Pooja Hegde Issues Legal Notice to Umair Sandhu - Sakshi
Sakshi News home page

Pooja Hegde: నోటీసులు సరే.. కానీ ఏం లాభం?

Published Wed, Jul 26 2023 11:17 AM | Last Updated on Wed, Jul 26 2023 11:57 AM

Pooja Hegde Sent Legal Notices Umair Sandhu - Sakshi

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి వరసపెట్టి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మహేశ్ 'గుంటూరు కారం' నుంచి తప్పుకొందో, తప్పించారో తెలియదు గానీ ఆ సినిమా నుంచి బయటకొచ్చేసింది. తెలుగులో కొత్తగా ఇంకేం మూవీస్ ఒప్పుకోలేదు. ఇ‍ప్పుడు ఓ క్రిటిక్‌కి లీగల్ నోటీసులు పంపితే.. ఆ విషయాన్ని అతడు కామెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: ఉపాసన డైమండ్ గిఫ్ట్‌పై తమన్నా క్లారిటీ!)

తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు లాంటి స్టార్ హీరోలతో హిట్స్ కొట్టిన పూజాహెగ్డేకు గత కొన్నాళ్ల నుంచి అస్సలు కలిసి రావట్లేదు. కారణం ఏదైనా గానీ ఆమె సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో దర్శకనిర్మాతలు ఆమెవైపు చూడటం మానేశారు. గతంలో ఈమెపై రివ్యూయర్ అని తనకు తాను చెప్పుకునే ఉమైర్ సంధు దారుణమైన విమర్శలు చేశాడు. ఇప్పుడు దానికి ప్రతిగా అతడికి లీగల్ నోటీసులు పంపించింది. అతడు దాన్ని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చాడు.

గత కొన్నేళ్లుగా ఓవర్సీస్ రివ్యూయర్ అని చెప్పుకొనే ఉమైర్ సంధు.. తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా ప్రతి సినిమా బాగుంది బాగోలేదు అని ట్విట్టర్ లో చెప్పేవాడు. అక్కడివరకు ఆగితే బాగుండు. కానీ.. 'ప్రభాస్-కృతిసనన్ ప్రపోజ్ చేశాడు. పూజాహెగ్డే ఐరన్ లెగ్' లాంటి విపరీతమైన ట్వీట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా కృతిసనన్, పూజాహెగ్డే.. లీగల్ నోటీసులు పంపించారు. అయితే అతడు లండన్‌లో ఉంటున్నాడు. దీంతో ఏం యాక్షన్ తీసుకోవడానికి కుదరదు. అందుకే సదరు హీరోయిన్ల నోటీసులపై కూడా అతడు ట్వీట్స్ పెట్టి కామెడీ చేస్తున్నాడు. 

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement