Guntur: ఆఫీసుపై దాడి.. మంత్రి రజిని సీరియస్‌ వార్నింగ్‌ | Vidadala Rajini Serious Comments On TDP And Janasena Activists | Sakshi
Sakshi News home page

ఆఫీసుపై దాడి వెనుక ఎవరున్నా విడిచిపెట్టేది లేదు: మంత్రి రజిని వార్నింగ్‌

Published Mon, Jan 1 2024 9:27 AM | Last Updated on Wed, Jan 24 2024 4:49 PM

Vidadala Rajini Serious Comments On TDP And Janasena Activists - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు. 

ఈ సందర్భంగా మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీసీ మహిళనైన నన్ను దాడులతో భయపెట్టలేరు. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడి. రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజలు మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొంటాం. ఈ ఘటన వెనుక ఉన్న వారికీ గుణపాఠం చెబుతాం. చంద్రబాబు, నారా లోకేష్‌కు బీసీలపై కపట ప్రేమ. బీసీ మహిళా మంత్రిగా ఉన్న నా కార్యాలయంపైనే దాడి చేశారు. బీసీలంటే ఎంత చిన్న చూపో అర్థం అవుతుంది. పక్కా ప్రణాళికతో ఇలా దాడి చేశారు. లాఠీఛార్జ్ చేసినప్పటికి దాడి కొనసాగించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించు​కోవడాన్ని ఎల్లో బ్యాచ్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు జయహో బీసీ అంటారు.. మరొకవైపు బీసీ మంత్రుల ఆఫీసులపై రాళ్లు రువ్వుతారు. గుంటూరులో ఆఫీసులపైన దాడి చేసే సంస్కృతి ఇప్పటి వరకు లేదు. తాము అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులుంటాయో రాత్రి ఘటనతోనే ప్రజలకు చెప్పారు. బీసీ మహిళ పోటీ చేయకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి అని కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement