చంద్రబాబు విష క్రీడలో అమాయకులు బలి
రాజకీయ స్వలాభం కోసం అసత్యాల ప్రచారం
సామాన్యులపై దూషణలకు దిగే సోషల్ మాఫియాలకు కోట్లు
నిందలు తట్టుకోలేక నిండు ప్రాణాలు తీసుకుంటోన్న అమాయకులు
మేలు చేసిన సీఎం, ఎమ్మెల్యేలను మెచ్ఛుకోవడమే ఆమె చేసిన పాపం. చాన్నాళ్ళ కు ఓ గూడు దొరికిందన్న సంతోషాన్ని మిగల్చకుండా సోషల్ మీడియా ముసుగులో టీడీపీ- జనసేన రాబందులు వాలిపోయాయి. ట్రోల్స్ తో పీక్కు తిన్నాయి. అవమానాలు తట్టుకోలేక ఆ మహిళ ఆఖరుకు ఉసురు తీసుకోవడమే మేలు అనుకుంది. రైలు చక్రాల కింద నలిగి పోయింది.
సాక్షి, గుంటూరు: టీడీపీ, జనసేన వేధింపులు ఓ మహిళ ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీలో ఇంటి స్థలం గురించి మాట్లాడిన మహిళను మానసికంగా హింసించి ఆమె చావుకు యమపాశంగా మారాయి. ఇళ్ల పట్టా వచ్చిందన్న ఆనందంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాటు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌లను మెచ్చుకుంటూ ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడటమే ఆ మహిళ పాలిట శాపమైంది. జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ టీడీపీ, జనసేన మితిమీరిన ట్రోలింగ్ కారణంగా అవమాన భారం తట్టుకోలేక రైలు కింపడి ఆత్మహత్య చేసుకుంది.
వివరాలు.. గుల్టి గీతాంజలి దేవి(29) గృహిణి, ఆమె భర్త బాలచంద్ర బంగారం పని చేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిత నాలుగో తరగతి, చిన్న కుమార్తె రిషిక ఒకటో తరగతి చదువుతున్నారు. తెనాలిలోని ఇస్లాంపేటలో నివసిస్తున్నారు. పెద్ద కుమార్తెకు నాలుగు సార్లు ‘అమ్మ ఒడి’ వచ్చింది. ఈమెకు ఇటీవల జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది.
ఈనెల 4వ తేదీన కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాను అందుకుంది. ఆ తర్వాత తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ ఛానల్‌తో పంచుకుంది. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని, స్వంత ఇళ్లు అనేది అందరి కల అని, ఇళ్ల స్థలం పొందడం ద్వారా తన కల నెరవేరిందంటూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడింది. తన పిల్లలకు అమ్మ ఒడి కూడా వస్తోందని, ఇన్ని మంచి పనులు చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను మళ్లీ గెలిపించుకోవడం తమ బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది.
అయితే ఆమె మాటలను కొందరు టీడీపీ, జనసేన కార్యకర్తలు వివరీతంగా ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టారు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన గీతాంజలి రెండు రోజుల క్రితం తెనాలి రైల్వేస్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం తుదిశ్వాస విడిచింది. అయితే ఒక బీసీ మహిళ.. కేవలం ఇళ్ల పట్టా వచ్చిందన్న తన ఆనందాన్ని పంచుకోవడమే ఆమె చేసిన తప్పా అంటూ పలువురు ప్రశ్నిస్తుండగా టిడిపి సోషల్ మీడియానే దారుణమైన ట్రోల్స్ చేసి ఆమెను బలితీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మాఫీయా కేరాఫ్ ‘టీడీపీ - జనసేన’
‘వాలంటీర్లు మాకు బీడీ కట్ట తెచ్చి పెడతారా, ఓయి వాలంటీర్ నాకు కండోమ్ తెచ్చిపెడతావా అంటూ తెలుగుదేశం సోషల్ మీడియా చేసిన విషప్రచారంతో చేస్తున్న సేవలో కూడా హేళన ఎదుర్కొని మనస్తాపంతో మొన్న వాలంటీర్ నవీన చనిపోతే.. నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమెరికన్ ఇంగ్లీష్ స్లాంగ్ నేర్చుకున్న నిరుపేద మేఘన అనే బాలిక తెలుగుదేశం, జనసేన చేసిన ట్రోల్స్‌తో మానసిక వేదనకు గురైంది.
నేడు ప్రభుత్వం నుంచి లబ్ది పొందాను అంటూ ధైర్యంగా చెప్పిన పాపానికి తెలుగుదేశం, జనసేన ట్రోల్ పేజీల మాఫీయా వేదింపులకి గీతాంజలి ప్రాణాలు తీసుకుంది. తమ రాజకీయ స్వలాభం కోసం, అసత్యాలను ప్రచారం చేస్తూ, అది తప్పు అని చెప్పిన సామాన్యులపై దుషణలకు దిగే సోషల్ మాఫీయాలను కోట్లు వెచ్చింది పెంచి పోషిస్తున్న తెలుగుదేశం జనసేన మాఫీయాని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది.’ అంటూ నిప్పులు చెరుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment