
వరుణ్ ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ
న్యూఢిల్లీ: గాయపడిన భారత పేసర్ వరుణ్ ఆరోన్ స్థానంలో ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి రానున్నాడు. శ్రీలంకతో జరగనున్న రెండు, మూడు వన్డేలకు ఆరోన్ స్థానంలో బిన్నీని తీసుకున్నట్టు బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంక-భారత్ రెండో వన్డే గురువారం అహ్మదాబాద్ లో జరగనుంది. జూన్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బిన్నీ చివరిసారిగా ఆడాడు.
ఈ నెల 2న జరిగిన తొలి వన్డేలో కుడికాలి కండరాలు పట్టేయడంతో ఆరోన్ బౌలింగ్ చేయలేకపోయాడు. 13వ ఓవర్ లో ఆరోన్ వైదొలగడంతో అతడి కోటాను కెప్టెన్ విరాట్ కోహ్లి పూర్తి చేశాడు.