
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తూ సంచలనం సృష్టిస్తున్న నటి శ్రీరెడ్డికి, నేచురల్ స్టార్ నానికి మధ్య జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా నానిపై శ్రీరెడ్డి పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై నాని సైతం స్పందిస్తూ.. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. అయితే తాజాగా ఈ వివాదంపై హీరో విశాల్ స్పందించాడు.
‘నాని నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. అంత మాత్రాన నేను అతడిని సమర్థించను. తాజాగా నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా ఉన్నాయి. నాని గురించి తెలిసిన వాళ్లందరికీ అతని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసు. ఏదో పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేయడం కాకుండా, ఆమె వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. ఇదంతా చూస్తుంటే ఒకరి తర్వాత ఒకరిపై ఆమె వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పోనుపోనూ ఆమె నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమో. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు అందుకు తగిన ఆధారాలు కూడా చూపించాలి. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది వాస్తవం. కానీ దానిని సాకుగా చూపి ప్రముఖులపై ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదు’ అని అన్నారు. ‘అభిమన్యుడు’ విజయోత్సవ యాత్రలో భాగంగా విశాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు . విశాల్, సమంత జంటగా నటించిన అభిమన్యుడు సినిమా భారీ విజయాన్ని అందుకుని మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment