జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట | Nani Wife Shared Their Child Arjun Photo | Sakshi
Sakshi News home page

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

Jul 28 2019 8:10 PM | Updated on Jul 28 2019 8:10 PM

Nani Wife Shared Their Child Arjun Photo - Sakshi

చిన్న పిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు. అసలు పిల్లలు అల్లరి చేస్తేనే అందంగా ఉంటుంది. న్యాచురల్‌ స్టార్‌ నాని కుమారుడు అర్జున్‌ కూడా తెగ అల్లరి చేసేస్తున్నాడట. ఈ విషయాన్ని ఆయన సతీమణి అంజన సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అర్జున్‌ చిన్ననాటి ఫోటోను షేర్‌ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశారు.

‘నాకు చాలా ఇష్టమైన ఫొటో అంటూ.. అర్జున్‌ పుట్టిన నెల రోజులకు తీసిన అపురూపమైనది’ అంటూ ఫొటోను షేర్‌ చేశారు. నిద్రలో తెగ నవ్వుతూ ఉన్న బాబును ఎత్తుకుని  అద్దం ముందు నిలబడి సెల్ఫీ దిగారు.  అంతేకాదు అర్జున్‌ ఏ మాత్రం కుదురుగా ఉండటం లేదంటూ బాబు చిందులేస్తూ ఆడుకుంటున్న వీడియోను, ఫొటోను షేర్‌ చేశారు. బాబు తన జీన్స్‌ కాదంటూ.. పరోక్షంగా అన్నీ నాని పోలికలేనని కామెంట్‌ చేశారు. ప్రస్తుతం నాని గ్యాంగ్‌ లీడర్‌ చిత్రంతో బిజీగా ఉండగా.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాబోతోన్న ‘వీ’ చిత్రంలో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement