సాక్షి,హైదరాబాద్: కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ బుధవారం(అక్టోబర్ 23) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ప్రధాని మోదీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మోదీ బాటలోనే నడుస్తానని కేటీఆర్ చెప్పారు. కాగా, తనపై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని అందులో పేర్కొన్నారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ ఇలాంటి తాటాకు చప్పుల్లకు భయపడేది లేదన్నారు.
ఇదీ చదవండి: కేటీఆర్ లీగల్ నోటీసులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment