ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కాంగ్రెస్‌నేతలకు చట్టపరమైన నోటీసులు పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ నేతలు వక్రీకరించారని ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. ‘కేంద్ర మంత్రి గడ్కరీ కాంగ్రెస్ పోస్ట్ చేసిన 19 సెకండ్ల వీడియో క్లిప్‌ను చూసి షాక్ అయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు, వాటి అసలు అర్థాన్ని కాంగ్రెస్ నేతలు వక్రీకరించారు’ అని న్యాయవాది బాలేందు శేఖర్ తెలిపారు.
గందరగోళాన్ని, అపకీర్తిని సృష్టించడానికి నితిన్ గడ్కరీ మాటాలను వక్రీకరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు పోస్ట్ చేసిన ఆ వీడియో క్లిప్‌ను తొలగించాలని లిగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. మూడు రోజుల్లో తన క్లైంట్‌కు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని లాయర్ బాలేందు శేఖర్ తెలిపారు.
వీడియో క్లిప్‌లో ఏం ఉంది?
జాతీయ మీడియా చానెల్‌కు నితిన్ గడ్కరీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఓ అంశాన్ని వివరించే క్రమంలో.. ‘గ్రామీణ ప్రజలు, కూలీలు, రైతులు సంతోషంగా లేరు. గ్రామాలకు సరైన రోడ్లు లేవు. తాగడానికి కనీసం తాగునీరు లేదు. నాణ్యమైన ఆస్పత్రులు, పాఠశాలలు లేవు’ అని అన్నారు. అయితే కేవలం ఈ మాటలను మాత్రమే ఉన్న ఓ క్లిప్‌ను కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 19 సెకండ్ల వీడియో క్లిప్‌పై కేంద్రమంత్రి గడ్కరీ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
తన మాటలను కాంగ్రెస్ పార్టీ నేతలు కావాలనే వక్రీకరించారని గడ్కరీ అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. తన వీడియో క్లిప్‌ను 24 గంటల్లో డిలీట్ చేసీ.. కాంగ్రెస్ నేతలైన మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌లు మూడు రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణలు తెలిపాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment