గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష(19) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దర్యప్తులో భాగంగా కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు విష్ణువర్ధన్ మృతురాలు అనూషను గత రెండేళ్ళుగా వేధిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మొదట విష్ణువర్ధన్, అనూషను పాలపాడు కాలువ వద్దకు మాట్లాడుకుందామని తీసుకేళ్ళాడు. ఇద్దర మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఆవేశంతో ఊగిపోయిన నిందితుడు అనూషను గొంతు నులిమి హత్య చేసి, మృతదేహన్ని కాల్వలోకి పడేశాడు.
కాగా, పోలీసులు నిందితుడు విష్ణువర్ధన్‌పై దిశా, పలు చట్టాల కింద కేసులను నమోదు చేశారు. ఈఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఇప్పటికే నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు డీఎస్పీ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment