నాని భార్యకు శ్రీరెడ్డి కౌంటర్‌! | Sri Reddy Counter To Nani Wife Anjana | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 17 2018 12:17 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Sri Reddy Counter To Nani Wife Anjana - Sakshi

ఇటీవల టాలీవుడ్‌లో దుమారం రేపిన అంశం కాస్టింగ్ కౌచ్‌. ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్‌, పోస్ట్‌లతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం హీరో నానిపై చేస్తున్న ఆరోపణలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తనపై చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందనగా నాని ఇటీవల శ్రీరెడ్డికి లీగల్‌ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీరెడ్డి కూడా స్పందిస్తూ.. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. కోర్టులోనే తేల్చుకుందాం అని నానికి సవాల్‌ విసిరారు. 

ఈ క్రమంలో శ్రీరెడ్డిపై నాని భార్య అంజనా కూడా ఫైర్‌ అయ్యారు. అయితే తాజాగా నానికి సపోర్ట్‌గా అంజనా చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా శ్రీరెడ్డి మరో పోస్ట్‌ చేశారు. ‘హాయ్‌ మిసెస్‌. నేనిప్పుడే నువ్వు చేసిన పోస్ట్‌ను చూశాను. నేను నీ భర్తతో ఉన్నప్పుడు నువ్వు చూడలేదు. నేను పేరు కోసం తాపత్రయపడటం లేదు. నీ భర్తే పేరు కోసం తాపత్రయ పడతాడు. నాకు ఉన్న పేరు చాలు. ఒకవేళ నా భర్తకే పేరు, డబ్బు ఉండి ఇలాంటి పనులు చేస్తే, నేను నా భర్తకు మాత్రం సపోర్ట్‌ చేయను. అవసరమైతే అలాంటి వాడ్ని వదిలేసి వెళ్లిపోతానేమో అంతే కానీ బాధిత మహిళను మాత్రం అవమాన పరచను. ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. మొత్తం విషయం తెలిసేవరకు సైలెన్స్‌గా ఉండండి. నా వైపు సత్యం ఉంది. కర్మ ఉంది. నీ భర్త తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే’నని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో శ్రీరెడ్డి పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement