Guntur West Assembly Constituency
-
గుంటూరు వెస్ట్‌లో టీడీపీకి భారీ షాక్
కాకినాడ,సాక్షి: ఎన్నికల వేళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్జగన్ మోహన్‌రెడ్డి వారందరినీ ఆప్యాయంగా పలుకరించి, కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం మేమంతా సిద్ధం బస్సు యాత్ర నైట్ స్టే పాయింట్ వద్ద చేరికల కార్యక్రమం జరిగింది. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో మాజీ కార్పొరేటర్ ఎస్.కెసైదా, మొండి బండ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ, టీడీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మేకల మాధవయాదవ్ తదితరులున్నారు. ఇదీ చదవండి.. మేమంతా సిద్ధం.. 18వ రోజు సీఎంజగన్‌కు ఘన స్వాగతం -
రాజకీయ నేపథ్యం: గుంటూరు పశ్చిమ అభ్యర్థి విడదల రజిని
గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినిని అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో చిలకలూరిపేట నుంచి గెలుపొందిన ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వరుసగా రెండుసార్లు తెలుగుదేశం గెలిచిన ఈ నియోజకవర్గంలో రజిని తనదైన ముద్ర వేశారు. ఆమెకు పోటీగా ఎవరిని పెట్టాలనే దానిపై తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోయి ఇప్పటి వరకూ కష్టపడ్డ వారందరిని కాదని, ఒక మహిళకు కేటాయించాల్సి వచ్చింది. నియోజకవర్గం: గుంటూరు పశ్చిమ పేరు: విడదల రజిని వయస్సు.: 34 విద్యార్హత: బీఎస్సీ, ఎంబీఏ సామాజిక వర్గం: కాపు ఎన్నికల్లో పోటీ: రెండో సారి రాజకీయ నేపథ్యం: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018లో వైఎస్సార్ సీపీలో చేరారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేసి అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. -
మంత్రి రజిని ఆఫీస్‌పై దాడి.. 30 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు తమ చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి 30 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై గుర్తు తెలియని ఆగంతకులు దాడులు చేశారు. ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడడంతో పాటు ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా.. రౌడీ మూక వెనక్కి తగ్గలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు. పచ్చమూక దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి రజిని.. బీసీ అయిన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. ఓటమి భయంతో.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారామె. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారామె. మరోవైపు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే మంత్రి రజినీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎవరున్నా విడిచిపెట్టేది లేదు: మంత్రి రజిని వార్నింగ్ -
Guntur: ఆఫీసుపై దాడి.. మంత్రి రజిని సీరియస్ వార్నింగ్
సాక్షి, గుంటూరు: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీసీ మహిళనైన నన్ను దాడులతో భయపెట్టలేరు. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడి. రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజలు మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొంటాం. ఈ ఘటన వెనుక ఉన్న వారికీ గుణపాఠం చెబుతాం. చంద్రబాబు, నారా లోకేష్‌కు బీసీలపై కపట ప్రేమ. బీసీ మహిళా మంత్రిగా ఉన్న నా కార్యాలయంపైనే దాడి చేశారు. బీసీలంటే ఎంత చిన్న చూపో అర్థం అవుతుంది. పక్కా ప్రణాళికతో ఇలా దాడి చేశారు. లాఠీఛార్జ్ చేసినప్పటికి దాడి కొనసాగించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడాన్ని ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు జయహో బీసీ అంటారు.. మరొకవైపు బీసీ మంత్రుల ఆఫీసులపై రాళ్లు రువ్వుతారు. గుంటూరులో ఆఫీసులపైన దాడి చేసే సంస్కృతి ఇప్పటి వరకు లేదు. తాము అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులుంటాయో రాత్రి ఘటనతోనే ప్రజలకు చెప్పారు. బీసీ మహిళ పోటీ చేయకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి అని కామెంట్స్ చేశారు.