నాని బర్త్‌ డే సెలబ్రేషన్స్.. తండ్రికి సర్‌ప్రైజ్ ఇచ్చిన తనయుడు! | Hero Nani Son Gives Surprise On His 40th Birthday Celebrations | Sakshi
Sakshi News home page

Nani Birthday Celebrations: నాని బర్త్‌ డే.. తండ్రికి తనయుడి బిగ్ సర్‌ప్రైజ్‌!

Published Tue, Feb 27 2024 7:21 PM | Last Updated on Tue, Feb 27 2024 7:41 PM

Hero Nani Son Gives Surprise On His 40th Birthday Celebrations - Sakshi

నేచురల్ స్టార్‌ నాని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే హాయ్ నాన్న చిత్రం ద్వారా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన ప్రస్తుతం సరిపోదా శనివారం అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్‌ ఎస్‌జే కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇటీవలే నాని 40వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఫిబ్రవరి 24న తన కుటుంబ సభ్యులతో కలిసి బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 
 
అయితే తాజాగా జరుపుకున్న బర్త్‌ డే వేడుకల్లో నాని తనయుడు అర్జున్ తండ్రికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. నాని నటించిన జెర్సీ చిత్రంలోని హోయనా హోయనా అనే ట్యూన్‌ను  పియానోపై వాయించాడు. తండ్రి బర్త్‌ డే రోజు తన కుమారుడు స్పెషల్‌గా ట్రీట్ ఇవ్వడంతో నాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నాని భార్య అంజనా యలవర్తి తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

అంజనా తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఈ వారాంతంలో నా సగం జీవితంలో తెలిసిన వ్యక్తి 40వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. సాధారణంగా ఆయన ఇలాంటి వేడుకలు, సర్‌ప్రైజ్‌ల నుంచి తప్పించుకుంటాడు. కానీ చిన్న చిన్న హావ భావాలను ఆస్వాదిస్తారు. ఒక చిన్న సర్‌ప్రైజ్‌ అతనిని మార్చగలదు. ఈ సారి జున్ను తన నాన్నా బర్త్‌ డే కోసం బిగ్‌ ప్లాన్ చేశాడు. ఆయనకు లైఫ్‌లో మరిచిపోలేని సర్‌ప్రైజ్‌ అందించాడు. అర్జున్ నుంచి ఈ రోజు అనుకోకుండా జెర్సీ నుంచి ఒక పాటను చూశాం. ఈ పాటతో నాని గర్వపడేలా చేశాడు ‍అర్జున్‌. ఇది నిజంగా అద్భుతమైన క్షణంలా అనిపించింది. ఏదో ఒక సమయంలో పూర్తి వీడియో పోస్ట్ చేస్తాను' అంటూ షేర్ చేసింది. 

కాగా.. నాని పూర్తి పేరు ఘంటా నవీన్‌ బాబు. నానిది స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామమే అయినా.. విశాఖపట్నానికి చెందిన అంజనా అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కెరీర్‌ మొదట్లో బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన నాని.. అనుకోకుండా 'అష్టా చమ్మా' చిత్రంతో హీరోగా మారాడు. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిందా చిత్రం. అలా 2008లో మొదలైన ఆయన ప్రయాణం. హీరోగా ఇప్పటికే 30కి పైగా చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. గతేడాది దసరా,హాయ్‌ నాన్న చిత్రాలతో హిట్లు కొట్టిన నాని.. త్వరలో సరిపోదా శనివారం చిత్రంతో అలరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement