Road Safety World Series 2022
-
ఆ టోర్నీలో టీమిండియాతో పాటు పాక్ కూడా పాల్గొంటుంది..!
దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో (మూడో ఎడిషన్) దాయాది పాకిస్తాన్ తొలిసారి పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చినట్లు సమాచారం. పాక్ జట్టులో ఎవరెవరు ఉంటారన్నది తెలియాల్సి ఉంది. భారత్, పాక్ సహా మొత్తం 9 దేశాల జట్లు పాల్గొనే ఈ సిరీస్‌లో ఆయా దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు కూడా పాల్గొంటారు. ఈ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా సెప్టెంబర్‌లో జరుగనుంది. మూడు వారాల పాటు సాగే ఈ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జాక్ కలిస్, జాంటీ రోడ్స్, మఖాయ ఎన్తిని, రాస్ టేలర్, కెవిన్ పీటర్సన్, సనత్ జయసూర్య, బ్రెట్ లీ, తిలకరత్నే దిల్షన్, షేన్ వాట్సన్ లాంటి దిగ్గజాలతో పాటు మాజీ అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటారు. రెండు సీజన్ల పాటు భారత్‌లో విజయవంతంగా సాగిన ఈ సిరీస్‌ను నిర్వహకులు ఈసారి ఇంగ్లండ్‌లో ప్లాన్ చేయడంతో పాక్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ వెలువడాల్సి ఉంది. ఈ సిరీస్ తొలి ఎడిషన్ కోవిడ్ కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో జరగగా.. 2022 ఎడిషన్ నిరాటంకంగా ఒకే దశలో జరిగింది. ఈ రెండు ఎడిషన్లలో టీమిండియానే విజేతగా నిలిచింది. రెండు ఎడిషన్ల ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత జట్టు శ్రీలంకను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. తొలి ఎడిషన్ తొలి దశలో భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లతో పాటు ఆస్ట్రేలియా జట్టు పాల్గొనగా.. కోవిడ్ నిబంధనల కారణంగా ఆతర్వాత జరిగిన మలి దశలో ఆసీస్ జట్టు పాల్గొనలేదు. అయితే 2021లో జరిగిన మలి దశ సిరీస్‌లో ఆసీస్ స్థానంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు బరిలోకి దిగాయి. అనంతరం 2022లో జరిగిన సెకెండ్ ఎడిషన్‌లో ఏకంగా 8 దేశాల జట్లు పాల్గొన్నాయి. తొలి ఎడిషన్‌లో పాల్గొన జట్లతో పాటు అదనంగా కివీస్ ఈ ఎడిషన్‌లో పాల్గొంది. 2023 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొనే జట్లు.. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ -
రిటైరయ్యాక కూడా ఇరగదీశారు.. అప్పుడూ ఇలానే, కానీ..!
ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, లెజెండ్స్ లీగ్ క్రికెట్లో సత్తా చాటి, రిటైరైనా తగ్గేదేలే అని యువ క్రికెటర్లకు సందేశం పంపిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్లు, సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్లు ఆ రెండు సిరీస్‌ల్లో తమతమ అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. రోడ్ సేఫ్టీ సిరీస్, లెజెండ్స్ లీగ్‌లు ఒకే సమయంలో షెడ్యూలైనప్పటికీ పఠాన్ సోదరులు రెండిటిలోనూ పాల్గొని తమ జట్లను గెలిపించారు. 13 ఫ్లయిట్లు, 17 మ్యాచ్‌లు, 2 ఫైనళ్లు అంటూ ఇర్ఫాన్ పఠాన్.. తన సోదరుడు యూసఫ్‌ను ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్ వేదికగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో సచిన్ కెప్టెన్సీలో ఇండియా లెజెండ్స్ తరఫున ఆడిన యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్-2లో బిల్వారా కింగ్స్ జట్టు తరఫున ఆడారు. ఈ జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్లో ఇండియా లెజెండ్స్ జట్టు ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను మట్టికరిపించి వరుసగా రెండో సీజన్లోనూ ఛాంపియన్‌గా నిలువగా.. లెజెండ్స్ లీగ్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా క్యాపిటల్స్ చేతిలో బిల్వారా కింగ్స్ ఓటమిపాలైంది. ఈ రెండు టోర్నీల్లో యూసఫ్ పఠాన్ మొత్తం 14 మ్యాచ్‌ల్లో 341 పరుగులు చేసి, బౌలింగ్‌లో 10 వికెట్లు తీశాడు. ఇందులో ఐదు 30+ స్కోర్లు ఉన్నాయి. ఇక తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ విషయానికొస్తే.. ఇర్ఫాన్ ఈ రెండు టోర్నీల్లో కలిపి 12 ఇన్నింగ్స్‌ల్లో 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు 30+ స్కోర్లు ఉన్నాయి. అలాగే ఇర్ఫాన్ బౌలింగ్‌లో 2 వికెట్లు కూడా తీశాడు. ఈ రెండు టోర్నీల్లో యూసఫ్ పఠాన్ 27 సిక్సర్లు, 22 ఫోర్లు బాదగా.. ఇర్ఫాన్ పఠాన్ 11 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, పఠాన్ సోదరులు గతంతో అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శనే చేసినప్పటికీ వివిధ కారణాల చేత సరైన అవకాశాలు రాక వారి కెరీర్లు అర్థంతరంగా ముగిశాయి. ఇర్ఫాన్ 27 ఏళ్ల వయసులో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి.. దాదాపు పదేళ్ల పాటు జట్టులో చోటు కోసం నిరీక్షించి చివరకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున హ్యాట్రిక్ తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన ఇర్ఫాన్ పఠాన్.. 2007 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, అలాగే తానాడిన చివరి వన్డేలో ఐదు వికెట్లు తీశాడు. యూసఫ్ పఠాన్ విషయానికొస్తే ఇతనిది దాదాపు తమ్ముడి పరిస్థితే. కీలక మ్యాచ్‌ల్లో భారీ సిక్సర్లు బాది ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించిన యూసఫ్‌కు కూడా సరైన అవకాశాలు రాక కెరీర్‌ను అర్ధంతరంగా ముగించాడు. -
RSWS 2022: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్
Road Safety World Series 2022 Winner: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2022 ఫైనల్లో ఇండియా లెజెండ్స్ ఘన విజయం సాధించింది. శ్రీలంక లెజెండ్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని ముద్దాడింది. నమన్ ఓజా అద్భుత సెంచరీ(71 బంతుల్లో 108 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు, నాటౌట్)తో జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ ఈ టైటిల్ గెలవడం వరుసగా ఇది రెండోసారి. సచిన్ మెరుపులు చూద్దామనుకుంటే! ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వేదికగా శనివారం జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్లో టాస్ గెలిచిన ఇండియా లెజెండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్, కెప్టెన్ సచిన్ టెండుల్కర్ మెరుపులు చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. కులశేఖర బౌలింగ్‌లో సచిన్ గోల్డెన్ డకౌగా వెనుదిరిగాడు. వన్‌డౌన్ బ్యాటర్ సురేశ్ రైనా (4 పరుగులు) సైతం విఫలమయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వినయ్ కుమార్ 36 పరుగులతో రాణించగా.. మిగిలిన వాళ్లలో యువరాజ్ సింగ్ 19, ఇర్ఫాన్ పఠాన్ 11 పరుగులు చేశారు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా నమన్ ఓజా ఆఖరి వరకు పట్టుదలగా నిలబడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా లెజెండ్స్ 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కులశేఖరకు మూడు, ఇసురు ఉడానాకు రెండు వికెట్లు, ఇషాన్ జయరత్నేకు ఒక వికెట్ దక్కాయి. ఆదిలోనే షాక్.. ఆపై భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్ ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజేశ్ పవార్ బౌలింగ్‌లో దిల్షాన్ మునవీర 8 పరుగులు, వినయ్‌కుమార్ బౌలింగ్‌లో సనత్ జయసూర్య 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. కెప్టెన్ తిలకరత్నె దిల్షాన్(11 పరుగులు) సహా ఉపుల్ తరంగ(10) సైతం నిరాశపరిచాడు. ఈ క్రమంలో అసీల గుణరత్నె(19), జీవన్ మెండిస్(20) కాసేపు పోరాడగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ జయరత్నె అర్ధ శతకం(22 బంతుల్లో 51 పరుగులు)తో చెలరేగి లంక శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అయితే, వినయ్ కుమార్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత మహేల ఉదవటె(19 బంతుల్లో 26 పరుగులు) జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. టాపార్డర్ వైఫల్యం కారణంగా శ్రీలంక లెజెండ్స్ 18.5 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో వరుసగా రెండోసారి ట్రోఫీ ఇండియా లెజెండ్స్ కైవసమైంది. మాజీ క్రికెటర్ల లీగ్.. ఉద్దేశమేమిటంటే.. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు గతేడాది నుంచి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ పేరిట ఇంటర్నేషనల్ టీ20 లీగ్ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు ఇందులో భాగమయ్యారు. మొదట్లో ఇండియా, ఇంగ్లండ్, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు మాత్రమే ఉండగా.. ఈ ఏడాది న్యూజిలాండ్ లెజెండ్స్ సైతం చేరింది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సహకారంతో భారత రోడ్డు రవాణ, హైవేలు, ఐటీ మంత్రిత్వ శాఖ, యువజన క్రీడా శాఖ కలిసి ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నాయి. చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. -
సెంచరీతో చెలరేగిన నమన్ ఓజా.. ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శనివారం శ్రీలంక లెజెండ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ నమన్ ఓజా సెంచరీతో (71 బంతుల్లో 108 నాటౌట్, 15 ఫోర్లు, 2 సిక్సర్లు)చెలరేగాడు. దీంతో ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సెమీఫైనల్లో సెంచరీకి 10 పరుగుల దూరంలో ఆగిపోయిన నమన్ ఓజా.. ఈసారి మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోలేదు. ఆరంభంలోనే సచిన్ టెండూల్కర్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినప్పటికి.. సురేశ్ రైనా 4 పరుగులు చేసి ఔటైనప్పటికి.. ఒక ఎండ్‌లో మత్రం నమన్ ఓజా ఇన్నింగ్స్‌ను ధాటిగా కొనసాగించాడు. లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు. నమన్ ఓజాకు జతగా వినయ్‌కుమార్(21 బంతుల్లో 36 పరుగులు) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. వినయ్ కుమార్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ 13 బంతుల్లో 19 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ నమన్ ఓజా 68 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేయడంలో నమన్ ఓజా కీలకపాత్ర పోషించాడు. లంక లెజెండ్స్ బౌలర్లలో నువాన్ కులశేఖర మూడు వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా రెండు వికెట్లు, ఇషాన్ జయరత్నే ఒక వికెట్ తీసుకున్నాడు. Naman Ojha smashed 108* runs from 71 balls including 15 fours and 2 sixes in the Road Safety World Series final 2022, a terrific knock to remember. pic.twitter.com/F4gNjjgNyf — Johns. (@CricCrazyJohns) October 1, 2022 చదవండి: థర్డ్ అంపైర్ చీటింగ్.. టీమిండియా క్రికెటర్‌కు అన్యాయం -
మీ నాన్న వల్లే గెలిచాం.. బుడ్డోడిని ముద్దు చేసిన సచిన్.. వీడియో వైరల్
Road Safety World Series T20 2022 - India Legends vs Sri Lanka Legends In Final: రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్-2022 సెమీ ఫైనల్లో భాగంగా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ఈ టీ20 లీగ్‌లో ఇండియా లెజెండ్స్ తరఫున బరిలోకి దిగిన ఇర్ఫాన్.. కీలక మ్యాచ్‌లో రాణించి జట్టును ఫైనల్లో చేర్చడంలో తన వంతు సాయం చేశాడు. ఓపెనర్ నమన్ ఓజా 90 పరుగులతో అజేయంగా నిలవగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇర్ఫాన్ పఠాన్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 308కి పైగా స్ట్రైక్‌రేటుతో 37 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా సచిన్ టెండుల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ మరో నాలుగు బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మీ నాన్న వల్లే గెలిచాం! 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా లెజెండ్స్‌పై గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో సచిన్.. ఇర్ఫాన్ చిన్నారి కుమారుడు ఇమ్రాన్‌తో సరదాగా ముచ్చటిస్తూ.. ‘‘మేము ఈరోజు మ్యాచ్ ఎలా గెలిచామో తెలుసా? ఆయనెవరో తెలుసు కదా! ఆయన టప్ టప్మని సిక్స్‌లు కొట్టాడు. అలా మేము గెలిచాం’’ అంటూ బుడ్డోడిని ముద్దు చేశాడు. ఈ వీడియో సచిన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. లెజెండ్ .. చిన్న పిల్లలతో కూడా బాగా కలిసిపోతారు. ముద్దు చేయడంలో ముందుంటారు అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇమ్రాన్‌కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. అతడికి 90వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక శనివారం రాయ్‌పూర్ వేదికగా శ్రీలంక లెజెండ్స్‌తో ఫైనల్లో తలపడేందుకు ఇండియా లెజెండ్స్ సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Imran Pathan (@imrankpathan_official) చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ -
RSWS 2022 Final: వెస్టిండీస్‌కు పరాభవం.. ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్
RSWS 2022- Sri Lanka Legends vs West Indies Legends, Semi-final 2: సమిష్టి ప్రదర్శనతో శ్రీలంక లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్(ఆర్ఎస్డబ్ల్యూఎస్)- 2022 ఫైనల్‌కు చేరుకుంది. వెస్టిండీస్ లెజెండ్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించి.. ఇండియా లెజెండ్స్‌తో తుదిపోరుకు సిద్ధమైంది. ఆల్‌రౌండర్లు ఇషాన్ జయరత్నె(19 బంతుల్లో 31 పరుగులు), నువాన్ కులశేఖర జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా ఆర్ఎస్డబ్ల్యూఎస్ సెమీఫైనల్-2లో శ్రీలంక లెజెండ్స్- వెస్టిండీస్ లెజెండ్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రాణించిన జయరత్నె బ్రియన్ లారా బృందం ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది దిల్షాన్ సేన. ఓపెనర్లు మహేల ఉదవటె(15), సనత్ జయసూర్య(26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తిలకరత్నె దిల్షాన్ మాత్రం(12 బంతుల్లో ఏడు పరుగులు) విఫలమయ్యాడు. ఇక ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగిన ఇషాన్ జయరత్నె మెరుపులు మెరిపించగా.. జీవన్ మెండిస్ 25 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. పాపం నర్సింగ్! ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ టాపార్డర్ రాణించినప్పటికీ.. మిడిలార్డర్ కుప్పకూలింది. దీంతో వన్‌డౌన్ బ్యాటర్ నర్సింగ్ డియోనరైన్ ఒంటరి పోరాటం(39 బంతుల్లో 63 పరుగులు) వృథాగా పోయింది. 158 పరుగులకే విండీస్ ఆలౌట్ కాగా.. శ్రీలంక 14 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. కీలక వికెట్లు పడగొట్టిన నువాన్ కులశేఖర(4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక శ్రీలంక లెజెండ్స్ శనివారం(అక్టోబరు 1) నాటి ఫైనల్లో ఇండియా లెజెండ్స్‌తో తలపడనుంది. చదవండి: National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. Pak Vs Eng 6th T20: పాక్ బౌలర్లకు చుక్కలు.. 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సాల్ట్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో పాక్ చిత్తు -
బ్రెట్ లీ బౌలింగ్‌లో ట్రేడ్‌మార్క్ షాట్.. ఎన్నాళ్లయిందో
క్రికెట్లో కొన్ని పోటీలు(Rivalries) గమ్మత్తుగా ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వాటికి కల్ట్ఫ్యాన్స్ కూడా ఉంటారు. రెండు దశాద్దాల కింద చూసుకుంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు బంతులు వేయడానికి ప్రత్యర్థి బౌలర్లు వణికిపోయేవారు. ఎందుకంటే అప్పట్లో సచిన్ ఫామ్ భీకరమైన స్థాయిలో ఉండేది. అలాంటి చూడముచ్చటైన ఆటలో సచిన్ కొన్నిసార్లు గెలిస్తే.. మరికొన్నిసార్లు ప్రత్యర్థి బౌలర్లు పైచేయి సాధించేవారు. ముఖ్యంగా సచిన్-బ్రెట్ లీ, సచిన్-షోయబ్ అక్తర్‌ల మధ్య పోటీని అభిమానులు ఎగబడి చూసేవారు. ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్ సచిన్ కొట్టే స్వ్కేర్‌లెగ్ కవర్‌డ్రైవ్ షాట్‌కు ఎంతో మంది అభిమానులు ఉంటారు. సచిన్ ఈ షాట్‌ను లీ బౌలింగ్‌లో చాలాసార్లు ఆడేవాడు. అలాంటి ట్రేడ్‌మార్క్ షాట్లు చూసి చాలా కాలమైన తరుణంలో రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ పుణ్యమా అని అభిమానులు మరోసారి అలాంటి ట్రేడ్‌మార్క్ షాట్లను చూడగలుగుతున్నారు. మొన్నటికి మొన్న సచిన్ ఫ్రంట్‌ఫుట్ వచ్చి లాంగాన్ మీదుగా సిక్సర్ బాదడం చూసి వింటేజ్ సచిన్‌ను చూపించాడురా అనుకున్నాం. తాజాగా గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్లో సచిన్ బ్రెట్ లీ బౌలింగ్‌లో తొలి బంతినే ఎక్స్ట్రా కవర్స్ మీదుగా ఆణిముత్యంలాంటి బౌండరీ బాదాడు. దీన్ని చూసిన అభిమానులు మా కళ్లు ఎంత పుణ్యం చేసుకున్నాయో.. దశాబ్దంన్నర కింద ఇలాంటి షాట్లు చూశాం.. మళ్లీ ఇప్పుడు అంటూ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సెమీఫైనల్లో ఆస్ట్రేలియా లెజెండ్స్‌పై టీమిండియా లెజెండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నమన్ ఓజా(90 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్(37 నాటౌట్) రాణించి జట్టును గెలిపించారు. Sachin punching it 🆚 Binga 😎🔥 Kuch yaad aya, Paltan? 08' 👀#OneFamily @sachin_rt @BrettLee_58pic.twitter.com/zyORi8Ms6f — Mumbai Indians (@mipaltan) September 29, 2022 చదవండి: బుమ్రా దూరం.. సరైన బౌలర్లు లేరు; టీమిండియాకు కష్టమే! -
చెలరేగిన నమన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్.. ఫైనల్లో ఇండియా లెజెండ్స్
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో ఇండియా లెజెండ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా లెజెండ్స్ ఓపెనర్ నమన్ ఓజా (90 పరుగులు నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో ఇర్ఫాన్ పఠాన్ (37 పరుగులు నాటౌట్) మెరుపులు మెరిపించాడు. వాస్తవానికి బుధవారమే ఈ మ్యాచ్ పూర్తవ్వాల్సింది. కానీ ఆస్ట్రేలియా లెజెండ్స్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. వర్షం ఎంతకు తెరిపినివ్వకపోవడంతో ఆటను గురువారం కూడా కంటిన్యూ చేశారు. బుధవారం వర్షం అంతరాయం కలిగించే సమయానికి 17 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. కాగా గురువారం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 3 ఓవర్లు ఆడింది. మొత్తం 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బెన్ డక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో కామెరున్ వైట్ 30, బ్రాడ్ హడిన్ 12 పరుగులు చేశారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 10 పరుగులు చేసిన టెండూల్కర్ రీయర్డన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా(11) కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్(18)తో కలిసి నమన్ ఓజా(62 బంతుల్లో 90 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. యువీ, బిన్నీ, యూసఫ్ పఠాన్లు వెనుదిరగడంతో ఇండియా లెజెండ్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇర్ఫాన్ పఠాన్( 12 బంతుల్లో 37 నాటౌట్, 2 ఫోర్లు) మెరుపులు మెరిపించగా.. నమన్ ఓజా చెలరేగాడు. 10 పరుగుల దూరంలో సెంచరీ దూరమైనప్పటికి నమన్ ఓజా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 19.2 ఓవర్లలో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య సెమీఫైనల్-2 మ్యాచ్ విజేతతో ఇండియా లెజెండ్స్ ఫైనల్ ఆడనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న(శనివారం) జరగనుంది. Naman Ojha and Irfan Pathan guided India Legends towards a comfortable win against Australia Legends 🇮🇳🙌🏻#rsws #indialegends pic.twitter.com/qXrgq5MFH6 — Sportskeeda (@Sportskeeda) September 29, 2022 చదవండి: సెంచరీతో చెలరేగిన విండీస్ హిట్టర్.. ఫైనల్లో జమైకా తలైవాస్ సురేష్ రైనా స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే! -
సురేష్ రైనా స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే!
టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ప్రపంచ ఉత్తమ ఫీల్డర్లలో ఒకడు. అతడు క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ.. తన ఫీల్డింగ్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదు. తాజాగా సంచలన క్యాచ్‌తో రైనా మరోసారి మెరిశాడు. రైనా ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ లీగ్ సెమీఫైనల్-1లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో రైనా ఓ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అభిమాన్యు మిథున్ బౌలింగ్‌లో.. బెన్ డంక్ పాయింట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న రైనా.. డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. రైనా స్టన్నింగ్ క్యాచ్‌తో బ్యాటర్‌తో పాటు భారత ఫీల్డర్లందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సురేష్ రైనా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అదే విధంగా ఇటీవల అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రైనా వీడ్కోలు పలికాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన కెప్టెన్ సచిన్.. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వనించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అయితే వర్షం ఎప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను గురువారానికి వాయిదా వేశారు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. What a dive. What a catch 😱✨@ImRaina you beauty ♥️ Dekhte rahiye @India__Legends vs @aussie_legends in the #RoadSafetyWorldSeries now, only on @Colors_Cineplex, @justvoot, Colors Cineplex Superhits and @Sports18. pic.twitter.com/gXMHxd1KTy — Colors Cineplex (@Colors_Cineplex) September 28, 2022 చదవండి: Abu Dhabi T10 League: రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ10 లీగ్‌లో ఆడనున్న మిస్టర్ ఐపీఎల్! -
మరీ ఇంత బద్దకమా.. ఒక్క దానితో పోయేది!
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా మంగళవారం శ్రీలంక లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లంక లెజెండ్స్ 70 పరుగులతో విజయం సాధించింది. తిలకరత్నే దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు.ఈ విషయం పక్కనబెడితే.. బంగ్లాదేశ్ ఫీల్డర్ బద్దకానికి ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బంతి దొరికితే త్రో వేయాల్సింది పోయి అలాగే నిల్చుండిపోవడం జట్టుకు నష్టం చేకూర్చింది. ఇదే అదనుగా భావించిన ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు కేవలం ఒక్క పరుగు రావాల్సిన చోట నాలుగు పరుగులు తీయడం ఆసక్తి కలిగించింది. లంక లెజెండ్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ లెజెండ్స్ బౌలర్ వేసిన బంతిని లంక బ్యాటర్ స్వీప్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి గాల్లోకి లేచింది. కీపర్ క్యాచ్ అందుకునే క్రమంలో మిస్ అవడంతో అతని కాలికి బంతి తగిలి ముందుకు వెళ్లింది. ఈలోగా అక్కడికి థర్డ్‌మన్ ఫీల్డర్ వచ్చాడు. బంతిని అందుకున్నప్పటికి త్రో వేయలేదు. అప్పటికే లంక లెజెండ్స్ రెండు పరుగులు పూర్తి చేశారు. త్రో వేయకపోవడంతో మూడో పరుగుకు యత్నించారు. ఫీల్డర్ టెన్షన్లో సరిగ్గా త్రో వేయలేకపోయాడు. అలా బంతి మరోసారి మిస్ అయింది. దీంతో లంక బ్యాటర్లు మరో పరుగు పూర్తి చేశారు. అలా ఒక్క పరుగు పోయి నాలుగు పరుగులు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటికే రోడ్‌సేప్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్‌లు సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. మొదటి సెమీఫైనల్(సెప్టెంబర్ 28న)లో శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ తలపడనుండగా.. రెండో సెమీస్‌లో వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్(సెప్టెంబర్ 29న) పోటీపడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న(శనివారం) జరగనుంది. Oh they ran four 😃 TM Dilshan & Mahela Udawatte during the legends game vs Bangladesh pic.twitter.com/GQbcOilJ1n — Nibraz Ramzan (@nibraz88cricket) September 28, 2022 చదవండి: సునీల్ ఛెత్రికి ఫిఫా అరుదైన గౌరవం దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. శ్రీలంక లెజెండ్స్ విజయం -
దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. శ్రీలంక లెజెండ్స్ విజయం
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. తుషార్ ఇమ్రాన్ 52 పరుగులు చేయగా.. అబుల్ హసన్ 29 పరుగులు చేశాడు. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా లెజెండ్స్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. లంక లెజెండ్స్ బౌలర్లలో తిలకరత్నే దిల్షాన్ మూడు వికెట్లు తీయగా.. అసేలా గుణరత్నే 2, సనత్ జయసూర్య, దమ్మిక ప్రసాద్‌లు చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంక లెజెండ్స్‌కు ఓపెనర్లు ఉదావట్టే 43, సనత్ జయసూర్య 37 పరుగులతో శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ 51 పరుగులతో రాణించగా.. చమర సిల్వా 34 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. బంగ్లా లెజెండ్స్ బౌలర్లలో హొస్సేన్, షరీఫ్, కబీర్, రజాక్, ఎలిస్ సన్నీ తలా ఒక వికెట్ తీశారు. బ్యాటింగ్‌లో అర్థసెంచరీ, బౌలింగ్‌లో మూడు వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన కెప్టెన్ దిల్షాన్‌ను ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు వరించింది. కాగా ఇప్పటికే శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్‌లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. మొదటి సెమీఫైనల్(సెప్టెంబర్ 28న)లో శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ తలపడనుండగా.. రెండో సెమీస్‌లో వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్(సెప్టెంబర్ 29న) పోటీపడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న(శనివారం) జరగనుంది. చదవండి: 178 పరుగులకే ఆలౌట్.. సిరీస్ క్లీన్‌స్వీప్; సంజూ కెప్టెన్సీ అదరహో -
ఆ ఒక్క సిక్స్‌తో '1998 షార్జా'ను గుర్తుచేశాడు
టీమిండియా దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సచిన్ బ్యాటింగ్ జోరును ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 ఏళ్ల వయసులో భారీ షాట్లతో విరుచుకుపడి అభిమానులకు వింటేజ్ సచిన్‌ను గుర్తుచేశాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తాజాగా ఈ మ్యాచ్‌లో సచిన్ కొట్టిన మూడు సిక్సర్లు వేటికవే స్పెషల్ అని చెప్పొచ్చు. అయితే క్రిస్ ట్రెమ్లెట్ బౌలింగ్‌లో అతను కొట్టిన ఒక సిక్స్ మాత్రం 1998 షార్జాను గుర్తుచేసింది. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌ను అభిమానులు ముద్దగా ''Desert Strome'' అని పిలుచుకున్నారు. ఆ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సచిన్ కళ్లు చెదిరే సిక్సర్లతో మెరిశాడు. అందులో ఫ్రంట్‌పుట్ వచ్చి స్ట్రెయిట్ సిక్సర్ బాదడం అప్పట్లో ఒక ట్రేడ్‌మార్క్‌గా నిలిచిపోయింది. ఇలాంటి షాట్లు సచిన్ కొడుతుంటే అభిమానులు ఉర్రూతలూగిపోయేవాళ్లు. ట్రెమ్లెట్ బౌలింగ్‌లో 6,6,4 బాదిన సచిన్.. ఆ ఓవర్లో మొత్తంగా 16 పరుగులు పిండుకున్నాడు. ఇక సచిన్ షార్జా 1998 గుర్తుచేస్తూ.. ఫ్రంట్‌ఫుట్ వచ్చి స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు. దీంతో అభిమానులు 1998 షార్జా, ప్రస్తుతం సచిన్ కొట్టిన సిక్సర్లను ఒకే ఫ్రేమ్‌లో జోడించి ట్వీట్స్ చేశారు. ''సచిన్ సిక్సర్లు చూస్తుంటే మనం 1998లో ఉన్నామా''.. ''వింటేజ్ సచిన్‌ను తలపిస్తున్నాడు'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 40 పరుగులతో విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 15 ఓవర్లకు కుదించారు. సచిన్ మెరుపులకు యువరాజ్ విధ్వంసం తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెజెండ్స్ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. 𝗦𝗵𝗮𝗿𝗷𝗮𝗵 𝟮.𝟬 😍🙌🔟🏏 whattttt a playerrr 💙@sachin_rt turning back the clock 🕰️🔄#RoadSafetyWorldSeries #sachintendulkar #sharjah #GOAT #God pic.twitter.com/DflUaugI4N — Ashish Verma (@ashu112) September 22, 2022 Vintage Sachin Tendulkar pic.twitter.com/qvogWLkVqC — Sachin Tendulkar🇮🇳FC (@CrickeTendulkar) September 22, 2022 చదవండి: ఒకే ఫ్రేమ్‌లో ఆ 'నలుగురు'.. షేక్ అవుతున్న ఇంటర్నెట్ సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 40 పరుగులతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 15 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (20 బంతుల్లో 40 పరుగులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో యువరాజ్ సింగ్(15 బంతుల్లో 31 పరుగులు నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ 11 బంతుల్లో 27 పరుగులతో అలరించారు. ఇంగ్లండ్ లెజెండ్స్ బౌలింగ్‌లో ఎస్ పారీ మూడు వికెట్లు తీయగా.. స్కోఫీల్డ్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ లెజెండ్స్ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్ కీపర్ ఫిల్ మస్టర్డ్ 29 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. క్రిస్ ట్రెమ్లెట్ 24 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఇండియా లెజెండ్స్ బౌలర్లలో రాజేశ్ పవార్ 3, స్టువర్ట్ బిన్నీ, ప్రగ్యాన్ ఓజా, మన్‌ప్రీత్ గోనీ తలా ఒక వికెట్ తీశారు. 40 పరుగులతో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన సచిన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. చదవండి: గోల్డ్ మెడల్‌తో సర్ప్రైజ్ చేసిన హాలీవుడ్ హీరో 'బ్యాట్‌తోనే సమాధామిచ్చాడు.. పిచ్చి రాతలు మానుకోండి' -
హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన శ్రీలంక.. సఫారీలకు మరో షాక్
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2022లో భాగంగా సౌతాఫ్రికా లెజెండ్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 18) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక దిగ్గజాల టీమ్ ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా శ్రీలంక 11 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్రస్తుత ఎడిషన్‌లో హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో జీవన్ మెండిస్ (27 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఉపుల్ తరంగ (27 బంతుల్లో 36; 7 ఫోర్లు), మునవీరా (24 బంతుల్లో 26; 4 ఫోర్లు), గుణరత్నే (17 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించగా.. సఫారీ బౌలర్లు క్రుగెర్ 2, ఫిలాండర్, బోథా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. మోర్నీ వాన్ విక్ (56 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినప్పటికీ విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సఫారీ జట్టులో విక్ మినహా మరే ఇతర ఆటగాడు రాణించలేకపోయాడు. లంక బౌలర్లలో కులశేఖర 2, దిల్షాన్, ఉడాన, జీవన్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో శ్రీలంక తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి (3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) చేరుకోగా.. 4 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు, ఓ విజయం సాధించిన సౌతాఫ్రికా (ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది) నాలుగో స్థానానికి పడిపోయింది. 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇండియా లెజెండ్స్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం) మూడో ప్లేస్‌లో నిలిచింది. ఆతర్వాత న్యూజిలాండ్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం, ఓ ఓటమి), ఇంగ్లండ్ (3 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), బంగ్లాదేశ్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), ఆస్ట్రేలియా (ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓటమి) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్నాయి. -
రాణించిన రాస్ టేలర్.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ లెజెండ్స్ సూపర్ విక్టరీ సాధించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా దిగ్గజాలు 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేశారు. వికెట్‌కీపర్ దిమాన్ ఘోష్ (32 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), అలోక్ కపాలీ (21 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. ఓపెనర్లు నజీముద్దీన్ (0), మెహ్రబ్ హొసేన్ (1) దారుణంగా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో కైల్ మిల్స్ 2 వికెట్లు పడగొట్టగా.. బెన్నెట్‌కు ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనతంరం 99 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ దిగ్గజ టీమ్.. 9.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ జేమీ హౌ (17 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. డీన్ బ్రౌన్లీ (19 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ రాస్ టేలర్ (17 బంతుల్లో 30 నాటౌట్; 3 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. బంగ్లా బౌలర్లలో అబ్దుర్ రజాక్, అలోక్ కపాలీకి తలో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం) ఎగబాకగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా.. ఇండియా లెజెండ్స్, విండీస్ లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్, న్యూజిలాండ్ లెజెండ్స్, ఇంగ్లండ్ లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్ వరుసగా రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇవాళ ఇదే వేదికగా మరో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో విండీస్ లెజెండ్స్‌ను ఇంగ్లండ్ దిగ్గజ టీమ్ ఢీకొట్టాల్సి ఉంది. -
ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్ రద్దు
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండో ఎడిషన్ (2022)లో భాగంగా ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య జట్ల మధ్య కాన్పూర్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 14) జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ రద్దైంది. భారీ వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన భారత్.. తాజాగా లభించిన ఒక్క పాయింట్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన శ్రీలంక (4 పాయింట్లు) టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా.. వెస్టిండీస్ (3), సౌతాఫ్రికా (2), ఇంగ్లండ్ (0), బంగ్లాదేశ్ (0), ఆస్ట్రేలియా (0), న్యూజిలాండ్ (0) జట్లు వరుసగా మూడు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. సౌతాఫ్రికాను 61 పరుగుల భారీ తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ (42 బంతుల్లో 82 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా లెజెండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. టోర్నీలో భాగంగా రేపు (సెప్టెంబర్ 15) జరుగబోయే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ లెజెండ్స్ జట్టు.. న్యూజిలాండ్ లెజెండ్స్‌ను ఢీకొట్టనుంది. -
53 ఏళ్ల వయసులో అదరగొట్టాడు.. లంక లెజెండ్స్ ఘన విజయం
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్ లెజెండ్స్‌పై శ్రీలంక లెజెండ్స్ ఘన విజయం సాధించింది. 53 ఏళ్ల వయసులోనూ సనత్ జయసూర్య(4-2-3-4) తన స్పిన్ మాయజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. 4 ఓవర్లు వేసిన జయసూర్య రెండు మెయిడెన్లు సహా కేవలం మూడు పరుగుల్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.అతని స్పిన్ ధాటికి ఇంగ్లండ్ లెజెండ్స్ 19 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ లెజెండ్స్ బ్యాటర్స్‌లో ఇయాన్ బెల్ 15 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మస్టర్డ్ 14 పరుగులు చేశాడు. లంక బౌలింగ్‌లో సనత్ జయసూర్య 4 వికెట్లతో చెలరేగగా.. చమర డిసిల్వా, కులశేఖర చెరో రెండు వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా, జీవన్ మెండిస్ తలా ఒక వికెట్ తీశారు. కాగా లంక జట్టులో ఏడుగురు బౌలింగ్ చేయడం విశేషం. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి లంక లెజెండ్స్ 14.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దిల్షాన్ మునవీరా 24, ఉపుల్ తరంగ 23, తిలకరత్నే దిల్షాన్ 15 పరుగులు చేశారు. చివర్లో జీవన్ మెండిస్ 8 పరుగులు నాటౌట్ చేసి జట్టును గెలిపించాడు. కాగా స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు తీసిన జయసూర్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. Sri Lanka Legends continue their good run as they defeat the England Legends by 7 wickets! The bowling attack led by Sanath Jayasuriya was too good for the England Legends as they were bundled out for a paltry 78.#ENGLvsSLL #RoadSafetyWorldSeries #RSWS #YehJungHaiLegendary pic.twitter.com/hmOaFLvfma — Road Safety World Series (@RSWorldSeries) September 13, 2022 -
'మ్యాచ్‌లో సిక్సర్లు లేవు.. పార్టీలో మాత్రం ఇరగదీశాడు'
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ కోసం టీమిండియా దిగ్గజాలంతా ఒకే చోట చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరల్డ్ సిరీస్‌లో మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా ఉన్న ఈ క్రికెటర్లంతా మరోసారి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంపై అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ , ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా సహా మరికొంత మంది రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడుతున్నారు. కాగా సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా లెజెండ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పార్టీ మూడ్ లోకి వచ్చిన డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. మ్యాచ్‌లో సిక్సర్లు కొట్టడంలో విఫలమైన యువరాజ్ పార్టీలో మాత్రం తనదైన డ్యాన్స్‌తో హైలైట్‌గా మారాడు. పాత పాటలు వింటూ పలు డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించాడు. కాగా యువీ డ్యాన్స్‌పై ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ''యువరాజ్ సింగ్‌లో మాకు అత్యంత ఖరీదైన చీర్లీడర్ కనిపిస్తున్నాడు. నిజంగా ఇది అద్భుతమైన రాత్రి. సూపర్‌గా ఎంజాయ్ చేశాం. చాలాకాలం తర్వాత ఒక సిరీస్ కోసం మేమంతా కలవడం సంతోషంగా అనిపిస్తోంది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయ భేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. Having fun with two legendary singers 🎤 @IrfanPathan @ImRaina 🎶 and of course the legend of legends @sachin_rt 👑 @munafpa99881129 @ManpreetGony @pragyanojha #roadsafetyworldseries #indialegends pic.twitter.com/wjP31UcYVZ — Yuvraj Singh (@YUVSTRONG12) September 12, 2022 చదవండి: Mohammed Siraj: తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. వీడియో వైరల్ -
98 పరుగులకే ఆలౌట్.. విండీస్ లెజెండ్స్ ఘన విజయం
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా ఆదివారం వెస్టిండీస్ లెజెండ్స్, బంగ్లాదేశ్ లెజెండ్స్ మధ్య కాన్పూర్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విండీస్ లెజెండ్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్ 19.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో గోష్ 22 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అలోక్ కపాలి 19, అహ్మద్ 13 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో సంతోకి 3, బెన్, మహ్మద్ చెరో రెండు వికెట్లు తీయగా.. మారన్ బ్లాక్, బిషూ చెరొక వికెట్ తీశారు. అనంతరం 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ లెజెండ్స్ 15.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ 42 బంతుల్లో 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో కిర్క్ ఎడ్వర్డ్స్ 22, విలియమ్ పెర్కిన్స్ 9 పరుగులు చేసి జట్టును గెలిపించారు. బంగ్లా బౌలర్లలో అబ్దుర్ రజాక్, డోలార్ మహ్ముద్, అలోక్ కపాలి తలా ఒక వికెట్ తీశారు. -
సచిన్ అరుదైన లాఫ్టెడ్ షాట్.. వీడియో వైరల్!
టీమిండియా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాన్నాళ్ల తర్వాత తిరిగి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌కు సచిన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సచిన్ కేవలం16 పరుగులే చేసినప్పటికి.. తన ట్రేడ్ మార్క్ షాట్లతో మాత్రం అభిమానులను అలరించాడు. మఖాయ ఎంటిని బౌలింగ్‌లో లాఫ్టెడ్తో షాట్‌తో మరోసారి తన క్లాస్‌ను లిటిల్ మాస్టర్ చూపించాడు. సచిన్ ఆ షాట్ కొట్టిన వెంటనే ఒక్క సారిగా స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..సౌతాఫ్రికా లెజెండ్స్‌పై 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టువర్ట్ బిన్నీ 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. Sachin Tendulkar in action#sachin #SachinTendulkar #LegendsLeagueCricket #IndiaLegends #RoadSafetyWorldSeries2022 @mohsinaliisb pic.twitter.com/CimxmF7Rr9 — abhijeet Gautam (@gautamabhijeet1) September 10, 2022 చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
స్టువర్ట్ బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను ఇండియా లెజెండ్స్ విజయంతో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయ భేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు సురేశ్‌రైనా(33), యుసఫ్ పఠాన్(35) పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 పరుగులు మాత్రమే చేశాడు. సౌతాఫ్రికా లెజెండ్స్ బౌలర్లలో వాండర్వాత్ 2, ఎడ్డీ లీ, ఎన్తిని చెరొక వికెట్ తీశారు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో జాంటీ రోడ్స్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో రాహుల్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ఇండియా లెజెండ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో వెస్టిండీస్ లెజెండ్స్‌తో సెప్టెంబర్ 14న తలపడనుంది. చదవండి: Naseem Shah-Uravashi Rautela: 'ఊర్వశి రౌతేలా ఎవరో కూడా తెలియదు'.. కుండబద్దలు కొట్టిన పాక్ పేసర్ -
స్టువర్ట్ బిన్నీ విధ్వంసం.. ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేసింది. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ (42 బంతుల్లో 82 పరుగులు నాటౌట్, 5 ఫోర్లు, ఆరు సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. బిన్నీ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడూ సురేశ్ రైనా(33 పరుగులు), ఆఖర్లో యూసఫ్ పఠాన్(15 బంతుల్లో 35 నాటౌట్, ఒక ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. రైనాతో కలిసి మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించిన బిన్నీ.. ఆఖర్లో యూసఫ్ పఠాన్‌తో కలిసి 88 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. దీంతో ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అంతకముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 పరుగులు.. నమన్ ఓజా 21 పరుగులు చేసి ఔటయ్యారు. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మాత్రం ఆరు పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచాడు. సౌతాఫ్రికా లెజెండ్స్ బౌలర్లలో వాండర్వాత్ 2, ఎడ్డీ లీ, ఎన్తిని చెరొక వికెట్ తీశారు. చదవండి: Suresh Raina: సురేశ్ రైనా తిరిగి వస్తున్నాడు.. Sourav Ganguly: విరాట్ కోహ్లి నన్ను మించిన తోపు..! -
సురేశ్ రైనా తిరిగి వస్తున్నాడు..
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. పరిచయం అక్కర్లేని పేరు. ధోని హయాంలో టీమిండియాలో రైనా ఒక వెలుగు వెలిగాడు. కొన్నాళ్ల పాటు తనదైన ఆటతో ప్రత్యేక ముద్ర వేసిన రైనా.. ధోని రిటైర్మెంట్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోజునే(ఆగస్టు 15, 2020).. రైనా కూడా వీడ్కోలు పలకడం విశేషం. ధోనితో ప్రత్యేక అనుబంధం ఉన్న రైనా ఇటీవలే(సెప్టెంబర్ 6న) అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. అయితే రైనా మళ్లీ తిరిగి వస్తున్నాడు. రోడ్ సేఫ్టీ లీగ్ వరల్డ్ సిరీస్‌లో ఆడేందుకు రైనా సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ జట్టుతో జాయిన్ అయ్యాడు. శనివారం(సెప్టెంబర్ 10న) కాన్పూర్ వేదికగా ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు రైనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోనూ షేర్ చేశాడు. ఆ వీడియోలో రైనా తన జెర్సీ నెంబర్ అయిన '48' ధరించి నడుచుకుంటూ వెళ్తుంటాడు. ''రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌కు అంతా సిద్ధం.. టీమిండియా లెజెండ్స్ తరపున ఆడేందుకు తిరిగి వస్తున్నా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. రైనా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగానే.. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఫన్నీగా స్పందించాడు. ''వస్తే వస్తున్నావు కానీ మమ్మల్ని మాత్రం ఈజీగా తీసుకో ప్లీజ్'' అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ జత చేశాడు. View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3) చదవండి: Road Safety World Series 2022: ఇండియా లెజెండ్స్‌తో సౌతాఫ్రికా దిగ్గజాల 'ఢీ' -
ఇండియా లెజెండ్స్‌తో సౌతాఫ్రికా దిగ్గజాల 'ఢీ'
బీసీసీఐ సహకారంతో భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్-2 ఇవాల్టి (సెప్టెంబర్ 10) నుంచి ప్రారంభంకానుంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీ నేటి నుంచి ఆక్టోబర్ 1 వరకు కాన్పూర్, రాయ్‌పూర్, ఇండోర్, డెహ్రడూన్ వేదికలుగా జరుగనుంది. ఈ సీజన్ ఆరంభం మ్యాచ్‌లో ఇవాళ ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ తలపడనున్నాయి. కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా లెజెండ్స్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సారధ్యంలో మరోసారి బరిలోకి దిగనుండగా.. సౌతాఫ్రికా లెజెండ్స్ దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ నేతృత్వంలో పోటీపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను కలర్స్ సినీప్లెక్స్, కలర్స్ సినీప్లెక్స్ హెచ్డీ, కలర్స్ సినీప్లెక్స్ సూపర్ హిట్స్, స్పోర్ట్స్18 ఖేల్ ఛానల్లు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ఈ సిరీస్‌లో జరిగే 23 మ్యాచ్‌లు పై పేర్కొన్న ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. వీటితో ఈ సిరీస్‌లోని మొత్తం మ్యాచ్‌లను వూట్ యాప్, వెబ్సైట్లో కూడా చూడవచ్చు. దిగ్గజాల పోరును ఫ్రీగా చూడాలంటే జియో టీవీ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ సిరీస్‌లో ఇండియా, సౌతాఫ్రికా లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ దిగ్గజ జట్లు పాల్గొంటున్నాయి. రోడ్ సేఫ్టీపై విశ్వవ్యాప్తంగా అవగాహణ పెంచేందుకు ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ తొలి ఎడిషన్‌లో సచిన్ కెప్టెన్సీలో ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. జట్ల వివరాలు.. ఇండియా లెజెండ్స్: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), నమన్ ఓజా (వికెట్‌కీపర్), యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, మన్‌ప్రీత్ గోని, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, ప్రగ్యాన్ ఓజా, బాలసుబ్రమన్యమ్, రాహుల్ శర్మ, రాజేశ్ పవార్ సౌతాఫ్రికా లెజెండ్స్: జాంటీ రోడ్స్ (కెప్టెన్), మోర్నీ వాన్ విక్ (వికెట్‌కీపర్), అల్విరో పీటర్సన్, జాక్ రుడాల్ఫ్, హెన్రీ డేవిడ్స్, వెర్నాన్ ఫిలాండర్, జోహాన్ బోథా, లాన్స్ క్లూసనర్, జాండర్ డి బ్రూన్, మఖాయ ఎన్తిని, గార్నెట్ క్రుగర్, ఆండ్రూ పుట్టిక్, జోహాన్ వాండర్ వాత్, థండి షబలాల, ఎడ్డీ లీ, ల్యాడ్ నోరిస్ జోన్స్ చదవండి: సెంచరీ చేయకుండా మూడేళ్లు కొనసాగడం కోహ్లికే సాధ్యమైంది..!