విడిపోయే పూట.. కిలకిల, వలవల కలబోత..
విడిపోయే పూట.. కిలకిల, వలవల కలబోత..
Published Sun, Mar 19 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
ఎండకాసే వేళే వాన కురిసినట్టు.. వారి ముఖాల్లో వెలుగు, దిగులు కలబోసుకున్నాయి. ఓ వైపు చదువుల ప్రయాణంలో ఓ మజిలీ దాటామన్న ఆనందం.. మరోవైపు ఏళ్ల తరబడి కలిసిమెలిసి ఉన్న నేస్తాలను వీడిపోతున్నామన్న వేదన.. శనివారం కాకినాడ పీఆర్ కళాశాలలో డిగ్రీ విద్యార్థుల వీడ్కోలు వేడుకలో కనిపించిన భావోద్వేగభరిత దృశ్యాలివి. ఎక్కడెక్కడో ఇంటర్ చదివి ఈ కళాశాలకు చేరిన యువతీయువకులు మూడేళ్లపాటు పాఠాలతో పాటు ఆటపాటలనూ కలిసి ఆస్వాదించారు. ఇన్నాళ్లూ తమ నవ్వులు మారుమోగిన; తమ అడుగులను హత్తుకున్న కళాశాలనై, ప్రాంగణాన్నీ విడిచి వెళ్లే వేళ వారి హృదయాలు బరువెక్కాయి. ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం.. చదువులమ్మ చెట్టు నీడలో’ అన్న సినీ గీతాన్ని తలపించాయి ఆ వీడ్కోలు సన్నివేశాలు. వివిధ అనుభూతులతో ఉక్కిరిబిక్కిరైన ఆ దృశ్యాల్ని ‘సాక్షి’ కెమేరాలో బంధించింది.
ఫొటోలు : సతీష్‌కుమార్ పేపకాయల, సాక్షి, కాకినాడ
Advertisement