sachin tenudulkar
-
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడు: సునీల్ గవాస్కర్
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దుమ్మురేపుతున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో మరో అద్భుతమైన శతకంతో విరాట్ చెలరేగాడు. అతడి గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉండడం గమానార్హం. కాగా కింగ్ కోహ్లికి ఇది 46వ వన్డే సెంచరీ. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(49) అత్యధిక వన్డే సెంచరీల రికార్డుకు విరాట్ మరింత చేరువయ్యాడు. మరో నాలుగు సెంచరీలు ఈ రన్‌మిషన్ సాధిస్తే ప్రపంచ వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి ఎప్పుడు బ్రేక్ చేస్తాడనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌కు ముందు సచిన్ వన్డే సెంచరీల రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేస్తాడని గవాస్కర్ జోస్యం చెప్పాడు. అదే విధంగా విరాట్ మరో 5-6 ఏళ్లు ఆడితే సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దల కొట్టగలడని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌కు ముందు భారత జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు ఆడనుంది. ప్రస్తుతం సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి కావల్సిన సెంచరీలు కేవలం మూడు మాత్రమే. కాబట్టి ఐపీఎల్‌కు ముందు సచిన్ వన్డే సెంచరీల రికార్డును కోహ్లి బద్దలు కొడతాడని నేను భావిస్తున్నాను. కోహ్లి విశ్రాంతి తీసుకుని వచ్చినప్పటి నుంచి అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో సచిన్ పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేస్తడనడంలో ఎటువంటి సందేహం లేదని" గవాస్కర్ పేర్కొన్నాడు. అదేవిధంగా సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డు గురించి సన్నీ మాట్లాడుతూ.. ఒక వేళ కోహ్లి మరో 5-6 ఏళ్ల పాటు క్రికెట్ ఆడితే కచ్చితంగా సచిన 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు సగటున సంవత్సరానికి సెంచరీలు చేసినా సచిన్‌ను ఈజీగా అధిగమిస్తాడు. అతడు తన వయస్సు 40 ఏళ్ల వచ్చే వరకు ఆడితే వచ్చే 5-6 సంవత్సరాలలో మరో 26 సెంచరీలు సాధించగలడు. సచిన్ కూడా 40 ఏళ్ల వరకు క్రికెట్ ఆడాడు. కోహ్లికి కూడా అద్భుతమైన ఫిట్నెస్ ఉంది. కాబట్టి విరాట్ సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది అని అతడు అన్నాడు. చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే! -
సచిన్‌తో కోహ్లిని పోల్చడం సరికాదు.. గౌతం గంభీర్ సంచలన వాఖ్యలు
కొత్త ఏడాదిని టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో ఆరంభించాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో విరాట్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 113 పరుగులు చేశాడు. కాగా విరాట్‌కు ఇది 45వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ మార్కును అందుకునేందుకు 257 మ్యాచ్‌లు అవసరం కాగా.. సచిన్‌కు 310 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. అదే విధంగా స్వదేశంలో అత్యధిక సెంచరీల చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లి(20) సమం చేశాడు. దీంతో విరాట్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిస్తోంది. ఈ క్రమంలో కోహ్లిపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్‌తో విరాట్ కోహ్లిని పోల్చడం సరికాదు అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. సచిన్ కాలంలో ఫీల్డ్ ఆంక్షలు బ్యాటర్లకు అంత అనుకూలంగా లేనందున పరుగులు చేయడం కష్టమని గంభీర్ తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ మాట్లాడుతూ.. "కోహ్లిని సచిన్‌తో పోల్చడం సరికాదు. సచిన్ క్రికెట్ ఆడే కాలంలో ఫీల్డ్ ఆంక్షలు చాలా కఠినంగా ఉండేవి. ఫీల్డ్‌లో 30 యార్డ్ సర్కిల్ వెలుపల 5 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లు ఉండేవారు. కాబట్టి బౌండరీలు కొట్టడం చాలా కష్టంగా ఉండేది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND VS SL 1st ODI: రోహిత్.. లంకపై చేసిన హాఫ్ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా..? -
శిఖర్ ధావన్ అరుదైన రికార్డు.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ లిస్ట్-ఏ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 12,000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఏడో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనతను ధావన్ సాధించాడు. కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ధావన్ బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు లిస్ట్-ఏ క్రికెట్లో 297 మ్యాచ్‌లు ఆడిన ధావన్ 12,025 పరుగులు చేశాడు. వీటిలో 162 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(21,999) పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక పరుగులు వీరే సచిన్ టెండూల్కర్(551 మ్యాచ్‌లు) - 21,999 పరుగులు సౌరవ్ గంగూలీ(437 మ్యాచ్‌లు) -15, 622 పరుగులు రాహుల్ ద్రవిడ్ (449 మ్యాచ్‌లు)- 15,271 పరుగులు విరాట్ కోహ్లీ(296 మ్యాచ్‌లు)- 13,786 పరుగులు ఎంఎస్ ధోని(423 మ్యాచ్‌లు)- 13,353 పరుగులు యువరాజ్ సింగ్(423 మ్యాచ్‌లు)-12,633 పరుగులు శిఖర్ ధావన్(297 మ్యాచ్‌లు)-12,025 పరుగులు రాణించిన ధావన్, అయ్యర్ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(72), శ్రేయస్ అయ్యర్(80), గిల్(50) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
సచిన్ అరుదైన లాఫ్టెడ్ షాట్.. వీడియో వైరల్!
టీమిండియా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాన్నాళ్ల తర్వాత తిరిగి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌కు సచిన్ సారథ్యం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సచిన్ కేవలం16 పరుగులే చేసినప్పటికి.. తన ట్రేడ్ మార్క్ షాట్లతో మాత్రం అభిమానులను అలరించాడు. మఖాయ ఎంటిని బౌలింగ్‌లో లాఫ్టెడ్తో షాట్‌తో మరోసారి తన క్లాస్‌ను లిటిల్ మాస్టర్ చూపించాడు. సచిన్ ఆ షాట్ కొట్టిన వెంటనే ఒక్క సారిగా స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..సౌతాఫ్రికా లెజెండ్స్‌పై 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టువర్ట్ బిన్నీ 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. Sachin Tendulkar in action#sachin #SachinTendulkar #LegendsLeagueCricket #IndiaLegends #RoadSafetyWorldSeries2022 @mohsinaliisb pic.twitter.com/CimxmF7Rr9 — abhijeet Gautam (@gautamabhijeet1) September 10, 2022 చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
స్టువర్ట్ బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ను ఇండియా లెజెండ్స్ విజయంతో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయ భేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు సురేశ్‌రైనా(33), యుసఫ్ పఠాన్(35) పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 పరుగులు మాత్రమే చేశాడు. సౌతాఫ్రికా లెజెండ్స్ బౌలర్లలో వాండర్వాత్ 2, ఎడ్డీ లీ, ఎన్తిని చెరొక వికెట్ తీశారు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో జాంటీ రోడ్స్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో రాహుల్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ఇండియా లెజెండ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో వెస్టిండీస్ లెజెండ్స్‌తో సెప్టెంబర్ 14న తలపడనుంది. చదవండి: Naseem Shah-Uravashi Rautela: 'ఊర్వశి రౌతేలా ఎవరో కూడా తెలియదు'.. కుండబద్దలు కొట్టిన పాక్ పేసర్ -
ఆసియా కప్ లో తిరుగులేని రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడా?
యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి జరగనున్న ఆసియకప్కు టీమిండియా సిద్దమవుతోంది. భారత తమ తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో ఆగస్టు 28న దుబాయ్ వేదికగా తలపడనుంది. కాగా ఆసియా కప్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఆసియా కప్‌లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డుపై రోహిత్ కన్నేశాడు. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో 971 పరుగులతో సచిన తొలి స్థానంలో ఉన్నాడు. ఇక 883 పరుగులతో రెండో స్థానంలో రోహిత్.. మరో 89 పరుగులు సాధిస్తే సచిన్ అధిగిమించి అగ్రస్థానానికి చేరుకుంటాడు. అదే విధంగా రోహిత్ మరో 117 పరుగులు చేయగల్గితే ఆసియాకప్‌లో 1000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు. ఇక ఓవరాల్‌గా ఆసియాకప్‌లో 1000 పరుగుల సాధించిన లిస్ట్‌లో రోహిత్ మూడో స్థానంలో నిలువనున్నాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 1220 పరుగులతో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య టాప్‌లో ఉండగా.. 1075 పరుగులతో మరో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార్ సంగక్కర కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్‌గా ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన సనత్ జైసూర్య రికార్డును రోహిత్ బ్రేక్ చేయాలంటే 338 పరుగులు సాధించాలి. కాగా ఈ మెగా టోర్నీలో భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడనుంది కాబట్టి జయసూర్య రికార్డు రోహిత్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు ఆసియా కప్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 883 పరుగు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 7 హాఫ్ సెంచరీలు, సెంచరీ ఉన్నాయి. చదవండి: Martin Guptill- Rohit Sharma: రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన గప్టిల్.. మరోసారి అగ్రస్థానంలోకి! -
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన సొంత జట్టు ముంబైకు గుడ్‌బై చెప్పనున్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్‌కు అంతగా అవకాశాలు లభించడం లేదు. దీంతో వచ్చే దేశేవాళీ సీజన్ నుంచి గోవా తరపున ఆడేందుకు అర్జున్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాగా అర్జున్ ఇప్పటి వరకు ముంబై తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ--2021లో భాగంగా హర్యానా, పుదుచ్చేరి మ్యాచ్‌ల్లో అర్జున్ ముంబై జట్టులో భాగంగా ఉన్నాడు. అదే విధంగా ఐపీఎల్లో గత రెండు సీజన్ల నుంచి ముంబై జట్టులో అర్జున్ సభ్యునిగా ఉన్నప్పటికీ.. ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కలేదు. కాగా ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలో చోటుదక్కక పోవడంతోనే అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై టెండూల్కర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ స్పందిస్తూ.. "అర్జున్ తన కెరీర్ మెరుగుపరుచుకోవాలంటే ఎక్కువ సమయం గ్రౌండ్లో గడపడం చాలా ముఖ్యం. అర్జున్ గోవా జట్టు తరపున ఆడితే అతడికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఈ మార్పు అతడి క్రికెట్ కెరీర్లో కొత్త దశ" అని ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఇదే విషయంపై గోవా క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది. గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరజ్ లోట్లికర్ మాట్లడుతూ.. "మేము ప్రస్తుతం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల కోసం ఎదురు చూస్తున్నాము. అర్జున్ టెండూల్కర్ గోవా జట్టులో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రీ-సీజన్ ట్రయల్-మ్యాచ్‌లు ముందు మేము నిర్వహిస్తాం. అతడి ప్రదర్శన ఆధారంగా సెలెక్టర్లు జట్టుకు ఎంపిక చేస్తారు" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: WI vs NZ: హెట్‌మైర్ అద్భుత విన్యాసం.. క్యాచ్ ఆఫ్‌ది సీజన్! -
Sourav Ganguly: గంగూలీ బర్త్‌డే.. ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్!
టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం 50వ పడిలో అడుగుపెట్టనున్నాడు. అయితే, పుట్టినరోజు వేడుకలు మాత్రం ఒకరోజు ముందుగానే మొదలైపోయాయి. ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, ఒకప్పటి సహచర ఆటగాడు, టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్తో కలిసి గంగూలీ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాజీవ్ శుక్లా ట్విటర్లో షేర్ చేశాడు. ‘‘సౌరవ్ గంగూలీ 50వ పుట్టినరోజు సెలబ్రేట్ చేశాము. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. సంతోషకర జీవితం గడపాలి’’ అని ఆకాంక్షించారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా టీమిండియా ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో గంగూలీ సైతం యూకేలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రీషెడ్యూల్డ్ టెస్టు విషయానికొస్తే.. టీమిండియా ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. గురువారం(జూలై 7) నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. చదవండి: Wasim Jaffer: 'టెస్టుల్లో అతడికి సచిన్ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది' Celebrated the 50th birthday of Sourav Ganguli.wishing him happy & healthy life ahead. @SGanguly99 @sachin_rt @JayShah @BCCI pic.twitter.com/KBXbBajp3s — Rajeev Shukla (@ShuklaRajiv) July 7, 2022 -
ఆస్ట్రేలియన్ క్రికెటర్ అరుదైన ఫీట్.. దిగ్గజ ఆటగాళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్‌స్మిత్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ 59 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా స్మిత్ ఒక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో 150వ ఇన్నింగ్స్ దగ్గర అత్యధిక పరుగులు(7993 పరుగులు) సాధించిన తొలి బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను(7913 పరుగులు) స్మిత్ అధిగమించాడు. కాగా స్మిత్, సంగక్కర తర్వాత వరుసగా టీమిండియా త్రయం సచిన్ టెండూల్కర్(7,869 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్(7,694 పరుగులు), రాహుల్ ద్రవిడ్(7,680 పరుగులు) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. ఉస్మాన్ ఖవాజా 91, అలెక్స్ క్యారీ 67, కామెరాన్ గ్రీన్ 79, స్మి్త్ 59 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా చెరో 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. చదవండి: IPL 2022: అభిమానులకు బీసీసీఐ బ్యాడ్‌న్యూస్.. వరుసగా నాలుగో ఏడాది -
మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడం సంతోషం.. కానీ
క్రికెట్లో ఎంసీసీ(మెరిల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్) సవరించిన కొత్త రూల్స్ సంతోషం కలిగించాయని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ''ఎంసీసీ కమిటీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ బాగున్నాయి.. అందులో కొన్నింటికి నేను మద్దతు ఇస్తున్నా. ముఖ్యంగా మన్కడింగ్ విషయంలో మార్పు తీసుకురావడం అభినందనీయం. క్రీజులో ఉన్న బ్యాటర్‌కు మన్కడింగ్ అనే పదం ఇబ్బందిగా అనిపించేది. తాజాగా మన్కడింగ్ పదాన్ని రనౌట్‌గా మార్చారు. నా దృష్టిలో మన్కడింగ్ అనేది రనౌట్‌గానే పరిగణిస్తారు. ఒక రకంగా ఇది మంచిదే అయినప్పటికి.. అందరికి సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు. ఇక రెండో రూల్ ఒక బ్యాట్స్‌మన్ క్యాచ ఔట్‌గా వెనుదిరిగినప్పుడు.. క్రీజులోకి కొత్త బ్యాటర్ రావాలనే నిర్ణయం కూడా బాగా నచ్చింది. ఎందుకంటే.. ఒక బౌలర్ వికెట్ తీసి సక్సెస్ ట్రాక్‌లో ఉండడం సక్సెస్‌గా కనిపించినప్పుడు.. అతను కొత్త బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడం కూడా ఫెయిర్‌గానే కనిపిస్తుంది. ఈ కొత్త రూల్ బాగుంది.. వెల్డన్'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కానే కాదిపుడు. ఎంసీసీ చేసిన పలు సవరణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమలవుతాయి. ఎంసీసీ సవరణలివి... ►సలైవా (ఉమ్ము), చెమటతో బంతిని రుద్దడం పూర్తిగా నిషిద్ధం. కరోనా వల్ల ఇప్పుడైతే చెమట, ఉమ్ముతో బంతిని షైన్ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇకపైనా కుదరదు. ►క్యాచ్ అవుట్ అయిన బ్యాటర్ సగం పిచ్ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్ చేయాలి. ఓవర్ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్ దాటిన నెపంతో నాన్ స్ట్రయికర్ బ్యాటింగ్ చేయడానికి వీలులేదు. ►ఫీల్డింగ్ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్ భారీషాట్ ఆడినపుడు బ్యాటింగ్ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. -
అత్యంత పాపులర్ ఆటగాడిగా అరుదైన గౌరవం
టీమిండియా మెషిన్గన్గా పేరుపొందిన విరాట్ కోహ్లి అరుదైన గౌరవం పొందాడు. ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్న కోహ్లి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తాజాగా మరోసారి నిరూపితమైంది. 2022 జనవరి నెలకుగాను భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా కోహ్లి అగ్రస్థానంలో నిలిచాడు. ఓర్మాక్స్ మీడియా జనవరి నెలకు గానూ అత్యంత పాపులర్ ఆటగాడు ఎవరనే దానిపై సర్వే నిర్వహించింది. చదవండి: Dhoni-Deepak Chahar: 'రిటైర్మెంట్ రోజు ధోని చెప్పిన మాట నిలబెట్టుకున్నా' ఆ సర్వేలో కోహ్లి తొలి స్థానంలో ఉండగా.. మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని రెండో స్థానం, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉండడం విశేషం. వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్న కోహ్లి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వన్డే విభాగంలో రెండు.. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం.. టి20 ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్నాడు. ఇప్పటితరం ఆటగాళ్లలో అత్యంత టాలెంటెడ్ ప్లేయర్‌గా పేరుపొందిన కోహ్లి అంతేస్థాయిలో ప్రజాభిమానాన్ని చూరగొనడం సర్వేలో వెల్లడైంది. అందుకే కోహ్లి అగ్రస్థానం సంపాదించినట్లు ఓర్మాక్స్ వెల్లడించింది. ఇక మిగతా స్థానాల విషయానికి వస్తే.. నాలుగో స్థానంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిలిచాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికి దశాబ్దం కావొస్తున్న వేళ సచిన్‌ను ఇప్పటికి ఆరాధిస్తుండడం ప్రత్యేకత సంతరించుకుంది. క్రికెట్లో ఎవరు సాధించలేని.. ఇకపై ఎవరు అందుకోలేని ఘనతలు సాధించడమే కారణమని సర్వేలో తేలింది. ఐదు, ఆరు స్థానాల్లో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీలు నిలవడం విశేషం. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధు(బ్యాడ్మింటన్) ఏడో స్థానంలో నిలవగా.. సైనా నెహ్వాల్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిదో స్థానంలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉండగా.. పదో స్థానంలో ఇటీవలే టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సానియా మీర్జా ఉండడం విశేషం. చదవండి: Wriddiman Saha: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ Ormax Sports Stars: Most popular sportspersons in India (Jan 2022) pic.twitter.com/N9hhYdPhIT — Ormax Media (@OrmaxMedia) February 21, 2022 -
టీమిండియా విన్నింగ్ టీమ్ బ్యాట్.. ధర తెలిస్తే షాకే!
Bat Signed by 2011 World Cup winning team fetches 25,000 USD.. క్రికెట్లో టీమిండియాకు '2011' ఒక గోల్డెన్ ఇయర్. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ ధోని నాయకత్వంలోని టీమిండియా ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. 1983 కపిల్ డెవిల్స్ తర్వాత వన్డే వరల్డ్‌కప్‌ను అందుకున్న ఘనత ధోని సేనకే సాధ్యమైంది. ఇక శ్రీలంకతో జరిగిన ఆ ఫైనల్లో ధోని తన స్టైల్లో సిక్స్ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించి కప్‌ను చేతిలో పెట్టాడు. ఇక విజయం సాధించిన అనంతరం టీమిండియా చేసిన రచ్చ అంత తొందరగా మరిచిపోలేం. భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను తమ భుజాలపై మోస్తూ అతనికి ధోని సేన కప్‌ను గిఫ్ట్‌గా అందివ్వడం ఒక చరిత్ర. ఆరోజు ధోని ట్రోఫీ అందుకున్న తర్వాత.. టీమిండియా ఆటగాళ్లంతా ఒక బ్యాట్‌పై తమ సంతకాలను చేశారు. దానికి 2011 వరల్డ్‌కప్ విన్నింగ్ ఇండియన్ క్రికెట్ టీమ్ బ్యాట్ అని పేరు పెట్టారు. తాజాగా ఆ బ్యాట్‌కు నాన్ ఫంజిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ) రూపంలో భారీ ధర దక్కింది. చదవండి: 'సంవత్సరాలు మారుతున్నాయి.. కానీ సేమ్ ఫీలింగ్' ఇక క్రిక్ఫ్లిక్స్, రెవ్‌స్పోర్ట్స్, ఫనాటిక్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కలిసి సంయుక్తంగా ఎన్ఎఫ్టీ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. మొత్తంగా డిజిటల్ ఆర్టిక్రాప్ట్కు (335,950 అమెరికన్ డాలర్లు) ఎన్ఎఫ్టీ టోకెన్ రూపంలో బిడ్ వేశారు. ఇందులో టీమిండియా విన్నింగ్ టీమ్ బ్యాట్ ..వేలంలో 25వేల అమెరికన్ డాలర్లు పలికింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.18 లక్షలకు పైనే ఉంటుంది. అయితే ఇంతకముందు 2016లో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ సంతకం చేసిన ఎస్ఆర్హెచ్ జెర్సీకి ఎన్ఎఫ్టీ రూపంలో 30వేల అమెరికన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ.22 లక్షలుపైన) పలకింది. దుబాయ్ వేదికగా ఈ ఎన్ఎఫ్టీ వేలం నిర్వహించారు. ఇక సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్ క్రికెట్ కలెక్షన్ పేరుతో డిజిటర్ రైట్స్ రూపంలో వేలం నిర్వహించారు. ఈ ఎన్ఎఫ్టీ టోకెన్‌ను టెండూల్కర్ వీరాభిమాని.. ముంబైకి చెందిన అమల్ ఖాన్ 40వేల అమెరికన్ డాలర్లకు(ఇండియన్ కరెన్సీలో రూ .30,01,410) దక్కించుకోవడం విశేషం. చదవండి: Dinesh Karthik: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్ కార్తీక్...! ఎన్ఎఫ్టీ అంటే..! బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్ మార్కెట్లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్ కాయిన్, డిగో కాయిన్, ఈథర్నెట్ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. చదవండి: NFT: ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే.. -
బిగ్ హింట్ ఇచ్చిన దాదా... త్వరలోనే సచిన్ ‘రీ ఎంట్రీ’ ఖాయం.. అయితే..
Sourav Ganguly: టీమిండియా మాజీ సారథులు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ జట్టు కోసం కలిసి ఆడటం చూశాం. మరి.. భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లే క్రమంలో ఈ దిగ్గజ త్రయం ముగ్గురూ కలిసి ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే ఎంత బావుంటుందో కదా! టీమిండియా సగటు కలగనే ఆ రోజు తొందర్లోనే వస్తుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి బాస్ గంగూలీ హింట్ ఇచ్చాడు. ఇప్పటికే ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించడంలో కీలక పాత్ర పోషించిన దాదా.. సచిన్‌ను కూడా బీసీసీఐలో భాగం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు... ‘‘సచిన్ నిజంగా చాలా భిన్నమైన వ్యక్తి. తనకు ఇలాంటి అంశాల్లో భాగం కావడంపై పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే, భారత క్రికెట్లో సచిన్ జోక్యం అనేది నిజంగా చాలా పెద్ద వార్తే అవుతుంది కదా! ఈ విషయమై పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. ప్రతిభను సరిగా వినియోగించుకుంటే అద్భుతాలు చూడవచ్చు కదా’’ అని గంగూలీ పేర్కొన్నాడు. అయితే, ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని అధిగమించి.. ఏదో ఒకరోజు సచిన్‌ను భారత క్రికెట్లో మరోసారి భాగం చేయడం ఖాయమని స్పష్టం చేశాడు. జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక భారత హెడ్‌కోచ్‌గా ఉండేందుకు తొలుత నిరాకరించిన ద్రవిడ్.. గంగూలీ జోక్యంతో ఆ పదవి స్వీకరించిన సంగతి తెలిసిందే. అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా నియమించడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IPL 2022 Auction: అవి 12 వేల కోట్లు.. ఇవి 40 వేల కోట్లు.. మొత్తంగా 50: గంగూలీ -
సచిన్ పాజీతో మళ్లీ బ్యాటింగ్.. సూపర్ ఇన్నింగ్స్!
న్యూఢిల్లీ: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2021లో ఇండియా లెజెండ్స్ జట్టు శుభారంభం చేసింది. బంగ్లాదేశ్ లెజెండ్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక రాయ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ దిగ్గజాలు, సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంకా 59 బంతులు మిగిలి ఉండగానే 110 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. వ్యక్తిగత స్కోర్ల వివరాలు గమనిస్తే.. సెహ్వాగ్ 35 బంతుల్లో 80 పరుగులతో(10 బౌండరీలు, 5 సిక్సర్లు) రాణించగా, సచిన్ 26 బంతుల్లో 33 పరుగులు చేశాడు. దీంతో ఇండియా లెజెండ్స్ 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి బంగ్లా జట్టును మట్టికరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ టీ20 టోర్నీలో జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ లెజెండ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా లెజెండ్స్ బౌలర్ల ధాటికి ఏమాత్రం నిలవలేక 19.4 ఓవరల్లో 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రజ్ఞాన్ ఓజా, యువరాజ్‌సింగ్, వినయ్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా, మన్‌ప్రీత్ గోని, యూసఫ్ పఠాన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా సచిన్ పాజీతో మళ్లీ ఓపెనింగ్ చేయడం ఆనందంగా ఉందంటూ ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను సెహ్వాగ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చదవండి: వీరు విధ్వంసం.. Parampara Pratishtha Anushasan. Was fun to see the ball, hit the ball with @sachin_rt paaji at the other end. #RoadSafetyWorldSeries2021 pic.twitter.com/nBXxLHfPmD — Virender Sehwag (@virendersehwag) March 6, 2021 -
'విచారకరం.. నా ఇన్నింగ్స్ వారికే అంకితం'
ముంబై మారణహోమం(26/11) తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తాను ఆడిన 103 పరుగుల ఇన్నింగ్స్ కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు చెప్పపుకొచ్చాడు. ఆ ఇన్నింగ్స్‌ను ముంబై మారణహోమ బాధితులకు అంకితం చేసినట్లు మ్యాచ్ అనంతరం ప్రకటించడం అప్పటి క్రికెట్ అభిమానుల్లో ఎంతో సంతోషం నింపింది. ఆరోజు సచిన్ చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాయి. సచిన్ వ్యాఖ్యలకు నేటితో(డిసెంబర్ 15) సరిగ్గా 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మరోసారి ఆ వ్యాఖ్యలను గుర్తు చేసుకుందాం. (చదవండి : దుమ్మురేపిన కోహ్లి.. జడేజా) ఇంగ్లండ్‌పై విజయం అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బరువెక్కిన హృదయంతో మాట్లాడాడు. 'ముంబై మారణహోమం (26/11 దాడులు) నన్ను చాలా కలచివేసింది.. ఆ దృశ్యం తలచుకుంటేనే నా హృదయం కన్నీళ్లతో బరువెక్కుతుంది.. ఎంతో మంది అమాయకప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను చూస్తే నా రక్తం మరిగిపోయేది. వారిని అంతమొందించిన ఎన్ఎస్జీ కమాండోలకు నా శతకోటి వందనాలు.. ఈరోజు ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీని ఆ మారణహోమంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నా... అసలు ఆరోజు ముంబైలో ఏం జరుగుతుందో నాకు మొదట అర్థం కాలేదు. అర్థమయ్యే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఈరోజు ఇంగ్లండ్‌పై చేసిన 100 పరుగులు.. ఆ మారణహోమం నుంచి అభిమానులు బయటపడేందుకు సహాయపడుతుందనే అనుకుంటున్నా.మారణహోమం తర్వాత ఉగ్రవాదులతో పోరాడిన కమాండోలకు, అక్కడి ప్రజలకు, పోలీసులకు సెల్యూట్ తప్ప ఇంకేం చేయలేను. ఆ దహనకాండ తర్వాత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ సెంచరీ చేయడం.. అమరులకు అంకింతం చేయడం జీవితంలో మరిచిపోలేనిదంటూ' ఉద్వేగంతో పేర్కొన్నాడు. కాగా ముంబై మారణహోమానికి ముందే ఇంగ్లండ్ జట్టు భారత్‌లో 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడడానికి వచ్చింది. మూడో వన్డే సమయంలోనే 26/11 దాడులు జరగడంతో తదుపరి రెండు వన్డేలను రద్దు చేశారు. అనంతరం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ను నిర్వహించారు. సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మొదటి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆండ్రూ స్ట్రాస్ సెంచరీతో 316 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు 75 పరుగుల ఆధిక్యం వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో స్ట్రాస్ మరోసారి సెంచరీతో మెరవడంతో భారత్‌కు 387 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. సచిన్ 103 పరుగుల వీరోచిత సెంచరీతో భారత్ 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. (చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. స్మిత్ అనుమానమే!) -
'ఐదు రోజులు ఒక్కపాటనే వినిపించారు'
సిడ్నీ : 2003-04 ఆసీస్ టూర్ తనకు చాలా ప్రత్యేకమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాలాసార్లు పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగుల సచిన్ నాకౌట్ ఇన్నింగ్స్‌ను ఎవరు మరిచిపోలేరు. మాస్టర్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ డ్రా అవడమే కాకుండా సిరీస్ కూడా 1-1తే సమం అయింది. తాజాగా సచిన్ మరోసారి 241 పరుగుల ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటూ ఆ సందర్భంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. '2004లో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగులు ఇన్నింగ్స్‌ను పక్కనపెడితే.. మ్యాచ్ జరిగిన ఐదు రోజులు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్రియాన్ ఆడమ్స్ పాడిన సమ్మర్ ఆఫ్ 69 అనే పాటను ఐదు రోజుల పాటు ప్లే చేశారు. ఈ పాట మేము ఎంతలా వినాల్సి వచ్చిందంటే... గ్రౌండ్లో అడుగుపెడుతున్నప్పుడు, డ్రెస్సింగ్ రూమ్, ప్రాక్టీస్ సమయం, లంచ్, టీ బ్రేక్ ఇలా ఎక్కడికి వెళ్లినా అదే పాటను ప్లే చేశారు. ఆఖరికి మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్ రూంకు వెళ్లేటప్పుడు కూడా ఇదే పాటను మారుమోగించారు. ఆ పాట ప్రభావం ఎంత ఉండేదంటే.. ఆటోమెటిక్‌గా లిరిక్స్ నా నోటి నుంచి వచ్చేవి. ఇలాంటి సంఘటనే మళ్లీ 2003 ప్రపంచకప్‌లలో చోటుచేసుకుంది. నేను ఎక్కడికి వెళ్లినా లక్కీ అలీ "సర్ ఆల్బమ్" పాటను వినిపించేవారు.' అని చెప్పుకొచ్చాడు.(చదవండి : ఆ మూడు ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ చూస్తుంటా) కాగా సిరీస్‌లో మొదటి మూడు టెస్టుల్లో సచిన్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్రిస్బేన్, అడిలైడ్, మెల్బోర్న్ వేదికగా జరిగిన మొదటి మూడు టెస్టులు కలిపి 0,1,37,0,44 పరుగులు చేశాడు. ఇదే సిడ్నీ వేదికకు మరో విశేషం కూడా ఉంది. 2008లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆండ్రూ సైమండ్స్- హర్భజన్‌ల మధ్య జరిగిన మంకీ గేట్ వివాదం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయింది.(చదవండి : డ్రింక్స్ తాగడానికే ఐపీఎల్‌కు వచ్చేవాడు : సెహ్వాగ్) -
ఆ రికార్డుకు 23 పరుగుల దూరంలో కోహ్లి
సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బౌలర్ల వైఫల్యంతో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు అప్పగించేసింది. బ్యాట్స్‌మన్ సమిష్టి ఆటతీరు బాగానే ఉన్నా.. బౌలింగ్ కూర్పు సమస్యగా మారింది. యార్కర్ల కింగ్ నటరాజన్‌కు అవకాశం ఇవ్వకుండా సైనీని ఆడించడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. కేవలం బౌలర్ల వైఫల్యం కారణాలే టీమిండియా సిరీస్ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. (చదవండి : ఆఫ్ఘన్ బౌలర్‌పై ఆఫ్రిది తిట్ల పురాణం) ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో వన్డేలో మరో 23 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా కోహ్లి నిలుస్తాడు. ఈ క్రమంలో కోహ్లి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్‌కు ఈ ఘనతను అందుకోవడానికి 309 మ్యాచ్‌ల్లో 300 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. కానీ కోహ్లి ఆ 23 పరుగులు చేస్తే 242వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు. ఇక మొత్తంగా చూసుకుంటే వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన వారిలో కోహ్లి ఆరో ప్లేయర్‌గా నిలవనున్నాడు. ఇంతకు ముందు సచిన్‌తోపాటు రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేల జయవర్దనె కూడా వన్డేల్లో 12 వేల పరుగులు సాధించిన జాబితాలో ఉన్నారు. అంతేగాక కోహ్లి ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా సచిన్ (9 సెంచరీలు) సరసన నిలవనున్నాడు. -
నువ్వు కూడా అంతే కదా దాదా...!!
-
దాదా నువ్వు కూడా అంతే; సచిన్ కౌంటర్!!
క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మెగాటోర్నీ వరల్డ్ కప్-2019 కోసం కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్-సౌతాఫ్రికాల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి కామెంటరీ బాక్స్‌లో సందడి చేశాడు. ఇక బుధవారం సఫారీలతో టీమిండియా తలపడిన నేపథ్యంలో లిటిల్ మాస్టర్ సరికొత్త ఉత్సాహంతో తనదైన శైలిలో మాటల బాణాలు వదిలాడు. సెహ్వాగ్‌తో కలిసి దాదాపై పంచుల మీద పంచులు వేస్తూ అభిమానులను అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. నువ్వు కూడా అంతే కదా దాదా...!! వరల్డ్ కప్-2019లో భాగంగా తమ మొదటి మ్యాచ్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన సఫారీల కెప్టెన్ డు ప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు. అయితే భారత బౌలర్ల పదునైన బౌలింగ్‌తో సౌతాఫ్రికా 9వికెట్ల నష్టానికి 227 పరుగులు మాత్రమే చేయగలింది. కాగా పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న ప్రత్యర్థి పేసర్లు రబడ (2/39), మోరిస్ (1/36) చుక్కలు చూపారు. ఇందులో భాగంగా క్రిస్ మోరిస్ తన మొదటి ఓవర్లోనే విజృంభించాడు. అతడి బౌలింగ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాట్ విరిగిపోయింది. ఈ విషయం గురించి కామెంటరీ బాక్స్‌లో ఉన్న గంగూలీ మాట్లాడుతూ... ‘బ్యాట్ కొసభాగం పలుచగా ఉంటుంది. అందుకే ఒక్కోసారి ఇలా జరుగుతుంది. కానీ సచిన్ బ్యాట్ మాత్రం విరిగిపోదు’ అని వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా..అవును నిజమే ఆయన బ్యాట్ ఎలా విరిగిపోతుందిలే దాదా అంటూ సెహ్వాగ్ బదులిచ్చాడు. వెంటనే మళ్లీ అందుకున్న గంగూలీ..‘ ఆయన బ్యాట్ కింద కొన్ని బంతులే పడతాయి. బ్యాట్ మధ్య భాగంలో పడే బంతులే ఎక్కువగా ఉంటాయి. అయినా సచిన్ బ్యాట్‌తో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాడు. ఒక్కోసారి బ్యాట్‌కు ఫెవిక్విక్ పెడతాడు. గ్లూ వాడతాడు. ఇలా ఏది వాడినా బ్యాట్‌ను సంభాలించుకోగలుగుతాడు’ అంటూ సచిన్‌ను టీజ్ చేశాడు. వీరిద్దరి సరదా సంభాషణలో ఎంట్రీ ఇచ్చిన సచిన్..కేవలం తనే కాదు దాదా కూడా బ్యాట్‌తో ఇలాంటి ఆటలే ఆడతాడు అంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా లార్డ్స్‌లో తామిద్దరం కలిసి ఆడిన తొలి టెస్టు మ్యాచ్ తాలూకు ఙ్ఞాపకాలు గుర్తు చేస్తూ... నవ్వులు పుయించాడు. కాగా ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్లతో విజయం సాధించిన మెగాటోర్నీని ఘనంగా ఆరంభించింది. -
సచిన్ ‘పోస్టల్’ వివాదం!
స్టాంప్ కోసం నిబంధనల ఉల్లంఘన ముంబై: కెరీర్ ఆసాంతం వివాదాలకు దూరంగా ఉన్న మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్... తన ప్రమేయం లేకుండా కొత్త వివాదంలో చిక్కుకున్నారు. సచిన్ రిటైర్మెంట్ సందర్భంగా పోస్టల్ స్టాంప్ విడుదల సందర్భంగా సంబంధిత అధికారులు నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం బతికున్నవారిపై స్టాంప్ విడుదల చేయరాదు. వారు చనిపోయిన కనీసం పదేళ్ల తర్వాతే స్టాంప్ ముద్రించవచ్చు. అదీ 10వ వర్ధంతి లేదా 25వ లేదా వర్ధంతి...ఇలా ప్రత్యేక రోజునే విడుదల చేయవచ్చు. సచిన్ విషయంలో కేంద్ర మంత్రి శరద్ పవార్ అతి చొరవతో ఇదంతా వేగంగా జరిగిపోయింది. పోస్టల్ శాఖకు కనీస సమయం కూడా ఇవ్వకుండా ప్రతిపాదించిన 20 రోజుల్లోపే సచిన్ స్టాంప్‌ను పవార్ సిద్ధం చేయించారు. ఈ మొత్తం ప్రక్రియలో అధికారులు అన్ని నిబంధనలు ఉల్లంఘించడం వివాదానికి తావిచ్చింది.