
మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి అస్వస్థత గురైనట్లు వచ్చిన వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన ట్వీట్ చేశారు. మా అమ్మ అస్వస్థతకు గురైందని కొన్ని మీడియా కథనాలు చూశానని వెల్లడించారు. అమ్మ కొద్దిపాటి అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని.. రెండు రోజుల ముందు నుంచే ఆమెకు ఆరోగ్యం కాస్తా బాగాలేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని.. సంపూర్ణం ఆరోగ్యంతో ఉన్నారని చిరంజీవి తెలిపారు. అమ్మ ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నా అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థత గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే కేవలం రెగ్యూలర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లినట్లు వారి కుటుంబ సన్నిహితులు తెలిపారు. కానీ సోషల్ మీడియాలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కథనాలొచ్చాయి. దీంతో మెగాస్టార్ చిరు స్పందించారు. తాజాగా అమ్మ అంజనాదేవి ఆరోగ్యంపై అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార్ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.
My attention is drawn to some media reports claiming our mother is unwell and is hospitalised. Want to clarify that she was a little indisposed for a couple of days. She is hale and hearty and is perfectly alright now.
Appeal to all media not to publish any speculative reports…— Chiranjeevi Konidela (@KChiruTweets) February 21, 2025
Comments
Please login to add a commentAdd a comment