Anjana
-
అక్కినేనికి డై హార్డ్ ఫ్యాన్ ఆమెనే: మెగాస్టార్ చిరంజీవి
తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నాపు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.మెగాస్టార్ మాట్లాడుతూ..'మా అమ్మ అంజనాదేవిని ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రధాన కారణముంది. ఏఎన్ఆర్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్స్‌లో అమ్మ కూడా ఒకరు. మొగల్తూరులో నిండు గర్భంతో ఉన్నప్పటికీ ఆ సమయంలో ఏఎన్ఆర్ సినిమా చూసేందుకు వెళ్లారు. అప్పట్లో సినిమా చూసేందుకు నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్లి చూడాలి. ఆ సినిమా పేరు 'రోజులు మారాయి'.. అప్పట్లో సూపర్ హిట్ సినిమా. దీంతో జట్కా బండిలో సినిమాకు బయలుదేరారు. కానీ అప్పుడే ఓ బస్సు వీరి బండికి ఎదురొచ్చింది. ఆ బస్సుకు దారి ఇచ్చే సమయంలో వీరి ప్రయాణిస్తున్న జట్కా బండి పక్కన ఉన్న పొలాల్లో పడిపోయింది. అందరూ కిందపడ్డారు. నాన్న ఇంటికి వెళ్దామని చెప్పినా వినకుండా సినిమా చూడాల్సిందేనని అమ్మ పట్టుబట్టి మరి వెళ్లింది. ఎలాగైనా సరే ఆ మూవీ చూసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది' అని అన్నారు. నాకు డ్యాన్స్‌లో అక్కినేని నాగేశ్వరరావు ఆదర్శమని చిరంజీవి కొనియాడారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి వల్లే మనందరం ఇక్కడ ఉన్నామని తెలిపారు. అక్కినేని కుటుంబంతో నాకున్న అనుబంధం చాలా గొప్పదని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ రావడమనేది నా పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. అమితాబ్ చేతుల మీదుగా తీసుకోవడం మరింత ఆనందం కలిగించిందని మెగాస్టార్ అన్నారు. -
16 ఏళ్లయింది.. ఎన్టీఆర్ కోసం తెగ ఆరాటపడ్డ యాంకర్.. ఇన్నాళ్లకు! (ఫొటోలు)
-
Hero Arjun Daughter Photos: వ్యాపారవేత్తగా రాణిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో కూతురు (ఫోటోలు)
-
నాని బర్త్ డే సెలబ్రేషన్స్.. తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చిన తనయుడు!
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే హాయ్ నాన్న చిత్రం ద్వారా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన ప్రస్తుతం సరిపోదా శనివారం అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ఎస్జే కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇటీవలే నాని 40వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఫిబ్రవరి 24న తన కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే తాజాగా జరుపుకున్న బర్త్ డే వేడుకల్లో నాని తనయుడు అర్జున్ తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చాడు. నాని నటించిన జెర్సీ చిత్రంలోని హోయనా హోయనా అనే ట్యూన్‌ను పియానోపై వాయించాడు. తండ్రి బర్త్ డే రోజు తన కుమారుడు స్పెషల్‌గా ట్రీట్ ఇవ్వడంతో నాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నాని భార్య అంజనా యలవర్తి తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంజనా తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఈ వారాంతంలో నా సగం జీవితంలో తెలిసిన వ్యక్తి 40వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. సాధారణంగా ఆయన ఇలాంటి వేడుకలు, సర్‌ప్రైజ్‌ల నుంచి తప్పించుకుంటాడు. కానీ చిన్న చిన్న హావ భావాలను ఆస్వాదిస్తారు. ఒక చిన్న సర్ప్రైజ్ అతనిని మార్చగలదు. ఈ సారి జున్ను తన నాన్నా బర్త్ డే కోసం బిగ్ ప్లాన్ చేశాడు. ఆయనకు లైఫ్‌లో మరిచిపోలేని సర్ప్రైజ్ అందించాడు. అర్జున్ నుంచి ఈ రోజు అనుకోకుండా జెర్సీ నుంచి ఒక పాటను చూశాం. ఈ పాటతో నాని గర్వపడేలా చేశాడు అర్జున్. ఇది నిజంగా అద్భుతమైన క్షణంలా అనిపించింది. ఏదో ఒక సమయంలో పూర్తి వీడియో పోస్ట్ చేస్తాను' అంటూ షేర్ చేసింది. కాగా.. నాని పూర్తి పేరు ఘంటా నవీన్ బాబు. నానిది స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామమే అయినా.. విశాఖపట్నానికి చెందిన అంజనా అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కెరీర్ మొదట్లో బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నాని.. అనుకోకుండా 'అష్టా చమ్మా' చిత్రంతో హీరోగా మారాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిందా చిత్రం. అలా 2008లో మొదలైన ఆయన ప్రయాణం. హీరోగా ఇప్పటికే 30కి పైగా చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. గతేడాది దసరా,హాయ్ నాన్న చిత్రాలతో హిట్లు కొట్టిన నాని.. త్వరలో సరిపోదా శనివారం చిత్రంతో అలరించనున్నారు. View this post on Instagram A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy) -
కనిపించే దేవతకు జన్మదిన శుభాకాంక్షలు: మెగాస్టార్ ట్వీట్
ఇటీవలే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ఆయనను వరించింది. ఈ అవార్డ్‌తో ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్న మెగాస్టార్ కీర్తి మరింత పెరిగింది. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ఘనత దక్కించుకున్న నటుడిగా నిలిచారు. అయితే తాజాగా మెగాస్టార్ మాతృమూర్తి అంజనాదేవి జన్మదినాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం అంజనాదేవికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. మెగాస్టార్ నటిస్తోన్న ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు. కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.💐💐 pic.twitter.com/MFOttIdoPj — Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2024 -
నేచురల్ స్టార్ నాని పెళ్లి.. లవ్ స్టోరీ మామూలుగా లేదుగా?
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగిన హీరో నాని. కెరీర్ తొలినాళ్లలో రేడియో జాకీగా అలరించారు నాని. నాని పూర్తి పేరు ఘంటా నవీన్ బాబు. రాంబాబు, విజయ లక్ష్మీ దంపతులకు 1984 ఫిబ్రవరి 24న జన్మించారు. నానికి అక్క కూడా ఉన్నారు. పేరు దీప్తి. స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామం. కొన్నాళ్లు బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. అష్టా చెమ్మా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదిగారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. అలా మొదలైంది నాని సినీ ప్రయాణం. ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు, ఈగ, జెర్సీ, భలే భలే మగాడివోయ్, ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే చిత్రంలో నటిస్తోన్న నాని.. ఇటీవలే సరిపోదా శనివారం అనే టైటిల్లో కొత్త మూవీని ప్రకటించారు. (ఇది చదవండి: ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్ .. ఎమోషనల్ అయిన జ్యోతిరాజ్) అయితే 2012లో అక్టోబర్ 27న అంజనా ఎలవర్తి అనే అమ్మాయిని పెళ్లి హీరోకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లి జరిగిన నేటికి 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నాని తన ఇన్‌స్టాలో ఓ అరుదైన ఫోటోను పంచుకున్నారు. తన భార్య అంజనకు నుదుటిన బొట్టు పెడుతున్న పిక్ షేర్ చేశారు. మా బంధానికి 11 సంవత్సరాలు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే నానికి ఫేస్ బుక్ ద్వారా అంజనా పరిచయమైనట్లు తెలుస్తోంది. అయిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారు. కాగా.. విశాఖపట్నానికి చెందిన అంజనా కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తోంది. అయితే మొదట నానితో పెళ్లికి అంజనా ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదని సమాచారం. దీంతో ఐదేళ్ల పాటు రిలేషన్లో ఉన్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు. (ఇది చదవండి: పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్) View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తోన్న 'రావెన్'!
అజయ్ కార్తీక్, అంజనా జంటగా నటిస్తోన్న చిత్రం 'రావెన్'. ఈ చిత్రం ద్వారా దర్శకుడు గణేష్ కె బాబు శిష్యుడు కళ్యాణ్ కె జగన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీని ఎంజీ స్టూడియోస్ అధినేత ఏపీవీ.మారన్‌తో కలిసి సంయక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్ ధాను ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. వినూత్న కథాంశంతో కొత్త తరానికి చెందిన కథా చిత్రంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్త షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈ చిత్రంలో దర్శకుడు భాగ్యరాజ్, ఈటీవీ గణేష్, వీర, హిందూమతి, పి.అరుణాచలేశ్వరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి శక్తి చాయాగ్రహణం, మనం రమీశన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ లలిత్ కుమార్, ఫైవ్ స్టార్ కదిరేసన్, ఫైవ్ స్టార్ సెంథిల్, రాక్ ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ మురుగానందం, అరుణ్ విశ్వ, డిస్ట్రిబ్యూటర్ కోవై అరవింద్, పోర్ తొళిల్ చిత్ర దర్శకుడు విగ్నేష్ రాజా, యాత్తిశై చిత్ర దర్శకుడు ధరణి రాజేంద్రన్, గుడ్ నైట్ చిత్ర దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. #Dada fame director #GaneshKBabu has penned the story and screenplay of a film called #Raven, which went on floors today! The film features newcomer Ajay Karthik and actor Nethra 's daughter Anchana in the lead. The film is being directed by Kalyan K Jegan. Produced by :-… pic.twitter.com/wsEZyUenfM — Cineobserver (@cineobserver) August 21, 2023 -
Anjana Arjun : అర్జున్ సర్జా చిన్నకూతురు గ్లామర్ షో, హీరోయిన్ అవ్వడానికేనా? (ఫోటోలు)
-
జూనియర్ నాని తెగ అల్లరి చేస్తున్నాడట
చిన్న పిల్లలు అల్లరి చేస్తూనే ఉంటారు. అసలు పిల్లలు అల్లరి చేస్తేనే అందంగా ఉంటుంది. న్యాచురల్ స్టార్ నాని కుమారుడు అర్జున్ కూడా తెగ అల్లరి చేసేస్తున్నాడట. ఈ విషయాన్ని ఆయన సతీమణి అంజన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అర్జున్ చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘నాకు చాలా ఇష్టమైన ఫొటో అంటూ.. అర్జున్ పుట్టిన నెల రోజులకు తీసిన అపురూపమైనది’ అంటూ ఫొటోను షేర్ చేశారు. నిద్రలో తెగ నవ్వుతూ ఉన్న బాబును ఎత్తుకుని అద్దం ముందు నిలబడి సెల్ఫీ దిగారు. అంతేకాదు అర్జున్ ఏ మాత్రం కుదురుగా ఉండటం లేదంటూ బాబు చిందులేస్తూ ఆడుకుంటున్న వీడియోను, ఫొటోను షేర్ చేశారు. బాబు తన జీన్స్ కాదంటూ.. పరోక్షంగా అన్నీ నాని పోలికలేనని కామెంట్ చేశారు. ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ చిత్రంతో బిజీగా ఉండగా.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాబోతోన్న ‘వీ’ చిత్రంలో నటిస్తున్నాడు. -
కొడుకుతో సరదాగా నాని..
నేచురల్ స్టార్ నాని తన కుమారుడు అర్జున్‌తో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట్లో బెడ్ కింద దాక్కునేందుకు యత్నించిన అర్జున్ను.. నాని స్టైలిష్‌గా తన భూజలపైకి ఎత్తుకుని ఆడిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నాని భార్య అంజన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు.. ‘సో క్యూట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ ఏడాది జెర్సీ మూవీ సూపర్ హిట్ కొట్టిన నాని, మరికొద్ది రోజుల్లో ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. View this post on Instagram 🎵Kailove chedugudugudu🎵 A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy) on Jun 22, 2019 at 8:00am PDT -
జున్నూవాళ్ల డాడీ
సన్నాఫ్ సెలబ్రిటీ అయితేనే అడ్రస్ ఉండే సొసౌటీ ఇది! పోలీస్ ఆపితే.. 'మా డాడీ ఎవరో తెలుసా' అని అడిగే జనరేషన్ ఇది! కాని..'జున్నూ' అలా కకూడదని నానీ ప్రేమ పోలీసింగ్ చేస్తున్నాడు. వేలు చూపి 'ఇది చెయ్యొద్దు' అనడు. రేప్పొద్దున ఎవరు తన కొడుకు వైపు వేలెత్తి చూపకుండా ఇప్పుడే అన్నీ నేర్పిస్తున్నాడు. పిల్లలకు తండ్రి హీరో అవ్వాలంటే మురపాలే సరిపోవు మరి. ►మీ బర్త్‌డే 24న. రీసెంట్గా 24వ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. అది కూడా ‘24’ అనే సినిమా తీసిన డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్‌తో. 24 అంకెకు మీ జీవితంలో ఏదైనా స్పెషాలిటీ ఉందా? ►ఉందనుకుంటాను. కానీ దానికి లాజికల్ వివరణ ఇవ్వలేను. చిన్నప్పటి నుంచి 24తో చాలా కనెక్షన్ ఉంది. ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్ అనుకోకుండా 24వ సీట్ రావడం, ఇల్లు కొనుక్కుంటే అది ఫ్లాట్ నం. 24 అవ్వడం... ఇలా అనుకోకుండా కుదురుతుంటాయి. ఇక నేను పని చేస్తున్నది 24 శాఖలున్న ఇండస్ట్రీలో. సెకన్‌కు 24 ఫ్రేమ్‌లు ఉంటాయి. నా బర్త్‌డే 24. హీరోగా నా కెరీర్ స్టార్ట్ అయింది 24ఏళ్లకు. విచిత్రంగా అనిపిస్తుంటుంది. అది యాదృచ్ఛికమో దానికేమైనా కనెక్షన్ ఉందో నాకు తెలియదు. సరే ఇన్ని కనెక్షన్లు ఉన్నాయి కదా అని నా కారు నెంబర్లు కూడా 24 అని పెట్టించుకున్నాను (నవ్వుతూ). లక్కీ అని కాదు. 24తో ఓ చిన్న ఎమోషన్ ఏర్పడింది. ►ఈ బర్త్‌డే విశేషాలు ఏమైనా? ►బేసిక్‌గా బర్త్‌డే అంటే భయం. ఆ ఒక్క రోజు మాత్రం మన క్యాలెండర్ నుంచి స్కిప్ అయిపోతే బావుండు అనిపిస్తుంటుంది. ఒకలాంటి ప్రెషర్ ఫీల్ అవుతుంటాను. చిన్నప్పుడు బర్త్‌డే అంటే స్కూల్లో మనం చాలా స్పెషల్. క్లాస్‌లో ఎక్కువగా మాట్లాడని క్లాస్మేట్స్ కూడా వచ్చి మనకు విషెస్ చెబుతారు. యాక్టర్ అయ్యాక మనం వద్దనుకున్నా అటెన్షన్ ఉంటుంది. దాంతో ప్రైవేట్ టైమ్ కోసం వెతుకుతూ ఉంటాం. బర్త్‌డే రోజు లెక్కపెట్టలేనంత మంది విష్ చేస్తుంటారు. వాళ్లందరికీ రిప్లయ్ ఇవ్వాలనుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా కుదరదు. అదో ప్రెషర్. అంత టైమ్ కూడా ఉండదు. ఫ్రెండ్స్ కలవాలనుకుంటారు, ఫ్యామిలీ మనతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటారు. సినిమా షూటింగ్ ఉంటే వెళ్లిపోవాలి. అందుకే బర్త్‌డే డేట్ వరకు స్కిప్ అయి నెక్ట్స్ డేట్‌కి వెళ్లిపోతే బావుండు (నవ్వుతూ). ► గుర్తుండిపోయిన బర్త్‌డే ఏదైనా ఉందా? ►చిన్నప్పటి బర్త్డేల్లో ఓ అమాయకత్వం ఉండేది. ఏం చాక్లెట్లు కొనాలి? మన క్లోజ్ ఫ్రెండ్స్‌కు రెండు మూడు ఇచ్చి మిగతావాళ్లను ఒకటే తీసుకోమనడం... ఆ క్యూట్‌నెస్, ఇన్నోసెన్స్ ఇప్పుడు ఉండవు కదా. చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్న బర్త్డేలన్నీ గుర్తుండిపోయినవే. నా చిన్నప్పటి ఫొటోలన్నీ నా పుట్టినరోజుకు దిగినవే. అది కూడా సరోజ్ అనే ఫోటో స్టూడియోలో. నా ఆల్బమ్ తీస్తే ఫస్ట్ వచ్చే పది ఫొటోలు పది సంవత్సరాల బర్త్డేలవే. ప్రతి ఫొటో వెనుక ‘సరోజ్ ఫొటో స్టూడియో ఫిబ్రవరి 24’ అని కామన్‌గా ఉంటుంది. నా ఫొటోలన్నింటికీ ఒకటే బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. వెనకాల కర్టెన్ అలానే ఉంటుంది. ఫ్లవర్‌వాజ్ బొమ్మ సైజ్ అలానే ఉంటుంది. నా సైజ్ మారుతుంది. నేను పెద్దగా అవుతూ వచ్చాను. ఇప్పుడు అలా ఫొటోలు దిగడం మిస్ అవుతున్నాను. అమ్మ పొద్దునే లేపి నలుగు పెట్టి, తల స్నానం చేయించి ఫొటో తీయించడానికి రైల్వే ట్రాక్ దాటించి తీసుకెళ్లేది. అదో స్పెషల్ మెమొరీ. ► ఇంతకీ ఈ బర్త్‌డేకు ఇంట్లోనే ఉంటున్నారా? ►ఉంటున్నాను. ఉండకపోతే అదో ప్రాబ్లమ్. నాకు ఏదైనా పని ఉండి ఊరెళ్తే పని అయ్యాక తిరిగొస్తా. కానీ బర్త్‌డే ఉంటే పనిమధ్యలో తిరిగి రావాలి. ఇంట్లో లేకపోతే బాగోదు కదా. ► మీ భార్య అంజన ఏమైనా గొడవ చేస్తారా? అలాంటిదేం లేదు.. బర్త్‌డే వస్తుంది. స్కిప్ అయిపోతే బావుండు అని తనతో అంటుంటా. అయితే ఇంట్లోవాళ్లతో ఉండాలని వాళ్లు కోరుకుంటారు... నాకూ ఉండాలని ఉంటుంది కదా. ► మీ జున్ను (నాని తనయుడి ముద్దు పేరు) మీ జీవితంలోకి వచ్చాక మీకిది రెండో బర్త్‌డే. మీ అబ్బాయి ఫస్ట్ బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేశారు? లాస్ట్ ఇయర్ మార్చిలో జున్నూది ఫస్ట్ బర్త్‌డే. ఫస్ట్ బర్త్‌డే గ్రాండ్‌గా చేస్తున్నారా? అని కొంతమంది అడిగారు. వాడికి అర్థం కాని వయసులో వాడి ఫంక్షన్ చేసి ఉపయోగమేంటి? అనుకున్నాను. మా ఇంట్లోనే స్పెండ్ చేశాం. ఈ ఇయర్ కూడా అలానే జరుపుకుంటాం. బర్త్డేఫంక్షన్స్ అన్నీ మన ఫ్రెండ్స్‌ని కలుసుకోవడానికి సెలబ్రేట్ చేసుకుంటాం. మన ఆనందం, గొప్ప చూపించుకోవడం కోసం బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే బర్త్‌డే అంటే మనవాళ్లతో టైమ్ స్పెండ్ చేయడమే. ► ఈ బర్త్‌డేకి కొత్త బట్టలు కొనుక్కున్నారా? ►చిన్నప్పుడు మోస్ట్ ఎగై్జటింగ్ వాటిలో కొత్త బట్టలు కొనుక్కోవడం. ఇప్పుడు కొత్త బట్టలు సందర్భానికి సంబంధం లేకుండా కొనుక్కుంటున్నాం, కొన్న వెంటనే వేసుకుంటున్నాం. నటులకు షూటింగ్లో రోజూ కొత్త బట్టలే కదా (నవ్వుతూ). ఆ ఎగై్జటింగ్ విషయం ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ►కెరీర్‌వైజ్‌గా గతేడాది స్పీడ్ కొంచెం తగ్గించారు... ►కృష్ణార్జున యుద్ధం, దేవదాస్... రెండు సినిమాలే చేశాను. ‘బిగ్ బాస్’ షో వల్ల ఇంకోటి మిస్ అయింది. ఈ ఏడాది మూడు సినిమాలు వస్తాయి. ►మీ మొదటి సినిమా (అష్టా చెమ్మా) ఇంద్రగంటి మోహనకృష్ణతో చేశారు. 25వ సినిమా కూడా ఆయనతోనే చేయబోతున్నారు. ఇందులో విలన్‌గా కనిపిస్తారట? ►డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. ఇప్పటి వరకూ ఎప్పుడూ చేయని పాత్ర అది. ఇది మల్టీస్టారర్ కాదు. మోహనకృష్ణగారు ఓ హీరో (సుధీర్‌బాబు)తో సినిమా చేస్తున్నారు. అందులో నేనో చిన్న పాత్ర పోషిస్తున్నాను. అంతే. కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా గురించి ఇప్పుడు నేనేం చెప్పినా లాజికల్‌గా ఉండదు. త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ►సబ్జెక్ట్‌లు ఎంచుకోవడంలో నాని రూట్ మార్చాడని కొందరు అంటున్నారు.. ►లేదు. అయితే నేను రూట్ మార్చానని చాలామంది అనుకుంటున్నారు. రెండు రొటీన్ ఫిల్మ్స్ చేసి నాని కొత్త రూట్ వెతుకుంటున్నాడు, కొత్త రోల్స్ చేయబోతున్నాడు అని. నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. అవన్నీ బయటివాళ్ల అనాలసిస్‌లు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం, పైసా, జెండా పై కపిరాజు, జెంటిల్‌మేన్’ లాంటి ఇంట్రెస్టింగ్ ఐడియాలు చేశాం కదా .. మనం కమర్షియల్ మీటర్‌కు సెట్ అవుతామా? లేదా? అని ‘నేను లోకల్, యంసీఏ’ సినిమాలు చేశాను. రొటీన్ సినిమాలు అన్నారు. అన్నవాళ్లకు రొటీన్ కానీ నాకు కాదు. అవి చేశాను కదా అని మళ్లీ ఇటు సైడ్ వస్తున్నాను. యాక్టర్‌గా అన్నీ చేయాలి. అదే చేస్తూ వస్తున్నాను. చూసే విధానం బట్టి ఎవరికి వారు ఒక ఒపీనియన్ ఏర్పరుచుకుంటారు. నాని ఇటు వెళ్లాడు, అటు వచ్చాడు అని. ఇది సైకిల్. భవిష్యతుల్లో ‘ఎంసీఏ, నేను లోకల్’ లాంటివి చేయనని చెప్పడం లేదు. మళ్లీ వేరే రూట్లోకి వచ్చి చేస్తా. ►నాని ఏ పాత్ర అయినా బాగా చేయగలడు అనే కాంప్లిమెంట్ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ►చాలా మంది అనుకుంటారు.. నాని బాగా చేశాడు అని. కాదు.. స్క్రిప్ట్‌లో విషయం ఉండాలి. బాగా చేయడం, చేయకపోవడం ఉండదు. స్క్రిప్ట్‌లో స్కోప్ ఉండటం, ఉండకపోవడమే తేడా. ►హిట్, ఫ్లాప్ మీతో ఎన్నిరోజులు ట్రావెల్ అవుతాయి? ►అవి నాకు పెద్ద విషయం కాదు. నేను ఇంపార్టెంట్‌గా ఫీల్ అయ్యేది ఏంటంటే టీమ్ అంతా కష్టపడి సినిమా చేస్తుంటాం. దానికి తగ్గ క్రెడిట్ రాకపోతే కొంచెం బాధగా ఉంటుంది. వాళ్లంతా బాధపడతారు అనే బాధ తప్పితే నా కెరీర్ ఏమైపోతుంది... అనే ఆలోచన ఉండదు. సక్సెస్, ఫ్లాప్ బాధపెట్టవు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. జయాపజయాలకు అతీతంగా ప్రేక్షకులతో నాకు ఓ కనెక్షన్ వచ్చేసింది అనే నమ్మకం ఏర్పడింది. ►‘నా కెరీర్ ఏమైపోతుంది’ అనే ఆలోచన లేదన్నారు.. ఆ మాటల్లోనే ఏమీ కాదనే మీ ఆత్మవిశ్వాసం కనపడుతోంది. ఇది ఎప్పుడు డెవలప్ అయింది? ►ఎప్పుడు కుదిరిందో తెలియదు కానీ కుదిరింది. కొన్ని నెలలు కలసి టీమ్ అందరం కష్టపడతాం. పని చేసినవాళ్లు ఎప్పుడు తలుచుకున్నా వాళ్లకు ఆ సినిమా ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోకూడదు. ఎవరూ నష్టపోకూడదని కోరుకుంటాను. అందుకోసం సక్సెస్ అవసరం అయితే ఆ సక్సెస్ నాకు కావాలి. అయితే నేను ఏరోజూ సినిమా సక్సెస్ అవ్వాలి అని చేయలేదు. ఎంజాయ్ చేస్తూ చేశాను. నా పనిని ఎంజాయ్ చేస్తున్నంత వరకూ నాకు పని ఉంటుంది. జెన్యూన్‌గా కష్టపడితే వర్క్ మనల్ని ఫాలో అవుతుంటుందని నమ్ముతాను. సక్సెస్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి అని మొక్కుబడిగా చేస్తే అది కూడా మనల్ని వదిలేస్తుంది. దానివెనకాల మనం పరిగెత్తనప్పుడు అది మనపక్కనే బుద్ధిగా కూర్చుని ఉంటుందని నా ఫీలింగ్. ►మీ వయసుకన్నా ఎక్కువ వయసున్న పాత్రలు కూడా చేస్తున్నారు? ►‘జెర్సీ’లో నా వయసుకు మించిన పాత్ర చేశాను. ఇది నేను గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. ఇప్పటి వరకూ ఏ సినిమాకీ ఈ స్టేట్మెంట్ వాడలేదు. ‘జెర్సీ’ నా కెరీర్లో బెస్ట్ అవుతుంది. ►ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ►రిజల్ట్ గురించి చెబుతున్న స్టేట్మెంట్ కాదిది. యాక్టర్‌గా పూర్తి సంతృప్తి ఇచ్చింది. నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ‘ఇంకా ఏదో చేస్తే బావుండు’ అనే ఓ ఫీలింగ్ ఉంటుంది కదా.. అది లేదు ఈ సినిమా చూసిన తర్వాత. అందుకే నా బెస్ట్ వర్క్ అంటాను. ఈరోజు వరకూ ఇది బెస్ట్ అన్నాను. దాని అర్థం దీన్ని మించే సినిమాలు రావని కాదు. ఇప్పటివరకూ నా కెరీర్లో ఇది బెస్ట్. ఇదివరకూ మంచి సినిమాలు చేశా. అవి చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఆ సినిమాల్లో ఆ పాత్రగా మారిపోయినప్పటికీ ఎక్కడో చోట నాని అనేవాడు కనపడి ఉంటాడు. ఆర్టిస్ట్‌గా పూర్తి స్థాయి పాత్రగా మారిపోయే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఈ సినిమా చేసినప్పుడు అనిపించలేదు కానీ చూసుకున్నప్పుడు ‘నేను’ అనే ఫీలింగ్ నాకు రాలేదు. అర్జున్ అనే వ్యక్తి కథను చూస్తారు. వాడితోపాటూ ఏడ్చాను, నవ్వాను. రేపు థియేటర్స్‌లోకి వచ్చినప్పుడు అది ఎంతవరకూ నిజం అన్నది మాత్రం మీరే చెప్పాలి. యాక్టర్‌గా నాకు లభించిన సంతృప్తి వర్ణించలేనిది. ► అర్జున్ అంటే మీ అబ్బాయి పేరు. కావాలనే సినిమాలో పెట్టారా? ►అవును. సినిమాలో నా పేరు అర్జున్. మా అబ్బాయి పేరు నాని. రివర్స్ చేశాను (నవ్వుతూ). ►ఇంతకుముందు ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో మీ భార్య అంజన ఇంటి పేరు వాడారు. కావాలని మీరు చెబుతుంటారా? ►ఆ సినిమాలో హీరోయిన్ సమంత పేరు నిత్యా. ఆ పాత్రకు ఓ ఇంటిపేరు కావాలని గౌతమ్ మీనన్ అడిగారు. అప్పుడు నేను అంజనతో రిలేషన్లో ఉన్నాను. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. తన ఇంటిపేరు (యలవర్తి)ని హీరోయిన్ ఇంటిపేరుగా సజెస్ట్ చేస్తే, గౌతమ్ బాగుందన్నారు. ఆ తర్వాత ‘మజ్ను’లో ‘రాంబాబు గారి అబ్బాయా మజాకా’ అని ఓ డైలాగ్ చెప్పాను. నిజానికి ఆ సీన్లో ఆ డైలాగ్ లేదు, నేనే కావాలని సరదాగా చెప్పాను. బాగుందని ఉంచేశారు. అది మా నాన్నగారి పేరు. ఏదో సరదాకి ఇలాంటివి చేస్తుంటాను కానీ ఇవే ఉండాలని ఒత్తిడి చేయను. ►ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా మీ స్థానం మీదే. అదెలా వీలవుతుంది? ►ఎందుకంటే నేను రేస్‌లో లేను కాబట్టి. అందరూ పరిగెడుతున్న డైరెక్షన్లో నేను పరిగెడితే నేను రేస్‌లో ఉన్నట్టు. నా స్థానానికి డేంజర్. అందరూ వెళ్తున్న గమ్యం వైపు నేను వెళ్లడం లేదు. సో.. నన్ను దాటేస్తారు, నన్ను గెలిచేస్తారు అని భయపడను. నాకు డేంజర్ ఉందని అనుకోను. అందరూ సూపర్ స్టార్లు అవుదాం అని వెళ్తున్నారు కానీ నేను వెళ్తున్న మార్గంలో ఎవ్వరూ రావడం లేదని నేను అనుకుంటున్నాను. వాళ్లను డిస్ట్రబ్ చేసి నా దారిలో కూడా వచ్చేలా చేసుకోవడం లేదు (నవ్వుతూ). ►అంటే మీరు సూపర్‌స్టార్ అవ్వాలనుకోవడం లేదా? ►నేనెప్పుడూ యాక్టర్‌గానే ఉండాలి అనుకున్నాను. మీరు ఏ పేరుతో అయినా పిలుచుకోండి. న్యాచురల్ స్టార్ అదీ ఇదీ అనుకోవచ్చు. ప్రేమతో పిలుస్తున్నారు అని అనుకుంటాను. ఇందాక యాక్టర్‌గా బాగా సంతృప్తి చెందాను అని చెప్పాను కదా. దాని ముందు ఏ సూపర్‌స్టార్ ఫీలింగ్లూ దగ్గరకు రాలేవు. యాక్టర్ అనేవాళ్లకు దాన్ని మించిన సంతృప్తి ఉండదు. అదే ఉంటున్నప్పుడు ఇక దేనికోసం పరిగెత్తాలి. ►గేమ్ ఆడేటప్పుడు పోటీ లేకపోతే కిక్ ఉండదు కదా? ►నేను గేమ్ ఆడటం లేదు. ఒకరి మీద గెలవడానికి పోటీ అయితే అప్పుడు పోటీ కావాలి. నేనెవరి మీదా గెలవాలనుకోవడం లేదు. నాకు పిచ్చిగా నచ్చే ఓ పని చేస్తున్నాను. పొద్దున లేస్తే ఫుడ్ ఫర్ సోల్ అంటాం కదా.. ఆత్మసంతృప్తి కోసం పని చేస్తున్నాను. ఈ ప్రాసెస్‌ని ఆస్వాదించాలి అనుకుంటున్నాను. చేసిన ప్రతి షాట్ బావుంటే నాకు కిక్ వస్తుంది. అందులో కిక్ వెతుక్కుంటున్నాను కానీ పోటీలోకాదు. ►నటుడిగా సంతృప్తి ఇచ్చిన సినిమా బాగా ఆడలేదనుకోండి.. ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ మీ కెరీర్ మీద ఎంత ఉంటుంది? ►బాక్సాఫీస్ నంబర్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు ఓ భారీకథ మన దగ్గరకు వచ్చిందనుకోండి. దానికి పెద్ద బడ్జెట్ కావాలి. అంత బడ్జెట్ పెట్టాలంటే నా అంతకుముందు సినిమా బాక్సాఫీస్ నంబర్ బాగుండాలి. అప్పుడు ఆ భారీ కథను అడ్జెస్ట్ కాకుండా తీయొచ్చు. లేకపోతే రాజీపడిపోవాల్సి వస్తుంది. ఇందుకోసం బాక్సాఫీస్ నంబర్ని పట్టించుకోవాలి. డబ్బులు వస్తే బాగా ఆనందపడతాను. మా నిర్మాత, టీమ్ హ్యాపీగా ఉంటారు. వాళ్లంతా హ్యాపీ అయితే నేను హ్యాపీ. ►నాని నిర్మాతల హీరో అంటారు. ఒకవేళ చేసిన నిర్మాతకే మళ్లీ డేట్స్ ఇవ్వకపోతే ‘నానీకి బిల్డప్’ అంటారు. రెంటినీ ఎలా తీసుకుంటారు? ►కరెక్టే. నేను డేట్స్ ఇచ్చినప్పుడు నాని మనోడే అనుకునే చాన్స్ ఎక్కువ. అయితే నాని మనోడే కదా.. సినిమా చేస్తాడు అని ప్రతిసారీ అనుకుంటే కుదరకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. నాకు కథ ముఖ్యం. మంచి కథ కుదిరితేనే సినిమా. రెండు హిట్స్ కొట్టాం అని అదే కాంబినేషన్లో మూడోసారి సినిమా చేసేయాలి అనుకోను. మూడో సినిమా కథ కూడా కుదరాలి. బావుండాలి. ఇలా ఆలోచించడం నటుడిగా నాకు చాలా అవసరం. కెరీర్ స్టార్టింగ్‌లో మొహమాటానికి కొన్ని చేశాను. ఇప్పుడు నచ్చిందే చేస్తున్నాను. ►ఒకవేళ మీకు బాగా అనిపించని కథ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కదా? ►అది కాదనడంలేదు. అయితే నాకు డౌట్ ఉన్న కథతో సినిమాకి ఓకే చెబితే షూటింగ్ జరిగే నెక్ట్స్ ఆరు నెలలు డౌట్‌తో పడుకోవాలి, డౌట్‌తో నిద్రలేవాలి. నమ్మకంగా ఉన్న స్క్రిప్ట్‌తో చేస్తే ఏదో కొత్త ఉత్సాహంతో పని చేస్తాను. ఎగై్జటింగ్‌గా నిద్రలేస్తాను. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేదు. డౌట్ ఉన్న సినిమాలు కూడా హిట్ అవుతుంటాయి. నమ్మకంగా ఉన్న సినిమాలు పోతాయి. రిజల్ట్ రెండే రోజులు, అయితే షూటింగ్ ప్రాసెస్ మాత్రం దాదాపు 9 నెలలు. తొమ్మిదినెలలు ఇంపార్టెంటా? రెండు రోజులు ఇంపార్టెంటా? ►ఓకే.. పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పు? పెళ్లయ్యాక జీవితం నా చేతుల్లో లేదు, నా భార్య చేతుల్లో ఉందని చాలామంది అంటుంటారు... ►జీవితం వాళ్ల చేతుల్లోకి వెళ్లదు, మనమే పెడతాం. మనమే సరెండర్ అవుతాం. వాళ్లు లాక్కోవడం ఉండదు. అందరూ ఎలా మాట్లాడతారంటే నాకు స్వాతంత్య్రం లేదు అని జోకులేస్తారు. కానీ స్వేచ్ఛ కోల్పోయే విషయంలో ఒక్క శాతం కూడా వాళ్లు కారణం అవ్వరు. పని అయిపోయిందా? ఇంటికొస్తున్నావా? అని వాళ్లు ఫోన్ చేసినా చేయకపోయినా మనకే వెళ్లాలనిపిస్తుంది. అది రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతాం. నిజం చెప్పాలంటే పెళ్లి పెద్దగా ఏం మార్చలేదు నన్ను. పిల్లోడు మార్చాడు. చాలా మార్చాడు. పెళ్లి ఓవర్ రేటెడ్. కంట్రోల్ అదీ ఇదీ అంటాం కానీ. కంట్రోల్లో ఉండేది మాత్రం పిల్లల తర్వాతే. పెళ్లయ్యాక మూడేళ్లకు మా జున్ను పుట్టాడు. వీడొచ్చాక లైఫ్‌ని చూసే కోణమే మారిపోయింది. పొరపాటున ఏపని చేసినా ఒక ఎగ్జాంపుల్ అవుతాం. పొరపాటున పేపర్ పక్కన విసిరేసినా, వాడూ అదే నేర్చుకుంటాడని భయం. డస్ట్‌బిన్‌లో వేస్తున్నాను. నోట్లోంచి వచ్చే మాటలన్నీ మంచివే అయ్యుండాలి. ఆ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లోడికి రాంగ్ ఎగ్జాంపుల్ ఇవ్వకూడదు. ప్రపంచం దృష్టిలో హీరో అవడంకన్నా కొడుకు దృష్టిలో హీరో అవడానికి మించింది మరోటి లేదనుకుంటాను. సినిమా హీరో కాదు మా నాన్న రియల్ లైఫ్ హీరో అని పిల్లలు అనుకుంటే అది ప్రతి తండ్రికి పెద్ద సంతృప్తి. ‘జెర్సీ’ సినిమా ఆ పాయింట్ మాట్లాడుతుంది. ► మీ జున్నూ మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? ►నాన్న అంటాడు. ఇప్పుడు అదొక్క మాటే వచ్చు. పొద్దున్నుంచి నాన్న నాన్న అంటాడు. అమ్మ కూడా రాదు. నాన్నకూచి. నేను షూటింగ్లో ఉండి వీడియో కాల్ చేస్తే దిండు చూపిస్తాడు. నేను పక్కనే ఉండాలని అర్థం అన్నమాట. మేమిద్దరం ఉంటే అల్లరి మామూలుగా ఉండదు. మామూలుగా కొందరు పిల్లలు పదిమంది వస్తే ముడుచుకుపోతారు. జున్నుగాడు మాత్రం ఎంతమంది వస్తే అంత యాక్టివ్ అవుతాడు. ఎంటర్టైనర్. ఎవరు పిలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్తాడు. నేనైనా డబ్బులు తీసుకొని ఎంటర్టైన్ చేస్తానేమో, వాడు ఫ్రీగా ఎంటర్టైన్ చేస్తాడు (నవ్వుతూ). ► 24 గంటలే ఎందుకు.. ఇంకొన్ని గంటలుంటే బావుండే అని ఎప్పుడైనా అనుకున్నారా? ►అలా ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒకడినే ఉన్నానే నాలా ఇంకొకడుంటే బావుండే అనుకుంటాను. ఒక్కసారి కాదు చాలాసార్లు అనిపించింది. ఒకచోట ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇంకోచోట ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండూ మిస్సవ్వలేం. ఫ్యామిలీ అందరూ కలసి ఏదో స్పెషల్ ప్లాన్ ఫిక్స్ చేసుకొని ఉంటాం. వర్క్ కూడా మిస్ అవలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నాలోనే ఇద్దరుంటే నువ్వు ఈ పని చూసుకో, నేను ఇంకో పని చూసుకుంటాను అని సర్దుకోవచ్చు కదా. ఇలా ఊహించుకుని నవ్వుకుంటాను. ►ఒకప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు కదా... యాక్టింగ్ టు డైరెక్షన్ ఎప్పుడు? ►డైరెక్షన్ ఏమో కానీ ప్రొడక్షన్ సైడ్ ఉంటాను. ఓన్లీ కొత్త రకం సినిమాలే నిర్మించాలనుకుంటున్నాను. ‘అ!’ తర్వాత చాలా కథలు విన్నాను. సూపర్ హిట్ ప్రాజెక్ట్స్. నిర్మిస్తే డబ్బులొచ్చేస్తాయి. కానీ చేయలేదు. ఎందుకంటే నా బ్యానర్ మీద యూనిక్ సినిమాలు మాత్రమే చేయాలని. ► ‘అ!’ కమర్షియల్‌గా వర్కౌట్ అయిందా? ►అయింది. అలాగే పాత్ బ్రేకింగ్‌గా నిలిచింది. వాల్‌పోస్టర్ సినిమా నుంచి ఏ సినిమా వచ్చినా అలా యూనిక్‌గా ఉండాలన్నది నా ఆలోచన. ► 24 సినిమాల అనుభవం ఉంది మీకిప్పుడు. మీ పదేళ్ల కెరీర్‌ని ఎప్పటికప్పుడు యాక్టర్‌గా మనం ఏంటి అని సమీక్షించుకుంటారా? ►సమీక్షించుకోవడం అన్నట్టుగా కాదు కాని పాతజ్ఞాపకాల్ని విజిట్ చేస్తుంటాను. పాత సినిమాలు చూసినప్పుడు ‘అరే.. అప్పుడు మన పర్ఫార్మెన్స్ ఏంటి, ఇలా ఉంది?’ అనే యాంగిల్లో మాత్రమే ఆలోచిస్తా. నటుడిగా ఇంత పరణితి చెందా అది ఇదీ అని ఆలోచించుకోను. ► ఫైనల్లీ.. యాక్టర్‌గా ఇన్ని సినిమాలు చేయాలి అని టార్గెట్ ఏమైనా? ►నెక్స్ సినిమా గురించే ఆలోచించను. ఇంకా యాక్టర్‌గా ఎన్ని చేస్తాను అంటే ఇందాక ‘నచ్చిన కథలే చేస్తాను’ అని మాట్లాడిన ఐడియాలజీకి విరుద్ధం అయిపోతుంది. – డి.జి.భవాని -
పదేళ్లు పూర్తయ్యాయి.. ఏమాత్రం బిడియం లేదు!!
‘ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా... నీ పంట పండిందే ప్రేమా..’ అంటూ లావణ్యను ఆటపట్టించి మరీ ఆమె ప్రేమను గెలుపొందాడు రాంబాబు. మహేష్.. మహేష్ అంటూ కలువరించే లావణ్యను ప్రేమను పొందేందుకు రాంబాబు పడ్డ పాట్లు నవ్వు తెప్పించడంతో పాటు అతడిపై జాలి కలిగిస్తాయి. రెండు జంటల ప్రేమకథతో తెరకెక్కిన అష్టాచమ్మా సినిమా విడుదలై నేటికి సరిగ్గా పదేళ్లు. ఈ సినిమా గురించి ఎందుకీ ప్రస్తావన అనుకోకండి.. ఎందుకంటే ఈ సినిమా రూపంలోనే టాలీవుడ్‌కు నాచురల్ స్టార్ ‘నాని’ దొరికాడు. డైరెక్టర్ కావాలనుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్ బాబు ఘంటా అలియాస్ నాని... నాచురల్ స్టార్‌గా ఎదిగి ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. తన పదేళ్ల నటనా ప్రస్థానంలో ఎవరి ముందు నటించడానికైనా బిడియపడలేదని చెబుతూ ఇండస్ట్రీలో స్థిరపడిపోయాడు ఈ డబుల్ హ్యాట్రిక్ హీరో. గాడ్‌ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నవీన్ బాబు... పక్కింటి కుర్రాడిలా కన్పిస్తూనే... ‘హీరోగా నెగ్గడం అంటే ఇష్టంగా పనిచేయడం’ అంతే అనే లాజిక్‌తో దూసుకుపోతున్నాడు. రాంబాబు క్యారెక్టర్‌తో యువతకు దగ్గరైన ఈ సహజ నటుడు... విలక్షణమైన కథలు ఎన్నుకుంటూ తన విజయ పరంపరను, నటనా ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నాడు. అలా మొదలైంది ఇచ్చిన బూస్ట్‌తో.. తొలి రెండు సినిమాల్లో(అష్టాచమ్మా, రైడ్) మిగతా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న నాని.. ‘స్నేహితుడా’ సినిమాతో సోలో హీరోగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత భీమిలీ కబడ్డీ జట్టులో సూరిబాబుగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. 2011లో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరెక్కిన ‘అలా మొదలైంది’ మూవీతో నాని కెరీర్ ఊపందుకుంది. ఈ సినిమాలో ‘గౌతమ్’ గా నాని నటన సూపర్బ్. ప్రతీ ఇంటిలోనూ ఇలాంటి ఓ కొడుకు ఉండాలనిపించేంతగా ఉంటుంది తల్లితో గౌతమ్ అనుబంధం. బడా డైరెక్టర్లతో... పిల్ల జమీందార్‌తో హిట్ కొట్టిన ఈ యువహీరో రాజమౌళి దృష్టిలో పడటంతో ఈగ సినిమాలో నటించే చాన్స్ కొట్టేశారు. ఈగ విజయంతో బడా డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ నటుడిగా నానిని మరో మెట్టు ఎక్కించింది. ఈ సినిమాలో ‘వరుణ్’ గా జీవించిన నానిని నంది అవార్డు వరించింది. 2014లో విడుదలైన కృష్ణవంశీ పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు సినిమాల ఫలితం నాని కెరీర్‌పై ఎటువంటి ప్రభావం చూపనప్పటికీ అభిమానులు మాత్రం కాస్త నిరాశ చెందారు. ఎవడే సుబ్రమణ్యంతో మళ్లీ ఫామ్‌లోకి... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నాని మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు. ఆ తర్వాత భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టించాడు. గతేడాది విడుదలైన ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాతో సక్సెన్ స్టోరీని కంటిన్యూ చేశారు. అయితే ఈ ఏడాది విడుదలైన కృష్ణార్జున యుద్ధం సినిమా మాత్రం మిశ్రమ ఫలితాన్ని మిగిల్చింది. ప్రస్తుతం రొమాంటిక్ కింగ్ నాగార్జునతో కలిసి ‘దేవదాస్’ అనే భారీ మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్ చూస్తుంటే నాని ఖాతాలో మరో హిట్ పడుతుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. బుల్లితెరపై సరికొత్త అవతారంలో.. హీరోగా బిజీగా ఉన్న నాని ఈ ఏడాది.. పాపులర్ టీవీ షో బిగ్‌బాస్ రెండో సీజన్(బిగ్‌బాస్) హోస్ట్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. పిట్ట కథతో షోను మొదలు పెడుతూ... వస్తూనే తన మార్క్‌ను చూపించాడు. తనదైన శైలిలో షోను నడిపిస్తూ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడు. ప్రత్యేక పాత్రల్లో.. నిర్మాతగా.. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాని.. పలు తమిళ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా దర్శనమిచ్చాడు. మణిరత్నంలో సినిమాలో నటించాలనుకున్న నానికి ఇప్పటివరకైతే ఆ అవకాశం లభించలేదు కానీ ఓకే కన్మణి (ఓకే బంగారం) సినిమా తెలుగు వర్షన్లో హీరోకు డబ్బింగ్ చెప్పడం ద్వారా.. ఆయన సినిమాలో భాగమయ్యాడు. అలాగే పలు సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. కాగా గతంలో ‘డీ ఫర్ దోపిడీ’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన నాని.. ఈ ఏడాది ‘అ!’ సినిమాతో ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడిని టాలీవుడ్‌కి పరిచయం చేశారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. స్నేహితురాలినే జీవిత భాగస్వామిగా.. తన స్నేహితురాలు అంజనాను ప్రేమించిన నాని.. 2012లో పెద్దల సమక్షంలో ఆమెను వివాహమాడాడు. 2017లో ఈ జంటకు అర్జున్ అలియాస్ జున్ను జన్మించాడు. ఇలా కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ సంతోషానికి కేరాఫ్‌గా నిలుస్తున్నాడు నాచురల్ స్టార్. తన నటనా ప్రస్థానానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కొడుకుతో దేవదాస్ సెట్లో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన నాని... ‘పదేళ్లు పూర్తయ్యాయి. కానీ ఎప్పుడూ ఎవరి ముందు నటించడానికి ఏమాత్రం బిడియపడలేదంటూ’ ట్వీట్ చేశాడు. It’s been 10 years but I have never been so nervous to perform in front of someone :) When Mr Junnu came to visit Dr Dasu on sets. pic.twitter.com/D07kt1hVUT — Nani (@NameisNani) 5 September 2018 -
నాని భార్యకు శ్రీరెడ్డి కౌంటర్!
ఇటీవల టాలీవుడ్లో దుమారం రేపిన అంశం కాస్టింగ్ కౌచ్. ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్‌లతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం హీరో నానిపై చేస్తున్న ఆరోపణలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనపై చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందనగా నాని ఇటీవల శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీరెడ్డి కూడా స్పందిస్తూ.. తన ఫేస్బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. కోర్టులోనే తేల్చుకుందాం అని నానికి సవాల్ విసిరారు. ఈ క్రమంలో శ్రీరెడ్డిపై నాని భార్య అంజనా కూడా ఫైర్ అయ్యారు. అయితే తాజాగా నానికి సపోర్ట్‌గా అంజనా చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా శ్రీరెడ్డి మరో పోస్ట్ చేశారు. ‘హాయ్ మిసెస్. నేనిప్పుడే నువ్వు చేసిన పోస్ట్‌ను చూశాను. నేను నీ భర్తతో ఉన్నప్పుడు నువ్వు చూడలేదు. నేను పేరు కోసం తాపత్రయపడటం లేదు. నీ భర్తే పేరు కోసం తాపత్రయ పడతాడు. నాకు ఉన్న పేరు చాలు. ఒకవేళ నా భర్తకే పేరు, డబ్బు ఉండి ఇలాంటి పనులు చేస్తే, నేను నా భర్తకు మాత్రం సపోర్ట్ చేయను. అవసరమైతే అలాంటి వాడ్ని వదిలేసి వెళ్లిపోతానేమో అంతే కానీ బాధిత మహిళను మాత్రం అవమాన పరచను. ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. మొత్తం విషయం తెలిసేవరకు సైలెన్స్‌గా ఉండండి. నా వైపు సత్యం ఉంది. కర్మ ఉంది. నీ భర్త తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే’నని తన ఫేస్బుక్ ఖాతాలో శ్రీరెడ్డి పోస్ట్ చేశారు. -
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
అరుణ్ రాహుల్, అంజన జంటగా కట్ల రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో కేజే రాజేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘చేతిలోన చెయ్యేసి చెప్పు బావా’. ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అరుణ్ రాహుల్ మాట్లాడుతూ – ‘‘తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేశాను. ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాను. తెలుగు పరిశ్రమలో నా ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘నిర్మాతగా నా తొలి సినిమా ఇది. కథ కూడా నేనే అందిస్తున్నాను. కచ్చితంగా మంచి సినిమాను అందిస్తాం అనే నమ్మకముంది’’ అన్నారు నిర్మాత. ‘‘రాజేశ్ మంచి కథను అందించారు. ప్రేమను దక్కించుకోలేని జంట మరో జన్మలో ఎలా విజయం సాధించారన్నది కథాంశం. సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శకులు. ఈ సినిమాకు సంగీతం: పార్థసారధి, కెమెరా: వేణు మురళీధరన్. -
మరైందిరుందు పార్కుంమర్మమెన్నకు సెన్సార్ కష్టాలు
తమిళసినిమా: మరైదిరుందు పార్కుం మర్మమెన్న చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్‌బోర్డు నిరాకరించింది. ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై వి.మదిఅళగన్, ఆర్.రమ్య నిర్మించిన చిత్రం మరైంది రుందు పార్కుంమర్మమెన్న. తిలగర్ చిత్రం ఫేమ్ ధ్రువకథానాయకుడిగా నటించిన ఇందులో ఐశ్వర్యదత్త, అంజన కథానాయికలుగా నటించారు. జేడీ.చక్రవర్తి, శరణ్యపొన్‌వన్నన్, రా ధారవి, మనోబాలా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాకేష్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మంగళవారం సెన్సార్‌బోర్డు సభ్యులకు ప్రదర్శించారు. సెన్సార్బృందం ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారట. దీని గురించి దర్శకుడు రాకేష్ తెలుపుతూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల గురించి తెరపై ఆవిష్కరించిన చిత్రం మరైం దిరుంది పార్కుం మర్మమెన్న అని తెలిపారు. మహిళలు, పిల్లలు ఎలా బాధింపునకు గురవుతున్నారన్న విషయాల గురించి అవగాహన కలిగించే విధంగా ఈ చిత్రాన్ని రూపొం దించామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు నిత్యం పత్రికల్లో, ప్రసార సాధనాల్లో చూస్తున్నామన్నారు. వాటి గురించి పట్టించుకోని సెన్సార్‌బోర్డు సభ్యులు తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించి రివైజింగ్ కమిటీకి వెళ్లమనడం ఎంత మాత్రం సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు. -
నాని నాన్నయ్యాడు
లైఫ్‌లో ఎప్పటికీ మరువలేని తీపి గుర్తును ఈ ఉగాది నానీకి అందించింది. పండగనాడు నాని సతీమణి అంజన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. 2012లో నాని, అంజనల వివాహం జరిగింది. అంతకు ముందు ఫేస్బుక్లో మొదలైన వీళ్లిదరి పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నూతన తెలుగు సంవత్సరాదిన బుల్లి నాని ఇంట అడుగు పెట్టడంతో నాని, అంజనల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు నానీకి శుభాకాంక్షలు తెలిపారు. -
నాని ఇంట్లో రెండు పండుగలు
వరుస హిట్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని.. ఈ ఉగాదిని మరింత ఆనందంగా గడుపుకుంటున్నాడు. హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వెళ్తుతున్న ఈ నేచురల్ స్టార్, రియల్ లైఫ్ లోనూ ప్రమోషన్ పొందాడు. ఉగాది రోజు నాని దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిన్నుకోరి షూటింగ్లో బిజీగా ఉన్నాడు నాని. సినీరంగంలోకి అడుగుపెట్టడానికి ముందు ఆర్జే గా పనిచేస్తున్న రోజుల్లో అంజనతో ప్రేమలో పడిన నాని, 2012 అక్టోబర్ లో పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకున్నారు. -
నాన్నవుతున్నాడోచ్!
యస్.. మీరు చదువుతోంది నిజమే. న్యాచురల్ స్టార్ నాని త్వరలో నాన్న కాబోతున్నారు. అంజన (నాని భార్య) ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. దంపతులు ఇద్దరూ ఆదివారం స్నేహితులందర్నీ ఆహ్వానించి స్వగృహంలో పార్టీ ఇచ్చారు. ఐదేళ్ల ప్రేమ తర్వాత, 2012 అక్టోబర్ 27న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘జెంటిల్మన్’, ‘మజ్ను’... రానున్న ‘నేను లోకల్’తో వరుసగా మంచి సినిమాలతో జోరు మీదున్న ఈ హీరో కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఇది తీపి వార్తే. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నాని కూడా ఫుల్ హ్యాపీ. -
నాని కూడా ఆ లిస్ట్‌లో చేరబోతున్నాడు..!
హీరోగా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, త్వరలో పర్సనల్ లైఫ్‌లో కూడా ప్రమోషన్ పొందబోతున్నాడు. ఇటీవల వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ హీరో పర్సనల్ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నాడు. ప్రస్తుతం నేను లోకల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈ నేచ్యురల్ యాక్టర్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ తీసుకుంటున్నాడు. ఈ జనరేషన్ హీరోల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, ఆది లాంటి హీరోలు ఇప్పటికే ఫాదర్స్ లిస్ట్‌లో చేరిపోగా తాజాగా నాని కూడా ఆ లిస్ట్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. మరికొద్ది నెలల్లో నాని భార్య అంజన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. నాని, అంజనాల కుటుంబ సభ్యులు తన కుటుంబంలోకి రానున్న కొత్త వెలుగుకు స్వాగతం పలకటానికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఈ చిన్నారి చనిపోతూ ఏం చేసిందంటే..
'మానవ చరిత్ర వర్థిల్లిందల్లా సాటి మనిషిని ఆదుకోవడంలోనే.. అది మరణంలోనైనా సరే' అనే సేయింగ్ను చదువుకోనప్పటికీ దానిని అక్షరాల పాటించి చిరస్మరణీయురాలిగా మిగిలిపోయింది మూడేళ్ల చిన్నారి అంజన. శనివారం (నిన్న) సాయంత్రం బ్రెయిన్ డెడ్ అయిన అంజన.. తన కిడ్నీలు, కాలేయం, కళ్లను ప్రాణాపాయంలో ఉన్న బాలుడికి దానం చేసింది. కేరళలో అవయవదానం చేసిన అతిపిన్న వయస్కురాలిగా కీర్తిగడించింది. తిరువనంతపురంలోని కరకులంలో నివసించే అజిత్ దంపతుల ఒక్కగానొక్క కూతురు అంజన. గత గురువారం ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కూప్పకూలిపోయిన అంజనను హాస్పిటల్ కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అంజన కండిషన్ ను 'సీరియస్ బ్రెయిన్ డ్యామేజ్' గా గుర్తించిన వైద్యులు.. కొద్ది రోజుల్లో చనిపోవడం ఖాయమని తేల్చారు. ఆ తరువాత తల్లిదండ్రులను ఒప్పించి అవయవదానానికి రంగం సిద్ధం చేశారు. ఇక్కడ మనం ఒక విశేషాన్ని చెప్పుకోవాలి.. వైద్యశాస్త్రం బాగా అభివృద్థి చెందుతున్న ప్రస్తుత దశలో అవయవాల మార్పిడి ఆపరేషన్లు తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో ప్రైవేటు ఆసుపత్రుల దందాను సాధ్యమైనంతమేరకు నివారించడానికి 'కేరళ నెట్ వర్క ఆఫ్ ఆర్గాన్ షేరింగ్ (కేఎన్ఓఎస్) పేరుతో కేరళ ప్రభుత్వమే ఓ ప్రత్యేక సంస్థను నెలకొల్పింది. దీని ద్వారా దాతలు, గ్రహీతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనిటర్ చేస్తుంటారు. అలా శనివారం రాత్రి అంజన అవయవాలను సేకరించిన కేఎన్ఓఎస్.. అదే రోజు రాత్రి ఓ ఐదేళ్ల బాలుడికి వాటిని అమర్చింది. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ఆదివారం మద్యాహ్నం తిరువనంతపురంలో అంజన అంత్యక్రియలు 'ఘనంగా' జరిగాయి. అవును మరి, చిరంజీవులను ఆమాత్రం గౌరవించుకోకుంటే ఎలా! -
జపాన్‌లో అడ్రస్ మిస్సయ్యా
జపాన్‌లో షాపింగ్‌కు వెళ్లి అడ్రస్ పేపర్‌ను మిస్సయ్యానని చెప్పింది అంజనా. ఈమె జుంబో -3డి చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఇం తకుముందు అంబులి -3డి, ఆ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శక ద్వయం హరి - హరీష్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం జుంబో-3డి, జి.హరి, జపాన్‌కుచెందిన ఎంఎస్‌జి మూవీస్ సంస్థ అధినేత బకిడ్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోకుల్ హీరోగా నటిస్తున్నారు. అంజనా మాట్లాడుతూ, 3డి ఫార్మెట్లో తెరకెక్కుతున్న జుంబో చిత్రంలో నటించడం సరికొత్త అనుభవం అంది. చిత్ర షూటింగ్ 90శాతం జపాన్‌లో సాగిందని చెప్పింది. డైలాగ్‌లేని ఒక సన్నివేశంలో ఎలాంటి కదలికలు లేకుండా నటించానని అది చాలా ఆసక్తిగా ఉంటుందని తెలిపింది. బేబి హన్సిక చాలా ముఖ్య పాత్రలో నటించిందని చెప్పిం ది. టోక్యో, టోయామలాంటి అందమైన ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు చిత్రానికి అదనపు ఆకర్షణగా ఉంటాయని అంది. ఒకరోజు షాపింగ్‌కు వెళుతూ తాము బస చేస్తున్న హోటల్ అడ్రస్‌ను కాగితంపై రాసుకున్నానని అది ఎక్కడో పడిపోవడంతో కంగారు పడ్డానని చెప్పింది. అప్పుడు ఒక ఆటో డ్రైవర్ తాను గమ్యం చేరడానికి చాలా సాయం చేశారని చెప్పింది. తాను తమిళ అమ్మాయినని తెలియగానే రజనీకాంత్ గురించి అడిగాడని, అలా అతనితో చాలా విషయాలు మాట్లాడానని చెప్పింది. అదే విధంగా ఈ చిత్రం కోసం కొందరు జపాన్ నటీనటులతో కలసి నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొంది. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా జుంబో-3డి చిత్రం అందరినీ అలరిస్తోందని అంజనా అంటోంది. -
మా ఆయనే కాదు... మా తాతగారూ ఆర్టిస్టే!
యలవర్తి నాయుడమ్మ... ఈ పేరు చెప్పగానే ఒక తరం వాళ్ళకు ప్రసిద్ధ శాస్త్రవేత్త గుర్తుకొస్తారు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులకు అపూర్వమైన గురువు గుర్తుకొస్తారు. ఆయన వెంట చర్మశుద్ధి పరిశోధనా సంస్థలో పనిచేసినవారికి బడుగు వర్గాల బాగు కోసం అహరహం శ్రమించిన ప్రజల మనిషి గుర్తుకొస్తారు. ‘ప్రజల శాస్త్రవేత్త’గా నిలిచి, ఎందరి మనసులనో గెలిచి, అనూహ్యంగా ‘కనిష్క’ విమాన ప్రమాదంతో దుర్మరణం పాలైన ‘పద్మశ్రీ’ నాయుడమ్మ (1922-1985)ను శాస్త్ర సాంకేతిక రంగం కానీ, సామాన్య జనం కానీ మర్చిపోకపోవడం ఆయన కృషికి గీటురాయి. మరి, ఆయన వ్యక్తిగా ఎలా ఉండేవారు, కుటుంబ విలువలను ఎలా పాటించేవారు వంటి విషయాలతో నాణానికి మరో కోణాన్ని చూపెడుతున్నారు - స్వయానా నాయుడమ్మ జీన్స్ పంచుకున్న మనుమరాలు, హీరో నాని భార్య - పాతికేళ్ళ శ్రీమతి అంజన. తాతగారిని ప్రత్యక్షంగా చూడకపోయినా, ఆయన గురించి విని, చదివి తెలుసుకున్న ఈ నవతరం సైన్స్ పట్టభద్రురాలు ఏం చెబుతున్నారో ఆమె మాటల్లోనే విందాం... గుంటూరు జిల్లా తెనాలి దగ్గర యలవర్రు తాతగారి స్వస్థలం. పెరిగి పెద్దయ్యాక ఆ ఊరి వాళ్ళకూ, తన దగ్గర చదువుకున్న విద్యార్థులకూ ఆయన చాలా సాయపడ్డారు. అక్కడ మాకు ఆస్తిపాస్తులేమీ లేవు కానీ, ఇవాళ్టికీ తాతగారి పేరు చెప్పగానే, ‘ఆయన వల్లే మేమింత వాళ్ళమయ్యామమ్మా!’ అనేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఆ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అదే తాతగారు మాకిచ్చిన పెద్ద ఆస్తి అనిపిస్తుంది! తాతగారికి ముగ్గురు సంతానం. వాళ్ళలో అందరి కన్నా పెద్ద - మా నాన్న రతీశ్. తరువాత మా మేనత్త శాంతి. అందరికన్నా చిన్న - మా బాబాయి కీ.శే. రమేశ్. తాతగారిలానే నాన్న కూడా లెదర్ టెక్నాలజీలో డిగ్రీ చేశారు. తోళ్ళశుద్ధిలో మరింత అనుభవం కోసం నాన్నని అప్పట్లోనే స్పెయిన్ పంపించారట తాతగారు. ఆయన చూపిన బాటలోనే నడిచిన నాన్న ఆ తర్వాత విజయ నగరంలో లెదర్ ఫ్యాక్టరీ పెట్టుకుని సక్సెస్‌ఫుల్‌గా నడిపారు. నేను కూడా సైన్స్ పట్టభద్రురాలినే కానీ, గీతమ్స్‌లో ఐ.టి. విభాగంలో ఇంజనీరింగ్ చదివాక, కార్పొరేట్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశాను. మా తమ్ముడు వరుణ్‌కి తాతగారి తెలివితేటలు వచ్చాయి. ఆయన మనుమరాలిని కావడం నా అదృష్టం! మొదట్లో తాతగారి వ్యక్తిగత విషయాలు, కుటుంబంలోని సంగతులే తెలుసు. కానీ, ప్రభుత్వ ఉన్నతాధికారిగా రిటైరైన కాటా చంద్రహాస్‌గారు గత ఏడాది రాసిన నాయుడమ్మ జీవిత చరిత్రతో తాతగారి గొప్పతనం, చిన్నవయసులోనే ఆయన చేపట్టిన ఉన్నత పదవులు, సాధించిన విజయాలు, ఆయనను వరించిన అనేక పురస్కారాల గురించి నాకు మరింత వివరంగా తెలిసింది. అయితే, ఆ పుస్తకానికి కావాల్సిన వ్యక్తిగత ఫోటోలు వగైరా సమకూర్చడంలో నేనూ పాలుపంచుకొన్నాను. అది నాకెంతో సంతోషాన్నీ, తృప్తినీ కలిగించింది. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రసిద్ధ శాస్త్రవేత్త ‘పద్మభూషణ్’ వి.కె. సారస్వత్ చేతుల మీదుగా ఆ పుస్తకావిష్కరణ జరిగినప్పుడు, నాని, నేను ఆ పుస్తక ప్రతిని అందుకోవడం ఓ మరపురాని అనుభూతి! నాయుడమ్మగారి లాంటి గొప్ప వ్యక్తి స్వయానా నాకు తాతగారయినందుకు గర్విస్తున్నా! కానీ, ఆయనను ప్రత్యక్షంగా చూడలేకపోవడం, ఆయన ప్రేమను పంచుకోలేకపోవడం నాకు తీరని లోటు! ప్రజల శాస్త్రవేత్త... తాతగారు తన దగ్గర పని చేసే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకొని పేరు పేరునా పలకరించేవారట! చర్మాల శుద్ధి కోసం కాన్పూర్ నుంచి ప్రత్యేకంగా వచ్చే దిగువ తరగతి ముస్లిమ్ కుటుంబాలకు తాతగారు అండగా నిలిచారు. చర్మశుద్ధి చేసేవారికి కార్మికుల సంఘం లాంటివి పెట్టించి, వాళ్ళ బాగు కోసం పాటుపడ్డారు. నాయుడమ్మగారి మొదటి బ్యాచ్ శిష్యుల్లో ఒకరైన సుప్రసిద్ధ శాస్త్రవేత్త ‘పద్మశ్రీ’ టి. రామస్వామి ఆ మాటే చెప్పారు - ‘‘మద్రాసులోని ప్రతిష్ఠాత్మక చర్మ పరిశోధనా సంస్థగా ‘సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’ని నిలబెట్టిన ఘనత మీ తాతగారిదమ్మా! ఆయన లాంటి వ్యక్తిని మేము చూడలేదు. ఇటు సాంకేతిక నిపుణులనూ, అటు కార్మికులనూ దగ్గరకు చేర్చి, పరస్పర సహకారంతో సంస్థ ముందుకు దూసుకువెళ్ళేలా అద్భుతమైన మేనేజ్మెంట్ సూత్రాన్ని పాటించిన వ్యక్తి ఆయన! మేమంతా సాంకేతిక దృష్టితో నడిపితే, ఆయన జనసామాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని, చర్మశుద్ధికారుల సంక్షేమ దృష్టితో ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ సంస్థగా నడిపారు. ఆయనకున్న జనసమ్మోహన శక్తి అంతా ఇంతా కాదు! అందుకే ఆయన ‘ప్రజల శాస్త్రవేత్త’ అయ్యారు’’ అని అన్నారు. ఆ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను! తెనాలిలో ప్రొఫెసర్ విష్ణుమూర్తి గారు తదితరుల సమష్టికృషితో ‘డాక్టర్ వై. నాయుడమ్మ మెమోరియల్ ట్రస్ట్’ ఇప్పటికీ ప్రతి ఏటా ఒక విశిష్ట శాస్త్రవేత్తకు నాయుడమ్మ పురస్కారం అందిస్తోంది. పురస్కార గ్రహీతలైన పెద్ద పెద్ద సైంటిస్టులు వివిధ అంశాలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఏటా మా నాన్నగారు తప్పనిసరిగా దానికి హాజరవుతుంటారు. అక్కడకు వెళ్ళి, అంతమంది పెద్దవాళ్ళతో పాల్గొనాలంటే ఒక రకమైన భయం, బెరుకు ఉండేది నాలో.. అందుకే వెళ్లేదాన్ని కాదు. కానీ, తాతగారి మీద పుస్తకం చదివాక, ఇకనుంచీ ప్రతి ఏడాది ఆ పురస్కార ప్రదానోత్సవానికి వెళ్ళాలన్న ఉత్సాహం వచ్చింది. ఆ డైరీలు ఇప్పటికీ భద్రంగా... రోజూ డైరీ రాసే అలవాటు ఉండేదట తాత గారికి ! ఆ డైరీలన్నీ సంవత్సరాల వారీగా ఇప్పటికీ మా నాన్న గారి దగ్గర భద్రంగా ఉన్నాయి. వాటిని ఎప్పుడూ మా నాన్నగారు తాకనిచ్చేవారు కాదు. వాటిని తీయకూడదని నా దగ్గర మాట కూడా తీసుకున్నారు. కానీ, కుర్రతనంలో ఉండే సహజమైన కుతూహలంతో ఒకసారి తాత గారి డైరీ ఒకటి తీసి, చూశా. అనుకోకుండా, అది చనిపోయిన మా పెద్దన్నయ్య పుట్టిన 1980 నాటి డైరీ! అందులో ‘ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఉన్నా. రేపు ఉమ, రతీశ్లకు (అంటే, మా అమ్మానాన్న) తొలి సంతానం పుట్టనుంది. తాతనయ్యే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ఆయన రాసుకున్నారు. కానీ పాపం ఆయనకు తెలీదు... ఆయనతోపాటే ఆ ఆనందం కూడా పోనుందని! ఆ షాక్ నుంచి నాన్న ఇవాళ్టికీ కోలుకోలేదు! తాతగారు భౌతికంగా దూరమైన క్షణాల గురించి వింటుంటే, ఇప్పటికీ గుండె బరువెక్కిపోతుంది. 1985 జూన్ 23న జరిగిన కనిష్క విమాన ప్రమాదంలో తాత గారు చనిపోయారు. దాదాపు 329 మంది ప్రయాణిస్తున్న ఆ విమానంలో అందరూ చనిపోగా, దాదాపు 120 మృతదేహాలే లభించాయట. మిగిలిన శవాల ఆచూకీ కూడా తెలియలేదట. అలానే తాతగారి దేహం కూడా దొరకలేదు. అతి పెద్ద విషాదం ఏమిటంటే... ఆయన మృతదేహమైనా లభిస్తే తెద్దామని నాన్న ఐర్లండ్ వెళ్లిన సమయంలోనే మా నాయనమ్మ (అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ పవనాబాయ్) కూడా ఆత్మహత్యకు పాల్పడి, తాతగారిని చేరుకున్నారు. చిన్న వయసులోనే కన్నతల్లి బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించడంతో, మారుటితల్లి అయిన పవనాబాయ్నే ‘అమ్మా’ అని పిలుస్తూ, ఆమెలోనే కన్నతల్లిని చూసుకొని బతికిన మా నాన్న, నాలుగైదు రోజుల వ్యవధిలోనే తండ్రినీ, తల్లినీ ఇద్దరినీ పోగొట్టుకున్నారు. దెబ్బ మీద దెబ్బగా జరిగిన మరో దుస్సంఘటన ఏమిటంటే, తాతయ్య, నాయనమ్మల కర్మకాండలు చేస్తూ, అందరూ హడావిడిలో ఉన్నప్పుడు పసివాడైన మా పెద్దన్నయ్య అనుకోకుండా నీటి తొట్టెలో పడి మరణించాడు. అలా తండ్రి, తల్లి, కొడుకు- ముగ్గురూ పది రోజుల వ్యవధిలో కళ్ళ ముందే కానరాని తీరాలకు తరలిపోవడం నాన్నకి తగిలిన అతి పెద్ద ఎదురుదెబ్బ! ఆ షాక్ నుంచి ఆయన ఇప్పటికీ కోలుకోలేదు! ప్రతి నిమిషం మా గుండెల్లో ఉంటారు... ఇప్పటికీ ఇంట్లో ఏ చిన్న సంతోష సందర్భం వచ్చినా, ‘మీ తాతగారు ఉండి ఉంటేనా...’ అని నాన్న అనకుండా ఉండరు. నేను స్కూల్లో పరుగుపందెంలో గెలిచిన రోజు మొదలు హీరో నానితో నా పెళ్ళి వరకు ప్రతి సందర్భంలో అదే మాట అనుకుంటూనే ఉన్నాం. వ్యక్తిగతంగా నాకైతే, నా పెళ్ళిరోజున తాతగారు ఉండుంటే బాగుండేదనిపించింది. సినిమా యాక్టర్‌తో పెళ్ళి అంటే ఆయన ఒప్పుకొనేవారో? కాదో? అని ఎవరో అంటే, ఏమో అనుకున్నా కానీ, ఆ సందర్భంలోనే తెలిసింది - తాతగారు కూడా ఊళ్ళో నాటకాలు వేసేవారని! ఛత్రపతి శివాజీ వేషంలో ఆయన ఫోటో ఇప్పటికీ నాన్న దగ్గర ఉందట! అంటే, మా ఆయనే కాదు, మా తాత గారూ ఆర్టిస్టే! భౌతికంగా దూరమైన మూడు దశాబ్దాల తరువాత కూడా తాతగారు మా మాటల్లో నిత్యం మిగిలే ఉన్నారు. ఇక, ‘ప్రజల మనిషి’గా, దిగువ వర్గాల అభ్యున్నతికి పాటుబడ్డ ‘ప్రజా శాస్త్రవేత్త’గా శాస్త్ర రంగంలోనూ, సామాన్యుల గుండెల్లోనూ నిరంతరం వెలుగుతూనే ఉన్నారు. వేర్ ఎవర్ యు ఆర్... ఐ లవ్ యూ తాత గారూ! - సంభాషణ: రెంటాల జయదేవ -
మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో మూవీ స్టిల్స్
-
నేను... నా ఫ్రెండ్స్
సందీప్, సిద్దార్థ్‌వర్మ, రవి, హనీష్, అంజన, విష్ణుప్రియ, ప్రవీణ, హారిక ముఖ్య తారలుగా ‘నేను... నా ఫ్రెండ్స్’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. జి.ఎస్.రావు దర్శకుడు. సాయిమేధ రమణ, మధుసూదన్ ఓరుగంటి నిర్మాతలు. ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి జితేందర్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, డి.సురేష్‌బాబు క్లాప్ ఇచ్చారు. వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు జి.ఎస్.రావు తన ఏకలవ్య శిష్యుడని, సందేశాత్మక చిత్రం ద్వారా తను దర్శకుడవ్వడం ఆనందంగా ఉందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. కథ నచ్చి ఈ చిత్ర నిర్మాణానికి పూను కున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ రోజు నుంచి నిరవధికంగా షూటింగ్ జరుగుతుందని, డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చిన్ని చరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వై.విజయభాస్కరరెడ్డి.