గుంటూరు, సాక్షి: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో.. తన పేరు ఉందన్న ప్రచారంపైనా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది ఉత్త మూర్ఖపు ప్రచారమేనని, కొంతమంది కావాలని చేస్తున్న రాద్ధాంతమని కుండబద్ధలు కొట్టారాయన. అలాగే తనపై తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి డెడ్‌లైన్ విధించారాయన.
‘‘సీఎంలు పారిశ్రామిక వేత్తలను కలుస్తారు. నేను ఐదేళ్ల కాలంలో అదానీని కలిశాను. వాటికి విద్యుత్ ఒప్పందాలకు ముడిపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో థర్డ్ పార్టీ ఎవరూ లేరు. ఇది ఏపీ ప్రభుత్వానికి, డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వానికి(సెకి) మధ్య జరిగిన ఒప్పందం. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై పరువు నష్టం దావా వేస్తా.
.. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలు. వాస్తవాల్ని వకక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయి. ఆ కేసులో నా పేరు ఎక్కడా లేదు. కానీ, ఆ రెండు మీడియా సంస్థలు నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయి. వాటికి లీగల్ నోటీసులు పంపిస్తా. వాటికి 48 గంటల ఇస్తున్నా. ఆ లోపు క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: సంపద సృష్టించిన జగన్.. ఆవిరి చేస్తున్న చంద్రబాబు! ఎలాగంటే..
Comments
Please login to add a commentAdd a comment