ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డ్రీమ్ క్యాచర్. ఈ సినిమాకు సందీప్ కాకుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సియల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 3న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా డ్రీమ్ క్యాచర్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే మన జీవితంలో జరగబోయేది ముందే తెలిస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి రోహన్ శెట్టి సంగీతమందిస్తున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ..' సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ మూవీ మొదలైంది. ఇన్‌సెప్షన్ లాంటి హాలీవుడ్ మూవీస్ నాకు ఆదర్శంగా నిలిచాయి. ఒక హాలీవుడ్ స్థాయి అటెంప్ట్ చేయాలని అనుకున్నా. సినిమా మొత్తం హైదరాబాద్‌లోనే చేశాం. ట్రైలర్, పోస్టర్స్ చూసి ఈ మూవీ ఎక్కడ షూటింగ్ చేశారని అడుగుతున్నారు. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. గంటన్నర నిడివితో ఉన్న ఈ సినిమాలో ఎలాంటి పాటలు, ఫైట్స్ ఉండవు. కేవలం కథ మీదనే మూవీ నడుస్తుంది. నా టీమ్ అంతా ఎంతో బాగా సపోర్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ చేస్తున్నాం' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment