్ క్రికెట్ సిక్సస్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతీ జట్టులో కేవలం ఆరుగురు ప్లేయర్లే మాత్రమే ఉంటారు. India needed 32 in 6 balls:Stuart Binny - 4,WD,6,6,6,6,1. India lost by just 1 run. 💔 pic.twitter.com/qyhKWWyqe6— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2024 -
స్వాతంత్య్రం వచ్చాక టీమిండియా తొలి కెప్టెన్‌గా.. ఆయన కొడుకులు సైతం!
భారత క్రికెట్ తొలితరం క్రీడాకారుల్లో లాలా అమర్నాథ్ భరద్వాజ్ అగ్రగణ్యుడు. టెస్ట్ క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా 1933లోనే ఆయన చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో భారత్ అధికారికంగా ఎలాంటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లలోనూ పాల్గొనలేదు. అదేకాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సహా వివిధ జట్లతో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ఆడిన లాలా అమర్నాథ్ ఆ మూడేళ్ల వ్యవధిలోనే ముప్పయి సెంచరీలు సహా పదివేల పరుగుల మైలురాయిని అధిగమించారు. స్వాతంత్య్రం వచ్చాక భారత క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్‌గా సారథ్యం వహించారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా బౌలర్‌గానూ అద్భుతంగా రాణించారు. అప్పటి ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మాన్‌ను తన బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా ఔట్‌చేసిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. క్రీడారంగంలో వారసులు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటిది లాలా అమర్నాథ్ కొడుకులు– సురీందర్ అమర్నాథ్, మోహీందర్ అమర్నాథ్ తండ్రి అడుగుజాడల్లోనే క్రికెట్ క్రీడాకారులుగా అంతర్జాతీయంగా రాణించారు. మొహీందర్ అమర్నాథ్ 1983 ప్రపంచకప్ సాధించిన జట్టు వైస్‌కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు. లాలా అమర్నాథ్ చిన్న కొడుకు రాజీందర్ అమర్నాథ్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా రాణించాడు. రాజీందర్ తన తండ్రి జీవిత చరిత్రను ‘లాలా అమర్నాథ్: లైఫ్ అండ్ టైమ్స్– ది మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో రాశాడు. తండ్రి స్ఫూర్తితోనే తమ సోదరులు ముగ్గురమూ క్రికెట్లోకి అడుగు పెట్టామని రాజీందర్ చెబుతాడు. భారత క్రికెట్లో తండ్రీకొడుకులు ►వినోద్ మన్కడ్- అశోక్ మన్కడ్ ►నయన్ మోంగియా- మోహిత్ మోంగియా ►యోగ్రాజ్ సింగ్- యువరాజ్ సింగ్ ►రోజర్ బిన్నీ- స్టువర్ట్ బిన్నీ ►సునిల్ గావస్కర్- రోహన్ గావస్కర్ ►హేమంత్ కనిత్కర్- హ్రిషికేశ్ కనిత్కర్ ►విజయ్ మంజ్రేకర్- సంజయ్ మంజ్రేకర్ ►పంకజ్ రాయ్- ప్రణబ్ రాయ్ చదవండి: ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్ ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు -
యూసఫ్ పఠాన్ వీరబాదుడు.. మరోసారి రెచ్చిపోయిన స్టువర్ట్ బిన్నీ
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా నిన్న (మార్చి 25) ఇండోర్ నైట్స్-గౌహతి అవెంజర్స్, వైజాగ్ టైటాన్స్-పట్నా వారియర్స్ జట్లు తలపడ్డాయి. గౌహతితో జరిగిన మ్యాచ్‌లో ఇండోర్ నైట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. పట్నాపై వైజాగ్ టైటాన్స్ 78 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తరంగ, యూసఫ్ వీరబాదుడు.. అయినా ప్రయోజనం లేదు..! ఇండోర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గౌహతి.. ఉపుల్ తరంగ (27 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ (23 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆఖర్లో అనురీత్ సింగ్ (22 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండోర్.. ఫిల్ మస్టర్డ్ (45 బంతుల్లో 80; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ శర్మ (50 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో 18.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. స్టువర్ట్ బిన్నీ మరోసారి.. పట్నాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ టైటాన్స్.. సన్నీ సింగ్ (45 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), స్టువర్ట్ బిన్నీ(29 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పట్నా వారియర్స్.. వైజాగ్ బౌలర్లు తిసార పెరీరా (2/2), ఆశిష్ నునివాల్ (2/18), ఇషాన్ మల్హోత్రా (2/18), భారత్ అవస్తి (1/14) ధాటికి 17.5 ఓవర్లలో 131 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. పట్నా ఇన్నింగ్స్‌లో బిస్లా (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు మ్యాచ్‌లోనూ బిన్నీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. -
బీసీసీఐ అధ్యక్షుడిపై ఆరోపణలు.. ఆమె కారణంగా..!
ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా ఈ విషయంపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో డిసెంబర్ 20లోగా వివరణ ఇవ్వాలంటూ బిన్నీకి వినీత్ నోటీసు జారీ చేశారు. భారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ పని చేస్తోందని... ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేలు ఆడిన బిన్నీ ఇటీవలే బోర్డు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. -
స్టువర్ట్ బిన్నీ విధ్వంసం.. ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేసింది. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ (42 బంతుల్లో 82 పరుగులు నాటౌట్, 5 ఫోర్లు, ఆరు సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. బిన్నీ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడూ సురేశ్ రైనా(33 పరుగులు), ఆఖర్లో యూసఫ్ పఠాన్(15 బంతుల్లో 35 నాటౌట్, ఒక ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. రైనాతో కలిసి మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించిన బిన్నీ.. ఆఖర్లో యూసఫ్ పఠాన్‌తో కలిసి 88 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. దీంతో ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అంతకముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 పరుగులు.. నమన్ ఓజా 21 పరుగులు చేసి ఔటయ్యారు. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రం ఆరు పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచాడు. సౌతాఫ్రికా లెజెండ్స్ బౌలర్లలో వాండర్వాత్ 2, ఎడ్డీ లీ, ఎన్తిని చెరొక వికెట్ తీశారు. చదవండి: Suresh Raina: సురేశ్ రైనా తిరిగి వస్తున్నాడు.. Sourav Ganguly: విరాట్ కోహ్లి నన్ను మించిన తోపు..! -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్
ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బిన్నీ సోమవారం ప్రకటించాడు. టీమిండియా తరుపున అతడు 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 95 మ్యాచ్‌లు ఆడిన బిన్నీ 4796 పరుగులు చేసి, బౌలింగ్‌లో 146 వికెట్లు పడగొట్టాడు. కాగా 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో అద్భుతమైన ఘనత సాధించాడు. ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి ఘోర ఓటమి తప్పదని భావిస్తున్న తరుణంలో బాల్‌తో అద్భుతం సృష్టించిన స్టువర్ట్ బిన్నీ, 4 పరుగులకే 6 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. వన్డే క్రికెట్లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు బిన్నీ (6/4)వే కావడం విశేషం. ఇక 2014 ఇంగ్లాండ్ తో తొలి టెస్టు ఆడిన స్టువర్ట్ బిన్నీ 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 2016లో వెస్టిండీస్‌పై చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. కాగా స్టువర్ట్ బిన్నీ భార్య, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత మయంతి లాంగర్.. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో ఆండర్సన్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ, వికెట్లు సమర్పించుకున్న భారత స్టార్ ఆటగాళ్లపై పరోక్షంగా సెటైర్లు వేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ అనంతరం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన భర్త స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే, అతనికి బౌలింగ్ చేయలేక ఆండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేసింది. ఆమె ఈ పోస్ట్ చేసిన తరువాత రోజే స్టువర్ట్ బిన్నీ రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. చదవండి: Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. -
టీమిండియా క్రికెటర్ భార్య వెటకారం.. కోహ్లి, రహానేలపై సెటైర్లు!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత మయంతి లాంగర్.. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో ఆండర్సన్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూ, వికెట్లు సమర్పించుకున్న భారత స్టార్ ఆటగాళ్లపై పరోక్షంగా సెటైర్లు వేసింది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ అనంతరం ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ స్టోరీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన భర్త స్టువర్ట్ బిన్నీ బౌండరీ బాదితే, అతనికి బౌలింగ్ చేయలేక ఆండర్సన్ అసహనంతో తల పట్టుకున్న ఫోటోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేసింది. ఈ ఫోటో 2014 ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా తీసింది. ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన బిన్నీ.. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే అవుటైనా, రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ స్టోరీలో మయంతి ఎలాంటి కామెంట్లు చేయకపోయినా.. ఇంగ్లండ్‌లో ఆండర్సన్‌ను ఎదుర్కోవడం అందరి వల్లా కాదని, దానికి తన భర్తలా సపరేట్ టాలెంట్ ఉండాలని పరోక్షంగా కోహ్లి, రహానే, పుజారాపై సెటైర్లు వేసినట్లుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మయంతి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకైన స్టువర్ట్ బిన్నీ.. క్రికెట్ యాంకర్ మయంతి లాంగర్‌ను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి గతేడాది సెప్టెంబర్‌లో ఓ కొడుకు కూడా జన్మించాడు. 37 ఏళ్ల స్టువర్ట్ బిన్నీ, ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించలేదు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ఆడిన బిన్నీ.. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు. టీమిండియా తరుపున 6 టెస్ట్‌లు ఆడిన అతను.. ఓ హాఫ్ సెంచరీతో 194 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో బిన్నీ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, వన్డే క్రికెట్లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మాత్రం స్టువర్ట్ బిన్నీ(6/4) పేరిటే నమోదై ఉన్నాయి. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన బిన్నీ.. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి, అనిల్ కుంబ్లే(6/12) రికార్డును బ్రేక్ చేశాడు. చదవండి: అదును చూసి విరుచుకుపడ్డాం.. ఇంగ్లండ్ బౌలర్లను ఆకాశానికెత్తిన రూట్ -
'ఐపీఎల్ యాంకరింగ్ మిస్సవుతున్నా'
ముంబై : పలు ఐపీఎల్ సీజన్లలో యాంకరింగ్‌తో మంచి పాపులరిటీ సంపాదించిన మాయంతి లాంగర్ ఆరువారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తన భర్త ప్రముఖ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీతో కలసి చేతిలో బిడ్డతో దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. 'ఈసారి ఐపీఎల్ 2020 యాంకరింగ్ మిస్సవుతున్నా.. కానీ ఇంట్లోనే ఉంటూ రోజువారి ఐపీఎల్ మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్‌లో చూస్తూ ఎంజాయ్ చేయబోతున్నా. ఈ సందర్భంగా మా గ్యాంగ్ సభ్యులైన జతిన్ సపారు, సుహైల్ చాందోక్, క్రికెట్ ఆకాశ్, సంజన గణేషన్, స్కాట్ బైరిస్, బ్రెట్ లీ లాంటి వాళ్లను మిస్సవుతున్నా.. అంటూ' పేర్కొన్నారు. (చదవండి : 'మేం లేకపోయినా.. చెన్నైకి నష్టం లేదు') 'గత ఐదేళ్లుగా స్టార్‌స్పోర్ట్స్ తన కుటుంబంలో నన్ను ఒకదానిలా చూసింది. వారు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఒక యాంకర్‌గా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించా. కరోనా లేకపోయుంటే మార్చిలో ఐపీఎల్ జరుగుంటే.. ఐదు నెలల ప్రెగ్నెన్సీతో యాంకరింగ్ చేద్దామనుకున్నా. కరోనా వల్ల దాదాపు నెలల తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది. కానీ స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం నాకు ఈ విషయంలో చాలా మద్దతునిచ్చింది. ఆ విషయంలో వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఆరు వారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చా. స్టువర్ట్ బిన్నీ, బిడ్డతో కలిసి మధురక్షణాలను అనుభవిస్తున్నా.. బాబు మా జీవితంలోకి ప్రేవేశించాకా చాలా కొత్తగా అనిపిస్తుందంటూ' తెలిపారు.(చదవండి : 'ఆర్సీబీలో కోహ్లి, డివిలియర్స్ ఫేవరెట్ కాదు') So I’m going to love watching the IPL @StarSportsIndia all the best to the team 😁 @jatinsapru @suhailchandhok @cricketaakash @SanjanaGanesan @ProfDeano @scottbstyris @BrettLee_58 @Sanjog_G and the full gang!! pic.twitter.com/fZVk0NUbTi — Mayanti Langer Binny (@MayantiLanger_B) September 18, 2020 స్పోర్ట్స్ వ్యాఖ్యాతల్లో తనదైన ముద్ర వేసిన మయాంతి ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్ టోర్నీలతో పాటు ఇండియన్ కౌన్సిల్ లీగ్(ఐసీఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లాంటి టోర్నీలకు యాంకర్‌గా వ్యవహరించారు. ఇక మయాంతి భర్త క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ టీమిండియా తరపున 14 వన్డేలు, 6 టెస్టులు ఆడాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బిన్నీని గతేడాది ఐపీఎల్ వేలం సందర్భంగా జట్టు నుంచి రిలీజ్ చేసింది. -
‘తొలిసారి భర్త ఫొటో పెట్టింది; నిజమా?’
‘క్షమించండి. నాకు తెలిసి కింగ్స్ ఎలెవన్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూడలేదనుకుంటా. మరేం పర్లేదు. #MarutiSuzukiCricketLiveలో హెచ్డీలో మ్యాచులు వీక్షించండి. ఓకేనా’ అంటూ తన భర్త, క్రికెటర్ స్టువర్ట్ బిన్నీని ట్రోల్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు స్పోర్ట్స్ ప్రజెంటర్ మయంతి లాంగర్. ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా మోహాలీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచులో రాజస్తాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాటి ఈ మ్యాచ్ ద్వారా రాయల్స్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ ఈ సీజన్లో తొలిసారిగా మైదానంలో అడుగుపెట్టాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో (11 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించి గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. చదవండి : (సొంతగడ్డపై పంజాబ్ ప్రతాపం) అయితే ఇన్నాళ్లుగా బిన్నీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో.. కొంతమంది నెటిజన్లు... ‘ స్టువర్ట్ ఎక్కడ మయంతి. అసలు తను ఆడతాడా’ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. మరికొంత మంది బిన్నీ ప్రదర్శనను పొగుడుతూనే.. ‘ఈనాటి ఇన్నింగ్స్ కారణంగా మొట్ట మొదటిసారి మయంతి సోలో డీపీ తీసేసి.. భర్తతో ఉన్న ఫొటో పెట్టింది’ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. ఇందుకు స్పందించిన మయంతి.. ‘ నిజమా? మీ దగ్గర నా నెంబర్ లేదనుకుంటా. నిజానికి నేను డీపీగా ఏ ఫొటో పెట్టానో మీకు తెలిసే అవకాశం లేదు. అయితే ఇంత మంచి ఫొటోను వెదికిపెట్టినందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ వాళ్ల నోర్లు మూయించారు. కాగా ప్రస్తుతం ఇండియాలో ఉన్న గొప్ప స్పోర్ట్స్ ప్రజెంటర్లలో ఒకరిగా మయంతి కీర్తి గడించారు. 2012లో టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీని పెళ్లాడారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు తమ తమ ప్రొఫెషన్లలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నప్పటికీ.. భర్త కంటే కూడా మయంతినే ఓ మెట్టు పైన ఉందని, అందుకే బిన్నీని ఆమె లెక్కచేయదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మయంతి కూడా వారికి గట్టిగా సమాధానమిస్తూనే యాంకర్‌గా దూసుకుపోతున్నారు. Sorry that you seemed to have missed #KXIPvRR on @StarSportsIndia you can join us on #MarutiSuzukiCricketLive on SS 1/2/Hindi/HD and of course @hotstartweets Cheers 👍🏼 https://t.co/Jv59z4xOXZ — Mayanti Langer Binny (@MayantiLanger_B) April 16, 2019 Really Navneet? Considering you don’t have my number you don’t know what the picture actually is 🤭 but thanks a ton for digging out this one, it’s a super pic 👍🏼 https://t.co/kgmgm6qBhT — Mayanti Langer Binny (@MayantiLanger_B) April 16, 2019 -
క్రికెటర్ ను ఇంటర్వ్యూ చేసిన భార్య!
-
క్రికెటర్ ను ఇంటర్వ్యూ చేసిన భార్య!
బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఆరంభమై వారం రోజులైనప్పటికీ అక్కడ అదనపు ఆకర్షణ అనేది కరువైంది..ప్రధానంగా స్టార్ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, మనీష్ పాండేలు అంతర్జాతీయ మ్యాచ్‌లో బిజీగా ఉండటంతో కర్ణాటక ప్రీమియర్ లీగ్ కు కళ తప్పింది. కాకపోతే, శుక్రవారం చోటు చేసుకున్న అరుదైన సంఘటనతో ఈ లీగ్ కు కాస్త జోష్ వచ్చింది. ఇందుకు కారణం ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ, అతని భార్య మయాంతి లాంగర్లే. కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో బెలగావీ పాంథర్స్ తరపున ఆడుతున్న స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్చూ చేసే అవకాశం స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా ఉన్న మయాంతికి వచ్చింది. బ్రాడ్ కాస్టింగ్ కవరేజ్ లో భాగంగా ఆ ఈవెంట్ కు హాజరైన మయాంతి.. భర్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్యూ చేయడం అభిమానుల్లో మజాను తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిన్న బెంగాళూరు బ్లాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో స్టువర్ట్ బిన్నీ 46 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులు నమోదు చేశాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెలగావీ పాంథర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 192 పరుగులు చేసింది. ఆపై బెంగళూరు బ్లాస్టర్స్ 19.3 ఓవర్లలో169 పరుగులు చేసింది. ఇక్కడ స్టువర్ట్ బిన్నీ రెండు వికెట్లతో్ రాణించారు. దాంతో పాంథర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన భర్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్య్వూ చేసే అరుదైన అవకాశం మయాంతికి వచ్చింది. ఇలా భర్తను భార్య ఇంటర్వ్యూ చేయడంపై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. స్టువర్ట్ బిన్నీ రాణించడానికి భార్య మయాంతి అక్కడకు రావడమేనని ఒకరు అభిప్రాయపడగా, భర్తను ఇంటర్య్యూ చేయడం అత్యున్నతమైన గిఫ్ట్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. -
ఫుల్ స్ట్రెంథ్‌తో బరిలోకి కోహ్లి సేన
న్యూఢిల్లీ: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు బీసీసీఐ సోమవారం 15మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన 17 మంది ఆటగాళ్లలో 15మందిని జట్టులో కొనసాగించింది. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ, బౌలర్ షార్దుల్ ఠాకూర్‌పై వేటు వేసింది. విరాట్ కోహ్లి నాయకత్వంలో పూర్తి బలగంతో స్వదేశంలో న్యూజిల్యాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి టీమిండియా సిద్ధమవుతోంది. ఈ నెల 22న కాన్పూర్‌లో జరిగే మొదటి మ్యాచ్‌తో ఈ మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బీసీసీఐ ప్రకటించిన భారత క్రికెట్ జట్టు ఇదే విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజరా, అంజిక్యా రహానే, శిఖర్ ధావన్, ఎం విజయ్, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్. -
మీ పని చూసుకోండి!
విమర్శకులకు మయంతి ఘాటు జవాబు బెంగళూరు: ఒక ఆటగాడు విఫలమైనప్పుడు అతడిని కాకుండా ‘దురభిమానులు’ అతడి వెనుక ఉన్న అమ్మాయిని సోషల్ మీడియాలో ఆడిపోసుకోవడం ఇటీవల తరచూ కనిపిస్తోంది. కోహ్లి బాగా ఆడని రోజు అనుష్క శర్మపై అంతా విరుచుకు పడ్డారు. ఇప్పుడు స్టువర్ట్ బిన్నీ వైఫల్యంపై అతని భార్య మయంతి లంగర్‌కు ఇదే అనుభవం ఎదురైంది. విండీస్‌తో జరిగిన తొలి టి20లో ఒకే ఓవర్లో స్టువర్ట్ 32 పరుగులిచ్చిన తర్వాత ఇది మొదలైంది. గతంలో కూడా మయంతి అందచందాలపై చాలా మంది పలు వ్యాఖ్యలు చేసినా... ట్విట్టర్లో ఈ సారి బిన్నీ ఆటకు ఆమెను బాధ్యులను చేయడం మయంతికి ఆగ్రహం తెప్పించింది. ఏం చేసి అతడిని భారత జట్టులో ఉంచుతున్నావని కొందరంటే, వెంటనే విడాకులు తీసుకొమ్మని ఇంకొందరు వ్యాఖ్యానించారు. అసలు ఆత్మహత్య చేసుకోలేకపోయావా అని కూడా మయంతిని అడిగేశారు! చివరకు దీనిపై మయంతి స్పందించింది. ‘ఆత్మహత్య చేసుకోమని చెప్పడం చూస్తే సిగ్గుగా అనిపిస్తోంది. విడాకుల గురించి మాట్లాడుతున్నారు. మీ జీవితంలో అలాంటిది జరగకుండా మీకు తగిన ప్రేమాభిమానాలు దక్కాలని కోరుకుంటున్నా. మమ్మల్ని విమర్శించడంలో మీకు చాలా ఆనందం లభిస్తుందని అనిపిస్తోంది. నేను 18 ఏళ్ల వయసునుంచి సంపాదిస్తున్నాను. డబ్బు కోసం బిన్నీని చేసుకున్నానని అనే బదులు వెళ్లి ఒక మంచి ఉద్యోగం చూసుకోండి. మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది’ అని లంగర్ సమాధానం ఇచ్చింది. -
'రవిశాస్త్రి, కుంబ్లేల కోరిక ఒకటే'
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఎంపిక కావడాన్ని ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ స్వాగతించాడు. భారత క్రికెట్ జట్టుకు గెలుపే లక్ష్యంగా టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఎలా పని చేశాడో.. ఇప్పుడు కుంబ్లే కూడా అదే కోరికతో పని చేయడం ఖాయమన్నాడు. వీరిద్దరూ జట్టు విజయమే లక్ష్యమే పని చేస్తారన్నాడు. దీంతో పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదని స్టువర్ట్ బిన్నీ అభిప్రాయపడ్డాడు. త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుంది. ఆ ప్రాక్టీస్ సెషన్లో సానుకూల ధోరణిలో ఉండాలన్నదే కుంబ్లే నుంచి నేర్చుకున్న తొలిపాఠంగా బిన్నీ తెలిపాడు. తమకు ఇంకా సాంకేతికపరమైన విషయాలు ఏమీ కుంబ్లే చెప్పలేదని, కేవలం విండీస్ టూర్‌కు ఆత్మస్థైర్యాన్ని కూడగట్టే యత్నం మాత్రమే ఆ మాజీ ఆటగాడు చేస్తున్నారన్నాడు. రంజీ ట్రోఫీలు ఆడినప్పట్నుంచి తనకు అనిల్ తెలుసని, అందుచేత తన గేమ్‌పై అనిల్‌కు పూర్తి అవగాహన ఉంటుందని స్టువర్ట్ బిన్నీ తెలిపాడు. -
ఎక్కువ అవకాశాలివ్వాలి: స్టువర్ట్ బిన్నీ
టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పినట్టుగా ఓ ఆటగాడికి ఎక్కువ అవకాశాలిస్తేనే అతడి అత్యుత్తమ ఆటతీరు బయటికి వస్తుందని స్టువర్ట్ బిన్నీ అన్నాడు. అవకాశాలు పెరిగే కొద్దీ తాను కూడా మెరుగ్గా రాణిస్తానని ఈ 31 ఏళ్ల ఆల్‌రౌండర్ చెప్పాడు. దక్షిణాఫ్రికా నాణ్యమైన జట్టు కాబట్టి రాబోయే సిరీస్ హోరాహోరీగా సాగుతుందని బిన్నీ అభిప్రాయపడ్డాడు. -
కోహ్లి చెప్పింది అక్షరసత్యం..
బెంగళూరు:ఒక ఆటగాడు తనకు తాను నిరూపించుకోవాలంటే సాధ్యమైనన్ని అవకాశాలు పొందాలని అంటున్నాడు టీమిండియా ఆటగాడు స్టువర్ట్ బిన్నీ. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన ఈ అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలన్నాడు. 'విరాట్ చెప్పినదాంట్లో వాస్తవం ఉంది. ఆటగాడు నిరూపించుకోవాలంటే ఎక్కువ అవకాశాలు పొందాలి. అలా దక్కితేనే ఆటగాడి ప్రతిభ బయటకు వస్తుంది. విరాట్ చెప్పింది అక్షర సత్యం' అని అన్నాడు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు ఎంపికైన బిన్నీ.. తనకు ఆన్ ఫీల్డ్ లో నిరూపించుకునే అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయన్నాడు. ఇప్పటివరకూ తన అంతర్జాతీయ కెరీయర్ చూస్తే ఐదు టెస్లులు, 13 వన్డేలు, 2 ట్వంటీ 20 మ్యాచ్ లు ఆడినట్లు పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ తమకు చాలా కఠినమైనదని... నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నసఫారీలను ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నాడు. తాను బౌలింగ్ చేయడాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తానన్నాడు. కొత్త బంతితో స్వింగ్ చేయగల సామర్థ్యం తనలో ఉందని.. దక్షిణాఫ్రికా సిరీస్ లో ఆ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఇటు వన్డేలు, ట్వంటీ 20లకు ఎంపిక కావడంపై బిన్నీ హర్షం వ్యక్తం చేశాడు. అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేస్తాను కాబట్టే తనను రెండు ఫార్మెట్లలో ఎంపిక చేశారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
స్టువర్ట్ బిన్నీకి పిలుపు
శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెట్ టెస్టు జట్టుతో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ చేరనున్నాడు. అతణ్ని జట్టులో 16వ సభ్యుడిగా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంకతో రెండో టెస్టు కొలంబోలో ఈనెల 20న మొదలవుతుంది. -
వరుణ్ ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ
న్యూఢిల్లీ: గాయపడిన భారత పేసర్ వరుణ్ ఆరోన్ స్థానంలో ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి రానున్నాడు. శ్రీలంకతో జరగనున్న రెండు, మూడు వన్డేలకు ఆరోన్ స్థానంలో బిన్నీని తీసుకున్నట్టు బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంక-భారత్ రెండో వన్డే గురువారం అహ్మదాబాద్ లో జరగనుంది. జూన్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బిన్నీ చివరిసారిగా ఆడాడు. ఈ నెల 2న జరిగిన తొలి వన్డేలో కుడికాలి కండరాలు పట్టేయడంతో ఆరోన్ బౌలింగ్ చేయలేకపోయాడు. 13వ ఓవర్ లో ఆరోన్ వైదొలగడంతో అతడి కోటాను కెప్టెన్ విరాట్ కోహ్లి పూర్తి చేశాడు. -
ఫైనల్లో సౌత్‌జోన్
సెమీస్‌లో చిత్తుగా ఓడిన ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీ క్రికెట్ రోహ్టక్: దేశవాళీ జోనల్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ మూడో రోజే ముగిసిన మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఇన్నింగ్స్ 118 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ను చిత్తుగా ఓడించింది. ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఈస్ట్‌జోన్ 23.4 ఓవర్లలో 62 పరుగులకే కుప్పకూలింది. శుక్లా (18), సౌరభ్ తివారి (13) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. శరత్‌కు 4 వికెట్లు దక్కగా, స్టువర్ట్ బిన్నీ 3 వికెట్లు తీశాడు. అంతకు ముందు గురువారం ఈస్ట్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కూడా పేలవ ప్రదర్శన కనబర్చి 84 పరుగులకే ఆలౌటైంది. సౌరభ్ తివారి (17), రాణా దత్తా (17)లదే అత్యధిక స్కోరు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా 4 వికెట్లు పడగొట్టిన బిన్నీ.. ఈస్ట్‌ను దెబ్బ తీశాడు. ప్రజ్ఞాన్ ఓజాకు 3 వికెట్లు దక్కాయి. గంభీర్ సెంచరీ: సెంట్రల్‌జోన్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో నార్త్‌జోన్ కెప్టెన్ గంభీర్ (242 బంతుల్లో 167; 18 ఫోర్లు) సెంచరీ చేశాడు. నార్త్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 538 పరుగులు చేసిన సెంట్రల్‌జోన్‌కు 81 పరుగుల ఆధిక్యం లభించింది. నార్త్ బ్యాట్స్‌మెన్‌లో సెహ్వాగ్ (32), యువరాజ్ (47), రసూల్ (44) ఫర్వాలేదనిపించారు. గురువారం సెంట్రల్ బ్యాట్స్‌మన్ నమన్ ఓజా (348 బంతుల్లో 217; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేశాడు. -
స్టువర్ట్‌కు ‘స్టార్ట్’ దొరికింది!
తొలి టెస్టులోనే ఆకట్టుకున్న బిన్నీ నాటింగ్‌హామ్ టెస్టులో మొదటి నాలుగు రోజులు చూస్తే స్టువర్ట్ బిన్నీ అసలు ఉన్నాడా... భారత జట్టు పది మందితోనే బరిలోకి దిగిందా అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో 1 పరుగు, బౌలింగ్‌లో వికెట్ లేకుండా కేవలం పది ఓవర్లు... బిన్నీని ఆడించడం ఒక విఫల ప్రయోగంగా కనిపించింది. అయితే చివరి రోజు రెండు సెషన్లకు పైగా ఆట మిగిలి ఉన్న సమయంలో ఒక్కసారిగా అతనే ఆపద్బాంధవుడయ్యాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా కళ్ళకు గంతలు కట్టినట్లుగా క్రికెట్ ఆడుతుంటే బిన్నీ నిలదొక్కుకున్నాడు. జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు. ఇంగ్లండ్ సిరీస్ ఓటమితో ప్రారంభం కాకుండా ఆదుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం షమీ, అండర్సన్‌లాంటి ఆటగాళ్లు కూడా అర్ధ సెంచరీ చేసిన పిచ్‌పై బిన్నీ 78 పరుగులు చేయడం విశేషమా అనవచ్చు. అయితే గణాంకాల జోలికి పోకుండా ఉంటే కనీసం తన ఎంపిక తప్పు కాదని స్టువర్ట్ బిన్నీ నిరూపించాడు. ముఖ్యంగా అతను క్రీజ్‌లోకి అడుగు పెట్టిన సమయంలో జట్టు పరిస్థితి బాగా లేదు. అండర్సన్, బ్రాడ్ చెలరేగుతున్నారు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యం వెంటాడుతుండగా అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో బిన్నీ చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మంచి స్ట్రోక్‌ప్లే ప్రదర్శించాడు. ‘కెరీర్ తొలి టెస్టులోనే జట్టును రక్షించే అవకాశం ఎంత మందికి వస్తుంది. నేను ఆ పని చేశాను. చాలా సంతోషం. రెండో ఇన్నింగ్స్‌లో మొదటి అర గంట నిలబడితే చాలని భావించాను. అదే పట్టుదలతో ముందుకెళ్లాను’ అని బిన్నీ వ్యాఖ్యానించాడు. వన్డేల తర్వాత... గత సీజన్ రంజీ ట్రోఫీలో కర్ణాటక విజయంలో బిన్నీది కూడా కీలక పాత్ర. అయినా సరే, ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అతని టెస్టు ఎంపికపై సందేహాలున్నాయి. విఫలమైతే ఇక అంతే సంగతులు! అయితే కొన్నాళ్ల క్రితమే బంగ్లాదేశ్‌పై వన్డేల్లో రికార్డు బౌలింగ్‌తో సత్తా చాటిన బిన్నీ టెస్టు అవకాశాన్నీ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ముఖ్యంగా వన్డే, టి20ల ముద్ర నుంచి బయట పడేందుకు అతనికి నాటింగ్‌హామ్ మ్యాచ్ ఉపయోగ పడింది. ‘కర్ణాటక తరఫున నేను ఆరో స్థానంలోనే ఆడతాను. సుదీర్ఘ ఫార్మాట్లో ఎలా ఆడాలో నాకు తెలుసు. బంతి రివర్స్ స్వింగ్ అవుతున్నప్పుడు కూడా సమర్థంగా ఎదుర్కోగలిగాను. ఆశించినట్లే కనీసం హాఫ్ సెంచరీ చేశాను’ అని బిన్నీ చెప్పాడు. నిలబడగలడా...? ఒక పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌ను కాదని, ఐదో బౌలర్‌గా అతనికి ధోని అవకాశం ఇచ్చాడు. అయితే ఆల్‌రౌండర్ అయిన బిన్నీ మీడియం పేస్ తొలి టెస్టులో పెద్దగా ఉపయోగపడలేదు. ‘నిజానికి ఆ పిచ్ నా బౌలింగ్ శైలికి సరిపోదు. కానీ ఐదు రోజుల మ్యాచ్‌లో ఏదో ఒక దశలో నా బౌలింగ్ కీలకమవుతుందని భావించాను. అవకాశం దక్కితే బౌలింగ్‌లోనూ రాణిస్తా’ అని అతను చెప్పాడు. బౌలింగ్ సంగతి పక్కన పెట్టినా తొలి టెస్టులో చక్కటి ప్రదర్శన తర్వాత కూడా తర్వాతి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు ఖాయమని చెప్పలేం. లార్డ్స్ వికెట్ చూసిన తర్వాతే బిన్నీ, అశ్విన్‌లలో ఒకరిని ఎంచుకుంటానని ధోని చెప్పడం కూడా స్థానంపై సందేహం రేకెత్తిస్తోంది. బిన్నీ తనకు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకున్నాడని... సెలక్టర్‌గా తన తండ్రి పాత్ర లేదని నిరూపించాడని మాత్రం చెప్పవచ్చు. కొసమెరుపు: 1948లో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ ఆండీ గాంటెమ్ తన తొలి టెస్టులోనే అద్భుత సెంచరీ సాధించాడు. అయితే సెంచరీకి ముందు నెమ్మదిగా ఆడటం వల్ల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు తక్కువ సమయం లభించిందని... ఫలితంగా విండీస్ మ్యాచ్ గెలవలేకపోయిందని అతనిపై ఆరోపణ. ఆ తర్వాత గాంటెమ్ జీవితంలో మరో టెస్టు ఆడలేదు. అయితే మరో అవకాశం వెంటనే రాకపోయినా బిన్నీ సెంచరీ కోసం అలాంటి ప్రయత్నం చేశాడనే అపప్రథ మాత్రం మూటగట్టుకోలేదు! -
'మ్యాచ్ ను రక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది'
నాటింగ్ హమ్:భారత్ -ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలిటెస్టు మ్యాచ్ ప్రతర్థి చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినందుకు చాలా ఆనందంగా ఉందని భారత్ ఆటగాడు స్టువర్డ్ బిన్నీ తెలిపాడు. ఆ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో బిన్నీ(78) పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన బిన్నీ.. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్ లో చేసిన పరుగులు జట్టుకు ఉపయోగపడినందుకు సంతోషంగా ఉందన్నాడు.' నేను ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా నిరాశ చెందాను. క్రీజ్ లో పది-పది హేను నిమిషాలు కష్టపడ్డా.. ఒక చెత్త షాట్ కొంపముంచిందని' బిన్నీ తెలిపాడు. సెకెండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఎక్కువ సమయం క్రీజ్ లో ఉండాలనుకున్నానని, ఆ సానుకూల థృక్పధంతోనే క్రీజ్ లో కి అడుగుపెట్టానని తెలిపాడు. అందరికీ జట్టు క్లిష్ట పరిస్థితుల్నినుంచి కాపాడే అవకాశం రాదని.. కానీ అటువంటి అవకాశం తనకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. -
మీర్పూర్ వన్డేలో భారత్ మెరుపు విజయం
-
4.4 ఓవర్లు.. 4 పరుగులు.. 6 వికెట్లు
మిర్పూర్: స్టువార్ట్ బిన్నీ రికార్డ్ బౌలింగ్ తో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో గెల్చుకుంది. రైనా సేన నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌటయింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 41 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 25.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటయింది. రైనా 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన బంగ్లాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మొహిత్ శర్మ, స్టువార్ట్ బిన్నీ ధాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోయారు. ముఖ్యంగా బిన్నీ తన పదునైన బౌలింగ్ తో అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. అంతేకాకుండా తక్కువ పరుగులిచ్చి ఎక్కువ వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. స్టువార్ట్ బిన్నీ 4.4 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ 4 వికెట్లు నేలకూల్చాడు. బంగ్లా ఆటగాళ్లలో మిథున్ అలీ(26), ముష్ఫికర్ రహీం(11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. నలుగురు డకౌటయ్యారు. స్టువార్ట్ బిన్నీ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. -
బిన్నీని తెస్తేనే నయం!
హామిల్టన్: భారత్ వన్డేలో నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశమే లేదు. ‘నలుగురు పేసర్లతో ఆడితే మాకు రెండు ఫలితాలు వస్తాయి. ఒకటి కెప్టెన్‌పై నిషేధం, రెండు ఓటమి’ న్యూజిలాండ్‌తో తొలి వన్డే తర్వాత ధోని వ్యాఖ్య ఇది. నలుగురు పేసర్లతో ఆడటంవల్ల స్లో ఓవర్ రేట్ అనేది భారత్‌కు పెద్ద సమస్య. కాబట్టి ఈ ఆప్షన్‌ను ధోని కొట్టిపారేశాడు. కానీ కివీస్‌లో వికెట్ల స్వభావం దృష్ట్యా ఇద్దరు స్పిన్నర్లు (అశ్విన్, జడేజా)తో ఆడే వ్యూహం బెడిసికొట్టొచ్చు. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఓ రకంగా జట్టుకు భారంగానే మారాడని అనుకోవాలి. కేవలం బౌలర్‌గా జట్టులో ఉంటే సరే... కానీ ఆల్‌రౌండర్ కోటాలో ఆడుతున్న జడేజా బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. గతేడాది చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఆల్‌రౌండర్ ఎక్కడా బంతితోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. బ్యాట్స్‌మెన్‌గా ఎలాగూ పనికి రావడం లేదు. తొలి వన్డేలో జడేజా కనీసం పది నిమిషాలు క్రీజులో నిలబడి కోహ్లికి సహకరిస్తే ఫలితం మరోలా ఉండేది. రేపు ప్రపంచకప్‌లోనూ ఇవే వికెట్లు కాబట్టి... భారత్ ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకోవడం మేలు. అదనంగా బ్యాట్స్‌మన్ కావాలంటే రాయుడు ఉన్నాడు. ఆల్‌రౌండరే కావాలంటే పేస్ ఆల్‌రౌండర్‌గా స్టువర్ట్ బిన్నీ అందుబాటులో ఉన్నాడు. కాబట్టి సిరీస్‌లో వీలైనంత తొందరగా బిన్నీని ఆడించడం మేలు. రేపు (బుధవారం) జరిగే రెండో వన్డేలో ధోని ఈ ప్రయోగం చేస్తాడా..? లేక జడేజాకే కట్టుబడతాడా అనేది ఆసక్తికరం. సిరీస్‌కు మిల్నే దూరం! పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తొలి వన్డేలో గాయపడ్డ మిల్నేకు ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. -
యువరాజ్ సింగ్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: వరుసగా విఫలమవుతున్న సీనియర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కు సెలెక్షన్ కమిటీ షాక్ ఇచ్చింది. వన్డే జట్టు నుంచి అతడికి ఉద్వాసన పలికింది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును సెలెక్షన్ కమిటీ నేడు ఎంపిక చేసింది. యువరాజ్ సింగ్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో కర్ణాటక ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి వచ్చాడు. బౌలర్ మొహిత్ శర్మకు మొండిచేయి చూపారు. అతడి స్థానంలో పేసర్ వరుణ్ ఆరోన్‌ను తీసుకున్నారు. మధ్యప్రదేశ్ సీమర్ ఈశ్వర్ పాండే 'డబుల్' సాధించాడు. వన్డే, టెస్టు టీమ్‌లో అతడు చోటు సంపాదించాడు. స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. టెస్టు టీమ్: ధోనీ(కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, పూజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, ఈశ్వర్ పాండే వన్డే టీమ్: ధోనీ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రహానే, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, ఈశ్వర్ పాండే