Legal Notices
-
ఈనాడు, ఆంధ్రజ్యోతికి జగన్ లీగల్ నోటీసులు
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి లీగల్ నోటీసులు... విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
-
ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. సెకీ ఐఎస్టీఎస్ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కథనాల వల్ల తమ క్లయింటు ప్రతిష్ట దెబ్బ తింటుందని ముందే తెలిసి, అందుకు అనుగుణంగా తప్పుడు ఆరోపణలతో కథనాలు ప్రచురించారని తెలిపారు. ఈ మేరకు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎన్.రాహుల్ కుమార్‌లకు వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు లీగల్ నోటీసు పంపారు.ఇదీ చదవండి: సెకితో ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన వైఎస్ జగన్ -
ప్రముఖ కమెడియన్ అలీకి నోటీసులు
అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలతో టాలీవుడ్ కమెడియన్ అలీకి నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి.. అలీ ఫామ్ హౌసులోని పనిమనుషులకు నోటీసులు అందజేశారు. అక్రమ నిర్మాణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఉంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!)విషయానికొస్తే వికారాబాద్ ఎక్మామిడి గ్రామంలో అలీకి వ్యవసాయ భూమి ఉంది. కుటుంబంతో ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్తుంటారు. అయితే అనుమతి లేకుండా ఆ స్థలంలో ఫామ్ హౌస్ నిర్మించారని, అలానే పన్ను చెల్లించకుండా అందులో నిర్మాణాలు చేపట్టినట్లు గ్రామ కార్యదర్శి శోభారాణి గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.అక్రమ నిర్మాణానికి సంబంధించిన ఈ నెల 5వ తేదీన నోటీసు ఇవ్వగా స్పందన లేదు. దీంతో ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశారు. అలీ అందుబాటులో లేకపోవడంతో పనివాళ్లకు నోటీసులు ఇచ్చినట్లు సెక్రటరీ తెలిపారు. మరి ఈ విషయమై అలీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: విడాకుల గోల.. వాళ్లందరికీ రెహమాన్ నోటీసులు) -
విడాకుల గోల.. వాళ్లందరికీ రెహమాన్ నోటీసులు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆరె రెహమాన్.. రీసెంట్గా విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇతడి భార్య సైరా భాను లాయర్ బయటపెట్టాడు. ఇద్దరు ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరారు. కానీ రెహమాన్ విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే ఈయన దగ్గర పనిచేస్తున్న మోహిని దే అనే అమ్మాయి కూడా భర్తకు డివోర్స్ ఇచ్చింది. దీంతో రుమార్స్ మొదలయ్యాయి.(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్)రెహమాన్-మోహిని దే మధ్య రిలేషన్ ఉన్నట్లు పలువురు ఆర్టికల్స్ రాశారు. యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేశారు. అయితే ఇవన్నీ అవాస్తవాలని, ఇలాంటివి ప్రచారం చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తప్పవని ఏఆర్ రెహమాన్ టీమ్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రకటన రిలీజ్ చేసింది.తన గురించి సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని రెహమాన్ సూచించినట్టు టీమ్ పేర్కొంది. ఇప్పటికే పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌ను 24 గంటల్లోపు తొలగించాలని, లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రెహమాన్.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తీస్తున్న సినిమా కోసం పనిచేస్తున్నారు. (ఇదీ చదవండి: ప్రభుత్వం ఉద్యోగం సాధించిన సుకుమార్ ఇంట్లో పనిమనిషి)Notice to all slanderers from ARR's Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x— A.R.Rahman (@arrahman) November 23, 2024 -
మోదీ బాటలోనే నడుస్తా: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ బుధవారం(అక్టోబర్ 23) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ప్రధాని మోదీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మోదీ బాటలోనే నడుస్తానని కేటీఆర్ చెప్పారు. కాగా, తనపై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని అందులో పేర్కొన్నారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ ఇలాంటి తాటాకు చప్పుల్లకు భయపడేది లేదన్నారు. ఇదీ చదవండి: కేటీఆర్ లీగల్ నోటీసులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు -
ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!
ఎవరికైనా అప్పు ఇచ్చారా..? తిరిగి చెల్లించడం లేదా..? అయితే కింద తెలిపిన విధంగా చేస్తే దాదాపు మీ డబ్బు తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు మీరు డబ్బు ఇచ్చినట్లు రుజువులు మాత్రం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకు స్టేట్మెంట్ వంటి ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. ఒకవేళా గూగుల్‌పే, ఫోన్‌పే..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా పేమెంట్ చేసినా బ్యాంక్ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా స్టేట్మెంట్ తీసుకోవచ్చు.అప్పు ఇచ్చాక చెప్పిన సమయానికి తిరిగి చెల్లించకుండా చాలామంది కాలయాపన చేస్తూంటారు. అలాంటి సందర్భంలో అప్పు తీసుకున్నట్లు మీ వద్ద ఉన్న రుజువులతో లీగల్‌గా అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపవచ్చు. దాంతో చాలా వరకు ఆ లీగల్ నోటీసుకు బయపడి మీ అప్పు తీర్చే అవకాశం ఉంటుంది. అయితే కొందరు అలా నోటీసులు స్వీకరించినా అప్పు చెల్లించరు.ఇదీ చదవండి: భారత హాకీ స్టార్‌కు చేదు అనుభవం!లీగల్ నోటీసులు అందుకుని అప్పు చెల్లించని వారికోసం మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. స్టేషన్ ద్వారా మనీసూట్ను పంపించాలి. అప్పు తీసుకున్న వారు దానికి స్పందించకపోతే కోర్టు ద్వారా తమను అదుపులోకి తీసుకుని వివరణ కోరే అవకాశం ఉంటుంది. అయితే అసలు అప్పు ఇవ్వడమే ఖర్చు..మళ్లీ పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరగాలంటే అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది కదా. అలాంటి వారు మనీసూట్లో అందుకు అయ్యే ఖర్చును సైతం పొందేలా వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ కోర్టులో కేసు గెలిస్తే అప్పుతోపాటు దాని రికవరీకి అయిన ఖర్చును సైతం తిరిగి చెల్లించాల్సిందే. -
'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!
ప్రభాస్ 'కల్కి' రిలీజై దాదాపు నెలరోజులు కావొస్తుంది. అయితేనేం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం లేకపోవడంతో ఇప్పటికే విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా మహాభారతం సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. వీటికోసమే జనాలు మాట్లాడుకుంటున్నారు కూడా. ఇప్పుడు ఈ సన్నివేశాల విషయమై చిత్రబృందానికి కల్కి ధామ్ పీఠాధిపతి నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి.(ఇదీ చదవండి: శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్)'కల్కి' సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపించిన ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ చిత్రబృందంతో పాటు ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌కు నోటీసులు పంపారు. కల్కి పుట్టుకని తప్పుగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.'మన పురాణాల్లో ఉన్న వాటికి ఈ సినిమా విరుద్ధంగా ఉంది. మతపరమైన మనోభావాలు కించపరిచేలా ఉంది. అందుకే మేం అభ్యంతరాలు చెప్పాం. స్పందన కోసం వేచి చూస్తున్నాం. కల్కి భగవానుడి కాన్సెప్ట్నే ఈ సినిమా మార్చేసిందని, ఇలా చేయడం పురాణాలని అగౌరపరచడమే. దీని వల్ల పురాణాలపై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది' అని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ తన నోటీసుల్లే పేర్కొన్నారు.(ఇదీ చదవండి: మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?) -
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందుకు రూ.100 కోట్ల మేరకు నష్టపరిహారంగా చెల్లించాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ఆమె ఈ నోటీసులు పంపించారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో– ఇసుకాసుర రాజ్యం’అంటూ సీఎం, సీతక్కతో పాటు మంత్రులపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు.సామాజిక మాధ్యమాల్లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, ఆ మేరకు అరోపణల వీడియో అసత్యమని అంగీకరిస్తూ ఒక వీడియో పోస్ట్ చేయాలని ఆ నోటీసుల్లో మంత్రి పేర్కొన్నారు. ఈ నోటీసులకు స్పందించి క్షమాపణలు చెప్పకపోతే.. చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 24న బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టిన నేపథ్యంలో లీగల్ నోటీసులు పంపించినట్టు మంత్రి తరఫు న్యాయవాది నాగులూరు కృష్ణకుమార్ తెలిపారు. ఈ మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలో సీతక్కతో సీఎం, కేబినెట్ మంత్రులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినట్టుగా చూపడాన్ని తప్పు బట్టారు. పనిగట్టుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలతో చేస్తున్న దు్రష్పచారంతో తమ క్లయింట్, మంత్రి సీతక్క ప్రతిష్టకు తీరని విఘాతంతోపాటు, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం ఓటర్లలో ఆమెకున్న ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. -
కొత్త రుణాలు కావాలా.. పాత అప్పు కట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు వారి ముక్కుపిండి మరీ తిరిగి వసూలు చేస్తున్నాయి. లీగల్ నోటీసులు, మౌఖిక ఆదేశాలు, ఒత్తిళ్లతో వడ్డీతో సహా రాబట్టుకుంటున్నా యి. కొన్ని బ్యాంకులు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఎంతోకొంత తగ్గించి వసూలు చేస్తున్నాయి. కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాల్సిందేనంటూ మెడపై కత్తి పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాల్లోని రైతుబంధు సొమ్మును లాగేసుకుంటున్నాయి. దీంతో కొందరు రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మరీ బ్యాంకులకు చెల్లిస్తున్నారు. రుణమాఫీ జరుగుతుందనే ఆశతో అప్పులు తిరిగి చెల్లించలేదని, రుణమాఫీ జరగకపోగా వడ్డీ తడిచిమోపెడు అవుతోందని గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ జరిగేవరకు వేచిచూడాలని వేడుకుంటున్నా బ్యాంకులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బ్యాంకులు నోటీసులు..మరోవైపు వ్యవసాయశాఖ చేతులెత్తేయడం, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో తెలియక, కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేక రైతులు నలిగిపోతున్నారు. ముందుకు సాగని రూ.2 లక్షల రుణమాఫీ తమ పార్టీని గెలిపిస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఇప్పుడదే పార్టీ అధికారంలోకి వచి్చంది. కానీ నాలుగు నెలలైనా ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదు. కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు చేయలేదు. కానీ రూ.2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని మాత్రం ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు.. ఎలా చేయాలి? ఏ తేదీ వరకు రుణమాఫీ చేయాలి అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పట్లో సాధ్యం కాదా? ఎన్నికల కోడ్‌తో ఇప్పటికిప్పుడు రుణమాఫీకి మార్గదర్శకాలు ఖరారు చేయడం, ఇతరత్రా ప్రక్రియ మొ దలు పెట్టడం కానీ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దీంతో జూన్ మొదటి వారం వరకు రుణ మాఫీపై అడుగు ముందుకు పడే అవకాశం లేదు. మరోవైపు వానాకాలం సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు మే నుంచే రైతులు సిద్ధం అవుతుంటారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, త్వరగా వర్షాలు కురిస్తే దుక్కులు దున్నడానికి సన్నాహాలు చేసుకుంటుంటారు. ఇంకోవైపు ఏప్రిల్ నుంచే వానాకాలం సీజన్ పంట రుణాల ప్రక్రియను బ్యాంకులు ప్రారంభిస్తాయి. కానీ రుణమాఫీ జరగకుంటే కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అప్పులు తిరిగి చెల్లించాలని, రె న్యువల్ చేసుకోవాలని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ‘‘బ్యాంకుల్లో రైతు రుణాలు ఉన్నవాళ్లు ఎవ్వరూ కట్టకండి.. మేం అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం’’అప్పట్లో పలు ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ముందు చెల్లించండి.. తర్వాత సర్దుబాటు చేస్తాం రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూ డు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా అవి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు చెప్పిన ప్రకారం పాత అప్పులు చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేశాక సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే రైతులు డిఫాల్టర్లుగా మారిపోతారు. అయితే కొన్ని బ్యాంకులు రైతుబంధు సొమ్మును జమ చేసుకోవడం ద్వారా రెన్యువల్ చేయడం గమనార్హం. కాగా తాము రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం సాధ్యం కాదని ఒక బ్యాంకు అధికారి ‘సాక్షి’కి చెప్పారు. బకాయిలు పేరుకుపోతే ఎవరినైనా డిఫాల్టర్లుగా ప్రకటిస్తామని అన్నారు. లక్షలాది మంది రైతుల రుణ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, అందుకే నోటీసులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పాత రుణాన్ని అలాగే ఉంచి కొత్త రుణం ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. -
ఆ మీడియాలకు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కుట్రతో తనపైన, తన కుటుంబంపైన అసత్య ప్రచారాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ చానళ్లతో పాటు యూట్యూబ్ సంస్థలు, సోషల్ మీడియా సంస్థలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు శనివరం లీగల్ నోటీసులు పంపించారు. పక్కా ప్రణాళికతో తనకు, తన కుటుంబానికి నష్టం కలిగించాలనే దురుద్దేశంతోనే ఈ చానళ్లు, మీడియా సంస్థలు దుష్ప్రచారం సాగిస్తున్నాయని ఆయన తాను పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. మీడియా ముసుగులో పక్కా ఎజెండాతో సాగిస్తున్న కుట్రలో భాగంగా తమకు సంబంధం లేని అనేక అంశాల్లో తమ పేర్లను, ఫొటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన థంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుకొంటున్నారని, ఈ చానళ్లపై తగిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. వెంటనే ఆ వీడియోలను తొలగించండి తమకు, తమ కుటుంబానికి సంబంధంలేని అంశాలలో దుర్మార్గపూరిత ప్రచారం చేస్తూ పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ చానళ్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ చానల్స్ ఇప్పటికే జరిగిన తమ తప్పును సరిదిద్దుకొని, అలాంటి వీడియోలను, కంటెంట్‌ను తీసివేసినట్లు చెప్పాయని కేటీఆర్ తెలిపారు. వారం రోజుల్లోగా మిగిలిన మీడియా చానళ్లు, యూట్యూబ్ చానల్స్ ఇలాంటి కంటెంట్ ని తీసివేయకుంటే మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. యూట్యూబ్‌కి సైతం నోటీసులు కేవలం ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్‌కి సైతం లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ తెలిపారు. తమ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా ప్రచారం చేస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ మరిన్ని లీగల్ నోటీసులకు, కేసులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. -
టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తమపై అసత్య ప్రచారం చేస్తున్న పలు టీవీ, యూట్యూబ్ ఛానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. మొత్తం 10 సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లతో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చారు. కేవలం ఒక కుట్ర, ఎజెండాలో భాగంగా తమపై ఈ ప్రచారం జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. తమకు సంబంధం లేని విషయాలలో, తమ పేరును, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానళ్లపై న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. గతంలోనూ తమపై అసత్య ప్రచారం చేస్తున్న పలు సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఆయా సంస్థలు తప్పును సరిదిద్దుకొని, అసత్యపూరిత వీడియోలను తీసివేస్తున్నామని ప్రకటించాయి. ఇదీ చదవండి.. కడియంకు బీఆర్ఎస్ చెక్ -
కాంగ్రెస్ నేతలకు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసు
ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కాంగ్రెస్‌నేతలకు చట్టపరమైన నోటీసులు పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ నేతలు వక్రీకరించారని ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. ‘కేంద్ర మంత్రి గడ్కరీ కాంగ్రెస్ పోస్ట్ చేసిన 19 సెకండ్ల వీడియో క్లిప్‌ను చూసి షాక్ అయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు, వాటి అసలు అర్థాన్ని కాంగ్రెస్ నేతలు వక్రీకరించారు’ అని న్యాయవాది బాలేందు శేఖర్ తెలిపారు. గందరగోళాన్ని, అపకీర్తిని సృష్టించడానికి నితిన్ గడ్కరీ మాటాలను వక్రీకరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు పోస్ట్ చేసిన ఆ వీడియో క్లిప్‌ను తొలగించాలని లిగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. మూడు రోజుల్లో తన క్లైంట్కు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని లాయర్ బాలేందు శేఖర్ తెలిపారు. వీడియో క్లిప్‌లో ఏం ఉంది? జాతీయ మీడియా చానెల్‌కు నితిన్ గడ్కరీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఓ అంశాన్ని వివరించే క్రమంలో.. ‘గ్రామీణ ప్రజలు, కూలీలు, రైతులు సంతోషంగా లేరు. గ్రామాలకు సరైన రోడ్లు లేవు. తాగడానికి కనీసం తాగునీరు లేదు. నాణ్యమైన ఆస్పత్రులు, పాఠశాలలు లేవు’ అని అన్నారు. అయితే కేవలం ఈ మాటలను మాత్రమే ఉన్న ఓ క్లిప్‌ను కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 19 సెకండ్ల వీడియో క్లిప్‌పై కేంద్రమంత్రి గడ్కరీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన మాటలను కాంగ్రెస్ పార్టీ నేతలు కావాలనే వక్రీకరించారని గడ్కరీ అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. తన వీడియో క్లిప్‌ను 24 గంటల్లో డిలీట్ చేసీ.. కాంగ్రెస్ నేతలైన మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌లు మూడు రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణలు తెలిపాలని ఆయన డిమాండ్ చేశారు. -
పరువు నష్టం దావాపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్/ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ తనపై పరువు నష్టం కేసు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఆయన అయోమయంలో ఉన్నారని.. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరే ఠాకూర్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ‘‘మాణిక్యం ఠాగూర్ అయోమయంలో ఉన్నారు. ఆయనపై తోటి కాంగ్రెస్ నాయకుడు.. ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి మీకు(మాణిక్యం ఠాగూర్‌ను ఉద్దశిస్తూ..) రూ. 50 కోట్లతో పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పారు. అదే మాట మీకు మళ్లీ గుర్తు చేస్తున్నా. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన ఆ వార్తలనే నేను ప్రస్తావించా. పైగా కోమటిరెడ్డి చేసిన ఆ ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి కూడా తీసుకోలేదు.. వివరణా ఇవ్వలేదు. Manickam Garu, Why are you in a confused mode and misdirecting these notices? It was your colleague congressman & MP Venkat Reddy who had alleged on record that Revanth Reddy bribed you and bought the PCC president post for ₹50 Crore I had merely quoted the same since it was… https://t.co/YtK6EY9EIj pic.twitter.com/gickKF8Euy — KTR (@KTRBRS) January 31, 2024 .. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుంది. నా చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండి అంటూ ఎక్స్‌లో కేటీఆర్ సూచించారు. ఇదిలా ఉంటే.. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని మాణిక్యం ఠాగూర్ నోటీసులు పంపారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని.. వారంరోజుల్లోగా అదిర జరగకపోతే తదుపరి చట్టపరమైన చర్యలకు ముందుకెళ్తామని నోటీసుల్లో హెచ్చరించారాయన. -
చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?
'కల్కి' నిర్మాతలు మరోసారి సీరియస్ అయ్యారు. డార్లింగ్ ప్రభాస్ సినిమా విషయంలో నోటీసు ఇచ్చి ఇరవై రోజులు కూడా కాలేదు. ఇప్పుడు మరో మూవీ విషయంలో లీగల్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది కూడా అప్పుడెప్పుడో 1990లో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' కోసం. ఇలా సడన్‌గా సోషల్ మీడియాలో చిరు క్లాసిక్ హిట్ సినిమాపై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ అసలేంటి గొడవ? ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?) అసలు ఏమైంది? టాలీవుడ్లో వైజయంతీ మూవీస్ ప్రముఖ నిర్మాణ సంస్థ. నిర్మాత అశ్వనీదత్ అప్పట్లో సినిమాలు తీశారు. కానీ ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు మూవీస్ తీయలేకపోయారు. నిర్మాణం ఆపేశారు. దీంతో ఆయన కూతుళ్లు నిర్మాతలుగా మారారు. 'మహానటి', 'సీతారామం' లాంటి హిట్ సినిమాలతో మళ్లీ లైన్లోకి వచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ పెట్టి 'కల్కి' అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీస్తున్నారు. కొన్నాళ్ల ముందు 'కల్కి' నుంచి ఓ ఫొటో లీక్ కావడం, అది సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యేసరికి నిర్మాతలు సీరియస్ అయ్యారు. ఎవరైనా సరే దాన్ని షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సెప్టెంబరు 21న ఈ నోటీసు విషయమై ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇది జరిగి 20 రోజులు కూడా కాలేదు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా కాపీరైట్స్ విషయమై ప్రకటనతో పాటు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. (ఇదీ చదవండి: ఆ వార్తల వల్ల చాలా బాధపడ్డాను: మెగాస్టార్ చిరంజీవి) ఆ సినిమాపై పరోక్షంగా? ఈ పోస్ట్ ప్రకారం.. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలోని స్టోరీ, కాన్సెప్ట్, పాత్రలు ఇలా దేన్ని కూడా తమ ప్రమేయం లేకుండా ఉపయోగించడానికి వీల్లేదని.. ఒకవేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకటనతో పాటు ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు. ఇలా సడన్‌గా ఎందుకు సీరియస్ అయ్యారా అనేది చాలామందికి అర్థం కాలేదు. అయితే చిరు 157వ సినిమాని ఉద్దేశిస్తూనే పరోక్షంగానే ఈ నోటీస్ ఇచ్చారా అనేది డౌట్ కొందరికి వస్తోంది. ఎందుకంటే 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ్ దర్శకత్వంలో చిరు చేస్తున్న ఈ సినిమాకు 'ముల్లోకవీరుడు' అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ మూవీ కాన్సెప్ట్.. హీరో, వేరే లోకానికి వెళ్లడం అక్కడ దేవకన్యలని కలవడం ఇలానే ఉండబోతుందని అంటున్నారు. చూస్తుంటే 'జగదేకవీరుడు అతిలోక సుందరి'తో పోలికలు కనిపిస్తున్నాయి కదా! అందుకే 'వైజయంతీ' సంస్థ ఎవరు కాపీ కొడుతున్నారు? లేదా కొట్టాలని ట్రై చేస్తున్నారనేది పేరు చెప్పకుండా నోటీసు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
అతడికి లీగల్ నోటీసులు పంపిన పూజాహెగ్డే!
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి వరసపెట్టి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మహేశ్ 'గుంటూరు కారం' నుంచి తప్పుకొందో, తప్పించారో తెలియదు గానీ ఆ సినిమా నుంచి బయటకొచ్చేసింది. తెలుగులో కొత్తగా ఇంకేం మూవీస్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఓ క్రిటిక్‌కి లీగల్ నోటీసులు పంపితే.. ఆ విషయాన్ని అతడు కామెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: ఉపాసన డైమండ్ గిఫ్ట్‌పై తమన్నా క్లారిటీ!) తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు లాంటి స్టార్ హీరోలతో హిట్స్ కొట్టిన పూజాహెగ్డేకు గత కొన్నాళ్ల నుంచి అస్సలు కలిసి రావట్లేదు. కారణం ఏదైనా గానీ ఆమె సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో దర్శకనిర్మాతలు ఆమెవైపు చూడటం మానేశారు. గతంలో ఈమెపై రివ్యూయర్ అని తనకు తాను చెప్పుకునే ఉమైర్ సంధు దారుణమైన విమర్శలు చేశాడు. ఇప్పుడు దానికి ప్రతిగా అతడికి లీగల్ నోటీసులు పంపించింది. అతడు దాన్ని ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. గత కొన్నేళ్లుగా ఓవర్సీస్ రివ్యూయర్ అని చెప్పుకొనే ఉమైర్ సంధు.. తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా ప్రతి సినిమా బాగుంది బాగోలేదు అని ట్విట్టర్ లో చెప్పేవాడు. అక్కడివరకు ఆగితే బాగుండు. కానీ.. 'ప్రభాస్-కృతిసనన్ ప్రపోజ్ చేశాడు. పూజాహెగ్డే ఐరన్ లెగ్' లాంటి విపరీతమైన ట్వీట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా కృతిసనన్, పూజాహెగ్డే.. లీగల్ నోటీసులు పంపించారు. అయితే అతడు లండన్‌లో ఉంటున్నాడు. దీంతో ఏం యాక్షన్ తీసుకోవడానికి కుదరదు. అందుకే సదరు హీరోయిన్ల నోటీసులపై కూడా అతడు ట్వీట్స్ పెట్టి కామెడీ చేస్తున్నాడు. #PoojaHegde sent me Legal Notice 😄😄😄 !! Behjo Behjo Notices Flop Actresses. pic.twitter.com/lGneUBF1zw — Umair Sandhu (@UmairSandu) July 25, 2023 LOL 😂 : #KritiSanon Just sent me defamation emails after i tweeted of her “ Broke up ” news with #Prabhas 🤪 pic.twitter.com/ycEFmriMiG — Umair Sandhu (@UmairSandu) July 25, 2023 (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) -
పరువునష్టం దావా ఉపసంహరించుకోండి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ తనకిచ్చిన లీగల్ నోటీసులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ ఉదంతంపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించకుండా తనను అడ్డుకోవడంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన లీగల్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన నోటీసులకు తన న్యాయవాది కుమార్ వైభవ్ ద్వారా కేటీఆర్ న్యాయవాది ఇనుగంటి సుధాన్షురావుకు శనివారం సమాధానం పంపారు. కేటీఆర్‌వి నిరాధార ఆరోపణలు.. ‘ఏదైనా ప్రజాసంబంధిత అంశంలో ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్ష నాయకుడిపై ఉంటుంది. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో నేను చేసింది కూడా అదే. కానీ ప్రతిపక్ష నేతగా ప్రజల వాణిని వినిపించే నా గొంతును నియంత్రించేందుకు కేటీఆర్ నాకు నోటీసులిచ్చారు. దర్యాప్తు సంస్థలనే కాకుండా ప్రజలను కూడా ప్రభావితం చేసేలా మాట్లాడారు. లీకేజీలో ఇద్దరు ఉద్యోగుల తప్పిదమే ఉందంటూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని నేను ప్రజలకు చెబుతూ కేటీఆర్ వైఖరిని ప్రశ్నించాను. మంత్రిగా కేటీఆర్ నాపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, రాజకీయ దురుద్దేశాలతో కూడినవి. అందువల్ల కేటీఆర్ వెంటనే నోటీసులను ఉపసంహరించుకోవాలి. లేదంటే తదుపరి పర్యవసానాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’అని రేవంత్ తన సమాధానంలో పేర్కొన్నారు. -
రూ.100 కోట్ల దావా
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వారికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. వారిద్దరూ తనపై చేసిన వ్యాఖ్యలను వారం రోజుల్లోపు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు ‘ఈ నెల 17 నుంచి 25 వరకు వివిధ టీవీ చానెళ్లతో పాటు డిజిటల్, సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలిగించేలా ఇద్దరు నేతలు ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడారు. 2009 నుంచి 2018 వరకు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా పనిచేస్తున్న, విద్యావంతుడినైన నా ప్రతిష్టకు.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు భంగం కలిగించాయి. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి..’ అని కేటీఆర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే పదేపదే అబద్ధాలు ‘సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న నా పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటివారిపై అసత్య ప్రేలాపనలు చేసే హక్కు వీరికి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపుతున్నా. ఇప్పటికైనా ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలు మానుకోవాలి. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో దావాను ఎదుర్కోవాల్సి ఉంటుంది..’ అని మంత్రి స్పష్టం చేశారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన ఆరోపణల వివరాలను నోటీసుల్లో కేటీఆర్ పొందుపరిచారు. ఇవే సెక్షన్ల కింద రాహుల్‌కు జైలు శిక్ష గుజరాత్‌లోని సూరత్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్లు 499, 500 కిందే కేసు నమోదైంది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఈ కేసులోనే రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా కూడా న్యాయమూర్తి విధించారు. ఈ తీర్పు నేపథ్యంలోనే రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా సెక్రటేరియట్ ప్రకటించింది. ప్రస్తుతం కేటీఆర్ కూడా ఇవే సెక్షన్ల కింద లోక్‌సభ సభ్యులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు పంపించడం ఆసక్తికరంగా మారింది. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ల స్థానిక చిరునామాలకు, అలాగే ఢిల్లీ చిరునామాలకు కూడా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ముందే హెచ్చరించి నోటీసులు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనను బూచిగా చూపి ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆపేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నాయని కేటీఆర్ పలు సందర్భాల్లో విమర్శించారు. తన వ్యక్తిగత సహాయకుడిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను కూడా రెండు రోజుల క్రితం ఖండించారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్రలను సహించేది లేదని పదే పదే చెప్పిన కేటీఆర్.. ఇద్దరు విపక్ష నేతలకు లీగల్ నోటీసులు ఇస్తానని ఈ నెల 23నే చెప్పారు. చెప్పినట్టుగానే మంగళవారం నోటీసులు పంపించారు. -
రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు లీగల్ నోటీసులు జారీ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకుగానూ ఆయన వాళ్లిద్దరికీ నోటీసులు పంపించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న కేటీఆర్.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుజేసే కుట్రలో భాగమే ఇదంతా అని పేర్కొన్నారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోం. ఒక దురదృష్టకరమైన సంఘటనను బూచిగా చూపి.. మొత్తం నియామకాల ప్రక్రియ ఆపేయాలన్నదే బీజేపీ కాంగ్రెస్ కుట్ర. మతిలేని నేతల రాజకీయ ఉచ్చులో చిక్కుకోవద్దని తెలంగాణ యువతకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. ఇదీ చదవండి: ప్రధానితో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ భేటీ -
15 రోజుల్లో రూ.850 కోట్లు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: కనిపించిన నిధినల్లా వాడేసుకుని, తిరిగి చెల్లించకుండా భారీగా బకాయిపడ్డ ఆర్టీసికి ఇప్పుడు చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులతో కూడిన సహకార పరపతి సంఘం.. ఆ సంస్థపై ఫిర్యాదు చేస్తూ హైకోర్టు తలుపు తట్టనుంది. సంఘానికి బకాయిపడ్డ రూ.850 కోట్ల మొత్తాన్ని 15 రోజుల్లో చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ లీగల్ నోటీసు జారీ చేసింది. ఒకప్పుడు సంస్థ ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలిచి ఎంతగానో పేరొందిన ఈ సంఘం, ఆర్టీసీ మొండివైఖరి కారణంగా మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని నోటీసులో పేర్కొంది. దాన్ని నమ్ముకున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని చెప్పింది. వెంటనే బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆ సంఘం కార్యదర్శి మహేశ్ పేరుతో హైకోర్టు న్యాయవాది లీగల్ నోటీసు జారీ చేశారు. గతంలోనే ఓసారి హైకోర్టు జోక్యం చేసుకుని, సహకార పరపతి సంఘానికి బకాయిలు చెల్లించాలని సూచించింది. ఇప్పుడు కోర్టు ఆదేశాన్ని ధిక్కరించినందుకూ ఆర్టీసీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇదీ కథ.. ఆర్టీసీ ఉద్యోగులు సభ్యులుగా ఉండే ఈ సహకార పరపతి సంఘం 1952లో ఏర్పాటైంది. ఉద్యోగుల జీతం నుంచి 7 శాతం మినహాయించగా గతంలో నెలకు రూ.40 కోట్ల వరకు నిధి ఉండేది. ప్రస్తుతం అది రూ.22 కోట్లుగా ఉంది. ఈ మొత్తం నుంచి ఉద్యోగుల అవసరాలకు రుణం అందిస్తారు. మిగతా మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. కొన్నేళ్లుగా ఈ నిధిని ఆర్టీసీ తన అవసరాలకు వాడేసుకోవటం ప్రారంభించింది. చెల్లింపులు చేయకుండా ఎగ్గొట్టడం మొదలుపెట్టింది. సజ్జనార్ ఎండీగా వచ్చాక పలు దఫాలుగా రూ.500 కోట్లను బకాయి రూపంలో చెల్లించారు. ఇంకా రూ.610 కోట్ల బకాయి ఉంది. మరో రూ.240 కోట్ల వడ్డీ పేరుకుపోయింది. క్రమంగా సభ్యత్వాన్ని రద్దు చేసుకుని తమ డిపాజిట్ మొత్తాలను చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేయటం ప్రారంభించారు. 10 వేల మంది అలా రద్దు చేసుకోగా, మరో 6 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ప్రస్తుతం రుణాలకు సంబంధించి మరో 7 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. -
బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు.. మంత్రి కేటీఆర్ శుక్రవారం లీగల్ నోటీసులు పంపించారు. ఈ నెల 11వ తేదీన ట్విటర్లో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలపై ఆధారాలు చూపించాలని కేటీఆర్ తాజాగా డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కేటీఆర్. ఈ నేపథ్యంలో.. తాజాగా లీగల్ నోటీసులు పంపడం విశేషం. 48 గంటల్లోపు స్పందించాలని నోటీసుల్లో కేటీఆర్, బండి సంజయ్‌కు స్పష్టం చేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయికి నోటీసులు పంపించారు కేటీఆర్. నోటీసులో ఏముందంటే.. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో పేర్కొన్నాడు న్యాయవాది. ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా... కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ గారి పరువుకు కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని సదరు న్యాయవాది నోటీసుల్లో పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్ కి బేషరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసుల్లో స్పష్టం చేశారు. BS Kumar, if you don’t stop this ludicrous, baseless & irresponsible allegations, I’ll be constrained to take legal action If you have an iota of evidence to prove what you allege, please put it in public domain or else apologise publicly for this BS rhetoric https://t.co/YaskNVfJqj — KTR (@KTRTRS) May 12, 2022 -
లోన్ కడతారా.. జైలుకు పోతారా?
పెద్దపల్లి: పంట కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేదని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఎస్బీఐ బ్రాంచ్ అధికారులు మండలంలోని 164 మంది రైతులకు లీగల్ నోటీసులు జారీ చేశారు. రుణాలు వడ్డీతో సహా 15 రోజుల్లో చెల్లించకుంటే సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని నోటీసులో పేర్కొన్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇప్పటివరకు చాలామంది రైతుల రుణాలు మాఫీ కాలేదు. రుణం మాఫీ అవుతుందన్న ధీమాతో చాలామంది రైతులు మూడేళ్లుగా బ్యాంకులకు వాయిదాలు చెల్లించడం నిలిపివేశారు. దీంతో వడ్డీలు పెరిగి పోతున్నాయి. రూ.లక్ష రుణం తీసుకున్న రైతులకు ప్రస్తుతం వడ్డీ రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు అయింది. ఈ నేపథ్యంలో తాజాగా బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తున్నాయి. ఈవిషయమై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా సమాధానం చెప్పలేదు. మృతి చెందిన మహిళా రైతుకు నోటీసు ఓ మహిళా రైతు మరణించి ఏడాదైనా.. ఆమెకు కూడా బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన కొమురమ్మ రుణం తీసుకున్నప్పుడు రైతు బీమా చేసినా.. మరణించిన ఆమెకు నోటీసు ఇవ్వడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాఫీ అయినా నోటీస్: రవీందర్ రెడ్డి, లక్ష్మీపురం, రైతు, సర్పంచ్ అప్పు మాఫీ అయింది. అయినా నాకు నోటీసులు పంపారు. బ్యాంక్ అధికారులు నోటీసులు పంపడం వల్ల రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. -
500 కోట్లకు దావా.. అదనంగా ఫోన్‌కాల్‌లో అసభ్య పదజాలం!
కొటక్ మహీంద్రా బ్యాంక్, ఫిన్‌టెక్ కంపెనీ ‘భారత్‌పే’ ఎండీ అష్నీర్ గ్రోవర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. నైకా ఐపీవో సంబంధిత షేర్ల కేటాయింపులో కొటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని అష్నీర్ గ్రోవర్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదం మరో మలుపు తిరిగింది. కొటక్ బ్యాంక్ నుంచి నష్టపరిహారం కోరుతూ 500 కోట్ల రూపాయలకు దావా కూడా వేశాడు అష్నీర్ గ్రోవర్. అయితే తాజాగా ఈ పరిణామంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అష్నీర్, ఆయన భార్య మాధురి ఫోన్‌కాల్‌లో తమ ప్రతినిధిని అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది కొటక్ మహీంద్రా బ్యాంక్. ఈ మేరకు ఆదివారం ఆ జంటకు నోటీసులు సైతం పంపింది. అష్నీర్ గ్రోవర్-కొటక్ బ్యాంక్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. అష్నీర్ జంట నుంచి అక్టోబర్ 30న లీగల్ నోటీసులు అందుకున్నట్లు ఒప్పుకున్న కొటక్ మహీంద్రా బ్యాంక్.. అది ఎందుకనో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే టైంకి మాత్రం బదులు ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే గ్రోవర్ ఆడియో కాల్లో తమ ప్రతినిధిని ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మాత్రం న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఒక మీడియా స్టేట్మెంట్లో వెల్లడించింది. నా గొంతు కాదు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో గతవారం ఒక ఆడియో క్లిప్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్‌తో దురుసుగా ఒక జంట మాట్లాడిన క్లిప్ అది. ఆ కాల్లో ఒక వ్యక్తి అసభ్య పదజాలం ఉపయోగిస్తుండగా.. అవతలి వ్యక్తి అతన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ క్లిప్‌లో గొంతు భారత్‌పే ఎండీ అష్నీర్ గ్రోవర్దే అంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ, అష్నీర్ అది తన గొంతు కాదని ఖండించాడు కూడా. మరోవైపు లీగల్ నోటీసులు స్పందించేందుకు భారత్‌పే నిరాకరించింది. -
అల్లు అర్జున్‌కి షాకిచ్చిన సజ్జనార్, లీగల్ నోటీసులు జారీ
-
చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలకు డీజీపీ లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గుజరాత్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేకున్నా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతోపాటు తమ ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్, పలువురు టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లీగల్ నోటీసులు జారీ చేశారు. నిరాధార ఆరోపణలతో కథనాలు.. ‘రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ రవాణా– గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్ సీఎం ఇంటి సమీపంలో సంస్థలదే’, ‘దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారు?’, ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ అవాస్తవాలు’ అనే శీర్షికలతో ఈనాడు పలు కథనాలను ప్రచురించింది. ‘జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి’, డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. దీనికి జగన్, డీజీపీ ఏం చెబుతారు?, చంద్రబాబు ధ్వజం’ అనే శీర్షికలతో ఆంధ్రజ్యోతి వార్తలు ప్రచురించింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాటిని ప్రచురించడంపై చంద్రబాబు, లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, బొండా ఉమా, బుద్దా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభి, ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు, ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఆ పత్రిక బ్యూరో చీఫ్‌తోపాటు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆమోద పబ్లికేషన్స్, ప్రింటర్–పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ఆ పత్రిక బ్యూరో చీఫ్‌లకు డీజీపీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. దురుద్దేశపూర్వకంగానే.. డీఆర్ఐ గుజరాత్లో స్వాధీనం చేసుకున్న రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ స్పష్టం చేసినప్పటికీ చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు ప్రభుత్వ ప్రతిష్టకు విఘాతం కలిగించడంతోపాటు పోలీసు శాఖ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా అసత్య ఆరోపణలు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ హెరాయిన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం లేదని డీఆర్ఐ ప్రకటించినా, డీజీపీ కూడా స్పష్టత ఇచ్చినా దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఆ నిరాధార ఆరోపణలపై వాస్తవాలను నిర్ధారించుకోకుండానే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా ప్రచురించి పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించాయన్నారు. దురుద్దేశపూరిత చర్యలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఆ వార్తను ఆయా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో వారిపై డీజీపీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. చదవండి: తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం -
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు నోటీసులు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పూరిత వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలకు శనివారం నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె శ్రీనివాస్‌కు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. అసత్య వార్తలతో కథనాలు ప్రచురిస్తే సహించేది లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా, ఆంద్రప్రదేశ్ హైకోర్టు జడ్జిల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కుట్రపూరితంగా అగాధం పెంచేందుకు కొన్ని రాజకీయ శక్తుల ముసుగులో ఒక వర్గం మీడియా పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏబీఎస్, టీపీ-5లో అవాస్తవ కధనాలను ప్రసారం చేశారని, దీనిపై ఆ రెండు సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ మూర్తులపై నిఘా అంటూ ప్రచురించిన వార్త ఒక పక్కా ప్రణాళికతో నేరపూరితంగా జరిగిన కుట్రలో భాగమేనని ప్రభుత్వం భావిస్తోంది. (ఆంధ్రజ్యోతి కథనంపై ఏపీ సర్కార్ సీరియస్) -
భార్యకు నవాజుద్దీన్ లీగల్ నోటీసులు
ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన భార్య అలియాకు లీగల్ నోటీసులు పంపించినట్లు అతడి తరపు న్యాయవాది అద్నాన్ షేక్ తెలిపారు. అలియా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగిస్తుందని నవాజుద్దీన్ నోటీసులో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. మే 6న అలియా విడాకులు కోరుతూ నవాజుద్దీన్‌కు తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నోటీసులో మెయింటెనెన్స్ కింద నెల నెల డబ్బులు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే దీనిపై నవాజుద్దీన్ ఇంతవరకు స్పందించలేదని, అతడు డబ్బులు పంపించకపోవడం వల్ల పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేకపోతున్నాని ఆమె మీడియా ఎదుట వాపోయారు. (‘త్వరలోనే చాలా విషయాలు తెలుస్తాయి’) దీనిపై నవాజుద్దీన్ న్యాయవాది అద్నాన్ షేక్ మాట్లాడుతూ.. ‘తన నోటిసుకు నవాజుద్దీని సకాలంలోనే స్పందించాడు. తను నోటీసులో పేర్కొన్నట్లుగానే నెలవారి భత్యం చెల్లిస్తున్నాడు. చెల్లింపుకు సంబంధించిన వివరాలు, స్క్రీన్షాట్లు కూడా ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన ఖర్చులన్నింటినీ లాక్‌డౌన్‌కు ముందే అలియాకు చెల్లించాడు’ అని చెప్పుకొచ్చాడు. అయిన నవాజుద్దీన్‌కు అతడి కుటుంబానికి పరువు నష్టం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా అలియా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అందుచేతనే నవాజుద్దీన్, అలియాకు లీగల్ నోటీసులు పంపించాడని తెలిపారు. (పొలం పనుల్లో బిజీ అయిన స్టార్ నటుడు) ఇక నుంచి తనపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని, ఇటీవల చేసిన వ్యాఖ్యలకు వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని నవాజుద్దీన్ నోటీసులో పేర్కొన్నట్లు అద్నాన్ చెప్పారు. నవాజుద్దీన్, అలియాల విడాకుల విచారణపై ఆయన స్పందిస్తూ.. అలియా పంపించిన విడాకుల నోటిసుపై ఇప్పటికే మేము స్పందించామన్నాడు. ఇప్పుడు తమ నోటీసులకు అలియా సమాధానం ఇవ్వాలన్నారు. అలియా, నవాజుద్దీన్ ఆయన కుటుంబానికి పరువు నష్టం కలిగేలా ప్రచారం చేస్తున్నారని, ఇక మీదట అలాంటి ఆరోపణలు చేస్తే తనపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య) -
నాకెలాంటి నోటీసులు అందలేదు: తనుశ్రీ
ముంబై : గత కొన్ని రోజులుగా తనుశ్రీ దత్తా - నానా పటేకర్‌ల వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనుశ్రీ దత్తా ఆరోపించారు. ఈ ఆరోపణలు హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనుశ్రీ చేసే ఆరోపణలు అసత్యమైనవని, క్షమాపణలు చెప్పాలని ఆమెకు నోటీసులు పంపామని పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ మీడియాకు తెలిపారు. తనుశ్రీ మాత్రం తనకు నానాపటేకర్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. ఈ నోటీసులు బెదిరింపులు.. తనలాంటి మరింత మంది బాధితులను బయటకు రాకుండా భయపెట్టడానికేనన్నారు. ఎవరికైనా తనలాంటి అనుభవమే ఎదురైతే ధైర్యంగా బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటివాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశం మొత్తం మద్దతినిస్తుందని తెలిపారు. ఇక తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు, నటీమణులు ఒక్కొక్కరూ గళం విప్పుతున్న విషయం తెలిసిందే. మరోవైపు తనుశ్రీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతూ వస్తోంది. సెట్స్‌లో జరిగిన వాటిపై తనుశ్రీ చెబుతున్న విషయాలకు సంబంధించి, ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. తనుశ్రీ చెప్పిన విషయాలే ఆ వీడియోలో ఉండటం, ఆమె ఆరోపణలు వాస్తమేనని తేలుతోంది. చదవండి: తనుశ్రీ దత్తాకు లీగల్ నోటీసులు -
లైంగిక వేధింపులు : తనుశ్రీ దత్తాకు లీగల్ నోటీసులు
ముంబై : గత కొన్ని రోజులుగా తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనుశ్రీ దత్తా ఆరోపించారు. ఆ అనంతరం తనుశ్రీ ఆరోపణలు హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు, నటీమణులు ఒక్కొక్కరూ గళం విప్పారు. ప్రస్తుతం తనుశ్రీ చేస్తున్న ఆరోపణలపై నానా పటేకర్ లీగల్ నోటీసులు పంపారు. తనుశ్రీ చేస్తున్న ఆరోపణలు అసత్యమైనవని, పూర్తిగా అవి తప్పుడు ఆరోపణలంటూ పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ చెప్పారు. ఆమెకు లీగల్ నోటీసులు పంపినట్టు తెలిపారు. ఈ నోటీసుల్లో ఆమె చేస్తున్న ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని ఉన్నట్టు రాజేంద్ర శిరోద్కర్ ధృవీకరించారు. ‘ఇప్పుడు తనుశ్రీ ఇలా ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. కానీ ఏమో కారణాలు ఉండి ఉంటాయి. నానా ఈ రోజు లేదా రేపు ముంబైకి వస్తారు. వచ్చిన వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. రేపు కచ్చితంగా నానా ఇక్కడ ఉంటారు’ అని శిరోద్కర్ చెప్పారు. మరోవైపు తనుశ్రీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతూ వస్తోంది. సెట్స్‌లో జరిగిన వాటిపై తనుశ్రీ చెబుతున్న విషయాలకు సంబంధించి, ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. తనుశ్రీ చెప్పిన విషయాలే ఆ వీడియోలో ఉండటం, ఆమె ఆరోపణలు వాస్తమేనని తేలుతోంది. మరోవైపు తనుశ్రీపై లైంగిక వేధింపులు జరిగిన సమయంలో సెట్స్‌లో ఉన్న ప్రత్యక్ష సాక్షులు సైతం తనుశ్రీకే మద్దతు ఇస్తున్నారు. డ్యాన్సర్ నుంచి నటిగా మారిన డైసీ షా కూడా తనుశ్రీకే మద్దతు పలికారు. హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో పాటను షూట్ చేస్తున్న సమయంలో తొలి రెండు రోజులు బాగానే ఉందని, కానీ మూడో రోజు మాత్రం ఏదో జరిగిందని తనకు అర్థమైందని తెలిపారు. ఆ సమయంలో తన జాబ్ తనుశ్రీకి, ఆమె టీమ్‌కు స్టెపులు నేర్పడమని, కానీ మూడో రోజు సెట్లలో ఏదో జరగడంతో, తనుశ్రీ అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఆమె కారుపై కూడా దాడి జరిగినట్టు పేర్కొన్నారు. -
అవధులు దాటిన వంచన
ముప్పు ముంచుకొచ్చినప్పుడల్లా జనాన్ని పక్కదోవ పట్టించడంలో సిద్ధహస్తుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి హడావుడి మొదలెట్టారు. రొటీన్‌గా న్యాయ స్థానం నుంచి అందిన వారెంట్‌ను ఆసరా చేసుకుని భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నారు. తన చతురంగ బలగాలను రంగంలోకి దించి కుట్ర కోణాన్ని ప్రచారం చేస్తున్నారు. ఏలేరు కుంభకోణం మొదలుకొని నిన్న మొన్నటి ‘ఓటుకు కోట్లు’ వరకూ బడా బడా కేసుల్లో సైతం సునాయాసంగా స్టేలు తెచ్చుకోగలిగిన బాబు... ఈ పిపీలకాన్ని మాత్రం విస్మరించారని అనుకోవటం తెలివితక్కువ తనమే. దానిలోని ఆంతర్యమేమిటో ఇప్పుడు సాగుతున్న హడావుడి గమనిస్తే సులభంగానే బోధ పడుతుంది. ప్రజాసమస్యలపై ఆందోళనలు చేసేవారిపై నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న పేరిట కేసులు పెట్టడం, అరెస్టు చేయడం ప్రభుత్వాలకు రివాజు. గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు సర్కారు విపక్షాలనూ, ప్రజాసంఘాలనూ ఇలాంటి కేసులతోనే వేధిస్తోంది. ఆఖరికి ఇటీవల తన సభలో మౌనంగా ప్లకార్డులు పట్టుకున్నందుకు ఏ పార్టీకీ చెందని ముస్లిం యువకులను సైతం బాబు సర్కారు ఇలాగే అరెస్టు చేసి, అక్రమ కేసులు పెట్టి వారిని మానసికంగా, శారీరకంగా హింసించింది. ఇంతకూ ఇప్పుడు బాబుకు న్యాయస్థానం నుంచి వచ్చిన నోటీసు పూర్వాపరాలేమిటి? చంద్ర బాబు, ఆయన పార్టీ నేతలు ఎనిమిదేళ్లక్రితం, అంటే 2010లో బాబ్లీ ప్రాజెక్టును నిరసిస్తూ ఆందో ళన చేసేందుకు వెళ్లినప్పుడు మహారాష్ట్ర పోలీసులు ధర్మాబాద్ వద్ద వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసులు పెట్టారు. ఆ కేసుల విచారణ ధర్మాబాద్ సివిల్ జడ్జి కోర్టులో మూడేళ్లక్రితం మొదలైంది. అప్పటి నుంచి వేర్వేరు సందర్భాల్లో 22 సార్లు ఆ కేసు విచారణకొచ్చింది. అలా విచారణ జరిగిన ప్రతిసారీ కేసులోని ముద్దాయిలందరికీ నోటీసులు వెళ్తాయి. ఆ నోటీసులకు అనుగుణంగా కోర్టు ముందు హాజరై తమ వాదన వినిపించకపోతే, విచారణకు సహకరించకపోతే నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ అవుతుంది. జంగా మహారాష్ట్రలో తాము తప్పుచేయలేదనుకున్నప్పుడు 22 సార్లు కోర్టు నుంచి వచ్చిన నోటీసులకు బాబు ఎందుకు స్పందించలేదు? వాస్తవానికి ఇలాంటి చిన్న కేసుల్లో ముద్దాయిలు వెళ్లనవసరం లేదు. తమ న్యాయవాది ద్వారా వాదన వినిపించవచ్చు. ఈ మార్గాన్ని వదిలి ఇప్పుడు నానా యాగీ చేయడంలో బాబు ఉద్దేశం సుస్పష్టమే. ఆంధ్రప్రదేశ్‌లో తన కథ ముగింపుకొచ్చిందని ఆయనకు తెలుసు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీకి ఓటమి తప్పదని దాదాపు సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. అందుకే ‘జరుగుబాటు’ సిద్ధాంతాన్ని నమ్ముకుని చివరి వరకూ అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. పొరుగునున్న తెలం గాణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తోంది. ‘ఓటుకు కోట్లు’ కేసులో తాను అడ్డంగా దొరికాక అక్కడ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకో వడం వల్ల వీసమెత్తు ఉపయోగం కూడా లేదని బాబుకు ఎప్పుడో తెలిసిపోయింది. ఈ ముందస్తు ఎన్నికల్లో పార్టీకి సంభవించబోయే ఓటమి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కి పడిపోతామన్న భీతి ఆయన్ను వేధిస్తోంది. ఒక్క నోటీసుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లబ్ధి పొందడమే లక్ష్యంగా రెండునెలల తర్వాత ఇప్పుడు కోర్టు వారెం ట్ను బయటకు తవ్వి తీసి ‘కుట్ర’ కథకు తెరలేపారు. బాబ్లీ వ్యవహారాన్ని తెలంగాణ వాసులకు గుర్తు చేసి వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎంతో పోరాడానని చెప్పుకోవటం బాబు ఆంతర్యం. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలోని లక్ష లాది ఎకరాలను బీడు చేసే ప్రమాదమున్న ఆ ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతులు మొద లైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. 2001లో తాత్కాలిక డిజైన్ తయారైంది. మరికొన్నాళ్లకు అంచనా వ్యయాన్ని సవరించారు. టెండర్లు పిలిచారు. ఆ రోజుల్లో ఎప్పుడూ బాబ్లీ ప్రాజెక్టుపై ఆయన నోరెత్తింది లేదు. ఒక్క బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మాత్రమే కాదు... మహారాష్ట్ర తలపెట్టిన ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ ఆయన మౌనమే పాటించారు. కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచినప్పుడూ, కృష్ణానదిపై ఇతర ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నప్పుడూ ఆయన వైఖరి డిటోయే. అదే వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేశానని చెప్పుకోవడానికి ఈ వారెంట్ సాకుతో పెడబొబ్బలు పెడుతున్నారు. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోదీ తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని అనుచరగణంతో ఆరోపణలు చేయి స్తున్నారు. ఒకపక్క ‘ఆపరేషన్ గరుడ’ అంటూ ఒక నటుడితో కథ చెప్పిస్తూ, దానికి అనుగుణంగా సహచర మంత్రులతో ఇష్టానుసారం మాట్లాడిస్తున్న ప్రభుత్వాధినేతకు తనకు వ్యతిరేకంగా ఒక కోర్టు నుంచి వారెంట్ జారీ అయిందని రెండు నెలల తర్వాతగానీ తెలియలేదంటే ఎవరూ నమ్మరు. మహారాష్ట్రతో బాబుకున్న అనుబంధం ఈనాటిది కాదు. ఆయన విపక్షంలో ఉన్నప్పుడు సైతం ఆ రాష్ట్రానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి సీబీఐలో ఉండి బాబు ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేశారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నామని చెప్పాక కూడా మహారాష్ట్ర ఆర్థికమంత్రి సతీ మణికి బాబు టీటీడీ బోర్డు సభ్యత్వమిచ్చారు. నిజానికి బాబుపై తెలంగాణలో విచారణ ప్రారంభం కావలసిన ‘ఓటుకు కోట్లు’ కేసు ఇప్పటికీ ఫైళ్లలో పడి మూలుగుతోంది. బాబు సర్కారు వేలాది కోట్ల అవినీతికి పాల్పడుతున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ మొదలుకొని వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు గత నాలుగున్నరేళ్లుగా ఆరోపిస్తున్నాయి. వాటిపై ఇంతవరకూ కేసులే లేవు. కానీ ఈ చిన్న వారెంట్ పట్టుకుని రెండురోజులుగా బాబు అను చరగణం, ఆయన అనుకూల మీడియా హడావుడి చేస్తున్న తీరు ఔరా అనిపిస్తుంది. ఈ మాదిరి ప్రచారాలకు కాలం చెల్లిందని వారు గ్రహించటం ఉత్తమం. -
సీఎం చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు
-
‘కాంగ్రెస్’కు అంబానీ లీగల్ నోటీసులు
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంలో భారీగా లబ్ధి పొందారంటూ అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ గ్రూప్‌పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై ఆ సంస్థ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ నేతలు రాఫెల్ ఒప్పందంపై చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకోవాలంటూ లీగల్ నోటీసులు పంపిం ది. రాఫెల్ ఒప్పందంలో ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యంగా నెలరోజులపాటు దేశవ్యాప్తంగా.. నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రిలయన్స్ గ్రూప్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. రాఫెల్ కుంభకోణం జరిగిందని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ.. ఓ వ్యాపారవేత్తకు లాభం మేలుచేకూర్చేందుకే మోదీ ఒప్పందం మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల పార్టీ అధ్య క్షుడు రాహుల్‌కు రాసిన లేఖలోనూ అనిల్ అంబానీ అభ్యం తరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘వ్యాపార ప్రత్యర్థులు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న దుష్ప్రచారంలో భాగంగానే కాంగ్రెస్ తప్పుడు సమాచారం అందింది’అని ఆ లేఖలో రాహుల్‌కు అనిల్ అంబానీ సూచించారు. అయితే ఇలాంటి నోటీసులుకు భయపడబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న కాంగ్రెస్ ఎంపీ సునీల్ జఖడ్.. రాఫెల్ ఒప్పందం దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన విషయమన్నారు. ఈ నోటీసులు.. బీజేపీ, కార్పొరేట్ కంపెనీల మధ్య సంబంధానికి సాక్ష్యమని ఆయన అన్నారు. ‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. ఎన్నికైన ప్రజాప్రతినిధికి ఓ వ్యాపారవేత్త లీగల్ నోటీసులు పంపడం చాలా సీరియస్ అంశం. బీజేపీ, కార్పొరేట్ కంపెనీల మధ్య సంబంధంపై మా పోరాటం కొనసాగుతుంది’అని జక్కడ్ వెల్లడించారు. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీల పేర్లతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు శక్తిసింగ్ గోహిల్, ప్రియాంక చతుర్వేది, జైవీర్ షెర్గిల్‌లు కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. -
139 మందికి లీగల్ నోటీసులు
డిచ్పల్లి : మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట ఆర్మూర్ రోడ్దు ప్రాంతంలో నివసిస్తున్న 139 మంది స్థానికులకు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు లీగల్ నోటీసులు పంపడం డిచ్‌పల్లిలో కలకలం రేపుతోంది. లీగల్ నో?సులు అందుకున్న బాధితులు అందోళనకు గురవుతున్నారు. నోటీసులు అందుకున్న బాధితులు శుక్రవారం డిచ్పల్లి రైల్వేస్టేషన్ ఎదుట నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు తెలిపిన వివరాలు.. డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదుటగల ప్రాంతంలో పలు నివాస గృహాలు, హనుమాన్ ఆలయం ఉన్నాయి. ఎం.రాజశేఖర్ (సీతారాంనగర్ కాలనీ నిజామాబాద్), ఎం.రాజేంద్రకుమార్ (ఖైరతాబాద్, హైదరాబాద్) అనే వ్యక్తులు 14ఎకరాల 39 గుంటల స్థలం తమ పూర్వీకులదని ఆ స్థలంలో కొందరు ఇండ్లు నిర్మించుకున్నారని వాటిని కూలగొట్టి తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. 139 మందికి వ్యక్తిగతంగా ఈ నోటీసులు అందడంతో కొన్ని సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకుని ఉంటున్న స్థానికులు ఒక్కసారిగా అందోళనకు గురయ్యారు. చివరకు హనుమాన్ ఆలయం సైతం తమ స్థలంలోనే ఉందని ఆలయం పేరిట సైతం నోటీసు పంపడం స్థానికులను విస్తుపోయేలా చేస్తోంది. కొద్దిరోజుల క్రితం నివాస గృహాలుపోగా ఖాళీగా ఉన్న ప్లాట్లు తమకు చెందినవేనని కొందరు వ్యక్తులు ఇలాగే స్థానికులను బెదిరింపులకు గురి చేశారు. అప్పుడు సైతం స్థానికులంతా ఏకమై జిల్లా కలెక్టర్‌ను, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఆ వ్యక్తులు మళ్లీ ఇటువైపు తొంగి చూడలేదు. ఇప్పుడు తాజాగా లీగల్ నోటీసులు రావడంతో స్థానికులు కలవరం చెందుతున్నారు. కొందరు బినామీ వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం తమ స్థలమని పేర్కొంటూ నోటీసులు పంపించడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకుని బతుకుతున్నామని పేర్కొంటున్నారు. రాస్తారోకో వల్ల రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచి పోయాయి. సమాచారం అందుకున్న డిచ్పల్లి సీఐ రామాంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సముదాయించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం నోటీసులు అందుకున్న బాధితులంతా తహసీల్దార్ శేఖర్‌ను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. -
వాట్సాప్ నోటీసులపై కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ముంబై: లీగల్ నోటీసులపై ముంబై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఇక మీదట నేరుగా లేదా పోస్టు ద్వారానే కాకుండా సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఈమెయిల్, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా పంపిన లీగల్ నోటీసులకు చట్టబద్ధత ఉంటుందని ప్రకటించింది. ఎస్బీఐ, ముంబైకి చెందిన రోహిత్ జాదవ్ కేసులో కోర్టు ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం లేదంటూ ముంబైకి చెందిన రోహిత్ జాదవ్‌పై ఎస్బీఐ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. అతనికి లీగల్ నోటీసులు పంపించింది. అయితే జాదవ్ ఆ నోటీసులకు స్పందించలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా జవాబు ఇవ్వలేదు. దాంతో, లీగల్ నోటీసులు పంపించామనీ, కోర్టుకు హాజరు కావాలని వాట్సాప్‌లో జాదవ్‌కు సమాచారం ఇచ్చింది. కోర్టుకు హాజరుకావాల్సిన తేదీని పేర్కొంటూ వాట్సాప్‌లో పీడీఎఫ్ ఫైల్ పంపింది. చూశాడు... అయినా స్పందించలేదు..! తాము వాట్సాప్‌లో పంపిన పీడీఎఫ్ ఫైల్‌ను జాదవ్ చూశాడనీ, అయినా ఎలాంటి జవాబు ఇవ్వలేదని ఎస్బీఐ కోర్టు దృష్టికి తెచ్చింది. ఎస్బీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు.. సదరు రుణ ఎగవేతదారు వాట్సాప్‌లో పంపిన మేసేజ్‌ను ఓపెన్ చేసినట్లు యాప్ సమాచారంలో ఉన్న ‘బ్లూ టిక్’ను చూస్తే స్పష్టమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఐటీ చట్టంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రిజిస్ట్రర్ పోస్టు, నేరుగా పంపిన నోటీసులతో పాటు వాట్సాప్, ఈమెయిల్, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా పంపిన నోటీసులు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. దీంతో రోహిత్ కోర్టులో హాజరు కావాలని, ఎస్బీఐకు చెల్లించాల్సిన బిల్లును వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. లేకపోతే జైలుకి పంపాల్సి వస్తుందని హెచ్చరించింది. -
శ్రీరెడ్డి విమర్శలపై స్పందించిన నాని భార్య
హైదరాబాద్ : నేచురల్ స్టార్ నానిపై గత కొద్దిరోజులుగా నటి శ్రీరెడ్డి వివాదస్పద ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నాని సైతం స్పందిస్తూ.. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. అయితే తాజాగా ఈ వివాదంపై నాని భార్య అంజనా సైతం స్పందించారు. ‘‘సినీ పరిశ్రమ చాలా దయాగుణంతో ఉంటుంది. కానీ, పబ్లిసిటీ కోసం ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వస్తుండటం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త వ్యాఖ్యలను ఎవరూ నమ్మరనుకోండి. కానీ, వారి వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగజార్చుకోవడానికి ఎలా సిద్దపడతారో’’ అని అంజనా ట్వీట్ చేశారు. ఇక నాని పంపిన నోటీసులకు తాము సిద్దమని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. తనకు కావాల్సింది కూడా ఇదేనని.. నీ రంకు బాగోతం బయటపెట్టడానికి ఓ మంచి అవకాశం తనకు వచ్చిందన్నారు. బిగ్ బాస్-2 తాను లేకపోవడానికి నానినే కారణమని, నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే.. అని శ్రీరెడ్డి ఇటీవల పోస్ట్ చేయడం టాలీవుడ్లో దూమారం రేపిన విషయం తెలిసిందే. This industry has been kind but it troubles me to see that once in a while there comes along someone who puts their publicity ahead of other people's lives. No1 believes those ridiculous statements anyway. It is abt how little they think before degrading themselves to such levels https://t.co/40tv0zudaf — Anju Yelavarthy (@anjuyelavarthy) June 11, 2018 -
నా తండ్రి తప్పుడు మనిషి కాదు
సాక్షి, ముంబై/చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా చిత్రానికి కష్టాలు కొనసాగుతున్నాయి. కావేరీ జలాలపై రజనీ వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలో ఈ చిత్రం రిలీజ్ కాకుండా అడ్డుకుని తీరతామని కొన్ని సంఘాలు హెచ్చరించాయి. మరోవైపు కాలా కథ తన తండ్రిదేనంటున్న ముంబైకి చెందిన జర్నలిస్ట్ జవహర్ నాడర్, పరువు నష్టం దావా వేస్తానని కాలా నిర్మాతలను హెచ్చరించారు. కాలా సేట్ కథ... ట్యూటికోరిన్(తూత్తుకుడి)కి చెందిన ఎస్. థిరవియమ్ నాడర్ బెల్లం వ్యాపారి. 1957లో ముంబైలోని ధారావికి వలస వచ్చారు. అతనిని స్థానికులు ‘గుడ్వాలా సేట్’, ‘కాలా సేట్’ అని పిలిచేవారు. అయితే ఇప్పుడు కాలా చిత్రంలో రజనీ పోషిస్తున్న పాత్ర తన తండ్రిదేనని జవహర్ వాదిస్తున్నారు. ‘నా తండ్రి కథ అన్న విషయాన్ని దాచిపెట్టి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పైగా మంచి మనిషిగా పేరున్న నా తండ్రిని తప్పుడు కోణంలో చూపించారు. ఆయన గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోను. 36 గంటల్లో రజనీకాంత్ సహా చిత్ర యూనిట్ మొత్తం లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే రూ. 101 కోట్లకు దావా వేస్తా’ అని ఆయన లేఖలో హెచ్చరించారు. గతంలో కూడా ఆయన ఈ తరహా ఆరోపణలు చేయటం తెలిసిందే. కాలా టీమ్ స్పందన... ఇదిలా ఉంటే జవహర్ ఆరోపణలను కాలా చిత్ర యూనిట్ తోసిపుచ్చింది. ‘కాలా’ కథకు, థిరవియమ్ నాడార్కు అస్సలు సంబంధం లేదని తేల్చి చెప్పింది. నోటీసులు అందాక స్పందిస్తామని పేర్కొంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాలా’ను నటుడు ధనుష్ నిర్మించగా, రజనీకాంత్, ఈశ్వరి, నానాపటేకర్, సముద్రఖని, హూమా ఖురేషీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 7న కాలా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
మోదీకి సిద్దరామయ్య పరువునష్టం నోటీసులు
బెంగళూరు: అసత్య అవినీతి ఆరోపణలు చేసినందుకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిమాండ్‌చేశారు. క్షమాపణలు చెప్పకుంటే, పరువునష్టం కింద రూ.100 కోట్లు అపరాధరుసుం చెల్లించాలని మోదీ, అమిత్‌లకు సిద్దరామయ్య లీగల్ నోటీసులు పంపించారు. అవినీతి ఆరోపణలు చేసినందుకు కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పకు సైతం సిద్దరామయ్య నోటీసులు పంపారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘ప్రతీ పనికి లంచం తీసుకునే సర్కారు’, ‘పది శాతం కమీషన్లు పొందే సర్కారు’ అని ప్రచారసభల్లో మోదీ పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం తెల్సిందే. -
ఏడో భార్యని వదిలించుకునేందుకు యత్నం
యలమంచిలి: న్యాయం కోసం మరోసారి ఆ ఇల్లాలు రోడ్డెక్కింది. భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బూరుగుపల్లి పంచాయతీ మట్టవానిచెరువులో గురువారం జరిగింది. అసలేం జరిగిందంటే.. గ్రామానికి చెందిన చెల్లుబోయిన ఆంజనేయులు ఇప్పటివరకూ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. గ్రామస్తులకు తెలిసి రెండు, తెలియకుండా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏడో భార్య దేవరపల్లి మండలం సంగాయిగూడెంకు చెందిన లక్ష్మిని గతేడాది గర్భిణిగా ఉన్నప్పుడు వదిలించుకోవడానికి యత్నించాడు. దీంతో ఆమె సంఘ పెద్దల సాయంతో భర్త ఇంటిముందు ఆందోళన చేపట్టింది. ఈ విషయం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో అప్పట్లో సంచలనమైంది. దీంతో సంఘ పెద్దల చొరవతో పుట్టే బిడ్డకు అరెకరం పొలం, రూ.లక్ష నగదు, ఇంటిలో వాటా ఇచ్చేందుకు ఆంజనేయులు అంగీకరించాడు. అయితే పొలం రాశాడు కానీ నగదు, ఇల్లు ఇవ్వలేదు. ఈ ఏడాది కాలంలో భార్యను వదిలించుకోవడానికి అనేకసార్లు యత్నించినా ఆమె సంఘ పెద్దల సాయంతో నెట్టుకొచ్చింది. దీంతో అతను రెండు నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. భర్త వెళ్లిపోవడంతో లక్ష్మి తల్లిని తోడుగా తెచ్చుకుని భర్త మొదటి భార్య కుమారుల పేరిట ఉన్న ఐదెకరాల భూమిని అప్పు చేసి సాగు చేసుకుంది. ఇటీవలే కోత కూడా కోయించింది. ఇప్పుడు మరో నాటకం పంట చేతికి వచ్చిందని తెలుసుకున్న ఆంజనేయులు బుధవారం తన చెల్లి చంద్రావతి, మేనల్లుళ్లు జక్కంశెట్టి వెంకటేశ్వరరావు (వెంకన్నబాబు), గుబ్బల కోటేశ్వరరావును పొలం పంపి కట్టేత కట్టించడానికి పూనుకున్నాడు. ఉదయం పొలం వెళ్లిన లక్ష్మి వారిని చూసి నిలదీయగా.. మా మావయ్య పొలం నువ్వెవరు అడగడానికి అని ఎదురుతిరగడంతో బిత్తరపోయిన లక్ష్మి వారిని వారించే యత్నం చేయడంతో వారు ముగ్గురూ కలసి లక్ష్మిని చితకబాది వెళ్లిపోయారు. గాయాలతో గ్రామంలోకి వచ్చిన లక్ష్మి సంఘ పెద్దలకు జరిగిన విషయం తెలిపింది. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. కొంచెం తేరుకోవడంతో గురువారం ఇంటికి వచ్చి ఆందోళన చేపట్టింది. సంఘ పెద్దల సహకారంతో విలేకరులకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇదిలా ఉండగా పొలం విషయంలో సంఘ పెద్దలు అడ్డు వస్తారని ముందుగానే ఊహించిన ఆంజనేయులు తొమ్మిది మంది పెద్దలు మామిడిశెట్టి పెద్దిరాజు, గుబ్బల జయరాజు, గుబ్బల సత్యనారాయణ, యల్లమిల్లి ఏసుబాబు, బండి చంద్రవాసు, దొంగ వెంకటరమణ, గుబ్బల సత్యనారాయణ, యల్లమిల్లి వెంకట రామలక్ష్మి, పిల్లి పద్మావతిలకు కోర్టు నుంచి నోటీసులు ఇచ్చాడు. దీనిపై సంఘ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసు
సాక్షి, హైదరాబాద్: సన్‌బర్న్ సంగీత కార్యక్రమానికి అనుమతుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి మంత్రి కె.తారకరామారావు బావ మరిది, ఈటీజీ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రాజేంద్రప్రసాద్ పాకాల తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపారు. రాజకీయ లబ్ధికోసం, సంచలనాల కోసం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తమ క్లయింట్ రాజేంద్రప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేశారని న్యాయవాదులు తమ నోటీసులో పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలకుగాను మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. సన్‌బర్న్ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. -
అప్పటికీ అభ్యంతరం పెడితే టైటిల్ మార్చుతాం..
హైదరాబాద్ : 'మెంటల్ పోలీస్' సినిమా టైటిల్ మార్చాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘాల నుంచి వినతులు వచ్చాయని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. రెండు రాష్ట్రాల పోలీస్ సంఘాల నేతలకు సినిమా చూపిస్తామని, అప్పటికీ టైటిల్ మార్చాలంటే మార్పు చేస్తామని వారు బుధవారమిక్కడ వెల్లడించారు. శ్రీకాంత్ హీరోగా మెంటల్ పోలీస్ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా సినిమా పేరు ఉందంటూ ఆ చిత్ర నిర్మాత, దర్శకులతోపాటు హీరో శ్రీకాంత్‌కు పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. సమాజంలో పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా సినిమా పేరు పెట్టారని, దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. మరోవైపు మెంటల్ పోలీస్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసు అధికారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా శ్రీకాంత్, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో వీవీఏఎన్ ప్రసాద్ దాసరి, వీవీ దుర్గాప్రసాద్ అనగాని ఈ చిత్రాన్ని నిర్మించారు. -
'మెంటల్ పోలీస్' నిర్మాతకు లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ‘మెంటల్ పోలీస్’ పేరుతో సినిమా నిర్మించినందుకు నిర్మాత, దర్శకులతోపాటు అందులో నటించిన హీరో శ్రీకాంత్‌కు పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపింది. సమాజంలో పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా సినిమా పేరు పెట్టారని, దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కరణ్‌కుమార్ సింగ్, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. -
'ఔట్లుక్ మ్యాగజైన్ పై క్రిమినల్ కేసు'
ఔట్లుక్ మ్యాగజైన్‌పై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కించపరిచేలా తప్పుడు కథనం రాసినందుకు ఈ చర్యకు ఆదేశించారు. మరోవైపు తన పరువు మర్యాదలకు భంగం వాటిల్లేలా అనుచిత కథనం ప్రచురించినందుకు స్మితా సబర్వాల్ కూడా ఔట్లుక్ మ్యాగజైన్‌కు లీగల్ నోటీసులు పంపించారు. ఔట్లుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, హైదరాబాద్‌లోని అసిస్టెంట్ ఎడిటర్ మాధవి టాటాలకు స్మితా సభర్వాల్ తరఫు న్యాయవాది ఈ నోటీసులు పంపారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ సీఎంవో కార్యాలయంలో అడిషనల్ కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేసి సమర్థురాలైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి అధికారిపై ఔట్లుక్ పత్రికలో వచ్చిన కథనాన్ని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండించాయి. అదొక నీచమైన కథనమని, ఔట్లుక్ పత్రిక ఒక మహిళా ఐఏఎస్‌ను కించపరిచిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మండిపడ్డారు. ఈ కథనం తెలంగాణ ప్రజలను, సీఎంవో కార్యాలయాన్ని అవమానించినట్లుగా ఉందని.. వెంటనే ఔట్లుక్ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ మైక్రో పడగ
మైక్రో ఫైనాన్స కంపెనీలు మళ్లీ గ్రామాల్లోకి అడుగుపెడుతున్నాయి. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కొన్నాళ్లపాటు వెనక్కితగ్గిన పలు సంస్థలు అధిక వడ్డీల వసూళ్ల పర్వానికి మరోమారు తెరలేపాయి. గతంలో పేదలను పీల్చిపిప్పిచేసిన మైక్రో సంస్థల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు.. కంపెనీల చర్యలను ఏమాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. రుణమాఫీ విషయంలో నెలకొన్న సందిగ్ధాన్ని ఆసరా చేసుకుంటున్న మైక్రో సంస్థలు.. గతంలో తీసుకున్న అప్పును వడ్డీతోసహా చెల్లిస్తే అంతకు రెట్టింపు రుణమిస్తామని ఊరిస్తున్నాయి. దీంతో రైతులు, మహిళలు మళ్లీ మైక్రో సంస్థలవైపు చూస్తున్నారు. ఇక అప్పులు చెల్లించే స్థోమతలేదని, ఇప్పుడు బకాయి చెల్లించలేమని చెబుతున్న వారికి ఏకంగా నోటీసులు జారీ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నాయి. ⇒ వేధింపులు ప్రారంభించిన ఫైనాన్స కంపెనీలు ⇒ బకాయిదారులకు లీగల్ నోటీసులు ⇒ చెల్లించండి.. లేదంటే కోర్టుకేనంటూ బెదిరింపులు ⇒ ఇష్టారాజ్యంగా వడ్డీల వసూళ్లు ఫలితమివ్వని ప్రభుత్వ కమిటీలు ⇒ ఒక్క పరిగి నియోజకవర్గం పరిధిలోనే రూ.20 కోట్ల మైక్రో రుణాలు పరిగి: జిల్లాలో మైక్రో కంపెనీలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. మహిళలకు అప్పులిచ్చి అధిక వడ్డీలను వసూలు చేస్తున్న పలు కంపెనీల వేధింపులు అధికం కావడంతో గతంలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం గ్రామాల్లో కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు వెనక్కితగ్గినట్టు ఉన్న కంపెనీలు ఇప్పుడు మళ్లీ గ్రామాల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం రుణమాఫీ విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సంస్థలు పాత అప్పులు చెల్లిస్తే అంతకంటే ఎక్కువ రుణాలిస్తామని నమ్మబలుకుతున్నాయి. ఇచ్చిన వారి నుంచి డబ్బులు తీసుకోవడం, ఇవ్వనివారికి లీగల్ నోటీసులు జారీ చేయడం వంటి చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ఇటీవల పరిగి మండలం సోండేపూర్ తండాకు చెందిన కొందరికి నోటీసులు ఇవ్వడంతోపాటు ఓ వ్యక్తిపై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా పరిగి మండల పరిధిలోని పలువురికి కోర్టు నోటీసులు పంపించారు. కోర్టుకీడుస్తామంటూ బెదిరింపులు.. తీసుకున్న డబ్బులను వడ్డీలతోసహా వెంటనే చెల్లించాలని ైరె తులు, మహిళలకు మైక్రో సంస్థలు కోర్టు నోటీసులు పంపుతున్నాయి. డబ్బులు చెల్లించకుంటే కోర్టుకు హాజరుకావాల్సి వస్తుందని ఆయా కంపెనీల సిబ్బంది బెదిరిస్తున్నారు. మైక్రో సంస్థలు వసూలు చేస్తున్న వడ్డీల ప్రకారం.. ఇచ్చిన అసలు రెండేళ్లలోనే డబుల్ అవుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిగి మండలంలోని నస్కల్ గ్రామానికి చెందిన బేగరి అంజయ్య మూడేళ్ల క్రితం ఓ మైక్రో ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.10 వేలు అప్పుతీసుకున్నాడు. ఆ వెంటనే రూ. రెండు వేలు చెల్లించాడు. మిగిలిన రూ.8 వేలకు వడ్డీతో ఇప్పుడది రెట్టింపు అయిందని, వెంటనే చె ల్లించాలని నోటీసులు పంపారు. అదే గ్రామానికి చెందిన బేగరి నారాయణ, బైండ్ల నర్సింహులు తదితరులకు సైతం ఇలాగే నోటీసులు అందాయి. ఒక్క నియోజకవర్గంలోనే రూ.20 కోట్ల రుణాలు.. పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో ఎల్అండ్టీ, ఎస్కేఎస్, స్పందన తదితర సంస్థలు సుమారు రూ.20 కోట్ల మేర రుణాలిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా మైక్రో సంస్థలు 24 శాతం వడ్డీ అని చెబుతూ 45 నుంచి 55 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఆదుకోని ఆర్థిక చేకూర్పు.. మహిళల అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చి ఇతర ప్రైవేటు అప్పుల నుంచి విముక్తి కలిగించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా ప్రారంభించిన సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకం మహిళలన్ని ఆదుకోవడంలో విఫలమైంది. 10 నుంచి 15 మంది ఉన్న ఒక్కో సంఘానికి, విడివిడిగా ఒక్కో మహిళాకు ఏఏ అవసరాలున్నాయన్న దానిపై అధ్యయనం చేసి అవసరమైన మేరకు రుణాలివ్వాలని సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకాన్ని తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ఐకేపీ సిబ్బందితో ప్రణాళిక తయారు చేసింది. కానీ ఆ ప్రణాళికను ఇప్పటివరకు సమర్థవంతంగా అమలు చేయకపోవడంతో మహిళా సంఘాలు మైక్రో సంస్థల్ని ఆశ్రయించక తప్పడం లేదు. -
ఆంధ్రజ్యోతి ఎండీ, ఎడిటర్లకు లీగల్ నోటీసులు
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్‌లకు వైఎస్ఆర్సీపీ లీగల్ నోటీసులు ఇచ్చింది. 13.12.2014న విశాఖపట్నం ఎడిషన్‌లో ప్రచురించిన ఆర్టికల్‌పై క్షమాపణ చెప్పాలని నోటీస్‌లో ఆ పార్టీ డిమాండ్ చేసింది. నోటీస్ అందిన వారం రోజుల లోపల క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి ఆర్టికల్ ప్రచురించినట్లు ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. -
పరకాల, రామోజీలకు లీగల్ నోటీసులు
తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించారని ఎమ్మెల్యే చెవిరెడ్డి మండిపాటు తిరుపతి: తన పరువుకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, తన వివరణ తీసుకోకుండానే దురుద్దేశంతో ఆ ఆరోపణలను ప్రచురించిన ‘ఈనాడు’ సంస్థల అధిపతి రామోజీరావుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం లీగల్ నోటీసులు పంపారు. నోటీసు అందిన 15 రోజుల్లోపు నష్టపరి హారంగా రూ. 20 లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. ‘చెవిరెడ్డి తండ్రి సుబ్రమణ్యంరెడ్డికి పింఛను వస్తుందని, ఆ పింఛను ఎవరు తీసుకుంటున్నారో చెప్పాలని, చెవిరెడ్డి తండ్రికి పింఛను ఇవ్వాలా, దీనిపై జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి’ అని పత్రికా సమావేశంలో పరకాల ప్రభాకర్ ఇటీవల సవాల్ విసిరారు. దీనిని ‘ఈనాడు’ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. కనీసం తాను వివరణ ఇచ్చినా ఈనాడు పత్రిక పట్టించుకోలేదని, దురుద్దేశ పూర్వకంగానే తన పరువుకు భంగం కలిగించేలా పరకాల, ఈనాడు యాజమాన్యం ప్రవర్తించినట్టు చెవిరెడ్డి నోటీసులో పేర్కొన్నారు. కాగా, తనతండ్రి దరఖాస్తు చేయకున్నా అర్హుల జాబితాలోకి ఆయన పేరు ఎలా వచ్చిందో చెప్పాలంటూ అధికారులను చెవిరెడ్డి రాతపూర్వకంగా కోరారు. ‘‘అధికారుల పొరపాటు వల్లే పింఛను జాబి తాలోకి మీ తండ్రి పేరు చేరింది. అందులో మీ ప్రమేయం లేదు. ఏ రోజూ పింఛను డబ్బు తీసుకోలేదు’’ అని అధికారులు రాత పూర్వకంగా ఎమ్మెల్యే చెవిరెడ్డికి సమాధానం ఇచ్చారు.