నేను... నా ఫ్రెండ్స్
సందీప్, సిద్దార్థ్‌వర్మ, రవి, హనీష్, అంజన, విష్ణుప్రియ, ప్రవీణ, హారిక ముఖ్య తారలుగా ‘నేను... నా ఫ్రెండ్స్’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. జి.ఎస్.రావు దర్శకుడు. సాయిమేధ రమణ, మధుసూదన్ ఓరుగంటి నిర్మాతలు. ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి జితేందర్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, డి.సురేష్‌బాబు క్లాప్ ఇచ్చారు.
వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు జి.ఎస్.రావు తన ఏకలవ్య శిష్యుడని, సందేశాత్మక చిత్రం ద్వారా తను దర్శకుడవ్వడం ఆనందంగా ఉందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. కథ నచ్చి ఈ చిత్ర నిర్మాణానికి పూను కున్నామని నిర్మాతలు తెలిపారు.
ఈ రోజు నుంచి నిరవధికంగా షూటింగ్ జరుగుతుందని, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: చిన్ని చరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వై.విజయభాస్కరరెడ్డి.