
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేసింది. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ (42 బంతుల్లో 82 పరుగులు నాటౌట్, 5 ఫోర్లు, ఆరు సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. బిన్నీ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడూ సురేశ్ రైనా(33 పరుగులు), ఆఖర్లో యూసఫ్ పఠాన్(15 బంతుల్లో 35 నాటౌట్, ఒక ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.
రైనాతో కలిసి మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించిన బిన్నీ.. ఆఖర్లో యూసఫ్ పఠాన్‌తో కలిసి 88 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. దీంతో ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అంతకముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 పరుగులు.. నమన్ ఓజా 21 పరుగులు చేసి ఔటయ్యారు. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రం ఆరు పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచాడు. సౌతాఫ్రికా లెజెండ్స్ బౌలర్లలో వాండర్‌వాత్ 2, ఎడ్డీ లీ, ఎన్తిని చెరొక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment