శ్రీరెడ్డి విమర్శలపై స్పందించిన నాని భార్య | Nani Wife Anjana Responds Sri Reddy Comments | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 12 2018 1:56 PM | Last Updated on Tue, Jun 12 2018 5:26 PM

Nani Wife Anjana Responds Sri Reddy Comments - Sakshi

హైదరాబాద్‌ : నేచురల్‌ స్టార్‌ నానిపై గత కొద్దిరోజులుగా నటి శ్రీరెడ్డి వివాదస్పద ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నాని సైతం స్పందిస్తూ.. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆమెకు లీగల్‌ నోటీసులు పంపించారు. అయితే తాజాగా ఈ వివాదంపై నాని భార్య అంజనా సైతం స్పందించారు. ‘‘సినీ పరిశ్రమ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. కానీ, ప‌బ్లిసిటీ కోసం ఇతరుల జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వ‌స్తుండ‌టం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త వ్యాఖ్యలను ఎవ‌రూ నమ్మరనుకోండి. కానీ, వారి వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి ఎలా సిద్దప‌డ‌తారో’’ అని అంజ‌నా ట్వీట్ చేశారు. 

ఇక నాని పంపిన నోటీసులకు తాము సిద్దమని శ్రీరెడ్డి స్పష్టం చేసింది. తనకు కావాల్సింది కూడా ఇదేనని.. నీ రంకు బాగోతం బయటపెట్టడానికి ఓ మంచి అవకాశం తనకు వచ్చిందన్నారు. బిగ్‌ బాస్‌-2 తాను లేకపోవడానికి నానినే కారణమని, నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే.. అని శ్రీరెడ్డి ఇటీవల పోస్ట్‌ చేయడం టాలీవుడ్‌లో దూమారం రేపిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement