![India Legends thrash South Africa Legends by 61 runs in Kanpur - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/11/india-legends.jpg.webp?itok=M90m3aYo)
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను ఇండియా లెజెండ్స్ విజయంతో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయ భేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విధ్వంసం సృష్టించాడు.
కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు సురేశ్‌రైనా(33), యుసఫ్ పఠాన్(35) పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 పరుగులు మాత్రమే చేశాడు.
సౌతాఫ్రికా లెజెండ్స్ బౌలర్లలో వాండర్‌వాత్ 2, ఎడ్డీ లీ, ఎన్తిని చెరొక వికెట్ తీశారు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో జాంటీ రోడ్స్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో రాహుల్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ఇండియా లెజెండ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో వెస్టిండీస్ లెజెండ్స్‌తో సెప్టెంబర్ 14న తలపడనుంది.
చదవండి: Naseem Shah-Uravashi Rautela: 'ఊర్వశి రౌతేలా ఎవరో కూడా తెలియదు'.. కుండబద్దలు కొట్టిన పాక్ పేసర్
Comments
Please login to add a commentAdd a comment