ఆ పత్రికల పబ్లిషర్లు, ఎడిటర్లకు జగన్ తరఫున నోటీసులు ఇచ్చిన న్యాయవాదులు
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చౌక ధరకు ‘సెకీ’ విద్యుత్
యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో రాష్ట్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందం
ఇందులో మూడో పార్టీకి ఎలాంటి పాత్ర లేదు
అంతర్రాష్ట్ర సరఫరా చార్జీలు ఉండవని స్పష్టంగా చెప్పిన సెకీ.. అయినా ఉద్దేశపూర్వకంగా ఆ పత్రికలు తప్పుడు కథనాలు
దీనిపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
దానిని మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు.
సెకీ ఐఎస్‌టీఎస్ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ కథనాల వల్ల తమ క్లయింటు ప్రతిష్ట దెబ్బ తింటుందని ముందే తెలిసి, అందుకు అనుగుణంగా తప్పుడు ఆరోపణలతో కథనాలు ప్రచురించారని తెలిపారు. ఈ మేరకు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎన్.రాహుల్ కుమార్‌లకు వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు లీగల్ నోటీసు పంపారు.
ఇదీ చదవండి: సెకితో ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment