సిడ్నీ : 2003-04 ఆసీస్ టూర్ తనకు చాలా ప్రత్యేకమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాలాసార్లు పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగుల సచిన్ నాకౌట్ ఇన్నింగ్స్‌ను ఎవరు మరిచిపోలేరు. మాస్టర్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ డ్రా అవడమే కాకుండా సిరీస్ కూడా 1-1తే సమం అయింది. తాజాగా సచిన్ మరోసారి 241 పరుగుల ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటూ ఆ సందర్భంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
'2004లో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగులు ఇన్నింగ్స్‌ను పక్కనపెడితే.. మ్యాచ్ జరిగిన ఐదు రోజులు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్రియాన్ ఆడమ్స్ పాడిన సమ్మర్ ఆఫ్ 69 అనే పాటను ఐదు రోజుల పాటు ప్లే చేశారు. ఈ పాట మేము ఎంతలా వినాల్సి వచ్చిందంటే... గ్రౌండ్‌లో అడుగుపెడుతున్నప్పుడు, డ్రెస్సింగ్ రూమ్, ప్రాక్టీస్ సమయం, లంచ్, టీ బ్రేక్ ఇలా ఎక్కడికి వెళ్లినా అదే పాటను ప్లే చేశారు. ఆఖరికి మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్ రూంకు వెళ్లేటప్పుడు కూడా ఇదే పాటను మారుమోగించారు. ఆ పాట ప్రభావం ఎంత ఉండేదంటే.. ఆటోమెటిక్‌గా లిరిక్స్ నా నోటి నుంచి వచ్చేవి. ఇలాంటి సంఘటనే మళ్లీ 2003 ప్రపంచకప్‌లలో చోటుచేసుకుంది. నేను ఎక్కడికి వెళ్లినా లక్కీ అలీ "సర్ ఆల్బమ్" పాటను వినిపించేవారు.' అని చెప్పుకొచ్చాడు.(చదవండి : ఆ మూడు ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ చూస్తుంటా)
కాగా సిరీస్‌లో మొదటి మూడు టెస్టుల్లో సచిన్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్రిస్బేన్, అడిలైడ్, మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మొదటి మూడు టెస్టులు కలిపి 0,1,37,0,44 పరుగులు చేశాడు. ఇదే సిడ్నీ వేదికకు మరో విశేషం కూడా ఉంది. 2008లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆండ్రూ సైమండ్స్- హర్భజన్‌ల మధ్య జరిగిన మంకీ గేట్ వివాదం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయింది.(చదవండి : డ్రింక్స్ తాగడానికే ఐపీఎల్‌కు వచ్చేవాడు : సెహ్వాగ్)
Comments
Please login to add a commentAdd a comment