degree students
-
ఇంటర్న్‌షిప్‌కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థుల దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌నకు సర్వం సిద్ధమైంది. ఈ విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు సోమవారం నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుంది. డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. గతేడాది 2.56 లక్షల మంది ఇంటర్న్‌షిప్ చేయగా, ఈ ఏడాది 3.46 లక్షల మంది ఇందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం 30కి పైగా ప్రపంచ స్థాయి సంస్థల్లో వర్చువల్‌గా, మరో 30 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ద్వారా ఇంటర్న్‌షిప్ కల్పిస్తోంది. ఇంటర్న్‌షిప్ కోసం ఉన్నత విద్యా మండలి పోర్టల్‌లో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ఏర్పాటు చేశారు. జిల్లాలవారీగా గుర్తించిన సంస్థల వివరాలను వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారు. ఆ సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది. ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందం విద్యార్థుల ఇంటర్న్‌షిప్ కోసం పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వర్తక, వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో మాన్యుఫాక్చరింగ్‌తో పాటు సర్వీసు సంస్థలూ ఉన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకుంటోంది. ఎల్ఎంఎస్–ఐఐసీ పోర్టల్‌లో వీటి వివరాలు ఉంచింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, స్మార్ట్ ఇంటన్జ్, ఎక్సల్ ఆర్, సెలర్ అకాడమీ, సిస్కో, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, వాద్వానీ ఫౌండేషన్, టీమ్ లీజ్ వంటి సంస్థల ద్వారా ఇంటర్న్‌షిప్ అందిస్తోంది. ఈ ఏడాది సుమారు 40 వేల మంది సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు స్ట్రైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ కల్పిస్తోంది. వీరితో పాటు 2వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ కింద సేవలు వినియోగించుకోనుంది. వీరికి నెలకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తూ ఆరు నెలల పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన పెంపొందించనుంది. చదువుకొనే సమయంలోనే జీతాన్నీ అందుకుంటారు విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అమలు చేస్తున్నాం. దీర్ఘకాలిక ఇంటర్న్‌షిప్‌ను చివరి సెమిస్టర్లో పెట్టడం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలతో పాటు పరిశ్రమల్లో నేర్చుకున్న విజ్ఞానంతో వేగంగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 10 లక్షల మందికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ అందించింది. ఏపీలో విద్యార్థులు తొలిసారిగా చదువుకొనే సమయంలోనే జీతాన్నీ అందుకోనున్నారు. – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
మొదట ఒకే కాలేజీలో.. ఒకేరోజు ఇద్దరు ఇలా.. అసలు కారణాలేంటి?
ఖమ్మం: వేర్వేరు గ్రామాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు ఇద్దరు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లాడ మండలం మంగాపురానికి చెందిన కుంచం నాగేశ్వరి(18) ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అలాగే, నారాయణపురం గ్రామానికి చెందిన సంగసాని విజయ్(18) సైతం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వీరిలో నాగేశ్వరి రెడ్డిగూడెంలోని క్రీస్తుజ్యోతి డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరంలో చేరి అక్కడి నుంచి వైరాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు మారింది. ఇక విజయ్ క్రీస్తుజ్యోతి డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సమీప గ్రామాలకు చెందిన వీరిద్దరు తొలుత ఒకే కళాశాలలో చేరగా.. ఒకేరోజు ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తుండగా, రెండు గ్రామాల్లో విషాదాన్ని నింపింది. కాగా, ఘటనలపై తమకు ఫిర్యాదు అందలేదని తల్లాడ ఎస్ఐ సురేష్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నల్లగొండలో విషాదం
-
వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువతులు
-
జేఈఈ రాకున్నా... ఐఐటీ చదువు
సాధారణంగా దేశంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో చదవాలంటే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు కొట్టాల్సిందే. కానీ ఇక మీదట సాదాసీదా డిగ్రీ విద్యార్థులు కూడా ఐఐటీల్లో కోర్సులు పూర్తి చేయవచ్చు. జాతీయ స్థాయిలో ఈ తరహా కసరత్తు వేగంగా ముందుకెళ్తోంది. కోవిడ్ కాలంలో మొదలైన ఈ ఆలోచన ఇప్పుడు అనేక రూపాల్లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తోంది. దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న సీట్లు 50 వేల లోపే. అందులోనూ ఐఐటీల్లో ఉన్నవి 16 వేలు మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే ఐఐటీల్లో ఏ కోర్సు చేసినా మంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో అవసరమైన కొన్ని కోర్సులను ఐఐటీల ద్వారా సర్టిఫికేట్ కోర్సులుగా అందించాలని ఐఐటీలు కార్యాచరణ సిద్ధం చేశాయి. – సాక్షి, హైదరాబాద్ కోవిడ్ కాలంలో.. కోవిడ్ సమయంలో విద్యార్థులు ఆన్లైన్ విద్యకు అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోర్సులను డిజైన్ చేసినట్లు ఐఐటీలు చెబుతున్నాయి. విద్యార్థులు కూడా ఈ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని మద్రాస్ ఐఐటీ ఇటీవల తెలిపింది. ఈ సంస్థ ప్రతినిధులు వివిధ రాష్ట్రాలోని కాలేజీలకు వెళ్లి ఆన్లైన్ కోర్సుల ప్రాధాన్యతను వివరించారు. మిగతా ఐఐటీలు సరికొత్త సర్టిఫికెట్ కోర్సులను తెరపైకి తెచ్చాయి. ఇవీ కోర్సులు.. ఎంటెక్‌లో ఆన్లైన్ కోర్సులకు ఐఐటీ హైదరాబాద్ గతేడాది సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి మార్కెట్ డిమాండ్ కోర్సులను ఈ ఏడాది తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మరికొన్ని ఐఐటీలు ఈ సంవత్సరం నుంచి మార్కెట్ వర్గాల డిమాండ్‌కు అనుగుణంగా ఎంటెక్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను తీసుకొస్తున్నాయి. 2020లో ఐఐటీ మద్రాస్ బీఎస్సీ డేటా సైన్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ కోర్సులో 18 వేల మంది చేరినట్లు ఆ సంస్థ తెలిపింది. నాలుగేళ్ల బీఎస్సీ ఎల్రక్టానిక్స్ కోర్సును ఆన్లైన్ ద్వారా అందించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఐఐటీ బాంబే డిజిటల్ మార్కెటింగ్ అండ్ అప్లైడ్ అనలిటిక్స్, డిజైన్ థింకింగ్, మెషీన్ లెరి్నంగ్ అండ్ ఏఐ విత్ పైథాన్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అందిస్తున్నట్లు ప్రకటించింది. పట్నా ఐఐటీ ఎంటెక్ ఇన్ బిగ్ డేటా అండ్ బ్లాక్‌చైన్, ఎంటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను మరింత ఆధునీకరిస్తూ అందిస్తోంది. అయితే వాటిని ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు అందించాలని నిర్ణయించింది. ఢిల్లీ ఐఐటీ కూడా జాతీయ, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న సర్టిఫికెట్ కోర్సులను అందించనుంది. ఇందులో సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, మెషీన్ లెరి్నంగ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ స్టార్టప్ బూట్‌క్యాంప్, న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ కోర్సులున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సులువు.. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పటికప్పుడూ నైపుణ్యానికి పదును పెట్టాల్సిందే. ఇలాంటి మళ్లీ వారు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అంతర్జాతీయ ప్రమాణాలున్న ఐఐటీ సంస్థల్లో సర్టిఫికెట్ కోర్సులు చేయవచ్చు. ఐఐటీ ద్వారా సర్టిఫికెట్ కోర్సు చేస్తే మంచి ఫ్యాకల్టీ ద్వారా పాఠాలు వినడమే కాకుండా ఆ సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లకు విలువ ఉంటుంది. మరింత మెరుగైన ఉపాధికి ఆస్కారం ఉండే వీలుంది. ట్రెండ్ మంచిదే... అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ఇదే బాటలో ఐఐటీలు మంచి కోర్సులు ఆఫర్ చేయడం మంచిదే. అయితే ఇవి కేవలం సర్టిఫికెట్ల జారీకే పరిమితం కాకూడదు. కోర్సు నేర్చుకొనే విద్యార్థులు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటేనే అంతర్జాతీయంగా మంచి ఉద్యోగాలు పొందడానికి వీలుంటుంది. –ప్రొ.శ్రీరాం వెంకటేష్ (ఓయూ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్) -
పేద విద్యార్థులకు జీఆర్టీ జ్యువెలర్స్ అండ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన జీఆర్టీ జ్యువెలర్స్.. ఎంతో కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన డిగ్రీ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తోంది. ఇందుకోసం అందిన వెయ్యి దరఖాస్తులను పరిశీలించి 71 మంది అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసింది. ఒకటో సెమిస్టర్‌కు అర్హులైన విద్యార్థులకు రూ.25 లక్షలు అందజేసింది. రెండో సెమిస్టర్‌కు కూడా ఉపకార వేతనాలను అందిస్తామని.. డిగ్రీ పూర్తయ్యే వరకు ఈ సాయం కొనసాగుతుందని సంస్థ ఎండీ జీఆర్ ‘ఆనంద్’అనంతపద్మనాభన్ స్పష్టం చేశారు. -
నిజాం కళాశాలలో కొనసాగుతున్న డిగ్రీ విద్యార్థులు ఆందోళన
-
నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: నిజాం కాలేజీలో డిగ్రీ చదివే విద్యార్థినులకు కూడా హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన హాస్టల్ గదుల్లో సగం పీజీ చదివే విద్యార్థినులకు, మరో సగం డిగ్రీ చదివే విద్యార్థినులకు వసతి సదుపాయం అందుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. నిజాం కాలేజీలో ఇప్పటి వరకూ డిగ్రీ చదివే బాలురకు మాత్రమే హాస్టల్ సదుపాయం ఉంది. కాగా, తమకు కూడా హాస్టల్ సౌకర్యం కల్పించాలని నిజాం కాలేజీ విద్యార్థునులు ఇటీవల ఆందోళనకు దిగారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో, సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కేటీఆర్.. విద్యా శాఖ మంత్రి సబితను కోరారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఉన్నతాధికారులతో చర్చించారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 200 మందికి హాస్టల్ సదుపాయం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల మెరిట్, వారి స్వస్థలానికి హైదరాబాద్‌కు ఉండే దూరాన్ని బట్టి సీట్లు కేటాయిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థినుల ఆందోళనపై ప్రభుత్వం మానవతా కోణంలో స్పందించి, తక్షణ పరిష్కారం చూపిందని మంత్రి సబిత ట్వీట్ చేశారు. అయితే డిగ్రీ విద్యార్థుల కోసం అదనంగా మరో అంతస్తు నిర్మాణంపై అధికారికంగా సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా మంత్రిని కోరినట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. అప్పటి వరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం చెట్టుకిందే పాఠాలు విని.. అక్కడే భోజనాలు చేశారు. శనివారం కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. -
హాస్టల్ గోడ దూకి.. 150 సీసీ కెమెరాల కళ్లుగప్పి..
చంద్రగిరి(తిరుపతి జిల్లా): అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి నలుగురు విద్యార్థినులు పారిపోయిన ఘటన చంద్రగిరిలో కలకలకం సృష్టించింది. వెస్ట్ డీఎస్పీ నరసప్ప కథనం మేరకు.. విజయనగరం, విజయవాడ, కడప, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థినులు చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలలో ఉంటూ చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని.. వీరిలో ఇద్దరు విద్యార్థినులు మైనర్లు. వీరు డిగ్రీ చదువుకుంటూ.. హాస్టల్లో వేదాలు, హిందూ సంప్రదాయాలు నేర్చుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ నలుగురు అమ్మాయిలు హాస్టల్ వెనుక వైపు నుంచి 8 అడుగుల ఎత్తయిన గోడదూకి పారిపోయారు. హాస్టల్ ఇన్చార్జి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ గుర్తించేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, హాస్టల్ నుంచి వెళ్లే మూడు రోజులకు ముందు ఏమి జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఓ బయటి వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం రెండు సార్లు ఎవరితోనో మాట్లాడినట్లు తెలుస్తోంది. సుమారు 350 మంది ఉన్న హాస్టల్లో 150కి పైగా సీసీ కెమెరాలు, 10 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినా విద్యార్థినులు పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
డిగ్రీ ఇంటర్న్‌షిప్‌కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఏపీలో ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలకు చేపట్టిన సంస్కరణల్లో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సులకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అమలు చేస్తున్నారు. నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ ఆనర్ కోర్సులు అభ్యసించే వారికి ఏడాది ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టారు. మూడేళ్లలో డిగ్రీ కోర్సు నుంచి ఎగ్జిట్ అయ్యేవారికి 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఇంటర్న్‌షిప్ అమలులో ఆటంకాలు కలిగాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కరోనా తగ్గింది. కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులూ జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ సూచనల మేరకు రాష్త్ర ఉన్నత విద్యా మండలి ఇంటర్న్‌షిప్ అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. 27వేల సంస్థల గుర్తింపు.. విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌నకు రాష్ట్రంలోని 27,119 సంస్థలను గుర్తించారు. వీటిలో ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వర్తక, వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, మెగా సంస్థలను ఎంపికచేశారు. మాన్యుఫాక్చరింగ్‌తో పాటు సర్వీసు సంస్థలూ ఉన్నాయి. వీటిలో ఏపీ జెన్కో, హ్యుందాయ్, కియా మోటార్స్, విప్రో, అమర రాజా బ్యాటరీస్, కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్, హీరో మోటోకార్ప్ లిమిటెడ్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, సెంబ్‌కార్ప్ ఎనర్జీ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్ సహా వేలాది కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌నకు అవకాశముంది. ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఉన్నత విద్యా మండలి పోర్టల్‌లో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)ను ఏర్పాటు చేశారు. జిల్లాలవారీగా గుర్తించిన సంస్థల వివరాలను వెబ్సైట్లో ఉంచారు. ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది. వీటిలో వర్సిటీల వీసీలు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు ఉన్నారు. విద్యార్థులకు సహకరించేందుకు కాలేజీల్లో సమన్వయకర్తలను నియమించారు. ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులను సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దుతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి చెప్పారు. -
డిగ్రీ, పీజీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త..!
డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త తెలిపింది. భారత దేశాన్ని రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ముందువరుసలో నిలిపేందుకు, విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశంలోని 100 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు తెలిపింది. కృత్రిమ మేధస్సు, కంప్యూటర్ సైన్సెస్, గణితం & కంప్యూటింగ్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భారత దేశంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్లలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా అవసరం లేదు. రేపటి ప్రపంచ నాయకులుగా మారే అవకాశం ఉన్న భారత ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడం కోసం స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు వెల్లడించింది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 60 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు గ్రాంట్ అందనుండగా, 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల వరకు స్కాలర్ షిప్ అందించనున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించే పరీక్షలో మెరిట్ ఉన్న అభ్యర్థులకు స్కాలర్ షిప్ అందించనున్నారు. మొదట 80 శాతం ఫండ్స్ ను కోర్సు ప్రారంభంలో అందిస్తే, మిగతా 20 శాతం మొత్తాన్ని విద్యార్థులు భవిష్యత్ అకాడమిక్ అవసరాల కోసం అందించనున్నారు. 2021లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కంప్యూటర్ సైన్సెస్ కోర్సులో మొదటి సంవత్సరం చదువుతున్న 76 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ ఇచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్స్ దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలో ఉన్న టాప్ సైన్స్ & ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. అన్ని రకాల సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుంచి దరఖాస్తు దారులను ఆహ్వానిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రిలయన్స్ ఫౌండేషన్ లింకు మీద క్లిక్ చేయండి. (చదవండి: ప్రతి రోజు రూ.44 పొదుపు చేస్తే.. రూ.27 లక్షలు మీ సొంతం..!) -
కొలువుల చదువులు.. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందేలా
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వాటి ఫలాలు విద్యార్థులకు అందేలా కార్యాచరణ రూపొందించారు. డిగ్రీ పూర్తి చేసి కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు వెంటనే ఉద్యోగావకాశాలను అందుకొనేలా పూర్తిస్థాయి సామర్థ్యాలు, నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమల్లోకి తెస్తున్నారు. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులతో పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించారు. మూడేళ్ల డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పదినెలలు ఇంటర్న్‌షిప్ చేసేలా కోర్సులను రూపొందించారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా క్షేత్రస్థాయిలో శిక్షణ ఇప్పిస్తారు. చదవండి: AP పటిష్టంగా ఫౌండేషన్.. మూడు దశల్లో స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియ ఇందుకు రాష్ట్రంలోని అన్ని కాలేజీలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానిస్తున్నారు. విద్యార్థులు తమ కోర్సులతో సంబంధమున్న అంశాల్లో అందుబాటులో ఉన్న సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. ఇందుకు ఉన్నత విద్యామండలి పోర్టల్‌లోని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)లో వీటిని పొందుపరుస్తారు. జిల్లాలవారీగా ఈ సంస్థలను ఎంపిక చేసి జాబితాను వెబ్సైట్లో పెడతారు. జిల్లాల్లో ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇందులో వర్సిటీల ఉపకులపతులు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ముందుగానే జిల్లాలోని కంపెనీలను సంప్రదించి, ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు చేస్తాయి. ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులు కోఆర్డినేటర్ల సహకారంతో ఆయా సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సంస్థలు వాటికి అవసరమైన సంఖ్యలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో అవకాశం కల్పిస్తాయి. చదవండి: మన టాయిలెట్స్‌లాగే బడిలోనివీ శుభ్రంగా ఉండాలి.. సీఎం జగన్ ట్వీట్ మైక్రో నుంచి మెగా సంస్థల వరకు.. ఇంటర్న్‌షిప్‌కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి గుర్తించింది. ఇందులో మాన్యుఫాక్చరింగ్, సర్వీసు విభాగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచే వారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ద్వారా ఆయా సంస్థలకు కూడా మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. ఉభయ ప్రయోజనకరంగా ఈ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. మరోపక్క విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని, బాధ్యతను పెంపొందించడానికి ఉన్నత విద్యా మండలి కమ్యూనిటీ ప్రాజెక్టులను సిద్ధం చేసింది. సమాజంపై విద్యార్థులకు అవగాహన పెరగడంతో పాటు అక్కడి సమస్యలకు తాము నేర్చుకున్న విజ్ఞానం ద్వారా పరిష్కారాలను అన్వేషించేలా చేస్తారు. వీటి ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సమస్యలను అధిగమించే తత్వం ఏర్పడుతుంది. ఇదో విప్లవాత్మక కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి చదువు పూర్తిచేసి బయటకు వచ్చేనాటికి వారిని సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టాం. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానిస్తున్నాం. రాష్ట్రస్థాయి కమిటీతో పాటు జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేశారు. కాలేజీలు, పరిశ్రమలు, బిజినెస్ ఎంటర్ప్రైజర్లను అనుసంధానం చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తాం. చదువు పూర్తయ్యేసరికి విద్యార్థి పూర్తి నైపుణ్యం సాధించేలా చేస్తాం. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక కార్యక్రమం. -రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఇంటర్న్‌షిప్ కోసం వివిధ జిల్లాల్లో గుర్తించిన కొన్ని ముఖ్యమైన సంస్థలు ► 400 ఎండబ్ల్యూ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏపీ జెన్కో, తలారిచెరువు, అనంతపురం ►హ్యుందాయ్ ట్రాన్సిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కియా మోటార్స్ అనంతపురం ►విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ పిస్టన్ రాడ్ ప్లాంట్ అనంతపురం ►అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, కరకంబాడి, చిత్తూరు ►కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ►ఎక్స్‌ట్రాన్ సర్వర్స్ మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు ►హీరో మోటోకార్ప్ లిమిటెడ్, చిత్తూరు ► గుంటూరు టెక్స్టైల్ పార్కు, గుంటూరు ►జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, గుంటూరు ►మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు ►సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు ► ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా ► ది కేసీపీ లిమిటెడ్ సిమెంటు యూనిట్, కృష్ణా ►రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, కృష్ణా ►ది రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్, కృష్ణా ►గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నూలు ►జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్, కర్నూలు ►ఎస్బీజీ క్లింటెక్ ప్రాజెక్టు కో ప్రైవేట్ లిమిటెడ్. కర్నూలు ►టీజీవీ స్రాక్ లిమిటెడ్, కర్నూలు ►అమ్మన్ ట్రై స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు ►హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెల్లూరు ►ఎన్జీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు ►సెంబ్‌కార్ప్ ఎనర్జీ లిమిటెడ్, నెల్లూరు ►అరబిందో ఫార్మా లిమిటెడ్, శ్రీకాకుళం ►డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, శ్రీకాకుళం ►శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీకాకుళం ►స్మార్ట్‌కెమ్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీకాకుళం ► డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, విశాఖపట్నం ►హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, విశాఖపట్నం ►ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ విశాఖపట్నం ►విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం ► మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, విజయనగరం ► శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ లిమిటెడ్, విజయనగరం ►ఎస్ఎంఎస్ ఫార్మాçస్యూటికల్స్ లిమిటెడ్, విజయనగరం ►నవభారత్ లిమిటెడ్, పశ్చిమగోదావరి ► పాండురంగ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేటు లిమిటెడ్, పశ్చిమ గోదావరి ►వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పశ్చిమ గోదావరి ►ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, వైఎస్సార్ ►ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్, వైఎస్సార్ కడప ► టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్, వైఎస్సార్ కడప ►మిడ్వెస్ట్ నియోస్టోన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం ►జేసీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం ►కల్లామ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, ప్రకాశం ►పెరల్ డిస్టిలరీ లిమిటెడ్, ప్రకాశం ఇంజనీరింగ్ విద్యార్థులకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లులు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ 1.వ్యవసాయంలో నేల ఆరోగ్యం , పంట రీసైక్లింగ్ కోసం సిఫార్సు చేసే వ్యవస్థ అభివృద్ధి 2.వ్యవసాయం కోసం స్ప్రింక్లర్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు 3.అంటువ్యాధులకు సంబంధించి కంప్యూటర్ సహాయక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ రూపకల్పన సివిల్ ఇంజనీరింగ్ 1.ల్యాండ్ స్లైడ్ల కోసం ప్రత్యేకంగా జియోసింథటిక్స్ ఉపయోగించి నేల స్థిరీకరణ 2.జీఐఎస్ ఉపయోగించి భూగర్భ జలాల గుర్తింపు 3.పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి నివాస భవనంలో భూఉష్ణ శక్తి వినియోగం మెకానికల్ ఇంజనీరింగ్ 1.అగ్రికల్చరల్ పెస్టిసైడ్ స్ప్రేయర్ – కోవిడ్ శానిటైజేషన్ డ్రోన్ 2.గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం బయోగ్యాస్ కంప్రెషన్ – స్టోరేజ్ సిస్టమ్ 3.వ్యవసాయం కోసం స్కాచ్ యోక్ మెకానిజం ఉపయోగించి డ్యూయల్ సైడ్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ 1.ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా స్మార్ట్ అగ్రికల్చర్ విధానం, మాయిశ్చర్ హ్యుమిడిటీని గుర్తించడం 2.ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్మార్ట్ రెస్క్యూ సిస్టమ్ 3.స్మార్ట్ మాస్క్ – సామాజిక దూర హెచ్చరిక ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 1.వ్యవసాయ అవసరాల కోసం నేలలో నీటిశాతం, తేమను కనుగొనేందుకు సోలార్ పవర్‌తో నడిచే ఆటో ఇరిగేషన్ సిస్టమ్ వినియోగం 2.మెరుగైన ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇ హెల్త్ కేర్ కంప్యూటింగ్ విధానం అనుసరణ 3.జిగ్బీ ఆధారిత సోలార్ పవర్ ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ కంట్రోల్ సిస్టమ్ డిగ్రీ నాన్‌ప్రొఫెషనల్ విద్యార్థుల కోసం డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ విద్యార్ధులకు కూడా వివిధ అంశాల్లో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులను ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది. ఆర్ట్స్ విద్యార్థులకు 51, కామర్స్ విద్యార్థులకు 50, సైన్సు విద్యార్థులకు 38 ప్రాజెక్టులు ఉంటాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, ఉమెన్, యూత్ ఎంపవర్‌మెంటుతో పాటు వివిధ క్యాంపుల నిర్వహణ అంశాలతో ఈ ప్రాజెక్టులను రూపొందించారు. -
1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రో‘సాఫ్ట్’ స్కిల్స్
సాక్షి, అమరావతి: డిగ్రీ విద్యార్ధుల సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగావకాశాలు మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రపంచంలో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్రంలో 1.62 లక్షల మంది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించేందుకు సన్నద్ధమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఈమేరకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకోగా గడువు తేదీని వచ్చే ఏడాది డిసెంబర్ చివరి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఒప్పందం ప్రకారం గడువు ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుతో ముగుస్తున్నప్పటికీ కరోనాతో విద్యాసంస్థలు దీర్ఘకాలం మూతపడటం, విద్యార్థులు నెలల తరబడి కాలేజీలకు దూరం కావడంతో ఒప్పందం గడువును పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 300 కాలేజీల పరిధిలో చదువుతున్న విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు మైక్రోసాఫ్ట్ వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30.79 కోట్లను వెచ్చిస్తోంది. ఆన్లైన్ ద్వారా అత్యంత నాణ్యమైన కొత్త కరిక్యులమ్ ద్వారా మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. బ్రాండ్ వాల్యూ ఉన్న మైక్రోసాఫ్ట్ అందించే ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల గుర్తింపు ఉన్నందున విద్యార్ధులకు ఎంతో మేలు జరగనుంది. శిక్షణ ప్రాజెక్టు అమలు కోసం పర్యవేక్షణ, మూల్యాంకన కమిటీని ప్రభుత్వం నియమించింది. 40 కోర్సులలో శిక్షణ మైక్రోసాఫ్ట్ సంస్థ అధునాతన సాఫ్ట్వేర్ అంశాలపై విద్యార్ధులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రత్యేక డొమైన్ ద్వారా 40 సర్టిఫికేషన్ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ రూ.7,500 (100 యూఎస్ డాలర్లు) విలువ గల ‘అజూర్‌పాస్’ను ప్రతి విద్యార్థికి సమకూర్చనుంది. దీని ద్వారా 1.62 లక్షల మంది విద్యార్థులు క్లౌడ్ టెక్నాలజీ ద్వారా శిక్షణాంశాలను సులభంగా పొందగలుగుతారు. సర్టిఫికేషన్ కోర్సులతో పాటు అదనంగా ‘లింకిడ్ ఇన్ లెర్నింగ్’ ద్వారా బిజినెస్, క్రియేటివిటీ, టెక్నికల్ విభాగాలకు సంబంధించిన 8,600 కోర్సులు విద్యార్ధులు నేర్చుకునేందుకు అందుబాటులోకి వస్తాయి. అజూర్ ల్యాబ్స్ ద్వారా విద్యార్ధులకు యాప్‌ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా లాంటి 25 ఫ్రీ అజూర్ సర్వీసులు అందుతాయి. శిక్షణ కార్యక్రమాలకు మైక్రోసాఫ్ట్ లెర్న్ (ఎంఎస్ లెర్న్) ముఖ్యమైన ప్లాట్‌ఫాంగా ఉంటుంది. సెల్ఫ్‌పేస్‌డ్, డిజిటల్ లెర్నింగ్ వనరుల ద్వారా విద్యార్ధులు నూతన సాంకేతిక అంశాలపై శిక్షణ పొందుతారు. పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. ప్రాజెక్టు పర్యవేక్షణకు ఉన్నత కమిటీ 1.62 లక్షల మంది విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సుల ప్రాజెక్టు అమలు, పురోగతి పరిశీలనకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి ఛైర్మన్‌గా, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి సభ్యుడిగా, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా మరో నలుగురితో కమిటీ ఏర్పాటైంది. మైక్రోసాఫ్ట్‌తో ఉన్నత విద్యామండలి ఒప్పందం గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుండగా కరోనా వల్ల ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగినందున 2022 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. శిక్షణలో భాగంగా మైక్రోసాఫ్ట్ గుర్తించిన సంస్థల ద్వారా మాక్ టెస్టులు, పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపడతారు. విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ అందించే సర్టిఫికెట్లను డిజి లాకర్లో భద్రపరుస్తారు. ఎంతో ప్రయోజనకరం విద్యార్ధులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాల శిక్షణపై మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ ప్రతిపాదనలు అందించిన అనంతరం ప్రభుత్వం సంబంధిత నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. మైక్రోసాఫ్ట్ ప్రతిపాదనలతో రాష్ట్ర విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివిధ యూనివర్సిటీలు, కాలేజీల ద్వారా స్టేక్హోల్డర్ల నుంచి కూడా అభిప్రాయాలను తీసుకుంది. మైక్రోసాఫ్ట్ శిక్షణతో పలు రకాలుగా మేలు జరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో నిర్వహించిన సమావేశానికి మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఓమ్‌జివాన్ గుప్తా తదితరులు హాజరై ప్రతిపాదనలను వివరించారు. అకడమిక్ ప్రోగ్రామ్స్‌లో మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమాలను చేర్చడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని, సర్టిఫికేషన్ కోర్సులతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని వీసీలు పేర్కొన్నారు. -
వరంగల్‌లో క్యాంపస్ సెలక్షన్స్
వరంగల్ : నగరంలోని న్యూసైన్స్ కాలేజీలో 2021 అక్టోబరు 1న మెగా క్యాంపస్ సెలక్షన్స్ జరగనున్నాయని కాలేజీ డైరెక్టర్లు కే రవీందర్‌రెడ్డి, జే శ్రీధర్‌రావులు తెలిపారు. ఈ క్యాంపస్ సెలక్షన్స్‌లో టెక్ మహీంద్రా, ఎయిర్టెల్, పేటీఎం, శామ్సంగ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర 25 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నట్టు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ ఫైనలియర్ పాసై విద్యార్థులు ఈ క్యాంపస్ సెలక్షన్స్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. అయితే విద్యార్థులు వయస్సు 28 ఏళ్లు మించరాదని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. -
ప్రముఖులతో పాఠాలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠ్యపుస్తకాల చదువులను తగ్గించి, సామాజిక అవగాహన మేళవించి సరికొత్త బోధనను అందుబాటులోకి తేనున్నారు. రాజకీయ ప్రముఖులు, ఆర్థికవేత్తలు, మాజీ ఐఏఎస్‌లు, ఇతర మేధావులతో పాఠాలు చెప్పించబోతున్నారు. ఈ దిశగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి బీఏ ఆనర్స్ కోర్సులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మంగళవారం హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ కొత్త కోర్సును లాంఛనంగా ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ (పొలిటికల్), నిజామ్ కాలేజీలో బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్)ను అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలుపెట్టనున్న ఈ కోర్సులో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్‌లో వీటిని చేరుస్తారు. రెండు కాలేజీల్లో లభించే ఆదరణను బట్టి రాష్ట్రవ్యాప్తంగా కోర్సును విస్తరించే వీలుందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ప్రస్తుతానికి మూడేళ్ల కాలపరిమితితోనే కోర్సు ఉంటుందని, మున్ముందు నాలుగేళ్లకు పెంచుతామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ పాల్గొన్నారు. కోర్సు లక్ష్యం ఇదీ.. ఉమ్మడి రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం బీఏ ఆనర్స్ కోర్సును సమర్థవంతంగా నిర్వహించారు. అప్పట్లో ఈ కోర్సు చేసిన వారికి ఇంటర్మీడియెట్ బోధించే అర్హత కూడా ఉండేది. సైన్స్ కోర్సుల ప్రాధాన్యం పెరగడంతో ఆనర్స్ తెరమరుగైంది. సంప్రదాయ బీఏ కోర్సుల్లో చేరే వారి సంఖ్య 16 శాతానికి పరిమితమైంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో బీఏ చదివే వారి సంఖ్య పెరుగుతోంది. అదీగాక ఈ కోర్సు కోసం ఇక్కడి నుంచి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. సామాజిక అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ఉన్నత విద్యామండలి తెలిపింది. పాఠ్యపుస్తకాల్లో అంశాలకు 50 శాతం మార్కులిస్తే, సామాజిక అవగాహనకు మరో 50 మార్కులు ఇస్తారు. ఆనర్స్ కోర్సును వ్యాపారం కాకుండా, ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహిస్తే బాగుంటుందని వినోద్‌కుమార్ సలహా ఇచ్చారు. సమాజాన్ని అర్థం చేసుకోకపోతే అది చదువే కాదని, దీన్ని గుర్తించే ఆనర్స్ తెస్తున్నట్టు తెలిపారు. -
అనూష కేసు: రెండేళ్లు గా వేధిస్తున్నాడు!
గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష(19) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దర్యప్తులో భాగంగా కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు విష్ణువర్ధన్ మృతురాలు అనూషను గత రెండేళ్ళుగా వేధిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మొదట విష్ణువర్ధన్, అనూషను పాలపాడు కాలువ వద్దకు మాట్లాడుకుందామని తీసుకేళ్ళాడు. ఇద్దర మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఆవేశంతో ఊగిపోయిన నిందితుడు అనూషను గొంతు నులిమి హత్య చేసి, మృతదేహన్ని కాల్వలోకి పడేశాడు. కాగా, పోలీసులు నిందితుడు విష్ణువర్ధన్‌పై దిశా, పలు చట్టాల కింద కేసులను నమోదు చేశారు. ఈఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఇప్పటికే నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారుల్ని ఆదేశించిన విషయం తెలిసిందే. చదవండి: డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది. -
డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య
చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ప్రేమ పెడదారి పట్టింది. ప్రేమించిన తోటి విద్యార్థినిపై అనుమానం పెనుభూతమైంది. విచక్షణ పోయింది. రాక్షసత్వం ఆవహించింది. ఆమెను గొంతునులిమి చంపేశాడు. గుంటూరు జిల్లాలో బుధవారం ఈ దారుణం జరిగింది. డిగ్రీ చదువుతున్న యువకుడు తోటి విద్యార్థినిని దారుణంగా హత్యచేశాడు. నరసరావుపేట రూరల్: గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం డిగ్రీ విద్యార్థిని అనూష (19) హత్యకు గురైంది. సహ విద్యార్థి మేడా విష్ణువర్ధన్‌రెడ్డి ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని కాలువలో పడేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటనను జీర్ణించుకోలేని అనూష కుటుంబసభ్యులు, బంధువులు, విద్యార్థులు మృతదేహంతో సహా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రాత్రి పదిగంటల సమయంలో విద్యార్థులు ఆందోళన విరమించారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన కోట ప్రభాకరరావు, వనజ దంపతుల కుమార్తె అనూష నరసరావుపేటలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. రోజూ కళాశాల బస్సులో ఇంటిదగ్గర నుంచి వచ్చి వెళుతోంది. బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మేడా కోటిరెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఆమెతోపాటే చదువుతున్నాడు. కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. వారిమధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పథకం ప్రకారమే.. రోజూలాగే బుధవారం కళాశాల బస్సులో నరసరావుపేట వచ్చిన అనూష పాలకేంద్రం సెంటర్ వద్ద దిగింది. కాలేజీకి వెళుతున్న ఆమెను విష్ణువర్ధన్‌రెడ్డి ఆటోలో రావిపాడు వైపు తీసుకెళ్లాడు. మెయిన్‌రోడ్డుపై ఆటో దిగి గోవిందపురం మైనర్ కాలువ వైపు నడిచి వెళుతుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే అనుమానంతో రగిలిపోతున్న విష్ణువర్ధన్‌రెడ్డి ఆవేశంతో అనూష గొంతు పట్టుకున్నాడు. పైశాచికంగా గొంతుపట్టుకున్న అతడి చేతుల్లో ఆమె విలవిల్లాడుతూ ప్రాణాలొదిలింది. ఆమె మృతదేహాన్ని కాలువలోని గుర్రపుడెక్క మధ్య పడేసిన విష్ణువర్ధన్‌రెడ్డి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అతడి నుంచి వివరాలు సేకరించిన రూరల్ సీఐ వై.అచ్చయ్య, ఎస్ఐలు రోశయ్య, బాలకృష్ణ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థుల ఆందోళన నిన్నటివరకు తమ మధ్య తిరిగిన అనూష దారుణ హత్యను తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో వారు ఆస్పత్రి నుంచి అనూష మృతదేహాన్ని పల్నాడు బస్టాండ్ సెంటర్‌కు తీసుకొచ్చి.. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రాస్తారోకోకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారి ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. నరసరావుపేట సబ్‌కలెక్టర్ శ్రీవాసు నుపూర్ అజయ్‌కుమార్, డీఎస్పీ విజయకుమార్ ఆందోళన చేస్తున్నవారితో చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను వారికి తెలిపారు. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాత్రి పదిగంటల సమయంలో వారు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై దిశ చట్టం కింద కేసు నమోదు అధికారులను ఆదేశించిన సీఎం జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా నరసరావుపేటలో కళాశాల విద్యార్థిని అనూష హత్యకు గురైన సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్న ముఖ్యమంత్రి.. అనూష కుటుంబానికి తక్షణమే రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచి వారికి భరోసా ఇవ్వాలని సూచించారు. బాధ్యులపై దిశ చట్టం కింద వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని, విచారణ వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నేరస్తులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
వారిని ప్రమోట్ చేసేద్దామా!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులను పరీక్షల్లేకుండానే ప్రమోట్ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, సాంకేతిక విద్య, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, వివిధ వర్సిటీల ఇన్‌ఛార్జి వీసీలు జయేశ్ రంజన్, అరవింద్‌కుమార్, జనార్దన్‌రెడ్డి తదితరులతో సమావేశం గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. డిగ్రీ, పీజీ (ఇంజనీరింగ్ సహా) ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నిర్వహించాలా? వద్దా? అనే దానిపై చర్చించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ కష్టమనే భావన వ్యక్తమైనట్లు తెలిసింది.(ఇంటర్ ఫలితాలు బాలికలే టాప్) కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ వల్ల మరిన్ని సమస్యలు వస్తాయనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఒక్కో పరీక్ష కేంద్రానికి వందల మంది విద్యా ర్థులు రావడం, ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు చేతులు మారడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు పరీక్షలు నిర్వహించకుండా ఇంటర్నల్ మార్కుల ఆధారంగా, లేదా కిందటి సెమిస్టర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా పాస్‌చేస్తే ఎలా ఉంటుందనే దానిపైనా చర్చించారు. మొత్తానికి పరీక్షలను రద్దుచేసి, ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే ప్రమోట్ చేయాలనే అభిప్రాయాన్ని ఎక్కువ మం ది అధికారులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో చివరకు పరీక్ష ల రద్దుకు సమావేశం మొగ్గు చూపినట్లు సమాచారం. సీఎంకు నివేదిక.. ఆపై నిర్ణయం పరీక్షలు నిర్వహిస్తే లేదా నిర్వహించకపోతే తలెత్తే సమస్యలపై సమగ్ర నివేదికను రూపొందించి సీఎం కేసీఆర్‌కు అందజేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. దానిపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారనే భావనకు ఉన్నతాధికారులు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు రద్దుచేస్తే ఏ ప్రాతిపదికన విద్యార్థులను ప్రమోట్ చేయాలి?, మార్కులెలా ఇవ్వాలనే మార్గదర్శకాలను నివేదికలో పొందుపరచాలని నిర్ణయించారు. ఇప్ప టికే డిటెన్షన్‌ను ఎత్తివేసి, ప్రమోట్ చేసి నందున పరీక్షల సంగతి తరువాత చూసుకోవచ్చని, ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీఎంకు విన్నవించాలని నిర్ణ యించినట్లు తెలిసింది. ఫైనల్ సెమిస్టర్ లో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను చేసినా, ఆయా విద్యార్థులకు సంబంధించిన బ్యాక్‌లాగ్స్ విషయంపైనా చర్చించారు. -
రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులను నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు కళాశాల విద్యాశాఖ పేర్కొంది. ఇంట్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని విద్యార్థులకు వీడియో పాఠాలను రూపొందించి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నట్లు వెల్లడించింది. ఆన్లైన్ డిగ్రీ పాఠాలపై అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ బాల భాస్కర్, జాయింట్ డైరెక్టర్ యాదగిరి, అకడమిక్ ఆఫీసర్ జె. నీరజ తదితరులతో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ బోధన పక్కాగా చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 125 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1,270 మంది రెగ్యులర్, 845 మంది కాంట్రాక్ట్, 530 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఒక్కొక్కరు ప్రతిరోజూ 3 చొప్పున ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఎస్వీయూ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా పీలేరులో అధికారుల నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాల్ టికెట్ల జారీ విషయంలో సాంకేతిక సమస్యలు రావడంతో తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో గందరగోళం తలెత్తింది. హాల్ టికెట్లలో పరీక్షా కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించటం వల్ల తాము సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో ఈ నెల 14, 15 వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి యధావిథిగా పరీక్షలు జరగాల్సి ఉండగా, ఇప్పుడు కూడా పరీక్ష కేంద్రాల చిరునామాలు తప్పుగా ముద్రించడంతో 399 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
పీలేరులో అధికారుల నిర్లక్ష్యం
-
డిగ్రీలో ఒకే తరహా గ్రేడింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సిలబస్ భారం తగ్గనుంది. ప్రతి కోర్సులో, ప్రతి సబ్జెక్టులో కొన్ని పాఠ్యాంశాలను తగ్గించి కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న 180 క్రెడిట్ పాయింట్లను 150 క్రెడిట్లకు తగ్గించాలని నిర్ణయించింది. అలాగే పది పాయింట్ల యూనిఫామ్ గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. దీంతోపాటు డిగ్రీలో ఔట్‌కమ్ బేస్డ్ విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. ప్రతి పాఠ్యాంశానికి ముందు, ప్రతి పుస్తకానికి ముందు పేజీల్లో దానిని చదివితే ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తూ ముందుమాట పొందుపరిచేందుకు చర్యలు చేపట్టింది. ఆయా కోర్సు చదివితే భవిష్యత్తులో ఉండే అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కలిగేలా విషయాన్ని పుస్తకాల్లో పొందుపరుచాలని నిర్ణయించింది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమల్లోకి తెచ్చి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఆ విధానంపై సమీక్షించి ఈ నిర్ణయాలు తీసుకుంది. అంతేకాదు విద్యా ర్థుల్లో సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపునకు డిగ్రీలో ప్రాధాన్యం ఇవ్వనుంది. కోర్ సబ్జెక్టులు, ఎలక్టివ్స్‌తోపాటు వీటిని తప్పనిసరి అంశాలుగా చేర్చింది. ఈ మేరకు సిలబస్‌లో మార్పులు తెస్తోంది. ఇందులో భాగంగా వివిధ యూనివర్సిటీలకు చెందిన తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, కన్నడ, సంస్కృతం, పర్షియన్, అరబిక్, మరాఠీ విభాగాలకు చెందిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, విభాగాధిపతులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి భేటీ అయ్యారు. భాషల్లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. మిగతా సబ్జెక్టుల వారితోనూ సమావేశమై సిలబస్ తగ్గింపునకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మార్పు లను 2019–20 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేవాలని మండలి నిర్ణయించింది. ఒక్కో వర్సిటీలో ఒక్కోలా గ్రేడింగ్ ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక్కో వర్సిటీలో ఒక్కో తరహా గ్రేడింగ్, మార్కుల విధానం ఉంది. ఒక వర్సిటీలో గ్రేడింగ్ ఎ+ నుంచి ప్రారంభిస్తే కొన్నింట్లో ఎ నుంచి ఉంది. కొన్ని వర్సిటీల్లో 80 శాతం నుంచి 100 శాతం మార్కులు వస్తే ఎ గ్రేడ్ ఉండగా, కొన్నింట్లో 90 శాతం నుంచి 100 శాతం మార్కులు వచ్చినా ఎ గ్రేడ్ ఉంది. ఈ నేపథ్యంలో అన్ని వర్సిటీల్లో ఒకే తరహా గ్రేడింగ్, మార్కుల విధానం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. యూజీసీ నిబంధనల మేరకు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా డిగ్రీలో ఉన్న క్రెడిట్స్‌ను తగ్గించాలని నిర్ణయించింది. యూజీసీ నిబంధనల ప్రకారం 120 క్రెడిట్స్‌తో మూడేళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేయవచ్చు. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు 180 క్రెడిట్స్‌తో డిగ్రీ కోర్సును నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులపై భారం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి సెమిస్టర్లో 25 క్రెడిట్స్ చొప్పున మూడేళ్లలో ఆరు సెమిస్టర్లకు 150 క్రెడిట్స్‌తో డిగ్రీని పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఆ మేరకు పాఠ్యాంశాలను తగ్గించాలని నిర్ణయించారు. ఔట్‌కమ్ బేస్డ్ విద్యా విధానం సిలబస్ మార్పులతోపాటు డిగ్రీలో ఔట్‌కమ్ బేస్డ్ విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. ఔట్‌కమ్ బేస్డ్ లెర్నింగ్, ఔట్ కమ్ బేస్డ్ టీచింగ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఒక విద్యార్థి ఒక కోర్సులో చేరుతున్నప్పుడు ఆ కోర్సులో చేరితే చేకూరే ప్రయోజనాలు, భవిష్యత్‌లో అవకాశాలను లెక్చరర్లు క్షుణ్ణంగా వివరిస్తారు. అలాగే ప్రతి సబ్జెక్టులో ముందు పేజీల్లో దాన్ని చదివితే విద్యార్థికి లభించే ప్రయోజనాలు, అందే విజ్ఞానం గురించి చెబుతారు. ప్రతి పాఠ్యాంశం ముందు కూడా అలాగే ప్రయోజనాలను పొందుపరుస్తారు. మూడేళ్ల పాటు భాషలు, ఇతర మార్పులు భాషా సబ్జెక్టులు ప్రస్తుతం డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనే 4 సెమిస్టర్లలో ఉన్నాయి. వాటిని ఇకపై మూడేళ్లపాటు ఆరు సెమిస్టర్లలో కొనసాగిస్తారు. వీటికి 20 క్రెడిట్స్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. వీటితోపాటు.. - ఐదో సెమిస్టర్లో జనరల్ ఎలక్టివ్‌కు 4 క్రెడిట్స్, ఆరో సెమిస్టర్లో ప్రాజెక్టు వర్క్ పెట్టి దానికి 4 క్రెడిట్స్ ఇవ్వాలని మండలి నిర్ణయించింది. - ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సు, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సును తప్పనిసరి సబ్జెక్టులుగా అమలు చేయనున్నారు. ఇందులో ఎన్విరాన్మెంట్ సైన్స్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్‌తోపాటు ఇతర అంశాలు నేర్పిస్తారు. - ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఇతర స్పోర్ట్స్‌కు మొత్తంగా 6 క్రెడిట్స్ ఇవ్వనున్నారు. - విద్యార్థులకు 6 వారాల పాటు సమ్మర్ ఇంటర్న్‌షిప్ అమలు చేయనుంది. ప్రథమ సంవత్సరం పూర్తయ్యాక లేదా ద్వితీయ సంవత్సర పూర్తయిన తరువాత దీనిని అమలు చేయనుంది. దానికి 2 క్రెడిట్స్ ఇవ్వనుంది. - అలాగే బీకాంలో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేలా చర్యలు చేపట్టింది. బీకాంతోపాటు బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీకాం అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్, బీకాం టాక్స్ ప్రొసీజర్స్, బీకాం ఫారిన్ ట్రేడ్, బీకాం హానర్స్ కోర్సులను నిర్వహించాలని నిర్ణయించింది. - ఇప్పటివరకు ఉన్న బీకాం కంప్యూటర్స్, బీకాం ఈ కామర్స్ రెండింటిని కలిపి బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్‌గా నిర్వహించనుంది. -
ఉపకారం... ‘సెట్’ చేశారు!
సాక్షి, హైదరాబాద్: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేస్తోంది. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకుగాను విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా దరఖాస్తు చేసే క్రమంలో వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి వస్తోంది. కోర్సు చదివినన్ని సంవత్సరాలు ఇలా ప్రతిసారీ వివరాల నమోదు ఇబ్బందికరంగా మారుతోంది. పైగా నమోదు క్రమంలో ఏవైనా పొరపాట్లు జరిగితే వారి ఉపకారవేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈక్రమంలో దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎస్సీ అభివృద్ధిశాఖ కసరత్తు చేస్తోంది. ఇకపై సెట్ (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఆధారంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దరఖాస్తు చేసే ప్రక్రియలో కేవలం సెట్ హాల్‌టికెట్ నంబర్ నమోదు చేసిన వెంటనే విద్యార్థి వివరాలు పేజీలో ప్రత్యక్షమవుతాయి. ఇందులో కోర్సు, కాలేజీ తదితర వివరాలను ఎంట్రీ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేసిన వెంటనే దరఖాస్తు కాలేజీ యూజర్ ఐడీకి చేరుతుంది. అన్ని డిగ్రీ, పీజీ కోర్సులకు.. ఇంటర్మీడియెట్ మినహాయిస్తే డిగ్రీ విద్యార్థులకు దోస్త్, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ టెస్టుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సెట్‌కు దరఖాస్తు చేసుకున్న వివరాలను ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ఫారంలో ప్రత్యక్షమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు దోస్త్, సెట్ల వెబ్సైట్లను ఈపాస్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఈమేరకు సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) అధికారులతో ఎస్సీ అభివృద్ధి శాఖ సంప్రదింపులు చేస్తోంది. ఈపాస్ వెబ్‌సైట్‌తో వివిధ సెట్ల వెబ్‌పేజీలను అనుసంధానం చేస్తే సర్వర్, సాంకేతికత సమస్యలు కూడా తీరుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చించిన అధికారులు వచ్చే విద్యా ఏడాది నుంచి కొత్త విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకులు పి.కరుణాకర్ సాక్షితో అన్నారు. -
74 మంది విద్యార్థులకు అస్వస్థత
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలంలోని పెర్కిట్‌లో గల సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళా శాలలో ఆహారం వికటించి 74 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాలలో శుక్రవారం రాత్రి విద్యార్థులు భోజనం చేసి పడుకున్నాక వేకువజామున నుంచి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో కళాశా ల ప్రిన్సిపల్, కేర్ టేకర్‌కు సమాచారం ఇవ్వగా వారు ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్మూర్ డిప్యూటీ డీఎం హెచ్‌వో రమేశ్, వైద్యులు అశోక్, స్వాతి వినూత్న, వైద్య సిబ్బంది హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. ఆర్మూర్ డివిజన్లోని ఐదు రాష్ట్రీయ బాల ల స్వస్థ్య కార్యక్రమ్ బృందాలు కళాశాలకు చేరుకునారు. తీవ్ర అస్వస్థతకు గురైన 40 మంది విద్యార్థులకు వైద్యాధికారులు కళాశాలలోనే సెలైన్ బా టిళ్లు ఏర్పాటు చేసి చికిత్సలు అందజేశారు. మరో 34 మంది విద్యార్థులకు మాత్రలతో నయం చేశా రు. మధ్యాహ్నం విద్యార్థుల పరిస్థితి నిలకడకు వ చ్చింది. కారణాలు అవేనా.. కళాశాలలో 380 మంది విద్యార్థులున్నారు. శుక్రవారం 361 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా రాత్రి ఆహారంలో విద్యార్థులకు పప్పు, ఆలుగడ్డ కూరలను వడ్డించారు. ఆలుగడ్డ కూర మాడి పోవడంతో విద్యార్థులు దాన్ని వదిలి పప్పుతో భోజనం చేశారు. మాడిపోయిన కూరను తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాగా దీనికి ముందు విద్యార్థులు ఐరన్ మాత్రలను తీసుకున్నారు. ఖాళీ కడుపుతో ఐరన్ మాత్రలను తీసుకోవడంతో వచ్చే గ్యాస్ట్రిక్తో విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని కొందరి అభిప్రాయం. ఆర్నెళ్ల కిందే కళాశాల ఏర్పాటు.. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో ఆరు నెలల క్రితం కళాశాలను ఏర్పాటు చేశారు. వర్ని మండలం చందూర్‌లో ఉన్న కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఆశించినంత లేక పోవడంతో ఆర్మూర్‌కు తరలించారు. పెర్కిట్‌లోని ఒక ప్రైవేటు కళాశాలను అద్దెకు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు కళాశాలలోని అవసానదశకు చేరుకున్న వంట పాత్రలల్లో ఆహార పదార్థాలు వండడం ద్వారా అడుగంటి మాడిపోతున్నాయని వంట చేసేవారు పేర్కొంటున్నారు. తిన్న తర్వాతనే ఇలా జరిగింది.. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర పోయాం. అయితే కాసేపటికి కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. కేర్ టేకర్ దగ్గరకు వెళ్లగా ఉపశమనానికి మందు గోలీలను ఇచ్చారు. –దివ్య, సెకండియర్, చల్లగరిగ కూరలు మాడిపోయాయి.. రాత్రి అందజేసిన ఆహార పదార్థాలలో ఆలుగడ్డ కూర మాడిపోయింది. దీంతో పప్పుతో భోజనం చేశాం. ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా కళాశాలలోని 70 మంది విద్యార్థులకు అవస్థలు పడ్డాం. –హారిక, సెకండియర్, చౌట్పల్లి -
దారుణం : డిగ్రీ విద్యార్థులు తాగి.. ఘర్షణకు దిగి
సాక్షి, జగిత్యాల : జగిత్యాల మండలం తాటిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఘర్షణకుదిగారు. ఈ ఘర్షణలో ఒక విద్యార్థి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. తాటిపల్లికి చెందిన సాధినేని నవీన్, బొలిశెట్టి శ్రవణ్ ఇద్దరూ.. డిగ్రీ చదువుతున్నారు. వీరు మద్యం సేవించిన అనంతరం ఇద్దరు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో సాధినేని నవీన్‌ను బొలిశెట్టి శ్రవణ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటన గురించి సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణాలు తెలియదని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.