కొత్త ఏడాదిని టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో ఆరంభించాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో విరాట్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 113 పరుగులు చేశాడు. కాగా విరాట్‌కు ఇది 45వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేశాడు.
వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ మార్కును అందుకునేందుకు 257 మ్యాచ్‌లు అవసరం కాగా.. సచిన్‌కు 310 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. అదే విధంగా స్వదేశంలో అత్యధిక సెంచరీల చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లి(20) సమం చేశాడు. దీంతో విరాట్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిస్తోంది.
ఈ క్రమంలో కోహ్లిపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లిని పోల్చడం సరికాదు అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
సచిన్ కాలంలో ఫీల్డ్ ఆంక్షలు బ్యాటర్‌లకు అంత అనుకూలంగా లేనందున పరుగులు చేయడం కష్టమని గంభీర్ తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ మాట్లాడుతూ.. "కోహ్లిని సచిన్‌తో పోల్చడం సరికాదు. సచిన్ క్రికెట్ ఆడే కాలంలో ఫీల్డ్ ఆంక్షలు చాలా కఠినంగా ఉండేవి. ఫీల్డ్‌లో 30 యార్డ్ సర్కిల్ వెలుపల 5 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లు ఉండేవారు. కాబట్టి బౌండరీలు కొట్టడం చాలా కష్టంగా ఉండేది" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: IND VS SL 1st ODI: రోహిత్.. లంకపై చేసిన హాఫ్ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా..?
Comments
Please login to add a commentAdd a comment