
ఎక్కువ అవకాశాలివ్వాలి: స్టువర్ట్ బిన్నీ
టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పినట్టుగా ఓ ఆటగాడికి ఎక్కువ అవకాశాలిస్తేనే అతడి అత్యుత్తమ ఆటతీరు బయటికి వస్తుందని స్టువర్ట్ బిన్నీ అన్నాడు. అవకాశాలు పెరిగే కొద్దీ తాను కూడా మెరుగ్గా రాణిస్తానని ఈ 31 ఏళ్ల ఆల్‌రౌండర్ చెప్పాడు. దక్షిణాఫ్రికా నాణ్యమైన జట్టు కాబట్టి రాబోయే సిరీస్ హోరాహోరీగా సాగుతుందని బిన్నీ అభిప్రాయపడ్డాడు.