
స్టువర్ట్ బిన్నీకి పిలుపు
శ్రీలంకలో పర్యటిస్తున్న భారత క్రికెట్ టెస్టు జట్టుతో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ చేరనున్నాడు. అతణ్ని జట్టులో 16వ సభ్యుడిగా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంకతో రెండో టెస్టు కొలంబోలో ఈనెల 20న మొదలవుతుంది.