సీట్లు కేటాయించిన కళాశాల విద్యా శాఖ.. చేర్చుకోమంటున్న కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: కళాశాల విద్యా శాఖ అధికారుల నిర్వాకం వల్ల డిగ్రీ ఆన్‌లైన్‌లో సీట్లు పొందిన వేల మంది విద్యార్థులు రోడ్డు న పడ్డారు. ఆన్‌లైన్ ప్రవేశాల నుంచి మినహాయింపు పొందిన 13 కాలేజీలను కూడా వెబ్ కౌనె ్సలింగ్ పెట్టి విద్యా శాఖ సీట్లు కేటాయించడంతో ఈ గందరగోళ పరిస్థితి తలెత్తింది. కోర్టు ద్వారా తాము మినహాయింపు పొందామని, కళాశాల విద్యా శాఖ కేటాయించిన విద్యార్థులను చేర్చుకోమని కళాశాలలు చెబుతున్నాయి. శాఖ నిర్ణయించిన రూ. 3,500 వార్షిక ఫీజుకు తాము ఒప్పుకోనందున కోర్టును ఆశ్రయించి ఆన్‌లైన్ ప్రవేశాలనుంచి తప్పుకున్నామంటున్నాయి.
కాలేజీలో చేరాలంటే తాము నిర్ణయించిన రూ.40వేల-రూ.60వేల వరకు చెల్లించాల్సిం దేనంటున్నాయి. ఆప్షన్ల విషయాన్ని కళాశాల విద్యా శాఖ, ఓయూ అధికారుల దృష్టికి తీసుకెళ్లిరా వారు పట్టిం చుకోవడం లేదని విద్యార్థులంటున్నారు. కాలేజీల్లో రిపోర్టింగ్ గడువు శనివారంతో ముగియునుందని, ఇపుడు ఆప్ష న్లు ఇద్దామన్నా మంచి కాలేజీలు లేవం టున్నారు. ఓ విద్యార్థి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిని కలిసి తన ఆవేదన వ్యక్తం చేశాడు.
రోడ్డున పడిన డిగ్రీ విద్యార్థులు
Published Sat, Jul 2 2016 3:14 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement