
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తూ సంచలనం సృష్టిస్తున్న శ్రీరెడ్డికి నాచురల్ స్టార్ నాని లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. దీనికి శ్రీరెడ్డి స్పందించింది. తన పుట్టిన రోజు సందర్భంగా వేరే ప్రాంతానికి వెళ్తుంటే ఈ విషయం తెలిసిందన్నారు. తనకు కావాల్సింది కూడా ఇదేనని.. నీ రంకు బాగోతం బయటపెట్టడానికి ఓ మంచి అవకాశం తనకు వచ్చిందని నానిని ఉద్దేశించి అన్నారు. తప్పనిసరిగా ఫైట్ చేద్దాం.. గురువారం మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వస్తాను.. అప్పుడు నాని సంగతి చూస్తానని తెలిపారు. ఇక నానిపై చేసే పోరాటం చూసి మిగతా వారందరూ వణికిపోయేలా చేస్తానని ఛాలెంజ్ విసిరారు.
అలాగే బాధిత మహిళలు ఎలా ఫైట్ చేయాలో నేను చేసి చూపిస్తాను. నీవ్వు నిజంగా తప్పు చేస్తే, కచ్చితంగా నీ మనఃసాక్షికి తెలుసు.. నీ భార్యకు అన్నీ చెబుతానని చెప్పావు. మన సంగతి చెప్పావో లేదో నాకు తెలియదన్నారు. నువ్వు జనాల్లో పరువు పోతుందని లీగల్ నోటీసులు పంపావు కానీ ఏమి జరిగిందో నీకు తెలుసన్నారు. నువ్వు నిజంగా తప్పు చేసి ఉంటే.. ధర్మానికి నిజంగా బలం ఉంటే.. నువ్వు కచ్చితంగా దోరుకుతావని, దేవుడు నిన్ను శిక్షిస్తాడన్నాడని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment