memorable movements
-
'ఐదు రోజులు ఒక్కపాటనే వినిపించారు'
సిడ్నీ : 2003-04 ఆసీస్ టూర్ తనకు చాలా ప్రత్యేకమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాలాసార్లు పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగుల సచిన్ నాకౌట్ ఇన్నింగ్స్‌ను ఎవరు మరిచిపోలేరు. మాస్టర్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ డ్రా అవడమే కాకుండా సిరీస్ కూడా 1-1తే సమం అయింది. తాజాగా సచిన్ మరోసారి 241 పరుగుల ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటూ ఆ సందర్భంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. '2004లో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 241 పరుగులు ఇన్నింగ్స్‌ను పక్కనపెడితే.. మ్యాచ్ జరిగిన ఐదు రోజులు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్రియాన్ ఆడమ్స్ పాడిన సమ్మర్ ఆఫ్ 69 అనే పాటను ఐదు రోజుల పాటు ప్లే చేశారు. ఈ పాట మేము ఎంతలా వినాల్సి వచ్చిందంటే... గ్రౌండ్లో అడుగుపెడుతున్నప్పుడు, డ్రెస్సింగ్ రూమ్, ప్రాక్టీస్ సమయం, లంచ్, టీ బ్రేక్ ఇలా ఎక్కడికి వెళ్లినా అదే పాటను ప్లే చేశారు. ఆఖరికి మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్ రూంకు వెళ్లేటప్పుడు కూడా ఇదే పాటను మారుమోగించారు. ఆ పాట ప్రభావం ఎంత ఉండేదంటే.. ఆటోమెటిక్‌గా లిరిక్స్ నా నోటి నుంచి వచ్చేవి. ఇలాంటి సంఘటనే మళ్లీ 2003 ప్రపంచకప్‌లలో చోటుచేసుకుంది. నేను ఎక్కడికి వెళ్లినా లక్కీ అలీ "సర్ ఆల్బమ్" పాటను వినిపించేవారు.' అని చెప్పుకొచ్చాడు.(చదవండి : ఆ మూడు ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ చూస్తుంటా) కాగా సిరీస్‌లో మొదటి మూడు టెస్టుల్లో సచిన్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్రిస్బేన్, అడిలైడ్, మెల్బోర్న్ వేదికగా జరిగిన మొదటి మూడు టెస్టులు కలిపి 0,1,37,0,44 పరుగులు చేశాడు. ఇదే సిడ్నీ వేదికకు మరో విశేషం కూడా ఉంది. 2008లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆండ్రూ సైమండ్స్- హర్భజన్‌ల మధ్య జరిగిన మంకీ గేట్ వివాదం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయింది.(చదవండి : డ్రింక్స్ తాగడానికే ఐపీఎల్‌కు వచ్చేవాడు : సెహ్వాగ్) -
ఆ మూడు ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ చూస్తుంటా
ముంబై : అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు.. అన్ని ఫార్మాట్లు కలిపి 34వేలకు పైగా పరుగులు.. బ్యాటింగ్ విభాగంలో లెక్కలేనన్ని రికార్డులు.. ఈ దశాబ్దంలో అతను సాధించిన మైలురాళ్లను చేరుకోవడం ఇప్పటితరం ఆటగాళ్లకు కష్టమే.. ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి.. ఆ వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని. ఒకే ఆటగాడు లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి వాటిలో మూడు బెస్ట్ ఇన్నింగ్స్‌లను ఎంపిక చేసుకోవాలంటే కొంచెం కష్టమే. కానీ సచిన్ మాత్రం ఏ మాత్రం సంకోచం లేకుండా తన మూడు బెస్ట్ ఇన్నింగ్స్‌లను ఎప్పటికి మరిచిపోనని.. వాటి హైలెట్స్‌ను ఇప్పుడు కూడా వీక్షిస్తానని తెలిపాడు. యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సచిన్ ఈ విషయాలను పంచుకున్నాడు.(చదవండి : డ్రింక్స్ తాగడానికే ఐపీఎల్‌కు వచ్చేవాడు : సెహ్వాగ్) 'జీవితంలో లెక్కలేనన్ని రికార్డులు ఎన్నో సాధించా.. నేను ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఒకదానిని మించి మరొకటి ది బెస్ట్ అనిపిస్తుంది. అందులోనూ ది బెస్ట్ ఏంచుకోమంటే మాత్రం ఆ మూడు ఇన్నింగ్స్‌ల గురించి ప్రస్తావిస్తా. మొదటి రెండు ఒకే సిరీస్‌లో వచ్చినవి. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు. సెమీ ఫైనల్లో సెంచరీతో మెరిసి జట్టును ఫైనల్ చేర్చాను. అదే ఊపుతో ఫైనల్లో మరో సెంచరీ బాదేసి కోకకోలా కప్‌ను టీమిండియాకు అందించడం మరుపురాని జ్ఞాపకం. ఆ తర్వాత మరో ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే 2003 ప్రపంచకప్. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులు ఇన్నింగ్స్‌ను ఎప్పటికి మరిచిపోను. చిరకాల ప్రత్యర్థిపై శివరాత్రి రోజున ఆడిన ఆ ఇన్నింగ్స్ ఇప్పటికి నా కళ్ల ముందు కనిపిస్తుంది. అందుకే ఎప్పుడు వీలున్నా.. ఈ మూడు ఇన్నింగ్స్‌లకు సంబంధించిన వీడియోలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటా.' అని చెప్పుకొచ్చాడు.(చదవండి : 'శాస్త్రి ఆ విషయం నాకు ముందే చెప్పాడు') ఇవేగాక మాస్టర్ కెరీర్లో మరిన్ని కలికితురాయిలు ఉన్నాయి. 1992లో క్రికెట్లో కొత్తగా అడుగుపెట్టిన రోజుల్లో ఆసీస్‌పై పెర్త్ వేదికగా 114 పరుగులు చేయడం హైలెట్‌గా చెప్పవచ్చు. అప్పటివరకు సాధారణ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సచిన్‌కు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే ధైర్యం కలిగించింది. అలాగే 2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత ఇంగ్లండ్‌పై చేసిన 108 పరుగుల ఇన్నింగ్స్‌ను ఎవరు మరిచిపోరు. ఉగ్రదాడి తర్వాత దేశకోసం కసిగా ఆడిన ఇన్నింగ్స్ అది.. అందుకే దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని సచిన్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. 1999 ప్రపంచకప్.. కెన్యాపై 140 పరుగులు సుడిగాలి ఇన్నింగ్స్ తర్వాత సచిన్ జీవితంలో పెను విషాదం చోటుచేసుకుంది. తండ్రి మరణవార్తను తెలుసుకున్న సచిన్ ఆ బాధను దిగమింగుకొని పాకిస్తాన్‌పై చేసిన 136 పరుగల ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు. -
వైఎస్‌గారికి మరణం లేదు
‘‘వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మరణించలేదు.. తెలుగు మాట్లాడే ప్రజలందరి హృదయాల్లో జీవించే ఉన్నారు’’ అని రచయిత చిన్నికృష్ణ అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి (బుధవారం (జులై 8)ని పురస్కరించుకుని చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘మీరు (వైఎస్) ఆ దేవుడు పంపించిన బిడ్డ సార్. ఆ పేద ప్రజల కోసం చేయాల్సిందల్లా చేసి, నిష్క్రమించారు. మీకు మరణం లేదు సార్. నేను మిమ్మల్ని ఎన్నోసార్లు కలిశాను. ఇప్పుడు ఒక విషయాన్ని తొలిసారి అందరికీ చెబుతున్నా. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని రోడ్డు నంబర్ 14లో నేను ఉండేవాణ్ణి. ఆ ముందు వీధిలో మీరు ఉండేవారు. జనార్ధన్‌గారు అనే ఆయన మీ వద్ద చాలా ఏళ్లుగా పనిచేసేవారు. మీకు బాగా ఆప్తుడాయన. ఆయనతో కలిసి ఎన్నోసార్లు మీ వద్దకు వచ్చాను. నా పుట్టినరోజున ఉదయాన్నే మీ వద్దకు వచ్చి మీ ఆశీస్సులు తీసుకుని వెళ్లాను. మీ అభిమానం, ఆప్యాయత, ప్రేమని ఎప్పటికీ మరువను. మీరు విలక్షణ రాజకీయ చతురుడే కాదు.. అవసరంలో ఉన్నవాళ్లకు అభయదాత, రైతన్నలకు ఆపద్భాంధవుడు. పౌరుషానికి ప్రతినిధి, నిరుపేదల పాలిట ప్రత్యక్ష దైవం. రాజకీయం అంటే వాగ్దానం చెయ్యడమే కాదు.. దాన్ని నెరవేర్చడం అని భావితరాలకు నేర్పిన ప్రజల ముఖ్యమంత్రి మీరు’’ అన్నారు. -
విడిపోయే పూట.. కిలకిల, వలవల కలబోత..
ఎండకాసే వేళే వాన కురిసినట్టు.. వారి ముఖాల్లో వెలుగు, దిగులు కలబోసుకున్నాయి. ఓ వైపు చదువుల ప్రయాణంలో ఓ మజిలీ దాటామన్న ఆనందం.. మరోవైపు ఏళ్ల తరబడి కలిసిమెలిసి ఉన్న నేస్తాలను వీడిపోతున్నామన్న వేదన.. శనివారం కాకినాడ పీఆర్ కళాశాలలో డిగ్రీ విద్యార్థుల వీడ్కోలు వేడుకలో కనిపించిన భావోద్వేగభరిత దృశ్యాలివి. ఎక్కడెక్కడో ఇంటర్ చదివి ఈ కళాశాలకు చేరిన యువతీయువకులు మూడేళ్లపాటు పాఠాలతో పాటు ఆటపాటలనూ కలిసి ఆస్వాదించారు. ఇన్నాళ్లూ తమ నవ్వులు మారుమోగిన; తమ అడుగులను హత్తుకున్న కళాశాలనై, ప్రాంగణాన్నీ విడిచి వెళ్లే వేళ వారి హృదయాలు బరువెక్కాయి. ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం.. చదువులమ్మ చెట్టు నీడలో’ అన్న సినీ గీతాన్ని తలపించాయి ఆ వీడ్కోలు సన్నివేశాలు. వివిధ అనుభూతులతో ఉక్కిరిబిక్కిరైన ఆ దృశ్యాల్ని ‘సాక్షి’ కెమేరాలో బంధించింది. ఫొటోలు : సతీష్‌కుమార్ పేపకాయల, సాక్షి, కాకినాడ