గుంటూరు, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు తమ చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి 30 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై గుర్తు తెలియని ఆగంతకులు దాడులు చేశారు. ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడడంతో పాటు ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా.. రౌడీ మూక వెనక్కి తగ్గలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు.
పచ్చమూక దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి రజిని.. బీసీ అయిన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. ఓటమి భయంతో.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారామె. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారామె. మరోవైపు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే మంత్రి రజినీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఎవరున్నా విడిచిపెట్టేది లేదు: మంత్రి రజిని వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment